పట్టాలపై దారుణం | Rail atrocity | Sakshi
Sakshi News home page

పట్టాలపై దారుణం

Published Sun, Oct 19 2014 1:02 AM | Last Updated on Fri, Aug 17 2018 7:48 PM

పట్టాలపై దారుణం - Sakshi

పట్టాలపై దారుణం

  • తల్లి సహా కూతుళ్లను బలిగొన్న కలహాల కాపురం
  •  రైలుకింద పడి బలవన్మరణం
  •  మృతులు ఖమ్మం జిల్లా వాసులు
  •  మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో దారుణం
  • భర్త వేధింపులు ఆ ఇల్లాలిని కుంగదీశారుు. పన్నెండేళ్ల సంసారంలో సంతోషంగా ఉన్నది తక్కువే. భర్త రోజూ తాగొచ్చి వేధించినా.. ఆమె భరించింది. ఊరు నిండా అప్పులు చేసినా కూలోనాలో చేసి తీర్చింది. అరుునా అతడిలో మార్పు రాకపోగా.. రెండు రోజులుగా చిత్రహింసలకు గురిచేస్తుండడంతో విసిగి వేసారింది. పాఠశాల నుంచి తన ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని పుట్టెడు దుఃఖంతో రైలు పట్టాలపైకి చేరుకుంది. పిల్లలతో సహా రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడి కానరాని లోకాలకు చేరింది. మహబూబాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనతో మృతుల స్వగ్రామమైన ఖమ్మం జిల్లా చొప్పకట్లపాలెం, ప్రస్తుతం నివాసముంటున్న టేకులపల్లిలో విషాదాన్ని నింపింది.          
     
    మహబూబాబాద్/ఖమ్మం అర్బన్ : తాగుబోతు భర్త వేధింపులు భార్య, పిల్లలను బలిగొన్నాయి. మానుకోటలో జరిగిన ఈ  దారుణం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట గ్రామం జగ్గవరం కాలనీకి చెందిన తూము నాగమణి, గంగాధరం దంపతుల కుమార్తె శ్రావణి(28)కి అదే జిల్లా బోనకల్ మండలం చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన బొగ్గవరపు ఆంజనేయులుతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తెలు అమూల్య(11), జీవణి(9) ఉన్నారు. మద్యానికి బానిసైన ఆంజనేయులు భార్యపై అనుమానంతో నిత్యం వేధించేవాడు.

    దీంతో మూడేళ్లుగా ఆమె తన పిల్లలతో కలిసి భర్తకు దూరంగా ఉంటోంది. మూడు నెలల క్రితమే పెద్దమనుషులు ఎదుట తాను మారానని, తాగుడు మానానని ఒప్పుకుని భార్య, పిల్లలను తీసుకెళ్లాడు. ప్రస్తుతం వారు ఖమ్మం శివారు టేకులపల్లిలో శ్రీలక్ష్మినగర్ రోడ్డు నంబర్ 4లో నివాసముంటున్నారు. శ్రావణి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండగా, ఆంజనేయులు ఖమ్మం శివారులోని క్వారీలో కూలీగా పనిచేస్తున్నాడు.

    ఈ క్రమంలో ఈ నెల 11న తాగొచ్చి ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. రెండు రోజులుగా అలాగే కొడుతుండడం తో ఓపిక నశించిన శ్రావణి శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయల్దేరింది. ఖమ్మం రోటరీనగర్‌లో ఉంటున్న తన అక్క దగ్గరికి వెళుతున్నట్లు ఇంటి పక్కవారికి చెప్పి తన కుమార్తెలు చదువుతున్న కస్తూర్భా స్కూల్‌కు చేరుకుంది. వారితో పని ఉందని వెంటబెట్టుకుని బయల్దేరింది.
     
    అల్లుడు రోజూ కొడుతున్నాడని తెలియడంతో కూతురిని చూసేందుకు నాగమణి శుక్రవారం సాయంత్రం శ్రావణి ఉండే ఇంటికి వెళ్లగా ఇంట్లో సూసైడ్ నోట్ లభించింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె తన కుమారులతో కలిసి వెళ్లి రాత్రి రాత్రి 9 గంటలకు ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులు సమీపంలోని సాగర్ కాల్వ, పరిసర ప్రాంతాల్లో గాలించినా జాడ తెలియలేదు. ఆమె వాడుతున్న సెల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ఆరా తీయగా నగరంలోని బస్టాండ్ సమీపంలో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత అచూకీ లభించలేదు.

    ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి దాటాక మహబూబాబాద్ వద్ద రైలు కిందపడి తల్లి ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడిన వార్త టీవీల్లో  శనివారం ఉదయం రావడం చూసి ఖమ్మం అర్బన్ ఎస్సై రుద్రగాని వెంకటనారాయణ వెంటనే మహబూబాబాద్  పోలీసులకు సమాచారమిచ్చా రు. అదృశ్యమైన తల్లీకూతుళ్ల ఫొటోలు పంపారు. వాటిని పరిశీలించిన మానుకోట పోలీసులు మృతులు వారేనని నిర్ధారించారు. దీంతో సమాచారం అందుకున్న మృతుల బంధువులు మహబూబాబాద్‌కు చేరుకున్నారు.

    విగతజీవులుగా పడి ఉన్న కూతురు, మనవరాళ్లను చూడగానే నాగమణి రోదించిన తీరు చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యూరు. మహబూబాబాద్‌లో నమోదైన కేసు ను ఖమ్మం అర్బన్‌కు బదిలీ చేశాక  ఆత్మహత్యకు కారణమైన శ్రావణి భర్త, అతడి బంధువులపై విచారణ చేసి చర్య తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement