
Bobby Deol Ashram 3 Trailer Released And Streaming On MX Player: బాలీవుడ్ హీరో బాబీ డియోల్ బాబాగా నటించి మెప్పించిన వెబ్ సిరీస్ ఆశ్రమ్ (ఆశ్రమం). ఆగస్టు 28, 2020న విడుదలైన ఈ సిరీస్ మంచి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత అదే సంవత్సరం చాప్టర్ 2 పేరుతో నవంబర్‌లో 'ఆశ్రం 2'ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ వెబ్ సిరీస్ మూడో చాప్టర్ రానుంది. తాజాగా ఆశ్రమ్ మూడో చాప్టర్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎమ్‌ఎక్స్ ప్లేయర్‌లో జూన్ 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌కు ప్రకాష్ జా దర్శకత్వం వహించారు.
తనకు తాను దేవుడిగా ప్రచారం చేసుకుంటూ మహిళల దోపిడీ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, రాజకీయాలను నియంత్రించే బాబా పాత్రలో బాబీ డియోల్ ఆకట్టుకున్నాడు. ఇందులో బాబా మరింత పవర్‌ఫుల్‌గా, తానే దేవుడన్నట్లుగా కనపించనున్నట్లు తెలుస్తోంది. 'నేనే దేవున్ని.. నిరాలా భగవాన్' అని బాబీ డియోల్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఆశ్రమ్ చాప్టర్ 2లో త్రిదా చౌదరీ హైలెట్‌గా నిలవగా.. ప్రస్తుతం వస్తున్న మూడో చాప్టర్‌లో బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా అలరించనుంది. మరీ ఇషా గుప్తా ఏమేరకు ఆకట్టుకోనుందో చూడాలి. ఇందులో అదితీ పోహంకర్, చందన్ రాయ్ సన్యాల్, దర్శన్ కుమార్, అనుప్రియా గోయెంకా, అధ్యాయన్ సుమన్, త్రిదా చౌదరీ, తుషార్‌పాండే తదితరులు నటిస్తున్నారు.
చదవండి: సన్నీ డియోల్ తనయుడికి నిశ్చితార్థమంటూ వార్తలు.. ఇదిగో క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment