మరో భామతో హార్దిక్‌ డేటింగ్‌? | Rumours of Hardik Pandya dating Esha Gupta gain momentum | Sakshi
Sakshi News home page

మరో భామతో హార్దిక్‌ డేటింగ్‌?

Published Thu, Jun 7 2018 10:55 AM | Last Updated on Thu, Jun 7 2018 10:58 AM

Rumours of Hardik Pandya dating Esha Gupta gain momentum - Sakshi

ముంబై: ఇటీవల కాలంలో భారత స్టార్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా తరచు వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక్కడ ఆట కంటే కూడా డేటింగ్‌ వ్యవహారాల పరంగానే హార్దిక్‌ హాట్‌ టాపిక్‌గా మారుతున్నాడు. నిన్నటిదాకా బాలీవుడ్‌ బ్యూటీ ఎల్లీ అవ్రాన్‌తో ‘ప్రేమాయణం’ సాగించిన హార్దిక్‌.. ఇప్పుడు ఇషా గుప్తా అనే నటికి దగ్గరయ్యాడట!  వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటించిన ఇషాతో కలిసి పాండ్యా.. రెస్టారెంట్లు, పార్టీలు, ఈవెంట్లకు హాజరవుతున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. గతేడాది డిసెంబరు నుంచి డేటింగ్‌లో ఉన్న ఎల్లీతో రెండువారాల క్రితమే పాండ్యా విడిపోయాడని అతని సన్నిహితులు తెలిపారు. ఒకవేళ ఇషాతో డేటింగ్‌ నిజమైతే అది ఎంతకాలం ఉంటుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement