Goons
-
మరో దాడి.. అది వాళ్ల పనే : కేజ్రీవాల్
ఢిల్లీ : మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వినర్ అర్వింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) కారుపై మరోసారి దాడి జరిగింది. గురువారం హరినగర్‌లో అగంతకులు తన కారుపై దాడి చేశారని కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.‘నా కారుపై దాడి జరిగింది. ఇది ప్రత్యర్థి పార్టీ నేతల మద్దతు దారుల పనే. ఢిల్లీ పోలీసులే దాడికి పాల్పడ్డ నిందితుల్ని నా బహిరంగ సభలోకి ప్రవేశించేందుకు అనుమతించారు. దాడి వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా (amit shah) హస్తం ఉంది. ఢిల్లీ పోలీసులను బీజేపీ వ్యక్తిగత సైన్యం’గా ఉపయోగించుకుంటుంది. ‘ఈరోజు హరి నగర్లో జరిగిన పార్టీ బహిరంగ సభలోకి ప్రవేశించడానికి విపక్షాల అభ్యర్థులను పోలీసులు అనుమతించారు. నా కారుపై దాడి చేశారు’ అని ట్వీట్లో తెలిపారు. ఇదంతా అమిత్ షా ఆదేశాల మేరకే జరుగుతోంది. అమిత్ షా ఢిల్లీ పోలీసులను బీజేపీకి వ్యక్తిగత సైన్యంగా మార్చారు. ఇలాంటి దాడులపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోందని విమర్శించారు. ఒక జాతీయ పార్టీ, జాతీయ అధ్యక్షుడు, దాని నాయకులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని.. అయినప్పటికీ ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నలు గుప్పించారు. आज हरि नगर में विपक्षी उम्मीदवार के लोगों को पुलिस ने मेरी जनसभा में घुसने दिया और फिर मेरी गाड़ी पर हमला करवाया। ये सब अमित शाह जी के आदेश पर हो रहा है। अमित शाह जी ने दिल्ली पुलिस को बीजेपी की निजी आर्मी बना दिया है। चुनाव आयोग पर बड़े सवाल उठ रहे हैं कि एक राष्ट्रीय पार्टी…— Arvind Kejriwal (@ArvindKejriwal) January 23, 2025జనవరి 18న న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో ఆయన వాహనంపై బీజేపీ మద్దతు దారులు దాడి చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారు. కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్న సమయంలో బీజేపీ నేత పర్వేష్ వర్మ మద్దతు దారులు తమ పార్టీ అధినేత కారుపై కర్రలు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారని ఆ పార్టీ పేర్కొంది. ఆ ఆరోపణలను వర్మ ఖండించారు. ‘అరవింద్ కేజ్రీవాల్ వాహనం ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఆప్ ప్రభుత్వం తమకు చేసిన అభివృద్ది ఏంటో చెప్పాలని స్థానికులు ప్రశ్నించారు. ఆ సమయంలో స్థానికుల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా కేజ్రీవాల్ కారు ముందుకు సాగింది. కేజ్రీవాల్ కారు ఢీ కొని ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. కేజ్రీవాల్‌కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. ఆస్పత్రిలో గాయపడ్డ యువకుల్ని పరమర్శించేందుకు నేను ఇప్పుడే వెళ్తున్నాను’ అంటూ బీజేపీ నేత పర్వేష్ వర్మ మీడియాతో మాట్లాడారు. -
ఆ ఒక్క వీడియోనే లీకైందా?.. ఈసీకి సూటి ప్రశ్నలు సంధించిన సజ్జల
గుంటూరు, సాక్షి: మాచర్ల పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం ఉదంతంపై తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ వీడియో లీకేజీ వ్యవహారంలో ఎన్నికల సంఘం తీరుపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై స్పందిస్తూ ఎన్నికల సంఘానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ‘‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా?. వీడియో సరైందేనా? కాదా? అనేది నిర్దారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది?. ఒక వేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వస్తుంది?.. A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue - While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue - While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 .. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ నాడు ఈవీఎంలకు సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతుంది కదా.! అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తుంది?. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయటపెట్టదు?. 3. More importantly, in the videos attached below, there is clear evidence of TDP goons attacking innocent voters. Why has no action been initiated in these instances? pic.twitter.com/iYVvwO5nXj— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుంది కానీ.. ఒక చిన్న క్లిప్పింగ్‌ను మాత్రమే బయటకు ఎలా వస్తుంది?తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే.. అమాయక ఓటర్లపై టీడీపీ గుండాలు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు? దాని వెనక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదు? అని సజ్జల ప్రశ్నించారు. వీటికి సమాధానాలేవీ?13న జరిగితే 21వ తేదీన వీడియో బయటకు ఎందుకు వచ్చింది?గుర్తు తెలియని వ్యక్తులని ఎలా ఫిర్యాదు చేయగలిగారు?స్వయంగా ఎమ్మెల్యే ఉంటే ఇంత గోప్యత ఎందుకు? ఇన్నాళ్లూ టీడీపీ వాళ్లు గుర్తించలేదా?పిన్నెల్లి అనుచరులు తమను బెదిరించారనే టీడీపీ వాదన నమ్మేలా ఉందా?ఈ నెల 20న ఫిర్యాదు నమోదు అయ్యిందని ఈసీ వివరణ, అంటే.. ఇంతకాలం సీఈవో ఆఫీస్ ఆ ఫుటేజీని చూడలేదా?అసలు ఇంతకాలం ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేశారు?మిగతా వీడియోల సంగతి ఏంటి? అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారనేది ఈసీ ఎందుకు దాస్తోంది? -
టీడీపీ రాక్షస మూకల రక్తదాహం
హైదరాబాద్, సాక్షి: పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా తెలుగు దేశం పార్టీ రాక్షస మూకల రక్తదాహం తీరలేదు. మంగళవారం రెండో రోజూ రాష్ట్రంలో అనేక చోట్ల తీవ్ర స్థాయిలో హింసాకాండకు, విధ్వంసానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులకు దిగారు. బుధవారం కూడా బీతావాహ వాతావరణం కొనసాగుతోంది. పల్నాడు, తాడిపత్రి లాంటి చోట్ల తెలుగు దేశం ముఖ్య నేతలను ముందుండి.. తమ శ్రేణులను, అరాచక మూకలను రెచ్చగొడుతూ దాడులు చేయించి, బీభత్సం సృష్టించారు. ఎన్నికల్లో తమకు ఓటేయలేదన్న కక్షతో.. దొరికినవారిని దొరికినట్లుగా తీవ్రంగా కొట్టారు. రక్తాలు కారేలా గాయపరిచారు. ఆస్తులు ధ్వంసం చేశారు.టీడీపీ మూకలు పేట్రేగిపోవడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలతో పాటు, స్థానిక ప్రజలూ భీతావహులయ్యారు. అంత విధ్వంసం జరుగుతుంటే... వారిని అడ్డుకోవడంలోనూ పోలీస్ యంత్రాంగం ఘోరంగా విఫలమైంది.పల్నాడుదాచేపల్లి మండలం మాదినపాడు లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాస్టికంకర్రలు ఇనుప రాడులతో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలపై దాడులుబత్తుల ఆదినారాయణ రెడ్డి అనే కార్యకర్తపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులుతీవ్ర గాయాలు హాస్పిటల్ తరలింపుకాళ్లు చేతులు నరికేశారు!పల్నాడు మాచవరంలో టీడీపీ శ్రేణులు కత్తులతో విచక్షణా రహితంగా దాడులు చేశాయి. వైఎస్సార్సీపీ నేతలు సింగరయ్య, లక్ష్మీరెడ్డి కాళ్లు చేతులు నరికేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.తాడిపత్రిలోనూ ఉద్రిక్తతలుతాడిపత్రి లో కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించిన టీడీపీ నేతలు. జేసీ వర్గీయులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అల్లరి మూకలను చెదరగొట్టిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసుల విజ్ఞప్తి తో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. మరోవైపు పోలీసుల ఆదేశాల మేరకు.. టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం తాడిపత్రి వదిలి బయటకు వెళ్లారు. తాడిపత్రి లో 144 సెక్షన్ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. జేసీ దౌర్జన్యాల్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాంతాడిపత్రి ఉద్రిక్తతలకు కారణమైన జేసీ ప్రభాకర్‌రెడ్డి కుటుంబంపై పెద్దారెడ్డి మండిపడ్డారు. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని, తాడిపత్రిలో వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనం పాటించలని పిలుపు ఇచ్చారు. అలాగే.. నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరిస్తామని తెలిపారాయన.పల్నాడులో 144పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు కొనసాగుతుండడం.. విమర్శలు వెల్లువెత్తడంతో అధికార యంత్రాంగం కదిలింది. పల్నాడు వ్యాప్తంగా 144 సెక్షన్ అమలుకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్ పోలీసు శాఖకు ఉత్తర్వులిచ్చారు. నరసరావుపేట లోక్‌సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ముగ్గురికి మించి ఎక్కువ మంది గుమికూడొద్దని, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, అనుమానాస్పదంగా సంచరించకూడదని పోలీసు అధికారులు హెచ్చరించారు. -
మహిళపై లైంగిక దాడి.. అడ్డుకుందని రైలులో నుంచి తోసివేత!
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌పూర్ నుంచి గుజరాత్ వెళుతున్న సూరత్ ఎక్స్‌ప్రెస్‌లో కొందరు దుండగులు ఒక మహిళపై అత్యాచారం చేసేందుకు యత్నించారు. బాధితురాలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆ దుండగులు బాధితురాలితో పాటు ఆమె బంధువును కూడా రైలు నుంచి కిందకు తోసేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం గ్వాలియర్‌లోని బిలౌవా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూన్ 19న కూలి పనులు చేసుకునే ఒక మహిళ తన బంధువుతో పాటు సూరత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి.. లక్నో మీదుగా గుజరాత్‌లోని సూరత్ వెళుతోంది. బాధిత మహిళ జార్ఖండ్‌లోని పాలమూ జిల్లాకు చెందినది. ఆమె ప్రయాణిస్తున్న రైలులోకి గ్వాలియర్‌లో ఐదుగురు పురుషులు ఎక్కారు. వారంతా బాధితురాలు కూర్చున్న సీటు ఎదురుగా కూర్చున్నారు. కొద్దిసేపటి తరువాత వారంతా ఆ మహిళను చూసి వెకిలి చేష్టలు చేయడం ప్రారంభించారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ దుండగులు ఆమెకు ఫొటోలు తీసే ప్రయత్నం చేశారు. ఆమె వ్యతిరేకించడంతో ఆమెను, ఆమె బంధువుకు కొట్టారు. దీంతో బాధితురాలు, ఆమె బంధువు రైలు బోగీలోని డోర్ దగ్గరకు వెళ్లి నిలుచున్నారు. ఇంతలో ఆ దుండగులు వారి దగ్గరకు వచ్చి ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. దీనిని ఆమె వ్యతిరేకించడంతో ఆ దుండగులు ఆమెను, ఆమె బంధువును నడుస్తున్న రైలులో నుంచి కిందకు తోసివేశారు. వారు బరౌడీ గ్రామ సమీపంలో పడిపోయారు. సోమవారం రాత్రంతా బాధితులు రైలు పట్టాల సమీపంలో స్పృహ తప్పిన స్థితిలో పడి ఉన్నారు. మంగళవారం ఉదయం గ్రామస్తులు వారిని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించడంతోపాటు, వారి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: స్నేహితురాలిపై ప్రేమతో అమె.. ’అతని‘గా మారాలనుకుంది.. కానీ.. -
యోగిజీ ఎఫెక్ట్: ప్లీజ్.. చంపొద్దు కావాలంటే జైల్లో పెట్టండి
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండో దఫా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఫలితంతో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి అధికార పీఠంపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో యూపీకి చెందిన ఓ యువకుడు ఆందోళనలో ఉన్నాడు. కారణం ఏంటని అంటారా?.. ప్రాణభీతి. సీఎంగా యోగి ఆదిత్యానాథ్ అధికారంలో ఉన్నప్పుడు క్రిమినల్స్ పాలిట సింహస్వప్నం అయ్యారు. వరుస ఎన్కౌంటర్లలో క్రిమినల్స్‌ను ఏరిపారేయించారు. ఈ తరుణంలో ఆయన రెండోసారి సీఎం అయ్యేసరికి.. తననూ ఎక్కడ ఎన్కౌంటర్ చేయిస్తాడో అని భయపడుతున్నాడు ఆ వ్యక్తి. తనను చంపొద్దని.. జైల్లో పెట్టాలని వేడుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమ్ సింగ్ అనే వ్యక్తి ఓ కేసులో నిందితుడుగా ఉన్నాడు. ముందస్తుగా లొంగిపోవడమే మంచిదని భావించి.. గౌతమ్ సింగ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. అదీకాక ‘నేను ఆత్మసాక్షిగా లొంగిపోతున్నా.. నన్ను దయచేసి చంపోద్దు’అంటూ ప్లకార్డు పట్టుకొని పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. -
భర్త హత్యకు రూ.6 లక్షల సుపారీ, రోడ్డు ప్రమాదం అని..
కృష్ణరాజపురం: మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయనడానికి ఇదో ఉదాహరణ. ఒక మహిళ కొడుకు, కిరాయి హంతకులతో కలిసి భర్తనే హత్య చేయించింది. బెంగళూరు వైట్‌ఫీల్డ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘోరం వెలుగుచూసింది. వివరాలు.. గుంజూరుకు చెందిన సుబ్బరాయప్ప అనే వ్యక్తి ఇటీవల హత్యకు గురయ్యాడు. వైట్‌ఫీల్డ్ సమీపంలో మృతదేహం బయటపడింది. భార్య యశోదమ్మ, కుమారుడు దేవరాజు అందరికీ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు విచారించగా ఆ సమయంలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగలేదని తేలింది. దీంతో మృతుని కాల్‌లిస్టును తనిఖీ చేయగా అనిల్ అనే వ్యక్తి చివరగా కాల్ చేశాడని, అతడే స్కార్పియోలో తీసుకెళ్లాడని సీసీ కెమెరాల చిత్రాల్లో గుర్తించారు. అనిల్‌ను పట్టుకుని ప్రశ్నించగా నగేష్, ధనుష్, సునీల్‌కుమార్ అనే వారితో కలిపి హత్య చేశామని చెప్పారు. అతని భార్య, కొడుకు రూ.6 లక్షలు సుపారి ఇచ్చారని తెలిపారు. ఆస్తి గొడవలే హత్యకు కారణమని తెలిసింది. చదవండి: విషాదం: కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య -
బుల్లితెర నటుడికి చేదు అనుభవం..
బుల్లితెర నటుడికి చేదు అనుభవం ఎదురయ్యింది. కొందరు గుండాలు రోడ్డు మీద తనను బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారని తెలిపాడు. హప్పు కి ఉల్తాన్ పల్తాన్ ఫేమ్ సంజయ్ చౌదరికి ఈ అనుభవం ఎదురయ్యింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశాడు. ‘గైస్ దయచేసి తెలుసుకొండి. నా విషయంలో ఇదే జరిగింది. నేరస్థులు మీరు ఎవరనే విషయం గురించి పట్టించుకోరు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. సంజయ్ చౌదరి మాట్లాడుతూ.. ‘నేను మధ్యాహ్నం సమయంలో మీరా రోడ్డు నుంచి షూటింగ్ జరిగే నైగావ్ ప్రాంతానికి వెళ్తున్నాను. ఇంతలో ఓ వ్యక్తి స్కూటీపై వచ్చి నా కారు విండోని తట్టి పార్క్ చేయమని చెప్పాడు. అంతేకాక మరాఠీలో తిట్టడం ప్రారంభించాడు. నేను చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాను. ఏ వాహనాన్ని ఢీ కొట్టలేదు. అతను గ్లాస్‌ను కిందకి దించమన్నాడు. నేను అలానే చేశాను. వెంటనే అతడు నా కారు డోర్ తెరిచి లోపలకి వచ్చి కూర్చున్నాడు. ఆ తర్వాత నేను తన స్కూటీని ఢీ కొట్టానని.. అందువల్ల అతడికి 20 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు’ అన్నాడు. (చదవండి: కరణ్ పార్టీకి డ్రగ్స్ కేసుకు సంబంధం లేదు) View this post on Instagram This is actually happened with me criminals doesn’t care who you are A post shared by Sanjay choudhary (@sanjayychoudhary) on Sep 24, 2020 at 4:33am PDT ‘ఇంతలో మరో ఇద్దరు వ్యక్తులు అక్కడు వచ్చారు. వారు ముగ్గురు నన్ను బెదిరించడం ప్రారంభించారు. నా దగ్గర అంత మొత్తం లేదని చెప్పాను. ఏటీఎంకి వెళ్లి డ్రా చేసి తీసుకురమ్మన్నారు. లేదంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. నా ఫోన్ లాక్కున్నారు. డబ్బులిస్తేనే మొబైల్ ఇస్తామన్నారు. నా దగ్గర అంత డబ్బు లేదని వాలెట్ తెరిచి చూపించాను. దానిలో ఒక ఐదు వందల రూపాయల నోటు, 200 వందల రూపాయలు మొత్తం ఏడు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి. వారు ఆ మొత్తం తీసుకుని వెళ్లి పోయారు. నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. వారు గుండాలు అని తర్వాత అర్థం అయ్యింది. ఈ సందర్భంగా అభిమానులందరికి నేను చెప్పేది ఒక్కటే.. అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి’ అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. -
