![75 killed in suicide car bomb attack in Syria's Deir al-Zour - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/6/syria.jpg.webp?itok=r8NjD1IR)
బీరట్: తూర్పు సిరియాలోని డీర్ ఎజార్‌లో శనివారం జరిగిన కారు బాంబు దాడి ఘటనలో సుమారు 75 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. మరో 140 మంది గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమంటూ ఇస్లామిక్ స్టేట్ గ్రూపు (ఐసిస్) ప్రకటించింది.కొద్దికాలంగా డీర్ ఎజార్‌లో సిరియన్ భద్రతాదళాలతో పాటు, అమెరికా ఆధ్వర్యంలోని కుర్దీష్ అరబ్ దళాలు, సిరియన్ ప్రజాస్వామ్య దళాలు ఐసిస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు సిరియన్ మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు అబ్దెల్ రహ్మాన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment