Brutally
-
బెంగాల్: యువతిని చితకబాదిన ఘటనపై దుమారం
కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్‌లో ఓ వీడియో దుమారం రేపుతోంది. ఓ యువతిని రోడ్డుపై పడేసి కర్ర విరిగేలా చితకబాదుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.యువతిని కొడుతుండగా చుట్టూ నిలబడిన వారంతా చూస్తూ ఉండిపోయారు తప్ప ఆపడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ఈ ఘటన బెంగాల్లో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితి తెలియజేస్తోందని మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు. ‘ఈ వీడియోలో యువతిని దారుణంగా కొడుతున్నది చోప్రా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న తృణమూల్ ఎమ్మెల్యే హమిదుర్ రెహ్మాన్ అనుచరుడు తేజ్ముల్ అనే వ్యక్తి. ఇతను తన ‘ఇన్సాఫ్’ సభల ద్వారా పంచాయితీలు చేసి అక్కడికక్కడే శిక్షలు విధిస్తుంటాడు. This is the ugly face of Mamata Banerjee’s rule in West Bengal.The guy in the video, who is beating up a woman mercilessly, is Tajemul (popular as JCB in the area). He is famous for giving quick justice through his ‘insaf’ sabha and is a close associate of Chopra MLA Hamidur… pic.twitter.com/fuQ8dVO5Mr— Amit Malviya (@amitmalviya) June 30, 2024తృణమూల్ కాంగ్రెస్ పాలనలో ఈ తరహా షరియా కోర్టులున్నాయని భారత ప్రజలు మొత్తం గుర్తించాలి. బెంగాల్లో ప్రతి గ్రామంలో ‘సందేశ్‌ఖాలీ’తరహా ఘటనలు జరుగుతున్నాయి. మమత పాలన వెస్ట్‌బెంగాల్‌కు ఒక శాపం’అని మాలవ్య ట్వీట్లో ఫైర్ అయ్యారు. మరోపక్క సీపీఎం నేతలు కూడా యువతిని కొడుతున్న వీడియోపై స్పందించారు. బెంగాల్లో బుల్డోజర్ జస్టిస్ రాజ్యమేలుతోందని సీపీఎం స్టేట్ సెక్రటరీ ఎండీ సలీమ్ ఎక్స్(ట్విటర్)లో విమర్శించారు. కాగా, యువతిని చితకబాదిన ఘటన ఈ వారాంతంలోనే జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఏ కారణంతో కొడుతున్నారనేది తెలియరాలేదు. Not even #KangarooCourt ! Summary trial and punishment handed out by d @AITCofficial goon nicknamed JCB.Literally bulldozer justice at Chopra under @MamataOfficial rule. pic.twitter.com/TwJEThOUhi— Md Salim (@salimdotcomrade) June 30, 2024 -
ఏమైందో తెలియదు..! నడిరోడ్డుపై క్యాబ్ డ్రైవర్ని చితక్కొట్టారు..
అమెరికాలోని న్యూయార్క్‌లో దారుణం జరిగింది. ఐదుగురు యువకులు కలిసి వృద్ధుడైన ఓ క్యాబ్ డ్రైవర్‌ను దారుణంగా కొట్టారు. నడిరోడ్డులో 60 ఏళ్ల వృద్ధునిపై విచక్షణా రహితంగా పిడిగుద్దులు కురిపించారు. బూటు కాలుతో తంతూ ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులు కలిసి దాడి చేశారు. నగరంలోని సిక్స్త్ అవెన్యూ 34 వ కూడలికి సమీపంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు ఫైరవుతున్నారు. వీడియో ప్రకారం ఐదుగురు కలిసి క్యాబ్ డ్రైవర్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. వారి దెబ్బలను తట్టుకోలేక ఆ వృద్ధుడు తనను తాను రక్షించుకోవడానికి తలపై చేతులు పెట్టుకుని దీనంగా నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఓ మహిళ పిడిగుద్దులను భరించలేక క్యాబ్ వైపు వంగి పడిపోయాడు. ఈ దృశ్యాలు సదరు వీక్షకున్ని ఆలోచింపజేశాయి. ఈ వీడియో వైరల్ కాగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట క్యాబ్ డ్రైవర్‌కు యువకులకు మధ్య వాగ్వాదం నడిచిందని తెలిపారు. అనంతరం దాడి జరిగినట్లు పేర్కొన్నారు. Just another day in NYC.... A group of thugs beat up a 60 year old taxi cab driver in Manhattan in broad daylight. Last year a 52 year old NYC cab driver was beaten to death by a group of teens. pic.twitter.com/v9SQAkCWcN — Leftism (@LeftismForU) July 28, 2023 తీవ్రంగా గాయపడిన వృద్ధున్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. హోవార్డ్ కొలీ, నటాలీ మోర్గాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ బ్రూక్లిన్కు చెందినవారిగా గుర్తించారు. ఇదీ చదవండి: ఏంటీ వింత? ఎపుడూ లేనిది.. ఇపుడే కొత్తగా! 45 మందికి షాకిచ్చిన గోవా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ -
అద్దంలో చూసుకోకుండానే బయటకొచ్చారా?.. నటిపై నెటిజన్స్ ఫైర్!
ఈషా గుప్తా బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈషా 2007లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించింది. 2012లో క్రైమ్ థ్రిల్లర్ జన్నత్- 2లో ఆమె తొలిసారి నటించింది. ఆ చిత్రానికి ఉత్తమ డెబ్యూ ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది. ఆ తర్వాత చక్రవ్యూహ్, హంషాకల్స్, రాజ్ 3D, క్రైమ్ డ్రామా రుస్తోమ్, బాద్షాహో లాంటి సినిమాల్లో కనిపించింది. అయితే ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటున్న ఇషా తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో మరీ బోల్డ్ పిక్స్ షేర్ చేస్తూ అలరిస్తుంటారు. (ఇది చదవండి: విజయ్ దేవరకొండ, అఖిల్ కెరీర్‌ని దెబ్బ తీసిన ‘బామ్మర్ది’!) తాజాగా ముంబయిలో అడుగుపెట్టిన భామకు ఫోటోలకు ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్స్ దారుణ కామెంట్స్ చేశారు. ఆమె టాప్‌లెస్ డ్రెస్ ధరించగా.. మీరు మరింత బోల్డ్‌గా కనిపిస్తున్నారంటూ పోస్టులు పెట్టారు. 'ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓ సారి అద్దంలో చూసుకోలేదా' అని కొందరు నెటిజన్స్ ప్రశ్నించారు. మరికొందరైతే అలా బయటకు రావడానికి మీకు సిగ్గులేదా అని నిలదీశారు. మరొకరు రాస్తూ 'ఫ్యాషన్ పేరుతో ఉర్ఫీ జావెద్‌ను మీరు మించిపోయారు' అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: జియా డిప్రెషన్లో ఉందని ఆమె తల్లికి చెప్తే పట్టించుకోలేదు: నటుడు) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ప్రియురాలిని చావబాదిన ఘటన: నిందితుడి అరెస్టు, ఇల్లు ధ్వసం
భోపాల్: ఒక యువకుడు యువతిని దారుణం కొడుతున్న వీడియో నెట్టింట హల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీరియస్ అయిన అధికారులు సదరు వ్యక్తిని అరెస్టు చేయడమే గాక అతడి ఇంటిని కూడా ధ్వంసం చేశారు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..ఒక యువతని దారుణంగా కొడుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో జరిగింది. దీంతో రంగంలోకి దిగిన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారభించారు. దారుణానికి పాల్పడిన వ్యక్తిన పంకజ్ త్రిపాఠిగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతడు విచారణలో తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కారణంతో ఆ యువతిపై దాడి చేసినట్లు వివరించాడు. పోలీసులు నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఉంటున్న నిందితుడి ఇంటిని అధికారులు బుల్డోజర్తో కూల్చేశారు. అతడి జీవనాధారం డ్రైవింగ్. అందువల్ల అధికారులు అతడి డ్రైవింగ్ లైసెన్సు కూడా క్యాన్సిల్ చేశారు. సకాలంలో అతడిపై చర్యలు తీసుకోని స్థానిక పోలీసులను సైతం సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడి ఇంటిన కూల్చిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Bulldozer action by MP govt, Arrested Boy from Rewa who brutally beaten and filmed his girlfriend asking for marry her. pic.twitter.com/lmeazFV14S — Political Kida (@PoliticalKida) December 25, 2022 (చదవండి: షాకింగ్ వీడియో: నువ్వేం మనిషివిరా అయ్యా..! ప్రియురాలిని ఘోరంగా చావబాదాడు, కారణం ఏంటంటే..) -
దారుణంగా కొట్టి, వీడియో పోస్ట్ చేశారు
లక్నో: ఉత్తరప్రదేశ్ మహరాజ్ గంజ్‌లో దారుణం చోటు చేసుకుంది. అడవికి వెళ్లిన ఓ జంటపై ముగ్గురు గుండాలు విరుచుకు పడ్డారు. అతిదారుణంగా వీరిద్దరిపై దాడి చేశారు. అంతేకాదు ఈ దృశ్యాలు షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే కట్టెలకోసం అడవికి వెళ్లిన జంటను ఈ దుర్మార్గులు టార్గెట్ చేశారు. వారిని అడ్డుకుని గూండాల్లాగా దాడి చేశారు. ఈ మొత్తం సంఘటనను కెమెరాలో చిత్రించారు. అక్కడితో వీరి దౌర్జన్యం, దురాగతాలు ఆగలేదు. బలవంతంగా బాధితులిద్దర్నీ నగ్నంగా చేసి మరీ వీడియో తీశారు. ఈ సంఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. మోరల్ పోలీసింగ్ ఆరోపణలతోఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
రైతు దారుణ హత్య
పొలంలో నిద్రిస్తుండగా కత్తిపోట్లు సంచలనం రేకెత్తించిన ఘటన ఆలమూరు : ప్రశాంతమైన గ్రామంలో రైతు హత్యకు గురైన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. గొడవలకే ఆస్కారం లేని గ్రామంలో ఏకంగా ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయబడడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. అజాత శత్రువుగా గ్రామస్తులు భావిస్తున్న రైతు చుండ్రు వీర్రాఘవులు (44) హత్యను చేధించేందుకు పోలీసులకు సవాల్‌గా మారింది. ఆలమూరు పోలీసులు కథనం ప్రకారం మోదుకూరుకు చెందిన వీర్రాఘవులు తన పశువుల మకాం వద్ద రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యాన్ని నిల్వ చేశాడు. యథావిధిగా గురువారం రాత్రి తన ధాన్యం రాశుల వద్ద పహారా నిర్వహించేందుకు సుమారు 11.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయలు దేరివెళ్లిపోయాడు. వేకువ జామున పశువుల పాలు తీసుకునేందుకు వెళ్లిన తండ్రి రాజుకు తన కుమారుడు వీర్రాఘవులు రక్తపు మడుగులో శవమై కనిపించాడు. దీంతో తండ్రి రాజు వేస్తున్న కేకలను గమనించి పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు అక్కడకు చేరుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై పి.దొరరాజు ఆధ్వర్యంలో ఆలమూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడు శరీరంలోని ఛాతీపైన, మెడపైనా రెండు కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన విధానాన్ని బట్టి చూస్తే అత్యంత పాశవికంగా, కర్కశంగా, కసితోనే ఈ పని చేసినట్టు అర్థమవుతోంది. రామచంద్రపురం డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, మండపేట రూరల్ సీఐ వి.పుల్లారావుకు స్థానిక ఎస్సై దొరరాజు హత్యకు సంబంధించి సంఘటనా వివరాలను అందజేశారు. రైతు వీర్రాఘువులు గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం నాలుగు గంటల లోపే హత్యకు గురయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యలో స్థానికుల ప్రమేయం ఉందా లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వీర్రాఘవులను హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రతిష్టాత్మకంగా హత్య కేసు విచారణ ఆలమూరు మండలంలో ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు జరగని నేపథ్యంలో వీర్రాఘవులు హత్య కేసును త్వరితగతిన చేధించేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆదేశాల మేరకు కాకినాడ నుంచి క్లూస్‌టీం, జాగిలాలను రప్పించి సోదాలను నిర్వహించారు. లభించిన వివరాలు, స్థానికులు ఇచ్చిన సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. హత్య జరిగిన తీరు చూస్తూ పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందనే అభిప్రాయినిక పోలీసులు వచ్చారు. అనేక కోణాల్లో .. హత్యకేసును చేధించేందుకు పోలీసులు అనేక కోణాల్లో ఆలోచిస్తున్నారు. ఎవరైనా విరోదులు ఉన్నారా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే దిశగా పోలీసుల దర్యాప్తు జరుగుతుందని తెలుస్తోంది. పోలీసులకు ప్రస్తుతానికి ఏవిధమైన ఆధారాలు లభించలేదని విశ్వసనీయంగా తెలిసింది. మండపేట రూరల్ సీఐ పుల్లారావు కేసును దర్యాప్తు చేస్తుండగా ఎస్సై దొరరాజు కేసును నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మండపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మండపేట, అంగర, మండపేట రూరల్ ఎస్సైలు నసీరుల్లా, పెద్దిరాజు, సీహెచ్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరేళ్ల బాబును రక్తం వచ్చేలా కొట్టిన తల్లి
-
షేవింగ్ బ్లేడ్‌తో ప్రసన్న గొంతు కోశారు: సిఐ
-
ఎల్లంపేటలో చిన్నారి కావ్య దారుణ హత్య
-
‘సాగర్’కు ‘మల్లన్న’తో జీవం
బాన్సువాడ : ప్రపంచంలోనే మొట్టమొదటి భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయిన నిజాంసాగర్ సమైక్య పాలకుల తీరుతో ఎడారిగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మల్లనసాగర్తోనే నిజాంసాగర్‌కు పూర్వవైభవం వస్తుందని పేర్కొన్నారు. ఆదివారం ఆయన బాన్సువాడలోని తన ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. ఈ వర్షాకాలంలో సగటు వర్షపాతం 402 మిల్లీమీటర్ల కాగా 17 శాతం అధికంగా 429 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, కానీ నిజాంసాగర్, పోచంపాడ్ ప్రాజెక్టుల్లో ఆశించినంత నీరు చేరలేదని పేర్కొన్నారు. ప్రాణహిత నదినుంచి వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందన్నారు. ప్రాణహిత–ఇంద్రావతి నదుల నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్‌కు మళ్లిస్తే జిల్లా రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు. కాళేశ్వరం ద్వారా ఉత్తర తెలంగాణాలోని 20 లక్షల ఎకరాలు స్థిరీకరణ అవుతాయని, మరో 20 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు లభిస్తుందని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ఎల్తైన ప్రదేశంలో ఉన్నందున, ఎత్తిపోతల ద్వారా అక్కడి వరకు నీరును తీసుకువచ్చి, నేరుగా రోజు నిజామాబాద్ జిల్లాకు 3 టీఎంసీల చొప్పున నీరు అందించవచ్చన్నారు. ఇప్పటికే రూ. 13 వేల కోట్లతో టెండర్లను ఆహ్వానించామన్నారు. మల్లన్నసాగర్ నిర్మిస్తే కామారెడ్డి నియోజకవర్గంలో 80 వేల ఎకరాలు, ఎల్లారెడ్డిలో లక్ష, బాన్సువాడలో 30 వేలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో లక్ష, బాల్కొండలో 30 వేలు, ఆర్మూర్ నియోజకవర్గంలో 10 వేల ఎకరాలకు సాగు నీర అందుతుందని పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యం గల మల్లన్నసాగర్‌ను నిర్మించకుండా, ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని, మల్లన్నసాగర్ నిర్వాసితులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులు భూములు అప్పగిస్తున్నారని, వారికి పాదాభివందనం తెలుపుతున్నానని పేర్కొన్నారు. ప్రతిపక్షాల తీరును నిరసిస్తూ మంగళవారం రైతులతో చలో నిజాంసాగర్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు గర్భంలో నిర్వహించే కార్యక్రమంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారన్నారు. నిజాంసాగర్ దుస్థితిని ప్రపంచానికి చూపించేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీలకతీతంగా రైతులు పాల్గొనాలని కోరారు. అనంతరం నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులతో మంత్రి సమీక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మహ్మద్ ఎజాస్, భాస్కర్, సురేశ్, శ్రీనివాస్, స్వరూప, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అయ్యో.. బాలుడ్ని రోడ్డుకేసి కొట్టాడు
టర్కీ: సినిమాల్లో మాత్రమే కనిపించే ఒళ్లు గగుర్పొడిచేలాంటి సంఘటనలు కళ్లెదురుగా జరిగితే.. అది కూడా ఓ చిన్నారి జీవితంలో ఎదురైతే ఎలా ఉంటుంది. టర్కీలో నిజంగానే ఓ బాలుడికి భయంకరమైన అనుభవం ఎదురైంది. ఆ బాలుడు సిరియా నుంచి ఓ శరణార్ధి. తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదు.. ఏం తినాలో కూడా తెలియదు. కొత్తప్రదేశం, ఒంట్లో బెరుకు.. ఆ కంగారులో ఏం చేశాడో ఏమోగానీ.. ఓ వ్యాపారి అమాంతం పైకి లేపి రోడ్డుకేసి బలంగా విసిరి కొట్టాడు. ఈ ఘటన టర్కీలోని ఎప్పుడూ రద్దీగా ఉండే మార్కెట్లో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ లో ఇది రికార్డయింది. అందులో చూపించిన ప్రకారం ఓ బాలుడు భయంతో పరుగు తీశాడు. అతడి వెనుక ముసా డి అనే వీధి వ్యాపారస్తుడు వేగంగా వచ్చి ఆ బాలుడిని పట్టుకొని అమాంతం పైకి లేపి సీసీ రోడ్డుకు వేసి కొట్టాడు. ఈ ఘటన చూసి మార్కెట్ వాళ్లంతా కుర్రాడిని కొట్టిన వ్యక్తితో తగువుకు దిగారు. ఓ వ్యక్తి కోపాన్ని ఆపుకోలేక ఆ వ్యాపారస్తుడిపై చేయి చేసుకున్నాడు. -
నిర్దాక్షిణ్యంగా నిండు గర్భిణి గెంటివేత
మెదక్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దారుణం సంగారెడ్డి టౌన్: ఓ నిండు గర్భిణిని నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేసిన ఘటన బుధవారం మెదక్ జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. సంగారెడ్డి మండలానికి చెందిన కవిత నిండు గర్భిణి. డెలివరీ కోసం సోమవారం సం గారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేరింది. కవితకు సిజేరియన్ చేస్తామని చెప్పిన వైద్యులు.. రక్తం తక్కువగా ఉందని, వేరే ఆసుపత్రికి వెళ్లాలని బుధవారం బయటకు పంపి తలుపులు వేసేశారు. ఏమి చేయాలో తోచక ఆసుపత్రి ఆవరణలోనే ఉండిపోయింది. ఆమె లోపలికి వస్తుందేమోనని సిబ్బంది గంటలకొద్దీ తలుపులు మూసేశారు. దీంతో ఆ వార్డులోని బాలింతలు, గర్భిణుల సహాయకులు బయటే ఉండిపోయారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలనే: గర్భిణి తల్లిదండ్రులు కవిత ఆరు నెలలుగా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ వద్ద పరీక్షలు చేయించుకుంటోందని ఆమె తల్లిదండ్రులు యాదమ్మ, రంగయ్య తెలి పారు. సంగారెడ్డిలోని ఆ డాక్టర్‌కు చెందిన ప్రైవేటు ఆసుపత్రిలో ప్రతి నెలా వైద్యపరీక్షలు చేయించుకుందన్నారు. పేదరికం కారణంగా డెలివరీ కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిందని తెలిపారు. తీరా సిజేరియన్‌వేళ రక్తం లేదంటూ తమ కూతురును బయటికి వెళ్లగొట్టారని వారు కంట తడిపెట్టారు. ఈ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులకు ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయని, అక్కడికి పంపాలనే ఉద్దేశంతో ఆసుపత్రి సిబ్బంది ఇలా దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ‘ఆస్పత్రి లోపల ఆపరేషన్ అయిన బిడ్డ ఒక్కతే ఉంది. పొద్దున్నుంచి తలుపులు తెరుస్తలేరు.’ అని ఓ బాలింత తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై ‘సాక్షి’ వివరణ కోరేందుకు ప్రయ త్నించగా వైద్యులెవరూ ముందుకు రాలేదు. ఇన్చార్జి సూపరింటెండెంట్‌ను ఫోన్లో ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. -
మృత్యోన్మాదం
కోరుకొండలో దారుణం ఇనుపరాడ్డుతో ఉన్మాది దాడి ఘటనా స్థలిలో ఇద్దరు.. చికిత్స పొందుతూ మరొకరు మృతి కోరుకొండ /రాజమండ్రి క్రైం : ప్రశాంతంగా ఉన్న కోరుకొండలోని రామచంద్రరావు పేట ఒక్కసారిగా ఉలిక్కి పడింది. క్రిస్మస్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు స్థానికులు సన్నద్ధమవుతున్నారు. ఇంతలో ఓ ఉన్మాది ఇనుపరాడ్డుతో దాడి చేసి ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడు. తల్లి లాంటి వదినను కొట్టి చంపాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరిని కూడా అంతమొం దించాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా భీతా వహంగా మారింది. ఇద్దరు ఘటనా స్థలిలోనే మృతి చెందగా, మరో మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. స్థానిక రామచంద్రరావు పేటకు చెందిన ఏడిద ఆనంద్ గతంలో ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం మతిస్థిమితం లేని అతడు వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఇంటి వద్ద పని చేసుకుంటున్న వదిన విజయలక్ష్మి (45)తో ఘర్షణ దిగాడు. ఇనుప రాడ్డుతో ఆమె తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆ సమయంలో ఇంటి పక్కనున్న గెడ్డం నాగభూషణం (40) వచ్చి ప్రశ్నించడంతో అతడిని కూడా తీవ్రంగా గాయపరిచాడు. నాగభూషణాన్ని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెం దాడు. ఇంటి వద్ద పని చేసుకుంటున్న కోరుకొండ-2 ఎంపీటీసీ (టీడీపీ) సభ్యురాలు ఖండవల్లి కుమారి (45) గొడవను చూసి కేకలు వేసింది. అప్పటికే ఇద్దరిపై దాడి చేసిన అతడు కుమారి వద్దకు వచ్చి రాడ్డుతో తలపై తీవ్రంగా గాయపరిచాడు. తీవ్రగాయాలైన ఆమెను భర్త పంతులు, బంధువులు కలసి కోరుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుమారికి భర్త, కుమార్తె ఉన్నారు. డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, సీఐ జి.మధుసూదనరావు, ఎస్సై డి.రాంబాబు, సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఏడిద ఆనంద్‌ను కోరుకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృ తురాలు విజయలక్ష్మికి భర్త, కుమార్తె ఉన్నారు. అలాగే నాగభూషణానికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సకాలంలోరాని 108 అంబులెన్సు ప్రాణాపాయాలతో కొట్టుమిట్టులాడుతున్న గెడ్డం భూషణం, ఖండవల్లి కుమారిలను ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్సు సకాలంలో రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయారని పలువురు ఆరోపించారు. చికిత్స పొందుతూ ఎంపీటీసీ సభ్యురాలి మృతి కోరుకొండ గ్రామంలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఎంపీటీసీ సభ్యురాలు ఖండవల్లి కుమారి తీవ్రగాయాలతో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అదే ఘటనలో మృతి చెందిన ఏడిద విజయలక్ష్మి, గెడ్డం భూషణం మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చినప్పుడు బంధువుల ఆక్రందనలతో ఆస్పత్రి ప్రాంగణం మార్మోగింది. క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకుందామనుకుంటున్న వేళ ఇలా మృత్యువాతపడడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. జక్కంపూడి విజయలక్ష్మి పరామర్శ సంఘటన స్థలాన్ని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మితో పాటు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. -
ఒక్కడితోనే...
కళ్ల ముందే చెల్లికి దారుణం జరిగితే ఓ అన్న ఏం చేశాడు? వాళ్లపై ఎలా పగ తీర్చుకున్నాడు? అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘ఒక్కడితో మొదలైంది’. బైలుపాటి మోహన్ ఆర్ట్ ప్రొడక్షన్‌పై మొగలి నాగేశ్వరరావు దర్శకత్వంలో బి.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మోహన్, మైనా హీరో హీరోయిన్లు కాగా, ధన్‌రాజ్ టైటిల్‌రోల్ పోషిం చారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘నా మాతృ భాష కన్నడం అయినా తెలుగు సినిమాపై ఉన్న ఇష్టంతో ఈ సినిమా నిర్మించాను. ఈ చిత్రాన్ని నవంబర్ 20న విడుదల చేస్తాం’’ అని తెలిపారు. సుమన్, లావణ్య, అనూషా, చెమ్మక్చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా శ్యాంప్రసాద్ దూపాటి, కథ: నవీన్‌రాజ్ సీహెచ్, సంగీతం: బోలే శావలి. -
నాలుగేళ్ల బాలుడిపై బంధువు దాష్టీకం
-
భార్యను చంపిన మానవ మృగం
-
నిద్రిస్తున్న వ్యక్తిని చంపిన ప్రత్యర్ధులు
-
ప్రభుత్వం చేయిస్తున్న హత్యలు ఇవి: గుర్నాధరెడ్డి
-
ఇది రాజకీయ ప్రేరేపిత హత్య: వాసిరెడ్డి పద్మ
-
రాప్తాడులో వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య
-
ప్రత్యేక హోదా కల్పించకపోవడం దారుణం
పాతగుంటూరు: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడం దారుణమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజనచట్టం అమలు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులపై శనివారం పలు పార్టీల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాళ్ల మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం విభజన సమయంలో ఐదు సంవత్సరాలు ఆంధ్రాకు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన సందర్భాల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఐదేళ్లు చాలదు పదేళ్లు ప్రత్యేక హోదా కల్పించాలని అప్పట్లో డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెప్పడం, కేంద్ర మంత్రి సుజనాచౌదరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా నిధులు అధిక మొత్తంలో వస్తాయని చెప్పడం రాష్ట్ర ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్నారు. దీనిపై సీపీఐ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం కొనసాగిస్తుంటే తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అరెస్టు చేశారన్నారు. రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు సీపీఐ కృషి చేస్తుందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని చీల్చేందుకు మద్దతు ఇస్తూ ఎన్నికల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు మాట మార్చిందని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలతో ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాజధాని నిర్మాణానికి 32 వేల ఎకరాలు ప్రభుత్వం స్వీకరించిందని, ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టకుండా ఆ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించి వారిచ్చే డబ్బులతో అభివృద్ధి చేసేలా చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. వామపక్షాలు, ప్రతిపక్షం, ప్రజా సంఘాలు కలసికట్టుగా ప్రజా సమస్యలపై, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు విభజన చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేక మౌనం దాలుస్తున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా డెల్టా రైతులు, ప్రజలకు సాగునీరు, తాగునీటి సమస్యలు తీరుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమను వెలుగులోకి తెచ్చి పోలవరంను నిర్వీర్యం చేసేలా చూస్తుందన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరు ఆంజనేయులు మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడంలేదో అర్థం కావడంలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఉద్యమంలో పాల్గొంటామన్నారు. సమావేశంలో ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి తూమాటి శివయ్య, సీపీఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు పున్నయ్య, లోక్‌సత్తా జిల్లా జాయింట్ సెక్రటరీ జి.వెంకయ్య, లోక్‌సత్తా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎస్.మనోరమ, అయ్యస్వామి, వెంకటేశ్వరరావు, రాధాకృష్ణమూర్తి, సుబ్బారావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
బాబూ మాట నిలుపుకోవాలి
ఉరవకొండ : ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చి మాట నిలుపుకోవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వై.మధుసూధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అయ్యూక ఇచ్చిన హామీలు మరచి మాటలు కోటలు దాటేలా వ్యవహరిస్తుండటం దారుణం అన్నారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి 31న పశ్చివు గోదావరి జిల్లా తణుకులో చేపట్టే 48 గంటల దీక్షతో పాటు ఉరవకొండలో తన సోదరుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హంద్రీ-నీవా కాలువ నిధుల సాధన కోసం చేపట్టనున్న దీక్షకు మద్దతు తెలుపుతూ ఉరవకొండ నుండి సోవువారం ఆయన ప్రారంభించిన పాదయూత్రకు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. హంద్రీ-నీవా పథకానికి వైఎస్‌రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన శిలా ఫలకం నుండి ఆయన పాదయూత్ర ప్రారంభించారు. అంతకు ముందు ఆయన వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వూట్లాడుతూ చంద్రబాబు అవులుకు సాధ్యం కానీ హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అటకెక్కిస్తున్నారని మండిపడ్డారు. గడిచిన ఎనిమిది నెలల కాలంలో ప్రజల విశ్వాసాన్ని చూరగోనే ఒక్క పని చేయులేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎంతగానో ఆశలు పెట్టుకున్న రుణమాఫీకి కూడా ఎన్నో అడ్డంకులు కల్పిస్తూ మోకాలడ్డుతున్నారన్నారు. కరవు జిల్లా అనంతపురాన్ని చంద్రబాబు పూర్తిగా విస్మరించి మాటలతో కాలక్షేపం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి హంద్రీ-నీవా తొలి దశలో మిగిలిన అన్ని పనులను యుుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయూలని డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళల రుణాలు పూర్తిగా మాఫీ చేయూలన్నారు. జగన్, విశ్వేశ్వరరెడ్డి దీక్షలను ప్రజలు విజయవంతం చేయూలని పిలుపునిచ్చారు. పాదయూత్ర లత్తవరం, షేక్షానుపల్లి, కోనాపురం, పెన్నహోబిళం మీదుగా కూడేరు మండలంలోకి ప్రవేశించింది. పాదయూత్రకు ఆయూ గ్రావూల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. వుహిళలు హారతులు పట్టారు. పాదయూత్రలో ఉరవకొండ, విడపనకల్లు జడ్పీటీసీ సభ్యులు లలితవ్ము, తిప్పయ్యు, పార్టీ జిల్లా వుహిళా విభాగం అధ్యక్షురాలు బోయు సుశీలవ్ము, జిల్లా స్టీరింగ్ కమీటి సభ్యులు తేజోనాధ్, అశోక్, వుండల, పట్టణ కన్వీనర్లు సుంకన్న, బసవరాజు, వజ్రకరూర్ ఎంపీపీ కొర్ర వెంకటవ్ము, వూజీ ఎంపీపీ ఎసీ ఎర్రిస్వామి, వుండల నాయుకులు వన్నప్ప, తులసీదాస్, ప్రతాప్, నవీన్‌రెడ్డి, వడ్డే ఆంజినేయుులు, లత్తవరం గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
హత్య చేసి.. తగలబెట్టి..
* చినరావుపల్లిలో దారుణం * రంగంలోకి దిగిన పోలీసులు * మృతుని వివరాలు సేకరణ.. * నిందితుల కోసం నాలుగు బృందాలు * సంచలనం రేకెత్తించిన సంఘటన ఎచ్చెర్ల : ఎచ్చెర్ల మండలం సంతసీతారామపురం పరిధిలోని చినరావుపల్లిలో దారుణం జరిగింది.గ్రామ సమీపంలోని జీడిమామిడి తోటల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని హత్యచేసి దహనం చేశారు. మృతదేహం సగంసగం కాలి గుర్తించడానికి వీల్లేకుండా ఉంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. బుధవారం సాయంత్రం గ్రామంలో కాలిపోయిన గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు గ్రామ రెవెన్యూ అధికారి జరుగుళ్ల వెంకటరమణమూర్తికు తెలియజేయ గా అతని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం జేఆర్‌పురం సీఐ కె.అశోక్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి హత్యగా నిర్ధారించారు. మృతదేహాన్ని వాహనంలో గోనె సంచిలో పెట్టి తీసుకొచ్చి బయటకు తీయకుండానే కిరోసిన్,పెట్రోల్ పోసి తగలబెట్టి ఉంటారని భావిస్తున్నారు. మృత దేహానికి నిప్పు అంటించాక నిందితులు అక్కడ నుంచి పరారై ఉంటారని చెబుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. శ్రీకాకుళం డీఎప్సీ కె.భార్గవ నాయుడు, క్లూస్ టీం కూడా సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. మృతదేహాన్ని పరిశీలించి తలపై గాయాలు ఉన్నట్టు డీఎస్పీ గుర్తించారు. క త్తితో నరికి చంపి ఉంటారని.. మృతి చెందిన వ్యక్తి వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. ఈ నేర సంఘటనలో ఒకరిద్దరు కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉండి ఉంటుం ది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దారి పక్కనే.. మృతదేహాన్ని దహనం చేసిన ప్రాంతం ఆర్అండ్బీ రహదారికి అనుకొని కిలోమీటరు దూరంలో ఉంది. ఆ పక్క నుంచే కాలిబాట ఉంది. ఆర్అండ్బీ రహదారి నుంచి లావేరు మండలం బయ్యన్న పేట, మురపాక తదితర గ్రామాలకు ఈ దారి గుండా రాకపోకలు సాగి స్తారు. ఆ సమీపంలోనే షిర్డీసాయి ఆలయం కూడా ఉంది. ఎక్కడా మిస్సింగ్ కేసులు లేవు.. ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం మండలాల పోలీసుస్టేషన్ల పరిధిలో ఎక్కడ ఈ మధ్యకాలంలో అదృశ్యం కేసులు కూడా నమోదు కాలేదని డీఎస్పీచెప్పారు. మృత దేహం ఎవరిది అన్న మిస్టరీ వీడితే నిందితుల వివరాలు తెలిసే అవకాశం ఉంటుందన్నారు. వీలైనంత త్వరగా కేసును ఛేదిస్తామన్నారు. మృతుని ఆచూకీ కోసం నాలుగు బృందాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దహనం జరిగిన ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇదే ప్రదేశంలో గతంలో పలువురి ఆత్మహత్య చినరావుపల్లి ప్రాంతంలోని జీడిమామిడి తోటల్లో గతంలో పలు ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. వందల ఎకరాల్లో జీడిమామిడి తోటలు ఉండటం..జన సంచారం తక్కువగా ఉండడంతో ఈ ప్రాంతంలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కొన్నాళ్ల క్రితం ఓ ప్రేమ జంట ఇదే ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే మరో ఇద్దరు జీడి మామిడి చెట్లకు ఊరిపోసుకుని మృతిచెందారు. జన సంచారం పెద్దగా లేని కారణంగా సంఘటన జరిగి రోజులు గడిచాక విషయం బయటకు వస్తోంది. -
పట్టాలపై దారుణం
తల్లి సహా కూతుళ్లను బలిగొన్న కలహాల కాపురం రైలుకింద పడి బలవన్మరణం మృతులు ఖమ్మం జిల్లా వాసులు మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో దారుణం భర్త వేధింపులు ఆ ఇల్లాలిని కుంగదీశారుు. పన్నెండేళ్ల సంసారంలో సంతోషంగా ఉన్నది తక్కువే. భర్త రోజూ తాగొచ్చి వేధించినా.. ఆమె భరించింది. ఊరు నిండా అప్పులు చేసినా కూలోనాలో చేసి తీర్చింది. అరుునా అతడిలో మార్పు రాకపోగా.. రెండు రోజులుగా చిత్రహింసలకు గురిచేస్తుండడంతో విసిగి వేసారింది. పాఠశాల నుంచి తన ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని పుట్టెడు దుఃఖంతో రైలు పట్టాలపైకి చేరుకుంది. పిల్లలతో సహా రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడి కానరాని లోకాలకు చేరింది. మహబూబాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనతో మృతుల స్వగ్రామమైన ఖమ్మం జిల్లా చొప్పకట్లపాలెం, ప్రస్తుతం నివాసముంటున్న టేకులపల్లిలో విషాదాన్ని నింపింది. మహబూబాబాద్/ఖమ్మం అర్బన్ : తాగుబోతు భర్త వేధింపులు భార్య, పిల్లలను బలిగొన్నాయి. మానుకోటలో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట గ్రామం జగ్గవరం కాలనీకి చెందిన తూము నాగమణి, గంగాధరం దంపతుల కుమార్తె శ్రావణి(28)కి అదే జిల్లా బోనకల్ మండలం చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన బొగ్గవరపు ఆంజనేయులుతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తెలు అమూల్య(11), జీవణి(9) ఉన్నారు. మద్యానికి బానిసైన ఆంజనేయులు భార్యపై అనుమానంతో నిత్యం వేధించేవాడు. దీంతో మూడేళ్లుగా ఆమె తన పిల్లలతో కలిసి భర్తకు దూరంగా ఉంటోంది. మూడు నెలల క్రితమే పెద్దమనుషులు ఎదుట తాను మారానని, తాగుడు మానానని ఒప్పుకుని భార్య, పిల్లలను తీసుకెళ్లాడు. ప్రస్తుతం వారు ఖమ్మం శివారు టేకులపల్లిలో శ్రీలక్ష్మినగర్ రోడ్డు నంబర్ 4లో నివాసముంటున్నారు. శ్రావణి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండగా, ఆంజనేయులు ఖమ్మం శివారులోని క్వారీలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 11న తాగొచ్చి ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. రెండు రోజులుగా అలాగే కొడుతుండడం తో ఓపిక నశించిన శ్రావణి శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయల్దేరింది. ఖమ్మం రోటరీనగర్‌లో ఉంటున్న తన అక్క దగ్గరికి వెళుతున్నట్లు ఇంటి పక్కవారికి చెప్పి తన కుమార్తెలు చదువుతున్న కస్తూర్భా స్కూల్‌కు చేరుకుంది. వారితో పని ఉందని వెంటబెట్టుకుని బయల్దేరింది. అల్లుడు రోజూ కొడుతున్నాడని తెలియడంతో కూతురిని చూసేందుకు నాగమణి శుక్రవారం సాయంత్రం శ్రావణి ఉండే ఇంటికి వెళ్లగా ఇంట్లో సూసైడ్ నోట్ లభించింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె తన కుమారులతో కలిసి వెళ్లి రాత్రి రాత్రి 9 గంటలకు ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులు సమీపంలోని సాగర్ కాల్వ, పరిసర ప్రాంతాల్లో గాలించినా జాడ తెలియలేదు. ఆమె వాడుతున్న సెల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ఆరా తీయగా నగరంలోని బస్టాండ్ సమీపంలో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత అచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి దాటాక మహబూబాబాద్ వద్ద రైలు కిందపడి తల్లి ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడిన వార్త టీవీల్లో శనివారం ఉదయం రావడం చూసి ఖమ్మం అర్బన్ ఎస్సై రుద్రగాని వెంకటనారాయణ వెంటనే మహబూబాబాద్ పోలీసులకు సమాచారమిచ్చా రు. అదృశ్యమైన తల్లీకూతుళ్ల ఫొటోలు పంపారు. వాటిని పరిశీలించిన మానుకోట పోలీసులు మృతులు వారేనని నిర్ధారించారు. దీంతో సమాచారం అందుకున్న మృతుల బంధువులు మహబూబాబాద్‌కు చేరుకున్నారు. విగతజీవులుగా పడి ఉన్న కూతురు, మనవరాళ్లను చూడగానే నాగమణి రోదించిన తీరు చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యూరు. మహబూబాబాద్‌లో నమోదైన కేసు ను ఖమ్మం అర్బన్‌కు బదిలీ చేశాక ఆత్మహత్యకు కారణమైన శ్రావణి భర్త, అతడి బంధువులపై విచారణ చేసి చర్య తీసుకుంటామని ఎస్సై తెలిపారు. -
మద్యం మత్తులో దారుణం
కత్తులతో పొడుచుకున్న స్నేహితులు యువకుడి దుర్మరణం బెంగళూరు : మద్యం మత్తులో స్నేహితులు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలో ఓ యువకుడు మరణించాడు. బాణసవాడి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. కాచరణహళ్ళిలో నివాసముంటున్న కేశవమూర్తి (27), సోమశేఖరరెడ్డి (30) స్నేహితులు. వీరిద్దరు ఇంటిని అద్దెకు తీసి ఇచ్చే బ్రోకర్లుగా పని చేస్తున్నారు. కొంత కాలం క్రితం సోమశేఖర్‌రెడ్దికి కేశవమూర్తి రూ. 2,500 అప్పు ఇచ్చాడు. ఆ అప్పును తిరిగి ఇవ్వాలని ఆదివారం ఉదయం కేశవమూర్తి సోమశేఖర్‌ని కోరారు. ప్రస్తుతం తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో వారి మధ్య గొడవ జరిగింది. సాటి స్నేహితులు ఇద్దరికి నచ్చచెప్పడం అప్పటికి శాంతించారు. ఆదివారం రాత్రి కేశవమూర్తి, సోమశేఖర్‌రెడ్డితో పాటు నలుగురు స్నేహితులు హెణ్ణూరు మెయిన్ రోడ్డులోని జ్యోతి స్కూల్ సమీపంలో ఉన్న బార్లో మద్యం సేవించారు. తరువాత ఇద్దరు స్నేహితులు వెళ్లిపోయారు. బార్ దగ్గర కేశవమూర్తి, సోమశేఖర్‌రెడ్డి ఉన్నారు. ఆ సందర్భంలో వారు మళ్లీ నగదు విషయమై గొడవ పడ్డారు. మద్యం మత్తులో సహనం కొల్పోయిన వారు తమవెంట తెచ్చుకున్న కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కోలుకోలేక కేశవమూర్తి మరణించాడని పోలీసులు సోమవారం తెలిపారు.