దారుణంగా కొట్టి, వీడియో పోస్ట్ చేశారు
లక్నో: ఉత్తరప్రదేశ్ మహరాజ్ గంజ్‌లో దారుణం చోటు చేసుకుంది. అడవికి వెళ్లిన ఓ జంటపై ముగ్గురు గుండాలు విరుచుకు పడ్డారు. అతిదారుణంగా వీరిద్దరిపై దాడి చేశారు. అంతేకాదు ఈ దృశ్యాలు షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే కట్టెలకోసం అడవికి వెళ్లిన జంటను ఈ దుర్మార్గులు టార్గెట్ చేశారు. వారిని అడ్డుకుని గూండాల్లాగా దాడి చేశారు. ఈ మొత్తం సంఘటనను కెమెరాలో చిత్రించారు. అక్కడితో వీరి దౌర్జన్యం, దురాగతాలు ఆగలేదు. బలవంతంగా బాధితులిద్దర్నీ నగ్నంగా చేసి మరీ వీడియో తీశారు. ఈ సంఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. మోరల్ పోలీసింగ్ ఆరోపణలతోఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
ఆ గూండాలు మా ఇంటిపై దాడి చేశారు: కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో బుధవారం ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేసి.. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) శ్రేణుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కోల్‌కతాలోని తన నివాసంపై టీఎంసీ గూండాలు దాడి చేశారని, తన తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటిపై ఇలా దాడికి దిగడం సిగ్గుచేటు అని ఆయన ధ్వజమెత్తారు. కోల్‌కతా కైలాశ్ బోస్ ప్రాంతంలోని తన ఇంటిలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న టీఎంసీ మద్దతుదారుల వీడియోను ఆయన ట్వీట్ చేశారు. రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ స్కాంలో ఇద్దరు టీఎంసీ ఎంపీలను సీబీఐ అరెస్టు చేయడంతో ఇది రాజకీయ కక్షసాధింపేనంటూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళన దిగిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ-టీఎంసీ శ్రేణుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 'విషాదం ఏమిటంటే నేను కేంద్రమంత్రిని. నాకు ఎక్కడైనా పూర్తి భద్రత లభిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న నిరుపేద బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారుల పరిస్థితి దారుణంగా ఉంది. వారిని చితకబాదుతున్నారు. బీజేపీ జెండాలను కాల్చేస్తున్నారు. ఓ వృద్ధురాలి ఇంటిపై బాంబు వేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బెంగాల్ అంతటా ఇదే పరిస్థితి నెలకొంది' అని సుప్రియో అన్నారు. TMC Goons trying 2 break into my Apartment in Kailash Bose Street where my MumDad are staying• How shameful is this -
తల్లీ, కూతుళ్లు దారుణ హత్య
-
రైల్వేపోలీసులు ఈవ్ టీజర్మ మధ్య ఘర్షణ
-
దుండగుల దాడిలో మహారాష్ట్ర వాసి మృతి
నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సారంగపూర్, నెహ్రూనగర్ ప్రాంతంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో దెబ్బలు తిని గాయాలకు గురై ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని మహారాష్ట్ర వాసిగా శుక్రవారం గుర్తించారు. మృతుడు పర్బణీకి చెందిన ఠాకూర్ సూరజ్(30) సెక్యూరిటీ గార్డు పనిచేసేవాడని గుర్తించినట్లు ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పర్బణి నుంచి నెహ్రూనగర్‌లోని బంధువుల ఇంటికి వచ్చాడని పేర్కొన్నారు. అతను మరణించినట్లు పత్రికల్లో వచ్చిన వార్తను చూసి కుటుంబసభ్యులు బంధువులు పోలీసు స్టేషన్‌కు వచ్చి మృతదేహాన్ని చూసి గుర్తించారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు.