![Wife Brutullay Assasinated Her Husband With Goons In Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/19/Karnataka.jpg.webp?itok=6OHjkP4G)
ప్రతీకాత్మక చిత్రం
కృష్ణరాజపురం: మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయనడానికి ఇదో ఉదాహరణ. ఒక మహిళ కొడుకు, కిరాయి హంతకులతో కలిసి భర్తనే హత్య చేయించింది. బెంగళూరు వైట్‌ఫీల్డ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘోరం వెలుగుచూసింది. వివరాలు.. గుంజూరుకు చెందిన సుబ్బరాయప్ప అనే వ్యక్తి ఇటీవల హత్యకు గురయ్యాడు. వైట్‌ఫీల్డ్ సమీపంలో మృతదేహం బయటపడింది. భార్య యశోదమ్మ, కుమారుడు దేవరాజు అందరికీ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పారు.
ట్రాఫిక్ పోలీసులు విచారించగా ఆ సమయంలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగలేదని తేలింది. దీంతో మృతుని కాల్‌లిస్టును తనిఖీ చేయగా అనిల్ అనే వ్యక్తి చివరగా కాల్ చేశాడని, అతడే స్కార్పియోలో తీసుకెళ్లాడని సీసీ కెమెరాల చిత్రాల్లో గుర్తించారు. అనిల్‌ను పట్టుకుని ప్రశ్నించగా నగేష్, ధనుష్, సునీల్‌కుమార్ అనే వారితో కలిపి హత్య చేశామని చెప్పారు. అతని భార్య, కొడుకు రూ.6 లక్షలు సుపారి ఇచ్చారని తెలిపారు. ఆస్తి గొడవలే హత్యకు కారణమని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment