Esha Gupta Gets Brutally Trolled Over Her Dressing After Her Latest Video Goes Viral - Sakshi
Sakshi News home page

ఉర్ఫీ జావెద్‌ను మించి పోయారుగా.. నటిపై నెటిజన్స్ దారుణ ట్రోల్స్!

Published Sun, Apr 30 2023 4:45 PM | Last Updated on Sun, Apr 30 2023 6:21 PM

Esha Gupta Gets Brutally Trolled After Video of Her In Mumbai Spotted - Sakshi

ఈషా గుప్తా బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈషా 2007లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది.  2012లో క్రైమ్ థ్రిల్లర్ జన్నత్- 2లో ఆమె తొలిసారి నటించింది. ఆ చిత్రానికి ఉ‍త్తమ డెబ్యూ ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది.

ఆ తర్వాత చక్రవ్యూహ్, హంషాకల్స్, రాజ్ 3D, క్రైమ్ డ్రామా రుస్తోమ్, బాద్‌షాహో లాంటి సినిమాల్లో కనిపించింది. అయితే ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటున్న ఇషా తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో మరీ బోల్డ్ పిక్స్‌ షేర్ చేస్తూ అలరిస్తుంటారు. 

(ఇది చదవండి: విజయ్‌ దేవరకొండ, అఖిల్‌ కెరీర్‌ని దెబ్బ తీసిన ‘బామ్మర్ది’!)

తాజాగా ముంబయిలో అడుగుపెట్టిన భామకు ఫోటోలకు ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్‌ కాగా.. నెటిజన్స్ దారుణ కామెంట్స్ చేశారు. ఆమె టాప్‌లెస్‌ డ్రెస్‌  ధరించగా.. మీరు మరింత బోల్డ్‌గా కనిపిస్తున్నారంటూ పోస్టులు పెట్టారు.

'ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓ సారి అద్దంలో చూసుకోలేదా' అని కొందరు నెటిజన్స్ ప్రశ్నించారు. మరికొందరైతే అలా బయటకు రావడానికి మీకు సిగ్గులేదా అని నిలదీశారు. మరొకరు రాస్తూ 'ఫ‍్యాషన్‌ పేరుతో ఉర్ఫీ జావెద్‌ను మీరు మించిపోయారు' అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

(ఇది చదవండి: జియా డిప్రెషన్‌లో ఉందని ఆమె తల్లికి చెప్తే పట్టించుకోలేదు: నటుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement