
ఆ భర్త భార్య, బిడ్డనే ప్రాణం అనుకున్నాడు. కానీ, ప్రియుడి మోజులో పడి ఆమె ఆ భర్తనే వద్దునుకుంది. అలాంటప్పుడు వదిలేసి వెళ్లిపోతే సరిపోయేది కదా అంటూ సోషల్‌మీడియా ఇప్పుడు కోడై కూస్తోంది. ఉత్తర ప్రదేశ్ మీరట్‌కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ మర్డర్ కేసులో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు వెలుగులోకి చూస్తుండగా.. ముస్కాన్ రాక్షసత్వంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది.భర్తను చంపాక అతనితో జాలీగా ట్రిప్పులు వేసిన ముస్కాన్.. అతని పుట్టినరోజుతో పాటు హోలీ పార్టీ కూడా జరుపుకుంది. అందుకు సంబంధించిన దృశ్యాలే ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
సౌరభ్ శవానికి పోస్టుమార్టం పూర్తయింది. డ్రమ్ములో సిమెంట్‌తో కప్పబడిన శరీరభాగాలను డాక్టర్లు అతి కష్టం మీద బయటకు తీశారు. వాటికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం.. నిద్రమాత్రల కారణంగా సౌరభ్ గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత ముస్కాన్ తన రాక్షసత్వాన్ని బయటపెట్టింది.
సౌరభ్ గుండెల్లో కత్తితో మూడు సార్లు పొడిచింది. కత్తి లోతుగా అతడి గుండెల్లో దిగబడింది. ముస్కాన్ అతి దారుణంగా సౌరభ్ గుండెను చీల్చి పడేసింది. తర్వాత తలను శరీరంనుంచి వేరు చేసింది. శరీరాన్ని ముక్కలుముక్కలుగా కొసి పడేసింది. ముక్కల్ని డ్రమ్‌లో పడేసింది. ముస్కాన్ చేసిన దారుణం తెలిసి డాక్టర్లే షాక్ అయిపోయారు.
ఇక, పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. ముస్కాన్ పినతల్లిని కలిశారు. ఆమె ముస్కాన్‌పై ఫైర్ అయింది. చేసిన ఘోరానికి తన కూతురికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేసింది. ఈ దారుణంలో ముస్కాన్ హస్తంతో పాటు ఆమె ప్రియుడు సాహిల్ హస్తం కూడా ఉంది. ఇద్దరూ కలిసి, పక్కా ప్లాన్ ప్రకారం సౌరభ్‌ను చంపేశారు. మృతదేహాన్ని కనిపించకుండా చేసి తప్పించుకుందామనుకున్నారు. చాలా నాటకాలు ఆడారు. అవేవీ ఫలించలేదు. సౌరభ్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సౌరభ్ గురించి ఎంక్వైరీ చేయగా.. మర్డర్ విషయం బయటపడింది.
ప్రేమ పెళ్లి.. ప్రియుడి కోసం..
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ అదే ప్రాంతానికి చెందిన ముస్కాన్ రస్తోగి ప్రేమించుకున్నారు. 2016లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత భార్యతో గడపడానికి టైం దొరకటం లేదని నేవీలో ఉద్యోగం మానేశాడు. ఇంట్లో గొడవలు అవ్వటంతో భార్యతో కలిసి వేరుకాపురం పెట్టాడు. 2019లో వీరికి ఓ ఆడపిల్ల పుట్టింది. బిడ్డపుట్టిన తర్వాత సౌరభ్‌కు ఓ దారుణమైన విషయం తెలిసింది. ముస్కాన్.. ఆమె స్నేహితుడు సాహిల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసింది. ఈ విషయమై సౌరభ్, ముస్కాన్‌ల మధ్య గొడవలు అయ్యాయి. పరిస్థితి విడాకుల వరకు వెళ్లింది. కూతురు కోసం సౌరభ్ వెనక్కు తగ్గాడు. మళ్లీ జాబ్‌లో జాయిన్ అయ్యాడు. 2023లో విదేశానికి వెళ్లిపోయాడు. 2025 ఫిబ్రవరి నెలలో కూతురి పుట్టిన రోజు ఉండటంతో ఇండియా వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్, సాహిల్ .. అతడ్ని చంపేశారు.
ప్రియుడితో కలిసి మనాలికి
భర్తను హత్య చేసిన తర్వాత ప్రియుడితో కలిసి మనాలికి వచ్చిన ముస్కాన్.. ఆపై ట్యాక్సీలో కాసోల్ లోని తమ హెటల్ కు వచ్చినట్లు స్టాఫ్ ఒకరు తెలిపారు. హెటల్ లో రూమ్ తీసుకున్న తర్వాత రోజులో ఒకసారి మాత్రమే బయటకు వచ్చి చాలా స్వల్ప సమయం మాత్రమే ఉన్నారని హోటల్ స్టాఫ్ లో మరొకరు తెలిపారు.
నా వైఫ్ అంటూ సిబ్బందితో గొడవ
హోటల్ చెక్ ఇన్ లో భాగంగా ఇద్దరి ఐడీ కార్డులను పరిశీలించే క్రమంలో ముస్కాన్ ప్రియుడు ఐడీ కార్డు చూపించాడు. ఆపై ఆమె ఐడీ కార్డును చూసేటప్పుడు హోటల్ సిబ్బంది చేతుల్లోంచి ఆ కార్డును లాక్కొని తన భార్య అంటూ వారితో వాదనకు దిగాడు. ఆపై కొంత ఒత్తిడి తర్వాత ముస్కాన్ ఐడీ కార్డు కార్డును కు ఇచ్చినట్లు సిబ్బంది పేర్కొన్నారు.
ఆరు రోజులు రూమ్ లోనే..
వారు వచ్చిన తర్వాత ఆరు రోజులు రూమ్ తీసుకున్నారని, ఎక్కడికి వెళ్లకుండా రూమ్ లోనే ఉండిపోయేవారని హోటల్ సిబ్బంది తెలిపారు. సాధారణంగా ఎవరైనా మనాలికి వస్తే కొన్ని ప్లేస్ లకు వెళతారని కానీ వీరు అలా వెళ్లకుండా రూమ్ లోనే గడిపేవారన్నారు. ఫుడ్ ను ఒక్కసారే ఆర్డర్ చేసేవారని, క్లీనింగ్ కి కూడా ఒక్కసారే అనుమతి ఇచ్చేవారని సిబ్బంది తెలిపారు. అసలు బయటకు వచ్చేవారు కాదని, అనుమానం రాకుండా ఉండటానికి కేవలం ఏదొకసారి వచ్చి లోపలికి వెళ్లిపోయేవారట. మార్చి 16వ తేదీన వారు హోటల్ ను వెళ్లిపోయారని, వెళ్లే క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ కు తిరిగి వెళ్లిపోతున్నట్లు తమకు తెలిపారని స్టాఫ్ లో ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment