Meerut Murder Case: మా అన్న బిడ్డే అయితే పెంచుకుంటాం | Family of victim Saurabh Responds On Muskans baby | Sakshi
Sakshi News home page

Meerut Murder Case: మా అన్న బిడ్డే అయితే పెంచుకుంటాం

Published Tue, Apr 8 2025 6:52 PM | Last Updated on Tue, Apr 8 2025 8:05 PM

Family of victim Saurabh Responds On Muskans baby

మీరట్:  గత నెలలో యూపీలో సంచలన సృష్టించిన భర్త హత్య కేసులో నిందితురాలిగా మీరట్ జైల్లో ఉన్న ముస్కాన్ గర్బవతి అని మెడికల్ రిపోర్ట్ లో రావడంతో పుట్టబోయే బేబీ సంగతి ఏంటనే చర్చ మొదలైంది.  భర్తను ప్రియుడితో సాహిల్ శుక్లాతో కలిసి హత్య చేసి ఇప్పుడు జైల్లో ఉన్న ముస్కాన్ గురించి కనీసం ఆమె కుటుంబం కూడా పట్టించుకోవడం లేదు. ముస్కాన్ గర్భం దాల్చింది అన్న తర్వాత ఆమె కుటుంబం నుంచి ఒక్క మాట కూడా రాలేదు. భర్తను హత్య చేసిన తర్వాతే ఆమెను పట్టించుకోవడం మానేసిన కుటుంబ సభ్యులు.. ఈ విషయం గురించి కూడా ఎటువంటి ఆసక్తి చూపలేదు.

ఈ విషయంపై హత్య గావించబడ్డ సౌరభ్ సోదరుడు మాత్రం..  ముస్కాన్ కు పుట్టబోయే బిడ్డ సౌరభ్ రక్తం అయితే తాము తప్పకుండా పెంచుకుంటామన్నాడు. సౌరబ్ రాజ్ పుత్ సోదరుడు బబ్లూ రాజ్ పుత్ మాట్లాడుతూ.. ‘  ముస్కాన్ కు పుట్టబోయే బిడ్డ మా అన్నకు సంబంధించిన బేబీ అయితే మేము కచ్చితంగా పెంచుకుంటాం. అన్నీ చూసుకుంటాం.’ అని స్పష్టం చేశాడు.

ముస్కాన్ గర్భవతి అని తెలిసినా..
ముస్కాన్ గర్భవతి అని తెలిసినప్పటికీ ఆమె కుటుంబ నుంచి  ఎవరూ కూడా జైలుకు వచ్చి చూడలేదు. కాకపోతే ఆమె ప్రియుడు సాహిల్ కుటుంబ సభ్యులు మాత్రం సోమవారం జైలుకు వచ్చి అతన్ని పరామర్శించి వెళ్లారు. సాహిల్ నాన‍్నమ్మ జైలుకు వచ్చి మనవడితో మాట్లాడి వెళ్లినట్లు జైలు అధికారులు తెలిపారు.  ప్రస్తుతం ముస్కాన్‌, సాహిల్‌లు ఇద్దరూ మీరట్‌ జిల్లా జైల్లో వేర్వేరు బారక్‌ల్లో ఉంటున్నారు. తాము కలిసి ఉంటామని ఒకే బారక్‌ ఇవ్వమని డిమాండ్‌ చేసినా జైలు రూల్స్‌ ఒప్పుకోవమని చెప్పి వారికి సెపరేట్‌ రూమ్‌లే కేటాయించారు అధికారులు. ముస్కాన్‌ గర్భం దాల్చిన విషయాన్ని  సీనియర్ జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ వెల్లడించారు.  ముస్కాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతూ జైలు అధికారులు సీఎం కార్యాలయాన్ని కోరారు. దీంతో ఇటీవల ఆమెకు గర్భ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా తెలిపారు. 

కాగా, సౌరభ్‌ రాజ్‌పుత్‌, ముస్కాన్‌లు 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్‌ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్‌(25)తో ముస్కాన్‌ వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ, కుమార్తె కోసం సౌరభ్‌ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్‌.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement