Aashram 3: Bobby Deol Opens Up on Intimate Scenes With Esha Gupta - Sakshi
Sakshi News home page

Bobby Deol: ఇంటిమేట్‌ సీన్‌.. చాలా భయమేసింది, కానీ ఆమె వల్లే సులువైంది

Published Sat, Jun 25 2022 8:05 PM | Last Updated on Sun, Jun 26 2022 10:23 AM

Aashram 3: Bobby Deol Opens Up on Intimate Scenes With Esha Gupta - Sakshi

బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ నటించిన లేటెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ ఆశ్రమ్‌ 3 (ఆశ్రమం). క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో ఇషా గుప్తా నటించగా ప్రకాశ్‌ జా దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లో స్ట్రీమింగ్‌ అవుతోందీ సిరీస్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాబీ డియోల్‌ ఈ సిరీస్‌లోని అభ్యంతరకర సన్నివేశాలపై స్పందించాడు.

'మొదటి సారి అభ్యంతరకర సన్నివేశేంలో నటించడం కావడంతో నాకు చాలా భయమేసింది. ఇలా మరీ సన్నిహితంగా కలిసి నటించడం నాకిదే తొలిసారి. కానీ ఇషా చాలా ప్రొఫెషనల్‌. ఆమె పాత్రలో లీనమైపోవడంతో నాకు ఆమెతో కలిసి రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడం కొంత ఈజీ అయింది. అది స్క్రీన్‌పై కూడా సరిగ్గా వచ్చింది. ఇక ప్రతికూల పాత్రలో జనాలు నన్ను అంగీకరించినందుకు సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా డిఫరెంట్‌ అండ్‌ ఛాలెంజింగ్‌ రోల్స్‌ చేయగలనన్న నమ్మకం వచ్చింది' అని చెప్పుకొచ్చాడు బాబీ డియోల్‌.

చదవండి: హీరోయిన్‌ ఇంట్రస్టింగ్‌ పోస్ట్‌, తనతో ఉంది ఆ క్రికెటరే అంటున్న ఫ్యాన్స్‌
టీఆర్పీలో టాప్‌ సీరియల్‌.. కానీ నటులకు జీతాలివ్వట్లేదా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement