హుథయ్‌ఫా అల్ బద్రీ
బీరుట్: సిరియా ప్రభుత్వ దళాలతో పోరాడుతూ ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అగ్రనేత అబు బకర్ అల్ బగ్దాదీ కుమారుడు హుథయ్‌ఫా అల్ బద్రీ మృతి చెందినట్లు ఐఎస్ ప్రకటించింది. ఈ మేరకు బద్రీ మరణం గురించి తమ సోషల్ మీడియా అకౌంట్లలో మంగళవారం రాత్రి వెల్లడించింది. ఓ అస్సాల్ట్ రైఫిల్‌ను పట్టుకుని ఉన్న యువకుడి ఫొటోను కూడా చూపుతూ అతడి పేరును హుథయ్‌ఫా అల్ బద్రీగా పేర్కొంది. సెంట్రల్ సిరియన్ ప్రావిన్స్ ఆఫ్ హోమ్స్‌లోని థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద సిరియా, రష్యా బలగాలతో పోరాడుతూ చనిపోయినట్లు తెలిపింది.
అయితే ఎప్పుడు హతమయ్యాడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ‘ఇంఘిమసీ ఆపరేషన్’లో భాగంగా బద్రీ హతమైనట్లు ఐఎస్ తెలిపింది. సంప్రదాయ ఆత్మాహుతి బాంబింగ్ మెషీన్లకు ‘ఇంఘిమసీ ఆపరేషన్’ కొంత భిన్నంగా ఉంటుంది. పాత ఆత్మాహుతి దాడుల్లో భాగంగా లక్ష్యాలను చేరుకున్న వెంటనే సూసైడ్ బాంబర్లు తమను తాము పేల్చేసుకుంటారు. ఇంఘిమసీ ఆపరేషన్‌లో మాత్రం జిహాదిస్టులు తమ వద్ద ఉన్న తుపాకీలు, గ్రెనేడ్‌లు పూర్తయ్యే వరకు పోరాడతారు. అవి అయిపోగానే తమను తాము పేల్చేసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment