అక్కలో అమ్మను చూసుకుంటా: బాలీవుడ్‌ నటి | Raksha Bandhan: Esha Gupta Says I have another mother in Neha Gupta | Sakshi
Sakshi News home page

ప్రతి ఏడాది రాఖీ కట్టుకుంటాం.. గిఫ్టులు ఇచ్చేది మాత్రం తనే!

Published Mon, Aug 19 2024 1:09 PM | Last Updated on Mon, Aug 19 2024 1:43 PM

Raksha Bandhan: Esha Gupta Says I have another mother in Neha Gupta

అక్క నాకు మరో అమ్మలాంటిది అంటోంది బాలీవుడ్‌ నటి ఇషా గుప్తా. రాఖీ పండగ సందర్భంగా తన సోదరి నేహా గుప్తాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. ఇషా మాట్లాడుతూ.. అక్క ఎప్పుడూ సమయపాలన పాటించదు. కానీ తను చాలా మంచి వ్యక్తి. తనలో నేను మరో అమ్మను చూసుకుంటాను. అలా నాకు ఇద్దరు తల్లులు.

బ్లాక్‌మెయిల్‌ చేసేదాన్ని
మేము ఫ్రెండ్స్‌ కన్నా ఎక్కువ క్లోజ్‌గా ఉంటాం.  ఎప్పుడూ పోట్లాడుకోం.  నేను కాస్త రౌడీయిజం చేసినా తను మాత్రం ఎప్పుడూ కూల్‌గానే ఉంటుంది. చిన్నప్పుడు తను ప్రోగ్రెస్‌ కార్డులు దాచిపెట్టుకుంటే నేను వాటిని తీసి అమ్మానాన్నకు చూపించేదాన్ని. లేదంటే ఎక్కడున్నాయో చెప్పేస్తానని బ్లాక్‌మెయిల్‌ చేసేదాన్ని అని పేర్కొంది.

సహించలేను
నేహా మాట్లాడుతూ.. నాకు మా చెల్లి అంటే ఎంత ఇష్టమంటే.. తను నా ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోతే అస్సలు సహించలేను. తన ఫ్రెండ్స్‌తో చాటింగ్‌ చేసుకుంటూ బిజీగా ఉన్నా సరే నా కాల్‌ లిఫ్ట్‌ చేయాలంతే! తన గురించి ‍ప్రతీది నాకు తెలియాలనుకుంటాను. ప్రతి ఏడాది ఒకరికి ఒకరం రాఖీ కట్టుకుంటాం. పెద్దదాన్ని కాబట్టి గిఫ్టులు మాత్రం నేనే ఇస్తుంటాను అని నవ్వుతూ చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement