ప్రియురాలిని చావబాదిన ఘటన: నిందితుడి అరెస్టు, ఇల్లు ధ్వసం | Man Brutally Assaults At MP Rewa Arrest And Demolish His House | Sakshi
Sakshi News home page

ప్రియురాలిని చావబాదిన ఘటన: నిందితుడి అరెస్టు, ఇల్లు ధ్వసం

Published Sun, Dec 25 2022 8:40 PM | Last Updated on Sun, Dec 25 2022 8:42 PM

Man Brutally Assaults At MP Rewa Arrest And Demolish His House - Sakshi

భోపాల్‌: ఒక యువకుడు యువతిని దారుణం కొడుతున్న వీడియో నెట్టింట హల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీరియస్‌ అయిన అధికారులు సదరు వ్యక్తిని అరెస్టు చేయడమే గాక అతడి ఇంటిని కూడా ధ్వంసం చేశారు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..ఒక యువతని దారుణంగా కొడుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో జరిగింది.

దీంతో రంగంలోకి దిగిన ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారభించారు. దారుణానికి పాల్పడిన వ్యక్తిన పంకజ్‌ త్రిపాఠిగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతడు విచారణలో తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కారణంతో ఆ యువతిపై దాడి చేసినట్లు వివరించాడు. పోలీసులు నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌లో ఉంటున్న నిందితుడి ఇంటిని అధికారులు బుల్డోజర్‌తో కూల్చేశారు. అతడి జీవనాధారం డ్రైవింగ్‌.  అందువల్ల అధికారులు అతడి డ్రైవింగ్‌ లైసెన్సు కూడా క్యాన్సిల్‌ చేశారు. సకాలంలో అతడిపై చర్యలు తీసుకోని స్థానిక పోలీసులను సైతం సస్పెండ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడి ఇంటిన కూల్చిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

(చదవండి: షాకింగ్‌ వీడియో: నువ్వేం మనిషివిరా అయ్యా..! ప్రియురాలిని ఘోరంగా చావబాదాడు, కారణం ఏంటంటే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement