Tridha Choudhury
-
వీపుపై సీక్రెట్ టాటూతో టాలీవుడ్ బ్యూటీ (ఫొటోలు)
-
నేరాలు చేసే 'బాబా నిరాలా' మళ్లీ వచ్చేస్తున్నాడు.. ఆసక్తిగా ట్రైలర్
Bobby Deol Ashram 3 Trailer Released And Streaming On MX Player: బాలీవుడ్ హీరో బాబీ డియోల్ బాబాగా నటించి మెప్పించిన వెబ్ సిరీస్ ఆశ్రమ్ (ఆశ్రమం). ఆగస్టు 28, 2020న విడుదలైన ఈ సిరీస్ మంచి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత అదే సంవత్సరం చాప్టర్ 2 పేరుతో నవంబర్‌లో 'ఆశ్రం 2'ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ వెబ్ సిరీస్ మూడో చాప్టర్ రానుంది. తాజాగా ఆశ్రమ్ మూడో చాప్టర్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎమ్ఎక్స్ ప్లేయర్లో జూన్ 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌కు ప్రకాష్ జా దర్శకత్వం వహించారు. తనకు తాను దేవుడిగా ప్రచారం చేసుకుంటూ మహిళల దోపిడీ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, రాజకీయాలను నియంత్రించే బాబా పాత్రలో బాబీ డియోల్ ఆకట్టుకున్నాడు. ఇందులో బాబా మరింత పవర్‌ఫుల్‌గా, తానే దేవుడన్నట్లుగా కనపించనున్నట్లు తెలుస్తోంది. 'నేనే దేవున్ని.. నిరాలా భగవాన్' అని బాబీ డియోల్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఆశ్రమ్ చాప్టర్ 2లో త్రిదా చౌదరీ హైలెట్‌గా నిలవగా.. ప్రస్తుతం వస్తున్న మూడో చాప్టర్లో బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా అలరించనుంది. మరీ ఇషా గుప్తా ఏమేరకు ఆకట్టుకోనుందో చూడాలి. ఇందులో అదితీ పోహంకర్, చందన్ రాయ్ సన్యాల్, దర్శన్ కుమార్, అనుప్రియా గోయెంకా, అధ్యాయన్ సుమన్, త్రిదా చౌదరీ, తుషార్పాండే తదితరులు నటిస్తున్నారు. చదవండి: సన్నీ డియోల్ తనయుడికి నిశ్చితార్థమంటూ వార్తలు.. ఇదిగో క్లారిటీ -
హీరోయిన్లే హీరోలు
‘‘చీరాలలో బీ టెక్ చదువుకొని సినిమా మీద ఉన్న పిచ్చితో హైదరాబాద్ వచ్చాను. కొంతకాలం మీడియాలో పని చేసిన తర్వాత ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది’’ అన్నారు బాలు అడుసుమల్లి. ధన్యా బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్ ముఖ్య తారలు. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూరీ పిక్చర్స్ పతాకంపై బాలు అడుసుమల్లి దర్శకత్వంలో హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్ నిర్మించిన ‘అనుకున్నది ఒక్కటి...’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్ విత్ హిలేరియస్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించాం. నలుగురు హీరోలు గోవా వెళ్లి ఎంజాయ్ చేసే సినిమాలు చాలా వచ్చాయి. నాకు హీరోలతో సినిమా చేయలని ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అవకాశం రావటం చాలా కష్టం. అందుకే నా కథకు అమ్మాయిలే హీరోలు అనుకొని సినిమా తీయటానికి రెడీ అయ్యాను. కథ విషయానికొస్తే నలుగురు అమ్మాయిలు మందుకొట్టి మగాళ్ల గురించి ఏం మాట్లాడుకుంటారు? ఓ ఫ్రెండ్ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు గోవా వెళ్లిన నలుగురమ్మాయిలు అనుకోకుండా ఓ హత్య చేసి హైదరాబాద్‌కి వస్తారు. వచ్చాక ఎవరి పనులు వారు చేసుకుంటుంటారు. ఆ టైమ్‌లో విలన్ బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ బ్లాక్మెయిల్ నుండి తప్పించుకోవటానికి మళ్లీ గోవా వెళ్తారు. అలా వెళ్లిన వాళ్ల పరిస్థితి ఏంటి? అనేది మా సినిమా కథ. ఇది నిజంగా జరిగిన కథ. నా ఫ్రెండ్స్‌కే ఇలా జరిగింది. వాళ్లు చెప్పిన కథను దృష్టిలో పెట్టుకొని ఈ కథను సినిమాగా ఎందుకు తీయకూడదని తీశాను. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
అనుకున్నది ఒక్కటి
‘మంచి మనసుకు మంచి రోజులు’ చిత్రంలోని ‘అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట..’ పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. తాజాగా ఇదే పేరుతో ఓ సినిమా రూపొందింది. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. జర్నలిస్టు బాలు అడుసుమిల్లి ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూర్వీ పిక్చర్స్ పతాకంపై హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా మార్చి 6న విడుదలకానుంది. ఈ చిత్రం కొత్త ట్రైలర్‌ని విడుదల చేశారు. బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ– ‘‘మీడియా నుంచి వచ్చి ఒక సినిమాకు దర్శకత్వం వహించడం పెద్ద స్టెప్. చాలామంది దర్శకులు కావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకని దర్శకులందరికీ ఈ సినిమాను అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ధన్య అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు ధన్య బాలకృష్ణ. ‘‘చిన్నప్పటి నుండి స్నేహితులైన నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా’’ అన్నారు సిద్ధీ ఇద్నాని. ‘‘ఈ కథలో నలుగురు హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు త్రిధా చౌదరి. ‘‘హాయిగా రెండు గంటలపాటు నవ్వుకోవడానికి మా సినిమాకి రండి’’ అన్నారు కోమలి ప్రసాద్. ‘‘బాలు దర్శకుడు అవుతానని చెప్పినప్పుడు షాకయ్యా. కథ విన్న తర్వాత ట్రై చేయమని చెప్పాను. తర్వాత మేమే సినిమా నిర్మించాలనే నిర్ణయానికి వచ్చాం. రఘురామ్‌గారు, శ్రీరామ్‌గారు ఎంతో సపోర్ట్ చేశారు’’ అన్నారు హిమబిందు. చిత్ర సహనిర్మాత రఘురామ్ యేరుకొండ, నటులు లోబో, బాషా మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఎల్ఎ¯Œ వారణాసి, వైజేఆర్, లై¯Œ ప్రొడ్యూసర్: నేహా మురళి, కెమెరా: శేఖర్ గంగమోని, సంగీతం: వికాస్ బాడిస. -
వాళ్లు చెప్పిందొకటి.. చేసిందొకటి
‘‘తెలుగు అమ్మాయి కావాలి అని దర్శకులు అనుకున్నారు కాబట్టే ‘దర్శకుడు, రంగస్థలం, కల్కి’ సినిమాల్లో నాకు అవకాశాలు వచ్చాయి’’ అన్నారు పూజిత పొన్నాడ. కెమెరామెన్ నిజార్ షఫీ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘7’. హవీష్ హీరోగా, రెజీనా, నందితాశ్వేత, త్రిధాచౌదరి, అనీషా ఆంబ్రోస్, అదితీ ఆర్య, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. రమేష్ వర్మ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ నెల 5న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా పూజిత పొన్నాడ చెప్పిన విశేషాలు... ► నా తొలి ప్రాధాన్యం ప్రేమకథకే. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘7’ చిత్రంలో నాది సస్పెన్స్ రోల్. అందుకే నా పాత్ర గురించి ఎక్కువగా రివీల్ చేయకూడదు. సినిమాలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ ఎవరి కథ వారిదే. క్లైమాక్స్‌లో మెర్జ్ అవుతాయి. ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్ లేని హీరోయిన్ని నేనే అనుకుంటాను. హావీష్ మంచి కో స్టార్. ‘రాజుగాడు’ సినిమాలో చేసినప్పుడే షఫీగారితో పరిచయం.ఆయన దర్శకత్వంలో నటించడం హ్యాపీ. ► ఎలాంటి టీమ్‌తో వర్క్ చేయకూడదో ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’ సినిమా ప్రయాణం నేర్పించింది. ఈ సినిమా చేసినందుకు రిగ్రేట్ ఫీల్ అవుతున్నాను. స్క్రిప్ట్ నుంచి ప్రమోషన్, రిలీజ్ దాకా వారు చెప్పింది ఒకటి.. చేసింది మరొకటి. ఏదీ నేను అనుకున్నట్లు జరగలేదు. ఈ సినిమాకు ముందు స్క్రిప్ట్‌ని బట్టి మాత్రమే సినిమా చేసేదాన్ని. ఇప్పుడు మూవీ టీమ్‌ని కూడా పరిశీలించుకుంటున్నాను. ► ప్రస్తుతం ‘కల్కి’ సినిమాలో ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నాను. తెలుగులో కీర్తీ సురేశ్ లీడ్ రోల్ చేయనున్న చిత్రంలో నటించనున్నా. అదేవిధంగా మరో తమిళ సినిమాకి కూడా సైన్ చేశాను. -
ముద్దు సీన్లు ఉన్నాయని ముందు తెలియదు
‘‘సాధారణంగా నాకు థ్రిల్లర్స్ పెద్దగా ఆసక్తి లేదు. ఆ సబ్జక్టే కొంచెం డ్రైగా అనిపిస్తుంది. కానీ ఈ థ్రిల్లర్ ఒప్పుకోవడానికి కారణం కథ. ప్లస్ 6 హీరోయిన్లు ఉన్న తర్వాత ఇక డ్రైగా ఎందుకు ఉంటుంది? ఇలాంటి కథ ఎక్కడా రాలేదు’’ అన్నారు హవీష్. కెమెరామేన్ నిజార్ షఫీ దర్శకుడిగా మారి హవీష్ హీరోగా రెజీనా, నందితా శ్వేత, త్రిధా చౌదరి, అనీషా ఆంబ్రోస్, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా రూపొందించిన చిత్రం ‘7’. రమేశ్ వర్మ కథను అందించి, నిర్మించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఈ నెల 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా హవీష్ పలు విషయాలు పంచుకున్నారు. ► సినిమాలో రెహమాన్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఆయన దృష్టిలో హీరోయిన్లు, నేను (6+1) 7 పాత్రలం. అందుకే ఆ టైటిల్ పెట్టాం. మొదట సినిమా అనుకున్నప్పటి నుంచి మరో నాలుగు రోజుల్లో సెట్స్ మీదకు వెళ్తాం అనేవరకూ కూడా తెలుగులో మాత్రమే తీయాలనునుకున్నాం. చివర్లో మరో నిర్మాత కూడా తోడవ్వడంతో తెలుగు, తమిళంలో నిర్మించాం. దర్శకుడు షఫీ పుట్టింది తమిళనాడులో అయినా తెలుగు సినిమాలు ఎక్కువ చేశారు. రెండు ప్రాంతాల వాళ్లకు అనుగుణంగా ఈ సినిమా తెరకెక్కించారు. నాకు ఒక్క ముక్క తమిళం రాదు. డైలాగ్స్ నేర్చుకోవడానికి గంటల గంటలు పట్టేది. ► కథలో బలం ఉండబట్టే ఆరుగురు హీరోయిన్లు నటించడానికి ఒప్పుకున్నారు. ఒకరితో ఫ్రెండ్ అవుతున్నాను అనుకునే లోపు ఆమె పార్ట్ షూటింగ్ పూర్తయి మరో హీరోయిన్ జాయిన్ అయ్యేవారు. ఇంత మంది హీరోయిన్లు ఉన్నప్పుడు చిన్న చిన్న ఫైట్స్ కామన్. ఇద్దరు హీరోయిన్స్ సెట్లో ఉన్నప్పుడు అక్కడి వాతావరణంలో తేడా నాకు అర్థం అయ్యేది. ► ఏ పని చేసినా నం.1గా ఉండాలనుకునే మనస్తత్వం నాది. అలానే కష్టపడతాను. మన పని మనం చేసుకుంటూ వెళ్తే సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఆ మధ్య ఓ పెద్ద ప్రాజెక్ట్‌లో హీరోగా అవకాశం వచ్చింది. చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. దాంతో నా గత చిత్రానికి, దీనికి ఇంత గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం ఓ మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. అభిషేక్ పిక్చర్స్ వాళ్లకు చేస్తున్నది ఫ్యామిలీ డ్రామా. అందులో మంచి లవ్‌స్టోరీ ఉంటుంది. ► మా ప్రొడక్షన్లో ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘రాక్షసుడు’ సినిమా చేస్తున్నాం. జూలై 18న రిలీజ్ అనుకుంటున్నాం. నా బ్యానర్లో నేను నటించకపోయినా ఫర్వాలేదు. ఆల్రెడీ బ్యానర్లో నిర్మాతగా నా పేరున్నట్టే. ప్రతి సినిమాలో నేనుండవసరం లేదు కదా. ► ‘7’లో కొన్ని లిప్‌లాక్ సన్నివేశాలు ఉన్నాయి. కథ చెప్పినప్పుడు ముద్దు సీన్లు ఉన్నాయని నాతో చెప్పలేదు. సెట్లోకి వెళ్లి హీరోయిన్ను ముద్దుపెట్టమంటే భయపడ్డాను. ‘ఒకవేళ తను కొడితే ఏంటి?’ అనుకున్నాను. మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత ధైర్యంగా చేసేశాను. ఏ రంగంలో అయినా మార్పు మంచిదే. అందరికీ చాన్స్ ఇవ్వాలనే పద్ధతిని నమ్ముతాను. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబుగారిని చూశాం. ఇప్పుడు జగన్‌గారికి అవకాశం ఇచ్చారు. ఆప్షన్ ఉండాలి. ఈయన సరిగ్గా పరిపాలించకపోతే ఆయన. ఆయన చేయకపోతే ఈయన.. అలా ఉండాలి. జగన్‌గారు రావడం ఖచ్చితంగా మంచిదే. ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదని ఎందుకు అనుకోవాలి. జగన్‌గారు యంగ్‌స్టర్, ప్రపంచాన్ని చూశాడు. ఆయన బాగా పాలించగలరని అనుకుంటున్నాను. -
‘నలుగురు అమ్మాయిల కథ’ మూవీ స్టిల్స్
-
గోవా వెళ్తున్న నలుగురు అమ్మాయిల కథ!
బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ పతాకంపై బాలు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా హిమబిందు వెలగపూడి ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రిధా చౌదరి, ధన్య బాలకృష్ణ, సిద్ధీ ఇద్నాని, కోమలి ప్రసాద్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. ఫిబ్రవరి రెండో వారంలో కీలక సన్నివేశాలు, పాటల, పోరాట దృశ్యాల చిత్రీకరణకు చిత్రబృందం గోవా వెళ్లనుంది. ఈ సందర్భంగా దర్శకుడు బాలు మాట్లాడుతూ... ‘మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. స్వతంత్ర్య భావాలున్న నలుగురి జీవితాల్లో ఏం జరిగిందన్న విషయాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించాం. ఈ నెల రెండో వారంలో గోవాలో మొదలు కానున్న సెకండ్ షెడ్యూల్ లో రెండు పాటలు, కీలక సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మార్చిలో హైదరాబాదులో మూడో షెడ్యూల్ ప్లాన్ చేశాం. మే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కథానుగుణంగా వచ్చే మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’ అన్నారు. -
నలుగురమ్మాయిల కథ
బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా హిమబిందు వెలగపూడి నిర్మిస్తున్న చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సినీ మీడియా రంగంలో రిపోర్టర్‌గా పని చేసిన బాలు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాలు మాట్లాడుతూ– ‘‘స్వతంత్ర భావాలున్న నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. త్రిదా చౌదరి, ధన్యా బాలకృష్ణ. సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాలో కథానుగుణంగా ఉండే ట్విస్ట్‌లు ప్రేక్షకులనుఆకట్టుకుంటాయి’’ అన్నారు. ‘‘ఈ రోజు నుండి తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది. తదుపరి షెడ్యూల్‌ను గోవాలో ఫిబ్రవరిలో ప్రారంభిస్తాం. మేలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు హిమబిందు. ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, సహనిర్మాతలు: రాధికా శ్రీనివాస్ వెత్షా, ఉమా కూచిపూడి. -
‘మనసుకు నచ్చింది’ మూవీ రివ్యూ
టైటిల్ : మనసుకు నచ్చింది జానర్ : రొమాంటిక్ కామెడీ తారాగణం : సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి, అదిత్ అరుణ్, బేబీ జాన్వీ సంగీతం : రధన్ దర్శకత్వం : మంజుల ఘట్టమనేని నిర్మాత : సంజయ్ స్వరూప్, పి.కిరణ్ షో సినిమాతో నటిగా వెండితెరకు పరిచయం అయిన సూపర్ స్టార్ కృష్ణ వారసురాలు మంజుల. తొలి సినిమాతోనే జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న మంజుల తరువాత నటిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా దర్శకురాలిగా మారి మనసుకు నచ్చింది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సందీప్ కిషన్, అమైరా దస్తర్లు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించటంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. నటిగా ప్రూవ్ చేసుకున్నా మంజుల దర్శకురాలిగానూ సక్సెస్ సాధించిందా..? ఈ సినిమాతో సందీప్ కిషన్ హిట్ అందుకున్నాడా..? కథ : సూరజ్(సందీప్ కిషన్), నిత్య (అమైరా దస్తూర్) ఒకే ఫ్యామిలీలో కలిసి పెరిగిన స్నేహితులు. వాళ్ల స్నేహాన్ని ప్రేమగా భావించిన పెద్దవాళ్లు వాళ్లకు పెళ్లిచేయాలని నిర్ణయిస్తారు. కానీ తమ మధ్య స్నేహం తప్ప ప్రేమ లేదని సూరజ్, నిత్యలు ఇంట్లోనుంచి పారిపోతారు. తమ ఫ్రెండ్ శరత్(ప్రియదర్శి) సాయంతో గోవాలోని ఓ గెస్ట్ హౌజ్‌లో ఉంటుంటారు. అప్పటి వరకు ఎలాంటి గోల్స్ లేని సూరజ్ గోవా వెల్లిన తరువాత ఫొటోగ్రాఫర్ కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో ఫెయిల్ అవుతాడు. కానీ నిత్యా ధైర్యం చెప్పటంతో కూల్ అవుతాడు. అదే సమయంలో నిత్య.. తనకు సూరజ్ మీద ఉన్నది ఇష్టం కాదు ప్రేమ అని తెలుసుకుంటుంది. సూరజ్ కూడా ఏదో ఒకరోజు తన ప్రేమను ఫీల్ అవుతాడని ఎదురుచూస్తుంటుంది. కానీ ఈ లోగా గోవాలో పరిచయం అయిన నిక్కి (త్రిదా చౌదరి)ని సూరజ్ ఇష్టపడతాడు. అదే సమయంలో అభయ్ (అదిత్ అరుణ్) అనే కుర్రాడు నిత్యను ఇష్టపడతాడు. దీంతో వారి పెద్దలు ఈ రెండు జంటలకు పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. చివరకు సూరజ్.. నిత్య ప్రేమను అర్ధం చేసుకున్నాడా..? వారిద్దరు ఒక్కటయ్యారా..? ప్రయాణంలో అసలు ప్రకృతి పాత్ర ఏంటి అన్నదే మిగతా కథ. నటీనటులు : సందీప్ కిషన్ తనకు అలవాటైన యూత్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించాడు. అయితే ఎమోషనల్ సీన్స్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే చాలా సన్నివేశాల్లో సందీప్ నటన నిరాశపరుస్తుంది. హీరోయిన్ అమైర దస్తూర్ అందంతో ఆకట్టుకుంది. నటన పరంగానూ పరవాలేదనిపించింది. మరో హీరోయిన్గా నటించిన త్రిదా చౌదరి పూర్తిగా గ్లామర్ షోకే పరిమితమైంది. ప్రియదర్శి లాంటి లీడింగ్ కమెడియన్‌ను హీరో ఫ్రెండ్ పాత్రకు తీసుకున్నా.. సరిగ్గా ఉపయోగించుకోలేదు. ప్రియదర్శి డైలాగ్స్‌లో గత చిత్రాల్లో కనిపించే చమక్కులు ఈ సినిమాలో మిస్ అయ్యాయి. ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఘట్టమనేని వారసురాలు, మంజుల కూతురు జాన్వీ మంచి నటన కనబరించింది. ఇంగ్లీష్ కలిసి తెలుగు యాక్సెంట్లో జాన్వీ చెప్పిన డైలాగ్స్ అలరిస్తాయి. ఇతర పాత్రలు పెద్దగా తెర మీద కనిపించవు. అదిత్ అరుణ్, నాజర్, సంజయ్, అనితా చౌదరిలవి దాదాపుగా అతిథి పాత్రలే. విశ్లేషణ : మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా చేసిన తొలి ప్రయత్నంలో ఆకట్టుకోలేకపోయింది. రొటీన్ ట్రయాంగ్యులర్ లవ్ స్టోరికి ‘నేచర్’ అనే ఎలిమెంట్‌ను జోడించి చేసిన ఈ ప్రయత్నం పూర్తిగా నిరాశపరిచింది. కథలో కొత్తదనం లేకపోవటం కథనం కూడా నెమ్మదిగా సాగటం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. సినిమాలో ఆకట్టుకునే ఒకే ఒక్క అంశం సినిమాటోగ్రఫి, ప్రకృతి అందాలను వెండితెర మీద మరింత అందంగా చూపించారు సినిమాటోగ్రాఫర్ రవియాదవ్. రధన్ సంగీతం పరవాలేదు. ఎడిటింగ్, నిర్మాణవిలువలు బాగున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా ప్రతీ ఫ్రేము రిచ్‌గా తెరకెక్కించారు. ప్లస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫి హీరోయిన్ల గ్లామర్ మైనస్ పాయింట్స్ : కథా కథనం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
అక్కతో సినిమా కూడా చేస్తానేమో?
‘‘మంజుల డైరెక్షన్ చేస్తుందని ఊహించలేదు. హాలిడేస్ టైమ్‌లో తను ఏదో రాసుకుంటుంటే కవిత రాసుకుంటుందేమో అనుకున్నా. కానీ సినిమా కథ రాసుకుంటుందని అనుకోలేదు’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరో హీరోయిన్లుగా మంజుల దర్శకత్వంలో సంజయ్ స్వరూప్, పి.కిరణ్ నిర్మించిన ‘మనసుకు నచ్చింది’ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘మంజుల కథ ప్రిపేర్ చేసుకొని, సినిమా చేయబోతున్నానని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. ఒకరకంగా గర్వంగా ఫీలయ్యాను. విజువల్స్ బాగా నచ్చాయి. మా కిరణ్‌గారి సపోర్ట్, గైడెన్స్ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఆశిస్తున్నా. భవిష్యత్‌లో మా అక్కతో (మంజుల) సినిమా కూడా చేస్తానేమో?’’ అన్నారు. ‘‘మనసుకు నచ్చింది’ కథ రాయడం మొదలుకొని, సినిమా పూర్తి చేయడం వరకూ ఒక నేచురల్ ప్రాసెస్‌లా జరిగింది. మా నాన్నగారు (కృష్ణ), తమ్ముడు మహేశ్ గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది. ఒకానొక సందర్భంలో మహేశ్ కొడుకు గౌతమ్ వెళ్లి ‘నాన్నా.. మంజుల ఆంటీ సినిమాలో ఎప్పుడు యాక్ట్ చేస్తావ్?’ అని అడిగితే చాలా సింపుల్‌గా ‘అదే నా ఆఖరి సినిమా అవుతుంది’ అన్నాడట (నవ్వుతూ). కిరణ్‌గారి సహకారానికి రుణపడి ఉంటా’’ అన్నారు మంజుల. ‘‘మంజులగారి దర్శకత్వంలో హీరోగా చేయడం.. అది ఆమె ఫస్ట్ మూవీ కావడం నా లక్’’ అన్నారు సందీప్ కిషన్. -
మంచి ఫీల్
సూపర్‌స్టార్ కృష్ణ తనయ మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయమవుతోన్న చిత్రం ‘మనసుకు నచ్చింది’. సందీప్ కిషన్ హీరోగా, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరోయిన్లుగా మంజుల దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్–ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్–పి.కిరణ్ నిర్మించారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఫిబ్రవరి 16న విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఫ్రెష్, రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. డైరెక్టర్‌గా మంజులకు తొలి చిత్రమైనా అనుభవం ఉన్నవారిలా చక్కగా తెరకెక్కించారు. ఒక మంచి సినిమా చూశామనే భావన ప్రేక్షకులకు కలిగించేలా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రధన్ మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ప్రియదర్శి, పునర్నవి భూపాలం, నాజర్, అరుణ్ ఆదిత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రవి యాదవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా. -
మంజుల ‘మనసుకు నచ్చింది’ ట్రైలర్ అదిరింది!
-
పెండ్లీకూతురే.. లేపుకెళ్లడం ఫస్ట్‌టైమ్ చూస్తున్నా!
సాక్షి, హైదరాబాద్: మహేశ్‌బాబు సోదరి ఘట్టమనేని మంజుల దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ‘మనసుకు నచ్చింది’ . సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిధా, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను మహేశ్‌బాబు చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు. ఒక అందమైన ప్రేమకథ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కింది. ‘ పెండ్లీకూతురే.. పెండ్లికొడుకును లేపుకెళ్లడం ఫస్ట్‌టైమ్ చూస్తున్న నేను’ అన్న ప్రియదర్శి డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. మనసుకు నచ్చింది చేసేందుకు ఎంతదూరమైన వెళ్లే ఒక జంట ప్రేమకథ ఎలా మొదలైంది.. అన్న ఆసక్తికరమైన అంశంతో మోడ్రన్ యూత్ జీవనశైలికి దగ్గరగా ఈ సినిమా తెరకెక్కినట్టు కనిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్లో త్రిధా బికినీలో కనిపించడం గమనార్హం. స్నేహం, ప్రేమ అందులోని ఎమోషన్స్‌తో ఈ సినిమా ‘మనసుకు నచ్చేలా’ తెరకెక్కినట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. -
హీ ఈజ్ వెరీ క్యూట్
‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన త్రిదా చౌదరి తొలి చిత్రంతోనే అందరి అభిమానాన్ని పొందింది. తన మొదటి సినిమా తెలుగు చిత్రం కావటం చాలా సంతోషంగా ఉందంటోంది త్రిదా. విశాఖ నగరం మళ్లీ మళ్లీ రావాలనిపించేలా ఉందంటోంది ఈ కోల్‌కతా బ్యూటీ. ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమా సక్సెస్ టూర్లో భాగంగా వైజాగ్ వచ్చిన త్రిదాతో సిటీప్లస్ చిట్‌చాట్... నేను పుట్టి పెరిగింది అంతా కోల్‌కతాలో.. అమ్మ హౌస్‌వైఫ్. ఎక్కువగా లిటరేచర్ చదువుతుంది. నాన్న బిజినెస్ మాన్. మా అమ్మా నాన్న నాకు ఎంతో సపోర్ట్‌గా ఉంటున్నారు. రోజంతా నేను వర్క్ చేస్తూ ఉండాలి. ఒక్కోసారి షూటింగ్ ఒక్కో దగ్గర ఉంటుంది. ఒక్కోసారి రాత్రంతా కూడా షూటింగ్ ఉండొచ్చు. అలాంటి సమయంలో కూడా అమ్మా నాన్న చాలా సపోర్ట్ చేస్తారు. మామూలుగా అయితే చాలా కుటుంబాలలో వద్దు అనేవారేమో. కానీ నాకు మాత్రం అలా జరగలేదు. అమ్మా నాన్నకు థాంక్స్.... వాళ్లే నాకు బ్యాక్‌బోన్. ఎంట్రీ ఇలా... నేను మొత్తం అకడమిక్ ఓరియంటెడ్. ఎప్పుడూ చదువుకుంటూ ఉండేదాన్ని. అప్లైడ్ సెన్సైస్ చదవాలి లేదా డాక్టర్ అవ్వాలి అనుకునేదాన్ని. ఒకసారి నేషనల్ లెవల్ బ్యూటీ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేశాను.అప్పుడు నాకు నేషనల్ లెవల్ టీవీ ఛానెల్స్‌లో మంచి గుర్తింపు వచ్చింది. సరిగ్గా అప్పుడే సూర్య వర్సెస్ సూర్య కోసం హీరోయిన్ వెతుకుతున్నారు. డెరైక్టర్ కార్తీక్ ఘట్టమనేని నా వీడియో ఒకటి చూశారు. అప్పటికే అది చాలా పాపులర్ అయింది. ఈ సినిమాలో నా రోల్ వీడియో జాకీ. ఆ రోల్‌కు కావలసిన బాడీ లాంగ్వేజ్ నాకు ఉంది అని ఆడిషన్ చేసి నన్ను సెలక్ట్ చేశారు. అరుచుకునేవాళ్లం... నిఖిల్‌ని నేను షూటింగ్ లొకేషన్లో ఫస్ట్ టైం కలిశాను. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. నాకు తెలుగు రాకపోయినా డైలాగ్స్ చెప్పడంలో చాలా హెల్ప్ చేసేవాడు. వాయిస్ నోట్స్ పంపుతూ ఏ డైలాగ్ ఎలా చెప్పాలి లాంటివి సలహా ఇచ్చేవాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక ఫన్నీ సీన్ జరిగింది. సడెన్‌గా అసిస్టెంట్ డెరైక్టర్ నా మీద అరిచేవాడు. నేను కూడా తిరిగి అరిచేదాన్ని ఇలా ఒకరిమీద ఒకరం అరుచుకుంటూ ఉండేవాళ్లం. మిగిలిన క్రూ అంతా హీరోయిన్, అసిస్టెంట్ డెరైక్టర్ గొడవపడుతున్నారు... అసలు ఏమైంది అని చాలా కంగారుపడేవారు. తర్వాత విషయం తెలుసుకుని అందరం నవ్వుకునేవాళ్లం. సరదాగా మేం టీం మీద ప్లే చేసిన జోక్ అది. ఇలాంటివి షూటింగ్ టైంలో చాలానే చేశాం. నాకు నచ్చిన వాళ్లు... ప్రస్తుతం ఇంకొన్ని సినిమాలు డిస్కషన్లో ఉన్నాయి. అవి ఇంకా కన్ఫర్మ్ అవలేదు. తమన్నా నాకు చాలా ఇష్టం. భాషను చాలా త్వరగా నేర్చుకుంది. అలాగే మాధురీదీక్షిత్ నాకు ఇన్సిపిరేషన్. టాలీవుడ్లో నాకు మహేష్‌బాబు అంటే చాలా ఇష్టం. ఆన్‌స్క్రీన్ అపీరియన్స్ చాలా బాగుంటుంది. హీ ఈజ్ వెరీ క్యూట్. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నిఖిల్‌తో యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. తనతో మళ్లీ వర్క్ చేయాలని ఉంది. చాలా బాగుంది... నేను వైజాగ్ రావడం ఇదే ఫస్ట్ టైం. కాబట్టి అన్ని ప్లేస్‌లు తిరిగి చూడడానికి టైం సరిపోలేదు. కానీ చూసినంత వరకు చాలా బాగుంది. క్లీన్‌గా ఉంది. చాలా బాగా మెయింటెన్ చేస్తున్నారు. హుదూద్ తర్వాత చాలా త్వరగా కోలుకుంది. స్టీల్‌సిటీ అని చెప్పినందుకు అంతే ఫాస్ట్‌గా రికవర్ అయ్యింది. నేను మళ్లీ మళ్లీ ఇక్కడకు రావడానికి ప్లాన్ చేసుకుంటాను. ఈ సిటీలో ప్యూరిటీ ఉంది. -
యూత్ కనెక్ట్ అయ్యారు : తనికెళ్ల భరణి
‘‘ ‘స్వామి రారా’, ‘ కార్తికే య’ చిత్రాల తరువాత నా సినిమాల మీద అంచనాలు బాగా పెరిగాయి. వాటిని నిలబెడుతూ ఈ సినిమా మంచి వసూళ్లతో నడుస్తోంది’’ అని నిఖిల్ చెప్పారు. నిఖిల్, త్రిధా చౌధురి జంటగా సురక్ష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ ఇటీవల విడుదలైంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో తనికెళ్ల భరణి మాట్లాడుతూ -‘‘పిరికివాడు ధైర్యవంతుడిగా ఎలా మారాడు అని చూపించిన విధానానికి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. యంగ్ టీమ్‌ను నమ్మి ఈ సినిమా తీసిన నిర్మాతకు నా అభినందనలు . అన్ని పాత్రలకు మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. కార్తీక్ మాట్లాడుతూ -‘‘క్వాలిటీ విషయంలో రాజీపడకుండా నిర్మాత చాలా బాగా సహకరించారు, సంభాషణల విషయంలో భరణి గారి తోడ్పాటు మర్చిపోలేను’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శివకుమార్, నటులు ప్రవీణ్, హర్ష పాల్గొన్నారు. -
త్రిధా చౌదరితో గెస్ట్ టైం!
-
మొదట్లో ఇబ్బంది అనిపించింది!
‘‘కలలో కూడా ఊహించనవి జరిగినప్పుడు.. అది కూడా మంచి విషయాలైనప్పుడు స్వీట్ షాక్‌లా ఉంటుంది. ‘సూర్య వెర్సస్ సూర్య’కు అవకాశం వచ్చినప్పుడు నాకలాంటి అనుభూతే కలిగింది. నా మాతృభాష బెంగాలీలో పలు చిత్రాల్లో నటించినా, ఓ కొత్త భాషలో అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అని త్రిధా చౌదరి అన్నారు. నిఖిల్ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ‘సూర్య వెర్సస్ సూర్య’ ఈ గురువారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా త్రిధా కథానాయికగా పరిచయమయ్యారు. ఈ చిత్రం తనకు మంచి గుర్తింపు తెచ్చిందని త్రిధా చెబుతూ -‘‘వాస్తవానికి నేను పగటిపూటను ఇష్టపడినంతగా రాత్రిని ఇష్టపడను. కానీ, ఈ చిత్రం షూటింగ్ ఎక్కువగా రాత్రిపూట జరిగింది. దాంతో మొదటి రెండు, మూడు రోజులు ఇబ్బంది అనిపించింది. ఆ తర్వాత అడ్జస్ట్ అయ్యా’’ అన్నారు. ప్రస్తుతం బెంగాలీలో ప్రముఖ దర్శకుడు కమలేశ్వర్ ముఖర్జీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాననీ, తెలుగు చిత్రాలకు సంబంధించి కథలు వింటున్నాననీ త్రిధా తెలిపారు.