Esha gupta
-
అక్కలో అమ్మను చూసుకుంటా: బాలీవుడ్ నటి
అక్క నాకు మరో అమ్మలాంటిది అంటోంది బాలీవుడ్ నటి ఇషా గుప్తా. రాఖీ పండగ సందర్భంగా తన సోదరి నేహా గుప్తాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. ఇషా మాట్లాడుతూ.. అక్క ఎప్పుడూ సమయపాలన పాటించదు. కానీ తను చాలా మంచి వ్యక్తి. తనలో నేను మరో అమ్మను చూసుకుంటాను. అలా నాకు ఇద్దరు తల్లులు.బ్లాక్మెయిల్ చేసేదాన్నిమేము ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ క్లోజ్‌గా ఉంటాం. ఎప్పుడూ పోట్లాడుకోం. నేను కాస్త రౌడీయిజం చేసినా తను మాత్రం ఎప్పుడూ కూల్‌గానే ఉంటుంది. చిన్నప్పుడు తను ప్రోగ్రెస్ కార్డులు దాచిపెట్టుకుంటే నేను వాటిని తీసి అమ్మానాన్నకు చూపించేదాన్ని. లేదంటే ఎక్కడున్నాయో చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేసేదాన్ని అని పేర్కొంది.సహించలేనునేహా మాట్లాడుతూ.. నాకు మా చెల్లి అంటే ఎంత ఇష్టమంటే.. తను నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అస్సలు సహించలేను. తన ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేసుకుంటూ బిజీగా ఉన్నా సరే నా కాల్ లిఫ్ట్ చేయాలంతే! తన గురించి ప్రతీది నాకు తెలియాలనుకుంటాను. ప్రతి ఏడాది ఒకరికి ఒకరం రాఖీ కట్టుకుంటాం. పెద్దదాన్ని కాబట్టి గిఫ్టులు మాత్రం నేనే ఇస్తుంటాను అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. -
పెళ్లికి రెడీ అయిన హాట్ బ్యూటీ.. అంతకు ముందే 'ఎగ్ ఫ్రీజింగ్'
మరో హాట్ బ్యూటీ పెళ్లికి రెడీ అయింది. త్వరలో శుభకార్యం ఉండనుందనే హింట్ ఇచ్చేసింది. దీని గురించి పక్కనబెడితే ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న 'ఎగ్ ఫ్రీజింగ్' గురించి మాట్లాడింది. తను వీటిని ఎప్పుడో చేసేశానని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరా బ్యూటీ? పెళ్లెప్పుడు?2012లో 'జన్నత్ 2' అనే హిందీ సినిమాతో ఈషా గుప్తా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. రాజ్ త్రీడీ, హమ్ షకల్స్, రుస్తుమ్, టోటల్ ధమాల్ తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో హేరీ ఫేరీ 4, దేశీ మ్యాజిక్ అండ్ మర్డర్ 4 మూవీస్ ఉన్నాయి. యాక్టింగ్ గురించి పక్కనబెడితే హాట్ హాట్ పోజులతో ఎప్పటికప్పుడు నెటిజన్లని అలరించే ఈ బ్యూటీ.. ఏడేళ్ల క్రితమే ఎగ్ ఫ్రీజింగ్ చేసిన విషయాన్ని ఇప్పుడు బయటపెట్టింది. ఎగ్ ఫ్రీజింగ్ అంటే.. ఆరోగ్యకర అండాల్ని వైద్య పద్ధితిలో భద్రపరచడం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్)ఈ మధ్య టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఇలా చేసింది. మృణాల్ ఠాకుర్ కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటానని చెప్పింది. అయితే ఈషా గుప్తా మాత్రం 2017లోనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చింది. ఒకవేళ తాను నటి కాకపోయింటే ఈపాటికే ముగ్గురు పిల్లలకు తల్లిని అయ్యేదని, పిల్లలంటే తనకు అంత ఇష్టమని ఈషా చెప్పింది. అందుకే హెల్తీగా ఉన్నప్పుడే తన అండాల్ని భద్రపరుచుకున్నానని క్లారిటీ ఇచ్చింది.ఇకపోతే గతే ఐదేళ్ల నుంచి మాన్యువల్ కంపోస్ అనే యువ పారిశ్రామిక వేత్తతో రిలేషన్లో ఉన్న ఈషా గుప్తా.. త్వరలో తన పెళ్లి జరగొచ్చని హింట్ ఇచ్చేసింది. ఇతడు పరిచయం కాకముందే తాను ఎగ్ ఫ్రీజింగ్ చేసేసుకున్నానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్) -
'వినయ విధేయ రామ' బ్యూటీపై క్యాస్టింగ్ కౌచ్.. షాకింగ్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామందికి గ్లామరే కనిపిస్తుంది. కానీ దాని వెనక జరిగే ఘోరాలు మాత్రం అప్పుడప్పుడు బయటకొస్తుంటాయి. చాలామంది హీరోయిన్ల దగ్గర నుంచి లేడీ యాక్టర్స్ వరకు చాలామంది మీటూ, క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినవాళ్లే. అలా ఇప్పుడు ఓ బ్యూటీ తనకు ఓ రెండు సినిమాల ఇలాంటి అనుభవం ఎదురైందని భయపడుతూ చెప్పింది. ఎవరా బ్యూటీ? సోషల్ మీడియా యూజర్స్ భాషతో సంబంధం లేకుండా చాలామంది బ్యూటీస్‌ని ఆదరిస్తుంటారు. అలాంటి వాళ్లలో ఈషా గుప్తా ఒకరు. దిల్లీకి చెందిన ఈ భామ.. 'జన్నత్ 2' అనే హిందీ మూవీతో నటిగా మారింది. కెరీర్లో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ (ఐటమ్) చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ 'వీడెవడు', 'వినయ విధేయ రామ' చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం ఓ మూడు చిత్రాలు చేస్తోంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' నుంచి హాట్ బ్యూటీ ఎలిమినేట్!) ఏం జరిగింది? 'ఓ సినిమా విషయంలో ఇద్దరు వ్యక్తులు నన్ను ట్రాప్ చేయాలని చూశారు. అవుట్డోర్ షూటింగ్ అనేసరికి నాకు మొత్తం క్లియర్‌గా అర్థమైపోయింది. అయితే అవుట్డోర్ అనేసరికి వాళ్ల వలలో నేను పడతానని అనుకున్నారు. కానీ నేను వాళ్లకంటే స్మార్ట్‌గా ఆలోచించాను. నాకు ఒంటరిగా నిద్రపోయే అలవాటు లేదని, మేకర్ ఆర్టిస్టు కూడా నాతో పాటు రూంలో ఉంటారని చెప్పా. మేకర్ ఆర్టిస్టుని పిలిచి నిద్రపోయా' మరో సినిమా విషయంలో జరిగిన సంఘటనని కూడా ఈషా గుప్తా బయటపెట్టింది. 'సగం సినిమా పూర్తయింది. వాళ్లు అడిగిన దానికి నో చెప్పాను. దీంతో నేను సెట్లో ఉండటం ఇష్టం లేదని ఓ కో ప్రొడ్యూసర్ దర్శకుడితో చెప్పారు. ఈ సంఘటన తర్వాత నాకు చాలామంది అవకాశాలు ఇవ్వడం మానేశారు. నా గురించి సదరు కో ప్రొడ్యూసర్ బ్యాడ్‌గా చెప్పడమే దీనికి కారణం' అని ఈషా గుప్తా తనకెదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీ.. పెళ్లికి అంతా సెట్!) View this post on Instagram A post shared by Esha Gupta (@egupta) -
మెట్లపై దిశా.. కుర్చీపై శ్రద్ధా.. మధ్యలో ఈషా!
బ్లాక్ డ్రస్‌లో మత్తెక్కిస్తున్న దిశా పటానీ చీరకట్టులో దివ్యభారతి హాట్ వయ్యారాలు కుర్చీపై ఉంటూనే శ్రద్ధాదాస్ అందాల విందు డిజైనర్ చీరలో ఒంపుసొంపులు చూపిస్తున్న అనన్య పరువాలతో రాజసం లాంటి లుక్‌లో ఐశ్వర్యా రాజేశ్ పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న ఐటమ్ బ్యూటీ ఈషా గుప్తా మెరుపుల చీరలో 'జైలర్' బ్యూటీ మిర్నా మేనన్ కొండల మధ్య సముద్రంలో 'సామజవరగమన' బ్యూటీ View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) -
విచిత్రమైన గెటప్‌లో మృణాల్.. టెంప్ట్ చేస్తున్న నేహా
బీచ్ ఒడ్డున చిల్ అవుతున్న దిశా పటానీ జిగేలు డ్రస్‌లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకుర్ కలర్ కలర్ ఔట్ఫిట్లో శోభిత దూళిపాళ్ల ఆరెంజ్ దుస్తుల్లో అదరగొట్టేస్తున్న నేహాశెట్టి సిల్క్ డ్రస్‌లో సెగలు రేపుతున్న ప్రగ్యా స్మైలీ ఫేస్‌తో సమంత.. పింక్ టాప్‌తో వైట్ డ్రస్ తో తెగ నవ్వేస్తున్న రకుల్ ప్రీత్ Beach vibes with #DishaPatani. 🏖️🤍 pic.twitter.com/jPJ0HH4exW — Filmfare (@filmfare) August 17, 2023 View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Esha Gupta (@egupta) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
అరుదైన వ్యాధి బారిన ప్రముఖ నటి.. అలాంటి పరిస్థితిలో!
హీరోయిన్లని చూడగానే.. అబ్బా సూపర్ ఉంది అని ఫ్యాన్స్ అనుకుంటారు. అయితే సదరు హీరోయిన్లలో కొందరు అరుదైన వ్యాధులు, లేదంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఒకప్పుడు బయటపెట్టేవాళ్లు కాదు గానీ ఈ మధ్య మాత్రం తమకు ఎదురైన సమస్య గురించి నలుగురికి చెప్పడంలో సదరు బ్యూటీస్ అస్సలు మొహమాట పడట్లేదు. తాజాగా ఓ నటి అలానే ఓ ఫొటో పోస్ట్ చేసి తన హెల్త్ ప్రాబ్లమ్‌ని రివీల్ చేసింది. సమంతలా ఈ నటికి తెలుగు స్టార్ హీరోయిన్ సమంత.. ఈ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తనకు మయాసైటిస్ అనే అరుదైన వ్యాధి ఉందని గతేడాది బయటపెట్టిన సామ్.. ఇప్పుడు దానికి చికిత్స కోసమే విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీలానే బాలీవుడ్ నటి ఈషా గుప్తా కూడా అరుదైన వ్యాధి బారిన పడినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా ఈ నటి ఇన్‌స్టా స్టోరీలో ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న ఫొటో పోస్ట్ చేసింది. దీంతో అందరూ షాకయ్యారు. (ఇదీ చదవండి: ఏప్రిల్‌లో గుండెనొప్పి.. ఇప్పుడేమో మళ్లీ స్టేజీపై చలాకీ చంటి!) అదే కారణమా? ఈషా గుప్తా పోస్ట్ చేసిన ఫొటోకి హైపర్బేరిక్ థెరపీ అని క్యాప్షన్ పెట్టింది. గతంలో ఇదే థెరపీ సమంత తీసుకుంది. మయోసైటిస్ చికిత్సలో భాగంగా ఈ థెరపీ తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల పాడైన కండరాలు బాగుపడతాయి. కండరాల వాపు, ఇన్ఫెక్షన్ లాంటివి తగ్గుతాయని సామ్ అప్పట్లో చెప్పుకొచ్చింది. ఇప్పుడు అలాంటి ఆక్సిజన్ మాస్క్ తో ఈషా గుప్తా కనిపించడంతో ఈమెకీ మయోసైటిస్ వచ్చిందా అనే సందేహం కలుగుతోంది. తెలుగులో రెండే ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమైన ఈషా గుప్తా.. గతంలో తెలుగులోనూ రెండు సినిమాలు చేసింది. అందులో ఒకటి సచిన్ జోషి హీరోగా నటించిన 'వీడెవడు' కాగా, రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' మూవీలో ఏక్ బార్ ఏక్ బార్ అనే పాటలో ఈషా సందడి చేసింది. వీటి తర్వాత ఈమెకు టాలీవుడ్లో మరో ఛాన్స్ రాలేదనే చెప్పాలి. View this post on Instagram A post shared by Esha Gupta (@egupta) View this post on Instagram A post shared by Esha Gupta (@egupta) (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్‌పై బాడీ షేమింగ్.. ఆయన వల్ల!) -
అట్టహాసంగా ఆరంభమైన కాన్స్ చిత్రోత్సవాలు
76వ కాన్స్ చిత్రోత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఫ్రాన్స్‌లో ఈ నెల16న మొదలైన ఈ చిత్రోత్సవాలు 27 వరకు కొనసాగుతాయి. ఎనిమిది మంది జ్యూరీ సభ్యులకు స్వీడన్‌కు చెందిన రూబెన్ ఓస్ట్లాండ్ సారథ్యం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సమా చార, ప్రసార శాఖ డిప్యూటీ మినిస్టర్ ఎల్. మురుగన్ ఈ చిత్రోత్సవాల్లో ఇండియన్ టీమ్‌ను లీడ్ చేస్తున్నారు. 12 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో పలువురు దేశ, విదేశీ తారలు రెడ్ కార్పెట్‌పై మెరవనున్నారు. ఇక తొలి రోజు వేడుక విశేషాల్లోకి వెళదాం. ఏడు నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ తొలి రోజు బయోగ్రఫికల్ డ్రామా ‘జాన్ డ్యు బెర్రీ’ ప్రదర్శనతో ప్రారంభమై, చివరి రోజు ఉత్సవాలు ‘ఎలిమెంటల్’ సినిమా ప్రదర్శనతో ముగుస్తాయి. ‘జాన్ డ్యు బెర్రీ’ సినిమాలో ఓ లీడ్ రోల్ చేసిన జానీ డెప్ ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు. ఈ చిత్రప్రదర్శన ముగిసిన తర్వాత వీక్షకులు ఏడు నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్‌ఇవ్వడం విశేషం. తమ చిత్రానికి ఇంత అద్భుత స్పందన లభించిన నేపథ్యంలో జానీ డెప్ కళ్లు చెమర్చాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది. మైవెన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాన్స్‌లో భారతీయం ప్రతి ఏడాదీ కాన్స్ చిత్రోత్సవాల్లో భారతీయ తారలు మెరుస్తుంటారు. ఈ ఏడాది తొలి రోజు హిందీ తారలు సారా అలీఖాన్, ఈషా గుప్తా, మానుషీ చిల్లర్, ఊర్వశీ రౌతేలా రెడ్ కార్పెట్‌పై మెరిశారు. కాగా సారా, ఈషా, మానుషీ లు తొలిసారి కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ ముగ్గురితో పాటు ఊర్వశి కూడా రెడ్ కార్పెట్ పై సందడి చేశారు. దేశీ లుక్‌లో అగుపించిన సారాకి ప్రశంసలు లభించాయి. వీరు మాత్రమే కాదు.. ఇంకా హీరోయిన్లు అనుష్కా శర్మ, మృణాల్ ఠాకూర్, సన్నీ లియోన్, నాగాల్యాండ్ యాక్ట్రస్ ఆండ్రియా కెవిచుసాలు తొలిసారిగా ఈ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంటారు. ఇంకా ఆస్కార్ అవార్డు విన్నింగ్ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా, దర్శకుడు మధుర్ భండార్కర్, హీరోయిన్ అదితీరావ్ హైదరీ, నటుడు విజయ్‌వర్మ, దర్శకుడు విఘ్నేష్ శివన్ వంటి వారు పాల్గొననున్నట్లు సమాచారం. అలాగే దర్శకుడు అనురాగ్ కశ్వప్ తెరకెక్కించిన ‘కెన్నెడీ’, దర్శకుడు కను బెహ్లీ తీసిన ‘ఆగ్రా’, మణిపూర్ దర్శకుడు అరిబామ్ శ్యామ్ శర్మ తెరకెక్కించిన ‘ఇషానౌ’, యుధాజిత్ బసు ‘నెహెమిచ్’ వంటి భారత చిత్రాలు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కానున్నాయి. ‘కెన్నెడీ’ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఒకరిగా నటించిన సన్నీ లియోన్ ఈ చిత్రం ప్రదర్శనలో భాగంగానే ఉత్సవాలకు హాజరవుతున్నారు. రెండు దశాబ్దాలుగా... కాన్స్ చిత్రోత్సవాలంటే చాలామంది ఐశ్వర్యా రాయ్ కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే దాదాపు రెండు దశాబ్దాలుగా కాన్స్ రెడ్ కార్పెట్‌పై ఐష్ మెరుస్తున్నారు. షారుక్ ఖాన్, ఐశ్వర్యా రాయ్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రల్లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘దేవదాస్’ (2002) చిత్రం 55వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. అప్పట్నుంచి ఐశ్వర్యా రాయ్ క్రమం తప్పకుండా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరవుతున్నారు. ఈ ఏడాది చిత్రోత్సవాల్లో సందడి చేసేందుకు తన కూతురు ఆరాధ్యతో కలిసి ఐశ్వర్యా రాయ్ బుధవారం ముంబై నుంచి బయలుదేరారు. -
అద్దంలో చూసుకోకుండానే బయటకొచ్చారా?.. నటిపై నెటిజన్స్ ఫైర్!
ఈషా గుప్తా బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈషా 2007లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించింది. 2012లో క్రైమ్ థ్రిల్లర్ జన్నత్- 2లో ఆమె తొలిసారి నటించింది. ఆ చిత్రానికి ఉత్తమ డెబ్యూ ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది. ఆ తర్వాత చక్రవ్యూహ్, హంషాకల్స్, రాజ్ 3D, క్రైమ్ డ్రామా రుస్తోమ్, బాద్షాహో లాంటి సినిమాల్లో కనిపించింది. అయితే ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటున్న ఇషా తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో మరీ బోల్డ్ పిక్స్ షేర్ చేస్తూ అలరిస్తుంటారు. (ఇది చదవండి: విజయ్ దేవరకొండ, అఖిల్ కెరీర్‌ని దెబ్బ తీసిన ‘బామ్మర్ది’!) తాజాగా ముంబయిలో అడుగుపెట్టిన భామకు ఫోటోలకు ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్స్ దారుణ కామెంట్స్ చేశారు. ఆమె టాప్‌లెస్ డ్రెస్ ధరించగా.. మీరు మరింత బోల్డ్‌గా కనిపిస్తున్నారంటూ పోస్టులు పెట్టారు. 'ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓ సారి అద్దంలో చూసుకోలేదా' అని కొందరు నెటిజన్స్ ప్రశ్నించారు. మరికొందరైతే అలా బయటకు రావడానికి మీకు సిగ్గులేదా అని నిలదీశారు. మరొకరు రాస్తూ 'ఫ్యాషన్ పేరుతో ఉర్ఫీ జావెద్‌ను మీరు మించిపోయారు' అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: జియా డిప్రెషన్లో ఉందని ఆమె తల్లికి చెప్తే పట్టించుకోలేదు: నటుడు) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఆమె లీనమైపోయింది, అలా ఆ రొమాంటిక్ సీన్ ఈజీ అయింది
బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఆశ్రమ్ 3 (ఆశ్రమం). క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో ఇషా గుప్తా నటించగా ప్రకాశ్ జా దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఎమ్ఎక్స్ ప్లేయర్లో స్ట్రీమింగ్ అవుతోందీ సిరీస్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాబీ డియోల్ ఈ సిరీస్‌లోని అభ్యంతరకర సన్నివేశాలపై స్పందించాడు. 'మొదటి సారి అభ్యంతరకర సన్నివేశేంలో నటించడం కావడంతో నాకు చాలా భయమేసింది. ఇలా మరీ సన్నిహితంగా కలిసి నటించడం నాకిదే తొలిసారి. కానీ ఇషా చాలా ప్రొఫెషనల్. ఆమె పాత్రలో లీనమైపోవడంతో నాకు ఆమెతో కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం కొంత ఈజీ అయింది. అది స్క్రీన్‌పై కూడా సరిగ్గా వచ్చింది. ఇక ప్రతికూల పాత్రలో జనాలు నన్ను అంగీకరించినందుకు సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా డిఫరెంట్ అండ్ ఛాలెంజింగ్ రోల్స్ చేయగలనన్న నమ్మకం వచ్చింది' అని చెప్పుకొచ్చాడు బాబీ డియోల్. చదవండి: హీరోయిన్ ఇంట్రస్టింగ్ పోస్ట్, తనతో ఉంది ఆ క్రికెటరే అంటున్న ఫ్యాన్స్ టీఆర్పీలో టాప్ సీరియల్.. కానీ నటులకు జీతాలివ్వట్లేదా? -
Esha gupta Latest Photos : ఇషా గుప్తా లేటెస్ట్ ఫోటోస్
-
అందంగా కనిపించాలని ఇంజక్షన్..: షాకింగ్ విషయం వెల్లడించిన నటి
జన్నత్ 2 సినిమాతో వెండితెరకు పరిచయమైంది నటి ఈషా గుప్తా. ఈ మధ్యే ఆశ్రమ్ 3 సిరీస్‌లో కనిపించిన ఆమె కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. తాజాగా ఈ విషయాలను ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 'ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో నన్ను ఎన్నో మాటలు అన్నారు. నా ముక్కు గుండ్రంగా ఉందని, దాన్ని షార్ప్‌గా కనిపించేలా చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్లకు నా స్కిన్ మెరిసిపోయేందుకు ఇంజక్షన్ తీసుకోమని సలహా ఇచ్చారు. నేను వాళ్ల మాటలు విని దాని గురించి ఆరా తీస్తే ఒక్క ఇంజక్షన్ రూ.9000 ఉంటుందని తెలిసింది. దాని పేరు నేను చెప్పలేను కానీ చాలామంది నటీమణులు ఫెయిర్ స్కిన్ కోసం దీన్ని వాడుతున్నారు. అందంగా కనిపించాలని తారలపై చాలా ఒత్తిడి ఉంటుంది. నేను నా కూతురిని నటిగా మాత్రం అస్సలు చూడాలనుకోవడం లేదు. ఎందుకంటే తను చిన్న వయసులో నుంచే అందంగా కనిపించాలని ఒత్తిడికి లోనవడం నాకిష్టం లేదు. ఆమె పెద్దగా చదువుకోనవసరం లేదు, కానీ గొప్ప క్రీడాకారిణి కావాలని కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా ఈషా వెండితెరపై కనిపించి చాలాకాలమే అయ్యింది. ఆమె చివరగా 2019లో వచ్చిన టోటల్ ఢమాల్, వన్ డే జస్టిస్ డెలివర్డ్ చిత్రాల్లో మెరిసింది. చదవండి: ఇద్దరం ఒక్కటయ్యాం.. పెళ్లి ఫొటో షేర్ చేసిన విఘ్నేశ్ నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలీదు.. అదుర్స్ అనిపించిన బాలయ్య -
నేరాలు చేసే 'బాబా నిరాలా' మళ్లీ వచ్చేస్తున్నాడు.. ఆసక్తిగా ట్రైలర్
Bobby Deol Ashram 3 Trailer Released And Streaming On MX Player: బాలీవుడ్ హీరో బాబీ డియోల్ బాబాగా నటించి మెప్పించిన వెబ్ సిరీస్ ఆశ్రమ్ (ఆశ్రమం). ఆగస్టు 28, 2020న విడుదలైన ఈ సిరీస్ మంచి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత అదే సంవత్సరం చాప్టర్ 2 పేరుతో నవంబర్‌లో 'ఆశ్రం 2'ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ వెబ్ సిరీస్ మూడో చాప్టర్ రానుంది. తాజాగా ఆశ్రమ్ మూడో చాప్టర్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎమ్ఎక్స్ ప్లేయర్లో జూన్ 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌కు ప్రకాష్ జా దర్శకత్వం వహించారు. తనకు తాను దేవుడిగా ప్రచారం చేసుకుంటూ మహిళల దోపిడీ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, రాజకీయాలను నియంత్రించే బాబా పాత్రలో బాబీ డియోల్ ఆకట్టుకున్నాడు. ఇందులో బాబా మరింత పవర్‌ఫుల్‌గా, తానే దేవుడన్నట్లుగా కనపించనున్నట్లు తెలుస్తోంది. 'నేనే దేవున్ని.. నిరాలా భగవాన్' అని బాబీ డియోల్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఆశ్రమ్ చాప్టర్ 2లో త్రిదా చౌదరీ హైలెట్‌గా నిలవగా.. ప్రస్తుతం వస్తున్న మూడో చాప్టర్లో బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా అలరించనుంది. మరీ ఇషా గుప్తా ఏమేరకు ఆకట్టుకోనుందో చూడాలి. ఇందులో అదితీ పోహంకర్, చందన్ రాయ్ సన్యాల్, దర్శన్ కుమార్, అనుప్రియా గోయెంకా, అధ్యాయన్ సుమన్, త్రిదా చౌదరీ, తుషార్పాండే తదితరులు నటిస్తున్నారు. చదవండి: సన్నీ డియోల్ తనయుడికి నిశ్చితార్థమంటూ వార్తలు.. ఇదిగో క్లారిటీ -
హీరోయిన్ సెమీ న్యూడ్ ఫోటోషూట్.. ఐసోలేషన్‌లో ఉండి కూడా..
ఇటీవల కాలంలో హీరోయిన్లు, మోడల్స్ శృతిమించిన అందాల విందుతో రెచ్చిపోతున్నారు. ఎంత అందంగా కనిపిస్తే అంత ఎక్కువ అవకాశాలు, పాపులారిటీ సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయంతో తెగ హాట్స్ లుక్స్‌తో దర్శనమిస్తున్నారు. ఇంకా వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెట్టింటా కావాల్సినంత క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఈ కోవకే చెందుతుంది బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా. హీరోయిన్‌గానే కంటే హాట్ ఫోటో షూట్స్‌తోనే తెగ పాపులర్ అయిన ఈ భామ తాజాగా మరోసారి సెమీ న్యూడ్ లుక్స్‌తో దర్శనమిచ్చింది. ఇటీవలె కరోనా బారిన పడ్డ ఈ హాట్ బ్యూటీ తాజాగా ఒంటిపై నూలుపోగు లేకుండా బెడ్‌పై బోర్లా పడుకొని అర్థనగ్నంగా ఫోటోకు ఫోజులిచ్చింది. అంతేకాకుండా ఆ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేస్తూ.. ది ఫోటోగ్రాఫ్ అంటూ క్యాప్షన్‌ను జోడించింది. ప్రస్తుతం ఈషా షేర్చేసిన ఈ లెటెస్ట్ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఇన్‌స్టాలో ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ అందాల భామకు బోల్డ్‌గా కనిపించడం కొత్తేం కాదు. ఇంతకముందు కూడా పలుమార్లు సెమీన్యూడ్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేసిన సంగతి తెలిసిందే. కాగా వీడేవాడు చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్లో పలు సినిమాల్లో నటిస్తుంది. -
కొనసాగుతున్న కరోనా కలకలం.. మరో హీరోయిన్‌కు పాజిటివ్
Esha Gupta Tested Positive For Covid 19: బాలీవుడ్లో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. తాజాగా బీటౌన్ బ్యూటీ ఇషా గుప్తా కొవిడ్ బారిన పడింది. కరోనా పరీక్షలు నిర్వహించుకోగా ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఇషా తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. 'అత్యంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా సోకింది. నేను ఐసోలేట్ అయి నిబంధనలు పాటిస్తున్నాను. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నాను. దీని నుంచి మరింత స్ట్రాంగ్‌గా మెరుగ్గా తిరిగి వస్తాను. దయచేసి అందరూ సురక్షితంగా ఉండండి. మాస్క్ ధరించండి. మిమ్మల్ని, ఇతరులను జాగ్రత్తగా చూసుకోండి.' అని ఇన్‌స్టాలో స్టోరీ పెట్టింది 'జన్నత్ 2' బ్యూటీ. దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ విజృంభించడంతో బీటౌన్ ప్రముఖులు కొవిడ్‌కు గురవుతున్నారు. దీంతో ఐసోలేట్ అయి ఒంటరిగా గడుపుతున్నారు. ఇప్పటికే ప్రేమ్ చోప్రా, బోనీ కపూర్, ఏక్తా కపూర్, జాన్ అబ్రహం, అతని భార్య ప్రియా రుంచల్, విశాల్ డడ్లానీ, స్వరా భాస్కర్, మృణాల్ ఠాకూర్, అర్జున్ కపూర్, అలయ ఎఫ్‌లకు కరోనా సోకింది. హాట్ బ్యూటీ నోరా ఫతేహీకి కరోనా పాజిటివ్ రాగా ఇటీవలే నెగెటివ్ వచ్చినట్లు ప్రకటించింది. ఇదీ చదవండి: బుల్లితెర హీరోయిన్‌కు కొవిడ్.. అవి నమ్మొద్దని సలహా -
ఈషా టాప్‌లెస్ ఫొటోపై ట్రోల్స్, నెటిజన్లకు హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్
ఇటీవల కాలంలో హీరోయిన్లు, మోడల్స్ శృతిమించిన అందాల విందుతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్నారు. ఎంత అందంగా కనిపిస్తే అంత ఎక్కువ అవకాశాలు, పాపులారిటీ సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయంతో తెగ హాట్స్ లుక్స్‌తో దర్శనమిస్తున్నారు. ఇంకా వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెట్టింటా కావాల్సినంత క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఈ కోవకే చెందుతుంది బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా. చదవండి: కుమారుడిని చూసేందుకు తొలిసారి జైలుకు వచ్చిన షారుక్ హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌లోనూ అభిమానులను అలరిస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ ఇటీవల కాస్తా శృతిమించింది. సన్‌బాత్ అంటూ టాప్లేస్ ఫొటోలు షేర్ చేసి నెటిజన్ల మతి పోగోట్టింది. దీంతో కొందరూ ఆమె ఫొటోలకు పాజిటివ్‌గా రెస్పాండ్ కాగా..మరికొందరూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఆమెను ట్రోల్ చేస్తూ తన పోస్ట్‌పై ఆసభ్యకరంగా కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందిస్తూ నెటిజన్లకు చురకలు అట్టించింది. ‘‘ఇప్పటి వరకు సోషల్ మీడియాలో నాపై వచ్చే ట్రోల్స్ చూసి బాధపడేదాన్ని. కానీ ప్రస్తుతం అలాంటి ట్రోల్స్‌ను పట్టించుకోవడం మానేశాను. వాటికి అసలు స్పందించకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. కానీ నేను ఏం చేసినా కొందరు అదే పనిగా నన్ను వేలెత్తి చూపుతున్నారు. ఇటీవల నేను పంచుకున్న ఫొటోలకు అసభ్యకర రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు నేను స్పందించక తప్పడం లేదు. చాలా మంది మేల్ యాక్టర్స్ షర్ట్ లేకుండా ఫొటోలు షేర్ చేస్తే ‘మీ బాడీ సూపర్బ్‌గా ఉంది’ అంటూ సానుకూలంగా కామెంట్ చేస్తారు. మరి వారిని ఎందుకు పూర్తి దుస్తులు ధరించమని చెప్పరు?’’ అని ప్రశ్నించింది. చదవండి: అవును..నిజమే..ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నా: నటి ‘‘ఎందుకంటే నెటిజన్లలో కొందరు లింగ వివక్ష చూపెడుతున్నారు. చీర ధరించి ఫొటో షేర్ చేస్తే ‘ఈరోజు మీరు పూర్తి దుస్తులు ధరించారు’ అని వెటకారం చేస్తారు. మేకప్ ధరించిన ఫొటోలను పంచుకుంటే ‘ప్లాస్టిక్ బ్యూటీ’ అని కామెంట్లు పెడతారు. మేకప్ లేని ఫొటోలను షేర్ చేస్తే ‘నువ్వు అందంగా లేవు. ముఖానికి మేకప్ వేసుకో’ అని సలహాలు ఇస్తారు. ఇలా ఇండియాలోనే కాదు ప్రపంచంలోని నలుమూలలా ఆడవాళ్లపై వివక్ష కొనసాగుతోంది. మహిళలలకు సంబంధించి మన ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇక నా విషయానికొస్తే.. నేను మానసికంగా ఎంతో బలవంతురాలిని. ఎవరైనా ఒకసారి నా చెంపమీద కొడితే నేను రెండుసార్లు వారి చెంపలు వాయిస్తాను’’ అంటూ ఈషా నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చదవండి: ‘మోదీ జీ.. ప్రతిసారి నా కృత్రిమ కాలు తొలగించమంటున్నారు’ -
టాప్ లెస్ ఫోటోస్‌తో రచ్చ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ
ఇటీవల కాలంలో హీరోయిన్లు, మోడల్స్ శృతిమించిన అందాల విందుతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్నారు. ఎంత అందంగా కనిపిస్తే అంత ఎక్కువ అవకాశాలు, పాపులారిటీ సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయంతో తెగ హాట్స్ లుక్స్‌తో దర్శనమిస్తున్నారు. ఇంకా వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెట్టింటా కావాల్సినంత క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఈ కోవకే చెందుతుంది బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా. హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌తోనూ అభిమానులు అలరిస్తున్న ఈ బోల్డ్ భామ.. గ్లామర్ ఫోటోషూట్లతోనూ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. చదవండి: Mani Sharma: వైరలవుతోన్న మణిశర్మ కుమారుడి నిశ్చితార్థపు ఫోటోలు ఈ క్రమంలోనే ఆమె తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం జైపూర్ వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న ఈషా తన రిసార్ట్‌లోని బాల్కనీ వద్ద దిగిన హాట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అయితే ఇన్‌స్టాలో అయిదు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ అందాల భామకు బోల్డ్‌గా కనిపించడం కొత్తేం కాదు. ఇంతకముందు చాలాసార్లే బికినీ ఫోజులతో కనువిందు చేసింది. కానీ ఈసారి మరింత రెచ్చిపోయి ఏకంగా టాప్‌లెస్‌గా సెమీ న్యూడ్ ఫోటోలతో ఇంటర్నెట్లో సెగలు రేపుతోంది. జీన్స్ ప్యాంట్ మినహా ఒంటిపై నూలుపోగు లేకుండా ఘాలుగా ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. చదవండి: Shriya Saran: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ శ్రియ -
హీరోయిన్ ఇషా గుప్తా గ్లామర్ ఫోటోలు
-
అయ్యో! ఇషా గుప్తా
న్యూఢిల్లీ: ఆగస్టు 15వ తేదీన గణతంత్ర దినోత్సవ శుభాకాం క్షలు తెలిపిన బాలీవుడ్ నటి ఇషా గుప్తాపై సామాజిక మాధ్యమం ట్విట్టర్లో కామెంట్లు వెల్లువెత్తాయి. గురువారం మాజీ మిస్ ఇండియా ఇషా మాత్రం ‘గణతంత్ర దిన శుభాకాంక్షలు’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతే.. నెటిజన్లు వెంటనే తమదైన శైలిలో స్పందించారు. ఇషా గుప్తా బాధ్యత లేకుండా వ్యవహరించారని కొందరు విమర్శించారు. తన అకౌంట్ హ్యాక్ అయిందని ఇషా తెలపడంతో కథ ముగిసింది. -
రేప్‌కు గురవుతున్నట్టు అనిపించింది: నటి
బాలీవుడ్ నటి ఈషా గుప్తా శుక్రవారం రాత్రి తన స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఆమె తాజా చిత్రం ‘వన్ డే: జస్టిస్ డెలివర్డ్’ విడుదల కావడంతో గత రాత్రి స్నేహితులతో సంతోషంగా గడిపారు. అయితే, ఈ వేడుకలు అనుకున్నంత ఆనందంగా ముగియలేదని తెలుస్తోంది. ఓ హోటల్ యాజమాని తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆమె సోషల్ మీడియాలో తెలిపారు. రోహిత్ విగ్ అనే వ్యక్తి ప్రవర్తించన తీరు ఎంత క్రూరంగా ఉందని, తనకెంతో అసౌకర్యంగా, అభద్రంగా అనిపించిందని ఆమె వెల్లడించారు. తన చుట్టు ఇద్దరు గార్డులు ఉన్నా.. అతను స్వైరవిహారం చేశాడని, అలాంటివాళ్లు నాశనమవ్వాలని, అతని ప్రవర్తన వల్ల తాను రేప్‌కు గురవుతున్నట్టు అనిపించిందని పేర్కొన్నారు. ‘నాలాంటి ఒక మహిళ దేశంలో అభద్రతకు గురైతే.. ఇక సామాన్య మహిళల పరిస్థితేమిటి? ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నా పక్కనే ఉన్నా రేప్‌కు గురవుతున్నట్టు అనిపించింది. రోహిత్ విగ్ నువ్వొక స్వైరంలా ప్రవర్తించావు. నువ్వు నాశనమవ్వాలి’ అని ఈషా గుప్తా పేర్కొన్నారు. రోహిత్ విగ్ లాంటి వారి వల్లే మహిళలు ఎక్కడైనా అభద్రతా భావానికి లోనవుతారని, గుచ్చిగుచ్చి చూస్తూ చూపులతోటే రేప్ చేసేలా అతడు కనిపించాడని, ఫ్యూచర్ రేపిస్ట్‌లా కనిపిస్తున్న అతను ఎవరో మీకు తెలుసా? అంటూ తన సోషల్ మీడియా పేజీల్లో పేర్కొన్నారు. తెలుగులో ‘వినయ విధేయ రామ’ సినిమాలో రాంచరణ్ సరసన ప్రత్యేక గీతంలో నర్తించిన ఈషా గుప్తా బాలీవుడ్లో ‘టోటల్ ధమాల్’, ‘రుస్తుం’ వంటి సినిమాల్లో నటించారు. -
చరణ్ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ సినిమా వినయ విధేయ రామ. మాస్ మసాల ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీకి మరింత గ్లామర్ యాడ్ చేసేందుకు ఓ స్పెషల్ సాంగ్‌ను తెరకెక్కించనున్నారు. బోయపాటి సినిమాలతో పాటు చరణ్ సినిమాల్లోనూ స్పెషల్ సాంగ్స్‌లో స్టార్ హీరోయిన్స్ కనిపిస్తుంటారు. తమన్నా, పూజా హెగ్డే, కేథరిన్ లాంటి వారు వీరి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారు. ఈ సినిమాలో కూడా ఓ క్రేజీ స్టార్‌తో స్పెషల్ సాంగ్ చేయించాలని భావిస్తున్నారట చిత్రయూనిట్. అయితే సౌత్ భామలు రొటీన్ కావటంతో ఓ బాలీవుడ్ హాట్ బ్యూటీని సెలెక్ట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల సినిమాలతో కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో హల్చల్ చేస్తున్న ఈషా గుప్తా, వినయ విధేయ రామలో చరణ్ సరసన ఆడిపాడనుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
పాండ్యాతో పెళ్లి.. కన్ఫ్యూజ్ చేసిన ఈషా
యువ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నటి ఈషా గుప్తాతో గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు కథనాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. హాట్ బ్యూటీతో కలిసి పాండ్యా.. రెస్టారెంట్లు, పార్టీలు, ఈవెంట్లకు హాజరవుతున్నాడంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఈ తరుణంలో త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు ఇప్పుడు ఓ కథనం వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంపై పింక్విల్లా వెబ్సైట్ ప్రతినిధి ఈషాను సంప్రదించగా.. ఆమె గందరగోళమైన స్టేట్మెంట్ను ఇచ్చి వదిలేశారు. ‘నేను తొందర పడదల్చుకోవటం లేదు. వివాహానికి సమయం వచ్చినప్పుడు తెలియజేస్తా. ఇంతకు మించి ఏం చెప్పదల్చుకోలేదు’ అంటూ పేర్కొన్నారు. అయితే పాండ్యాతో డేటింగ్ చేస్తున్న మాట నిజమేనన్న ప్రశ్నకు మాత్రం ఆమె నవ్వి ఊరుకోవటం విశేషం. గతంలో నటి ఎల్లీ అవ్రమ్‌తో ఓపెన్ రొమాన్స్ కొనసాగించిన పాండ్యా.. తర్వాత ఇషాను ఓ పార్టీలో పరిచయం చేసుకుని డేటింగ్ మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే హెరా పెరీ-3, టోటల్ ధమాల్, పల్టాన్ చిత్రాలతో ఈషా బాలీవుడ్లో బిజీగా ఉండగా.. మరోవైపు పాండ్యా ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు. -
మరో భామతో హార్దిక్ డేటింగ్?
ముంబై: ఇటీవల కాలంలో భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తరచు వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక్కడ ఆట కంటే కూడా డేటింగ్ వ్యవహారాల పరంగానే హార్దిక్ హాట్ టాపిక్‌గా మారుతున్నాడు. నిన్నటిదాకా బాలీవుడ్ బ్యూటీ ఎల్లీ అవ్రాన్తో ‘ప్రేమాయణం’ సాగించిన హార్దిక్.. ఇప్పుడు ఇషా గుప్తా అనే నటికి దగ్గరయ్యాడట! వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో నటించిన ఇషాతో కలిసి పాండ్యా.. రెస్టారెంట్లు, పార్టీలు, ఈవెంట్లకు హాజరవుతున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. గతేడాది డిసెంబరు నుంచి డేటింగ్లో ఉన్న ఎల్లీతో రెండువారాల క్రితమే పాండ్యా విడిపోయాడని అతని సన్నిహితులు తెలిపారు. ఒకవేళ ఇషాతో డేటింగ్ నిజమైతే అది ఎంతకాలం ఉంటుందో చూడాలి. -
నటి ఇషాపై సెటైర్లు.. ఎదురుదాడి
ముంబై : లక్షల మందిని పొట్టనపెట్టుకున్నా ఆరని జ్వాలలా రగులుతోన్న సిరియా సంక్షోభం.. గడిచిన మూడు నెలల్లో మరింత భయంకరంగా మారింది. సిరియన్-రష్యన్ దళాల సంయుక్త దాడుల్లో వందలాదిమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వేలమంది గాయపడ్డారు. ఈ ఘటనలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. బాలీవుడ్ నటి ఇషా గుప్తా కూడా సిరియా సంక్షోభంపై ఓ ట్వీట్ చేశారు. అయితే నటి ట్వీట్‌పై కొందరు ట్రోలర్స్ సెటైర్లు గుప్పించారు. తిరిగి ఆమె ఎదురుదాడి చేయడంతో తోకముడిచారు. సిరియా అంతర్యుద్ధంలో గాయపడ్డ ఓ చిన్నారి ఫొటోను ట్వీట్ చేసిన ఇషా దానికి ‘‘ ఏ మతం, ఏ ప్రభుత్వం అన్నది అప్రస్తుతం. మానవత్వం మంటగలుస్తోంది. అకారణంగా చిన్నపిల్లలు చనిపోతున్నారు. ఇది ఆగాలి. సిరియాలో నెత్తుటిధారను ఆపాలి..’ అని కామెంట్ చేశారు. ఇషా ట్వీట్‌పై కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ఏసీ రూమ్స్‌లో కూర్చొని కామెంట్లు పెట్టడంకాదు.. నువ్వే సిరియా వెళ్లి ఏమైనా చెయ్యరాదు..’ అని ఒకరు, ‘ప్రపంచంతో పోల్చుకుంటే చిన్నపిల్లల మరణాలు ఇండియాలోనే ఎక్కువ. నువ్వు సేవచెయ్యడానికి ఈ దేశం సరిపోదా?’ అని ఇంకొకరు.. రకరకాలుగా సెటైర్లు వేశారు. ట్రోలర్ల తీరుపై మండిపడ్డ ఇషా.. ‘మానవత్వానికి హద్దులు గీస్తూ మీ వైకల్యాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. పిల్లలు చనిపోవడానికి, వేరేవాళ్లచేతిలో హత్యకు గురికావడానికి చాలా తేడాఉంటుందని గుర్తించాలి. లేదంటే సిరియా మాదిరే మీరూ చీకటి యుగంలో ఉన్నట్లేలెక్క’’ అని ఎదురుదాడిచేశారు. I don’t care which country or religion or government I have, humanity is dying. The children are dying and it needs to stop,now #SyriaIsBleeding pic.twitter.com/8EVPXgcScT — Esha Gupta (@eshagupta2811) February 25, 2018 Your dumbness is profound, there is a difference when you are KILLING them. That’s the problem with you trollers, good for nothing, even in Humanity you see borders. Even for children you see religion. This is what is called the dark age. #HumanRightsDiedInSyria #PrayForSyria https://t.co/tXrjJ8et5J — Esha Gupta (@eshagupta2811) February 27, 2018 -
'ఆ ఇద్దరిని చూసి కామెడీ నేర్చుకుంటా'
ముంబై: అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం లాంటి హీరోలతో తెరను పంచుకోవడం తన అదృష్టంగా భావిస్తానంటోంది బాలీవుడ్ భామ ఇషా గుప్తా. అభిషేక్, జాన్ ఇద్దరి కామెడీ భిన్న తరహాలో ఉంటుంది. ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రంలో వారిద్దరిని చూసి కామెడీ పాత్రల్లో నటించడంలో మెళకువలు నేర్చుకుంటానని చెప్పింది. నీరజ్ వోరా దర్శకత్వం వహిస్తున్న 'హిరా ఫెరీ 3'లో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం, ఇషా నటిస్తున్న విషయం తెలిసిందే. 'బ్లఫ్ మాస్టర్', 'బోల్ బచ్చన్' మూవీలలో అభిషేక్ బచ్చన్ నటన తనకు నచ్చిందని, ఆ హీరోలిద్దరూ 'దోస్తానా'లో చాలా కామెడీ పండించారని చెప్పింది. అందుకే వారి నుంచి కామెడీ టిప్స్ నేర్చుకోవడంపై దృష్టిపెట్టినట్లు వివరించింది. ఫెరోజ్ నడియాడ్వాలా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ 2006లో వచ్చిన ఫిర్ హిరా ఫెరీకి సీక్వెల్. మొత్తంగా ఈ సిరీస్‌లో ఇది మూడో సినిమా. హమ్‌షకల్స్ తర్వాత ఇషా చేస్తున్న తాజా చిత్రమిది. పెద్ద బ్యానర్లో తీస్తున్న చాలా బిగ్ మూవీ అని.. ఇది తనకు చాలా గొప్ప అవకాశమని చెప్పుకొచ్చింది. ఇది తన రెండో కామెడీ ప్రధాన మూవీ అని, ఈ తరహా సినిమాల్లో నటించేందుకు కావాల్సిన ట్రిక్స్ నేర్చుకుంటానన్నది. మూవీ సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఆమె నిరాకరించింది. -
పెళ్లా.. పదేళ్ల తర్వాత అడగండి...
పెళ్లి గురించి తనను ఇప్పుడప్పుడే అడగొద్దని, పదేళ్ల తర్వాత అడగండని అంటోంది బాలీవుడ్ భామ ఈషా గుప్తా. ఢిల్లీలో ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమెను మీడియా ప్రతినిధులు పెళ్లెప్పుడని ప్రశ్నిస్తే, మరో పదేళ్లయ్యాక గానీ పెళ్లి విషయమై నిర్ణయం తీసుకోలేనని, తన కంటే ముందుగా తన అక్క నేహాకు పెళ్లి జరగాలని కోరుకుంటున్నానని చెప్పింది. దేశభక్తి సినిమా చేయాలని ఉంది... యువనటుడు అర్జున్ కపూర్ దేశభక్తి సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నాడు. సాధారణంగా వినిపించే జాతీయగీతం ప్రజలను స్పందింపజేయడం అనిర్వచనీయంగా ఉంటుందని, త్వరలోనే ఒక దేశభక్తి సినిమా చేయాలనుకుంటున్నానని అతడు ‘ట్విట్టర్’ ద్వారా తన ఆసక్తిని బయటపెట్టాడు. భారతీయ ఆభరణాలంటే ఇష్టం... భారత్‌లో పుట్టి పెరగకపోయినా, తనకు భారతీయ ఆభరణాలంటేనే ఇష్టమని అంటోంది నర్గీస్ ఫక్రీ. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఒక ఫ్యాషన్ వీక్‌లో సంప్రదాయ భారతీయ ఆభరణాలతో ఆమె ర్యాంప్ వాక్ చేసింది. తాను చాలా తక్కువగా నగలు ధరిస్తానని, అయితే, భారతీయ ఆభరణాల డిజైన్లను ఎక్కువగా ఇష్టపడతానని నర్గీస్ ఫక్రీ చెబుతోంది.