ప్రేయసి కోసం నాలుక, మర్మాంగం కోసుకున్నాడు | lover boy cuts his tongue for girl friend | Sakshi
Sakshi News home page

ప్రేయసి కోసం నాలుక, మర్మాంగం కోసుకున్నాడు

Published Mon, Mar 20 2017 8:07 AM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

ప్రేయసి కోసం నాలుక, మర్మాంగం కోసుకున్నాడు

ప్రేయసి కోసం నాలుక, మర్మాంగం కోసుకున్నాడు

కృష్ణరాజపుర(కర్ణాటక) :  గుర్తు తెలియని వ్యక్తులు ఒరిస్సా యువకుడి నాలుక, మర్మంగాన్ని కోసేసిన ఘటనకు సంబంధించి కొత్తకోణం వెలుగుచూసింది. ప్రేమించిన అమ్మాయిని వశం చేసుకోవడానికి అమ్మవారికి మొక్కుకున‍్న ప్రకారం నాలుక, మర్మంగాన్ని తానే కోసుకున్నట్లు యువకుడు బిజుకుమార్‌ పోలీసుల విచారణలో అంగీకరించాడు.

వివరాలు.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బిజుకుమార్‌ తమ సొంత గ్రామంలో ఓ యువతిని ప్రేమించాడు. అయితే యువతి బిజుకుమార్‌ ప్రేమను తిరస్కరించడంతో మద్యానికి బానిసైన బిజుకుమార్‌ను తల్లితండ్రులు బెంగళూరులోని తమ సంబధీకుడి వద్దకు పంపించారు. కొద్ది రోజుల క్రితం నగరంలోని ఇమ్మడిహళ్లిలో తన మామయ్య వద్దకు వచ్చిన బిజుకుమార్‌కు స్థానికంగా నివాసముండే పశ్చిమబెంగాల్‌కు చెందిన యువకులతో పరిచయమైంది. తన గతం గురించి స్నేహితులకు చెప్పడంతో అమ్మవారికి నాలుకను,మర్మంగాన్ని కానుకగా సమర్పిస్తే వశీకరణ శక్తులు సిద్ధిస్తాయని తద్వార ప్రేమించిన అమ్మాయిని వశం చేసుకోవచ్చంటూ సూచించారు.

ఇది నమ్మిన బిజుకుమార్‌ చాకుతో నాలుకను, మర్మాంగాన్ని కోసుకున్నాడు.అయితే ఎటువంటి వశీకరణ శక్తులు సిద్ధించకపోవడంతో తప్పు తెలుసుకున్న బిజుకుమార్‌ విషయం మామయ్యకు తెలియకూడదనే ఉద్దేశంతో ఎవరో తనను అపహరించి నాలుక, మర్మాంగాన్ని కోసినట్లు కట్టుకథ వినిపించాడు. కానీ బిజుకుమార్‌ మామయ్య బిజుకుమార్‌ను ఆసుపత్రిలో చేర్పించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని విచారణ జరిపిన పోలీసులు బిజుకుమార్‌ చెప్పిన విధంగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో బిజుకుమార్‌పై అనుమానంతో నిజం చెప్పాలని లేదంటే తమదైన శైలిలో విచారణ చేస్తామనేసరికి బిజుకుమార్‌  ఆదివారం నిజం అంగీకరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement