అయ్యో.. బాలుడ్ని రోడ్డుకేసి కొట్టాడు | a young Syrian refugee boy was brutally slammed | Sakshi
Sakshi News home page

అయ్యో.. బాలుడ్ని రోడ్డుకేసి కొట్టాడు

Published Sun, Mar 13 2016 10:17 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

అయ్యో.. బాలుడ్ని రోడ్డుకేసి కొట్టాడు - Sakshi

అయ్యో.. బాలుడ్ని రోడ్డుకేసి కొట్టాడు

టర్కీ: సినిమాల్లో మాత్రమే కనిపించే ఒళ్లు గగుర్పొడిచేలాంటి సంఘటనలు కళ్లెదురుగా జరిగితే.. అది కూడా ఓ చిన్నారి జీవితంలో ఎదురైతే ఎలా ఉంటుంది. టర్కీలో నిజంగానే ఓ బాలుడికి భయంకరమైన అనుభవం ఎదురైంది. ఆ బాలుడు సిరియా నుంచి ఓ శరణార్ధి. తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదు.. ఏం తినాలో కూడా తెలియదు. కొత్తప్రదేశం, ఒంట్లో బెరుకు.. ఆ కంగారులో ఏం చేశాడో ఏమోగానీ.. ఓ వ్యాపారి అమాంతం పైకి లేపి రోడ్డుకేసి బలంగా విసిరి కొట్టాడు.

ఈ ఘటన టర్కీలోని ఎప్పుడూ రద్దీగా ఉండే మార్కెట్లో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ లో ఇది రికార్డయింది. అందులో చూపించిన ప్రకారం ఓ బాలుడు భయంతో పరుగు తీశాడు. అతడి వెనుక ముసా డి అనే వీధి వ్యాపారస్తుడు వేగంగా వచ్చి ఆ బాలుడిని పట్టుకొని అమాంతం పైకి లేపి సీసీ రోడ్డుకు వేసి కొట్టాడు. ఈ ఘటన చూసి మార్కెట్ వాళ్లంతా కుర్రాడిని కొట్టిన వ్యక్తితో తగువుకు దిగారు. ఓ వ్యక్తి కోపాన్ని ఆపుకోలేక ఆ వ్యాపారస్తుడిపై చేయి చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement