krishnarajapuram
-
మరో మహిళతో వివాహేతర సంబందం.. భర్త దాష్టీకాన్ని తట్టుకోలేని భార్య..
సాక్షి, బెంగళూరు(కృష్ణరాజపురం): భర్తకు మరో మహిళతో వివాహేతర సంబందం, పైగా కట్నం వేధింపులకు గురి చేయడంతో విరక్తి చెందిన మహిళ బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హోసకోటె తాలూకాలోని కల్కుంటి అగ్రహార గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. శ్వేత (24), ఏడాదిన్నర బాలుడు యక్షిత్ మృతులు. శ్వేతకు మూడేళ్ల కిందట రాకేష్ అనే యువకునితో పెళ్లయింది. అతనికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండేది. దీనిపై చాలాసార్లు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. పెద్దలు వచ్చి రాజీ పంచాయతీలు చేశారు. అయినా వివాహేతర సంబంధం మానుకోలేదు. దీనికి తోడు పుట్టింటి నుంచి డబ్బు తేవాలని శ్వేతను వేధించేవాడు. ఇదంతా భరించలేక ఆమె బాలున్ని గొంతు పిసికి చంపి, తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. అనుగొండనహళ్ళి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. చదవండి: (బెంగళూరులో విషాదం.. విగతజీవులుగా తల్లీ, కొడుకు కూతురు) -
పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ గ్యాంగ్‌రేప్ నిందితుడు
కృష్ణరాజపురం: బంగ్లాదేశ్ యువతిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న సోబజ్ పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులపై దాడికి పాల్పడగా... అత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో అతని కాలికి తూటా గాయమైంది. ఈ ఘటన బెంగళూరు రామ్మూర్తినగర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇటీవల బెంగళూరులో బంగ్లాదేశ్‌కు చెందిన వలస కూలీలు విందు చేసుకుని, అందులో ఒక యువతిపై దుండగులు లైంగిక దాడికి పాల్పడడం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళల్ని అరెస్టు చేశారు. 10వ నిందితుడు సోబజ్... రామ్మూర్తి నగర పోలీసుస్టేషన్ పరిధిలోని రాంపుర చెరువు సమీపంలోని ఒక గుడిసెలో ఉన్నాడని తెలిసి బుధవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి అతన్ని అరెస్టు చేశారు. నిందితుడిని పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో మూత్ర విసర్జన కోసం వాహనాన్ని నిలపాలని కోరాడు. వాహనం దిగి వెళ్తూ తన వెనుకే వస్తున్న హెడ్ కానిస్టేబుల్ దేవేంద్ర నాయక్‌పై చాకుతో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న ఎస్ఐ శివరాజ్పైనా దాడి చేశాడు. దీంతో ఎస్ఐ శివరాజ్ పిస్టల్‌తో కాల్చడంతో నిందితుని ఎడమ కాలికి గాయమైంది. నిందితునితో పాటు హెడ్‌కానిస్టేబుల్, ఎస్ఐకి గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. (చదవండి: బంగ్లాదేశ్‌లో నిర్భయ తరహా ఘటన) -
భర్త హత్యకు రూ.6 లక్షల సుపారీ, రోడ్డు ప్రమాదం అని..
కృష్ణరాజపురం: మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయనడానికి ఇదో ఉదాహరణ. ఒక మహిళ కొడుకు, కిరాయి హంతకులతో కలిసి భర్తనే హత్య చేయించింది. బెంగళూరు వైట్‌ఫీల్డ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘోరం వెలుగుచూసింది. వివరాలు.. గుంజూరుకు చెందిన సుబ్బరాయప్ప అనే వ్యక్తి ఇటీవల హత్యకు గురయ్యాడు. వైట్‌ఫీల్డ్ సమీపంలో మృతదేహం బయటపడింది. భార్య యశోదమ్మ, కుమారుడు దేవరాజు అందరికీ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు విచారించగా ఆ సమయంలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగలేదని తేలింది. దీంతో మృతుని కాల్‌లిస్టును తనిఖీ చేయగా అనిల్ అనే వ్యక్తి చివరగా కాల్ చేశాడని, అతడే స్కార్పియోలో తీసుకెళ్లాడని సీసీ కెమెరాల చిత్రాల్లో గుర్తించారు. అనిల్‌ను పట్టుకుని ప్రశ్నించగా నగేష్, ధనుష్, సునీల్‌కుమార్ అనే వారితో కలిపి హత్య చేశామని చెప్పారు. అతని భార్య, కొడుకు రూ.6 లక్షలు సుపారి ఇచ్చారని తెలిపారు. ఆస్తి గొడవలే హత్యకు కారణమని తెలిసింది. చదవండి: విషాదం: కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య -
కర్ణాటక ఎమ్మెల్యేపై హత్యాయత్నం
కృష్ణరాజపురం:బెంగళూరులోని హెబ్బాళ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే భైరతీ సురేష్‌పై శుక్రవారం హత్యాయత్నం జరిగింది.ఉదయం తన ఇంటి నుంచి కారులో వెళ్తుండగా కేఆర్ పురం వద్ద శివు అలియాస్ శివకుమార్ అనే యువకుడు కత్తితో దాడికి యత్నించాడు. దీంతో అప్రమత్తమైన గన్‌మెన్ వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. దాడికి యత్నించిన శివకుమార్‌తో పాటు అతని తల్లి కమలమ్మ చాలా కాలంగా తమ ఇంట్లోనే పని చేస్తున్నారని సురేష్ అన్నారు. శివకుమార్ ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడలేదని మతిస్థిమితం కోల్పోవడంతో ఈ దాడి చేసి ఉంటాడని శివకుమార్ తల్లి కమలమ్మ తెలిపింది. కాగా ఘటనపై కొత్తనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
కొడుకు కాదు.. కర్కోటకుడు
కృష్ణరాజపురం/బెంగళూరు : దారితప్పుతున్నావంటూ మందలించిన తల్లిపై కన్న కుమారుడు విచక్షణారహితంగా దాడి చేసి హింసించిన ఘటన శనివారం చెన్నమ్మనకెరె అచ్చుకట్టె పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు... చెన్నమ్మనకెరె ప్రాంతానికి చెందిన జీవన్ (19) డిగ్రీ చదువుతున్నాడు. దురలవాట్లు, ప్రేమించిన యువతి, తోటి స్నేహితులు తనను హీరోగా భావించాలని ఊహించుకునేవాడు. ప్రేమాయణం సాగిస్తున్న యువతిని ఇంటికి తీసుకువచ్చి తల్లి ఎదుటే సిగిరెట్లు తాగేవాడు. కళాశాలకు వెళ్లకుండా ప్రియురాలితో షికార్లు, పార్టీలు చేసుకునేవాడు. కన్నకొడుకు తన కళ్ల ముందే నాశనమవుతుండడాన్ని తట్టుకోలేక దురలవాట్లు, పరిపక్వత లేని ప్రేమ వల్ల జీవితాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దంటూ కొడుకును మందలించింది. ఎన్ని వెధవ పనులు చేసినా పల్లెత్తు మాట అనని తల్లి మంచిమాటలు చెప్పగానే జీవన్‌లో దాగున్న రాక్షసుడు బయటకు వచ్చాడు. తనకే నీతులు చెబితే తగిన శాస్తి చేస్తానంటూ చీపురకట్టతో కన్నతల్లిని తీవ్రంగా కొట్టసాగాడు. వదిలేయమంటూ ఎంత వేడుకున్నా తనకు నీతులు చెబితే ఇలాగే ఉంటుందంటూ మరింత తీవ్రంగా కొడుతూ హింసించాడు. ఈ తతంగం మొత్తం జీవన్ కుటుంబ సభ్యులు మొబైల్లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలు ప్రసార మాధ్యమాల్లో కూడా ప్రసారం కావడంతో పోలీసులు సుమోటోగా స్వీకరించి జీవన్‌పై కేసు నమోదు చేసుకున్నారు. తన కొడుకు బారి నుంచి తనను రక్షించడంతో పాటు తన కొడుక్కి బుద్ధి వచ్చేలా చేయాలంటూ జీవన్ తల్లి చెన్నమ్మనకెరె అచ్చుకట్టె పోలీసులను కోరారు. -
ప్రేయసి కోసం నాలుక, మర్మాంగం కోసుకున్నాడు
కృష్ణరాజపుర(కర్ణాటక) : గుర్తు తెలియని వ్యక్తులు ఒరిస్సా యువకుడి నాలుక, మర్మంగాన్ని కోసేసిన ఘటనకు సంబంధించి కొత్తకోణం వెలుగుచూసింది. ప్రేమించిన అమ్మాయిని వశం చేసుకోవడానికి అమ్మవారికి మొక్కుకున్న ప్రకారం నాలుక, మర్మంగాన్ని తానే కోసుకున్నట్లు యువకుడు బిజుకుమార్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. వివరాలు.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బిజుకుమార్ తమ సొంత గ్రామంలో ఓ యువతిని ప్రేమించాడు. అయితే యువతి బిజుకుమార్ ప్రేమను తిరస్కరించడంతో మద్యానికి బానిసైన బిజుకుమార్‌ను తల్లితండ్రులు బెంగళూరులోని తమ సంబధీకుడి వద్దకు పంపించారు. కొద్ది రోజుల క్రితం నగరంలోని ఇమ్మడిహళ్లిలో తన మామయ్య వద్దకు వచ్చిన బిజుకుమార్కు స్థానికంగా నివాసముండే పశ్చిమబెంగాల్‌కు చెందిన యువకులతో పరిచయమైంది. తన గతం గురించి స్నేహితులకు చెప్పడంతో అమ్మవారికి నాలుకను,మర్మంగాన్ని కానుకగా సమర్పిస్తే వశీకరణ శక్తులు సిద్ధిస్తాయని తద్వార ప్రేమించిన అమ్మాయిని వశం చేసుకోవచ్చంటూ సూచించారు. ఇది నమ్మిన బిజుకుమార్ చాకుతో నాలుకను, మర్మాంగాన్ని కోసుకున్నాడు.అయితే ఎటువంటి వశీకరణ శక్తులు సిద్ధించకపోవడంతో తప్పు తెలుసుకున్న బిజుకుమార్ విషయం మామయ్యకు తెలియకూడదనే ఉద్దేశంతో ఎవరో తనను అపహరించి నాలుక, మర్మాంగాన్ని కోసినట్లు కట్టుకథ వినిపించాడు. కానీ బిజుకుమార్ మామయ్య బిజుకుమార్‌ను ఆసుపత్రిలో చేర్పించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని విచారణ జరిపిన పోలీసులు బిజుకుమార్ చెప్పిన విధంగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో బిజుకుమార్పై అనుమానంతో నిజం చెప్పాలని లేదంటే తమదైన శైలిలో విచారణ చేస్తామనేసరికి బిజుకుమార్ ఆదివారం నిజం అంగీకరించాడు.