ఒక్కడితోనే... | new movie okkadine | Sakshi
Sakshi News home page

ఒక్కడితోనే...

Published Tue, Nov 10 2015 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 12:17 PM

ఒక్కడితోనే...

ఒక్కడితోనే...

కళ్ల ముందే చెల్లికి దారుణం జరిగితే ఓ అన్న ఏం చేశాడు? వాళ్లపై ఎలా పగ తీర్చుకున్నాడు? అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘ఒక్కడితో మొదలైంది’. బైలుపాటి మోహన్ ఆర్ట్ ప్రొడక్షన్‌పై మొగలి నాగేశ్వరరావు దర్శకత్వంలో బి.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మోహన్, మైనా హీరో హీరోయిన్లు కాగా, ధన్‌రాజ్ టైటిల్‌రోల్ పోషిం చారు.

నిర్మాత మాట్లాడుతూ -‘‘నా మాతృ భాష కన్నడం అయినా తెలుగు సినిమాపై ఉన్న ఇష్టంతో ఈ సినిమా నిర్మించాను. ఈ చిత్రాన్ని నవంబర్ 20న విడుదల చేస్తాం’’ అని తెలిపారు. సుమన్, లావణ్య, అనూషా, చెమ్మక్‌చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా శ్యాంప్రసాద్ దూపాటి, కథ: నవీన్‌రాజ్ సీహెచ్, సంగీతం: బోలే శావలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement