'వినయ విధేయ రామ' బ్యూటీపై క్యాస్టింగ్ కౌచ్.. షాకింగ్ కామెంట్స్ | Esha Gupta Comment On Casting Couch Experience | Sakshi
Sakshi News home page

Esha Gupta: దానికి నో చెప్పా.. ఛాన్సులు ఇవ్వడం మానేశారు!

Published Sat, Sep 30 2023 7:22 PM | Last Updated on Sat, Sep 30 2023 8:17 PM

Esha Gupta Comment On Casting Couch Experience - Sakshi

సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామందికి గ్లామరే కనిపిస్తుంది. కానీ దాని వెనక జరిగే ఘోరాలు మాత్రం అప్పుడప్పుడు బయటకొస్తుంటాయి. చాలామంది హీరోయిన్ల దగ్గర నుంచి లేడీ యాక్టర్స్ వరకు చాలామంది మీటూ, క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినవాళ్లే.  అలా ఇప్పుడు ఓ బ్యూటీ తనకు ఓ రెండు సినిమాల ఇలాంటి అనుభవం ఎదురైందని భయపడుతూ చెప్పింది.

ఎవరా బ్యూటీ?
సోషల్ మీడియా యూజర్స్ భాషతో సంబంధం లేకుండా చాలామంది బ్యూటీస్‌ని ఆదరిస్తుంటారు. అలాంటి వాళ్లలో ఈషా గుప్తా ఒకరు. దిల్లీకి చెందిన ఈ భామ.. 'జన్నత్ 2' అనే హిందీ మూవీతో నటిగా మారింది. కెరీర్‌లో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ (ఐటమ్) చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ 'వీడెవడు', 'వినయ విధేయ రామ' చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం ఓ మూడు చిత్రాలు చేస్తోంది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' నుంచి హాట్ బ్యూటీ ఎలిమినేట్!)

ఏం జరిగింది?
'ఓ సినిమా విషయంలో ఇద్దరు వ్యక్తులు నన్ను ట్రాప్ చేయాలని చూశారు. అవుట్‌డోర్ షూటింగ్ అనేసరికి నాకు మొత్తం క్లియర్‌గా అర్థమైపోయింది. అయితే అవుట్‌డోర్ అనేసరికి వాళ్ల వలలో నేను పడతానని అనుకున్నారు. కానీ నేను వాళ్లకంటే స్మార్ట్‌గా ఆలోచించాను. నాకు ఒంటరిగా నిద్రపోయే అలవాటు లేదని, మేకర్ ఆర్టిస్టు కూడా నాతో పాటు రూంలో ఉంటారని చెప్పా. మేకర్ ఆర్టిస్టుని పిలిచి నిద్రపోయా'

మరో సినిమా విషయంలో జరిగిన సంఘటనని కూడా ఈషా గుప్తా బయటపెట్టింది. 'సగం సినిమా పూర్తయింది. వాళ్లు అడిగిన దానికి నో చెప్పాను. దీంతో నేను సెట్‌లో ఉండటం ఇష్టం లేదని ఓ కో ప్రొడ్యూసర్ దర్శకుడితో చెప్పారు. ఈ సంఘటన తర్వాత నాకు చాలామంది అవకాశాలు ఇవ్వడం మానేశారు. నా గురించి సదరు కో ప్రొడ్యూసర్ బ్యాడ్‌గా చెప్పడమే దీనికి కారణం' అని ఈషా గుప్తా తనకెదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: వరుణ్‌ తేజ్ బ్యాచిలర్ పార్టీ.. పెళ్లికి అంతా సెట్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement