బెంగాల్‌: యువతిని చితకబాదిన ఘటనపై దుమారం Woman Beaten Up In Bengal Town Draws Fire | Sakshi
Sakshi News home page

బెంగాల్‌: రోడ్డుపై పడేసి.. యువతిని చితకబాదిన వీడియో వైరల్‌

Published Sun, Jun 30 2024 5:36 PM | Last Updated on Sun, Jun 30 2024 5:55 PM

Woman Beaten Up In Bengal Town Draws Fire

కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్‌లో ఓ వీడియో దుమారం రేపుతోంది. ఓ యువతిని రోడ్డుపై పడేసి  కర్ర విరిగేలా చితకబాదుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

యువతిని కొడుతుండగా చుట్టూ నిలబడిన వారంతా చూస్తూ ఉండిపోయారు తప్ప ఆపడానికి ఎవరూ ప్రయత్నించలేదు.  ఈ ఘటన బెంగాల్‌లో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితి తెలియజేస్తోందని  మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

ఈ  ఘటనపై బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవ్య ఎక్స్(ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. ‘ఈ వీడియోలో యువతిని దారుణంగా కొడుతున్నది చోప్రా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న తృణమూల్‌ ఎమ్మెల్యే  హమిదుర్‌ రెహ్మాన్‌ అనుచరుడు తేజ్‌ముల్‌ అనే వ్యక్తి. ఇతను తన ‘ఇన్‌సాఫ్‌’ సభల ద్వారా పంచాయితీలు చేసి అక్కడికక్కడే శిక్షలు విధిస్తుంటాడు. 

తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనలో ఈ తరహా షరియా కోర్టులున్నాయని భారత ప్రజలు మొత్తం గుర్తించాలి. బెంగాల్‌లో ప్రతి గ్రామంలో ‘సందేశ్‌ఖాలీ’తరహా ఘటనలు జరుగుతున్నాయి. మమత పాలన వెస్ట్‌బెంగాల్‌కు ఒక శాపం’అని మాలవ్య ట్వీట్‌లో ఫైర్‌ అయ్యారు. మరోపక్క సీపీఎం నేతలు కూడా యువతిని కొడుతున్న వీడియోపై స్పందించారు. 

బెంగాల్‌లో బుల్డోజర్‌ జస్టిస్‌ రాజ్యమేలుతోందని సీపీఎం స్టేట్‌ సెక్రటరీ ఎండీ సలీమ్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో విమర్శించారు. కాగా, యువతిని చితకబాదిన ఘటన ఈ వారాంతంలోనే జరిగినట్లు తెలుస్తోంది. అయితే  ఏ కారణంతో కొడుతున్నారనేది తెలియరాలేదు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement