దారుణంగా కొట్టి, వీడియో పోస్ట్ చేశారు
లక్నో: ఉత్తరప్రదేశ్ మహరాజ్ గంజ్లో దారుణం చోటు చేసుకుంది. అడవికి వెళ్లిన ఓ జంటపై ముగ్గురు గుండాలు విరుచుకు పడ్డారు. అతిదారుణంగా వీరిద్దరిపై దాడి చేశారు. అంతేకాదు ఈ దృశ్యాలు షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే కట్టెలకోసం అడవికి వెళ్లిన జంటను ఈ దుర్మార్గులు టార్గెట్ చేశారు. వారిని అడ్డుకుని గూండాల్లాగా దాడి చేశారు. ఈ మొత్తం సంఘటనను కెమెరాలో చిత్రించారు. అక్కడితో వీరి దౌర్జన్యం, దురాగతాలు ఆగలేదు. బలవంతంగా బాధితులిద్దర్నీ నగ్నంగా చేసి మరీ వీడియో తీశారు.
ఈ సంఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. మోరల్ పోలీసింగ్ ఆరోపణలతోఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.