హీ ఈజ్ వెరీ క్యూట్ | Tridha choudhury interview with sakshi | Sakshi
Sakshi News home page

హీ ఈజ్ వెరీ క్యూట్

Published Sun, Mar 15 2015 10:23 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

హీ ఈజ్ వెరీ క్యూట్ - Sakshi

హీ ఈజ్ వెరీ క్యూట్

‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన త్రిదా చౌదరి తొలి చిత్రంతోనే అందరి అభిమానాన్ని పొందింది. తన మొదటి సినిమా తెలుగు చిత్రం కావటం చాలా సంతోషంగా ఉందంటోంది త్రిదా. విశాఖ నగరం మళ్లీ మళ్లీ రావాలనిపించేలా ఉందంటోంది ఈ కోల్‌కతా బ్యూటీ. ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమా సక్సెస్ టూర్‌లో భాగంగా వైజాగ్ వచ్చిన త్రిదాతో సిటీప్లస్ చిట్‌చాట్...
 
 నేను పుట్టి పెరిగింది అంతా కోల్‌కతాలో.. అమ్మ హౌస్‌వైఫ్. ఎక్కువగా లిటరేచర్ చదువుతుంది. నాన్న బిజినెస్ మాన్. మా అమ్మా నాన్న నాకు ఎంతో సపోర్ట్‌గా ఉంటున్నారు. రోజంతా నేను వర్క్ చేస్తూ ఉండాలి. ఒక్కోసారి షూటింగ్ ఒక్కో దగ్గర ఉంటుంది. ఒక్కోసారి రాత్రంతా కూడా షూటింగ్ ఉండొచ్చు. అలాంటి సమయంలో కూడా అమ్మా నాన్న చాలా సపోర్ట్ చేస్తారు. మామూలుగా అయితే చాలా కుటుంబాలలో వద్దు అనేవారేమో. కానీ నాకు మాత్రం అలా జరగలేదు. అమ్మా నాన్నకు థాంక్స్.... వాళ్లే నాకు బ్యాక్‌బోన్.
 
 ఎంట్రీ ఇలా...
 నేను మొత్తం అకడమిక్ ఓరియంటెడ్. ఎప్పుడూ చదువుకుంటూ ఉండేదాన్ని. అప్లైడ్ సెన్సైస్ చదవాలి లేదా డాక్టర్ అవ్వాలి అనుకునేదాన్ని. ఒకసారి నేషనల్ లెవల్ బ్యూటీ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేశాను.అప్పుడు నాకు నేషనల్ లెవల్ టీవీ ఛానెల్స్‌లో మంచి గుర్తింపు వచ్చింది. సరిగ్గా అప్పుడే సూర్య వర్సెస్ సూర్య కోసం హీరోయిన్ వెతుకుతున్నారు. డెరైక్టర్ కార్తీక్ ఘట్టమనేని నా వీడియో ఒకటి చూశారు.  అప్పటికే అది చాలా పాపులర్ అయింది. ఈ సినిమాలో నా రోల్ వీడియో జాకీ. ఆ రోల్‌కు కావలసిన బాడీ లాంగ్వేజ్ నాకు ఉంది అని ఆడిషన్ చేసి నన్ను సెలక్ట్ చేశారు.
 
 అరుచుకునేవాళ్లం...
నిఖిల్‌ని నేను షూటింగ్ లొకేషన్‌లో ఫస్ట్ టైం కలిశాను. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. నాకు తెలుగు రాకపోయినా డైలాగ్స్ చెప్పడంలో చాలా హెల్ప్ చేసేవాడు. వాయిస్ నోట్స్ పంపుతూ ఏ డైలాగ్ ఎలా చెప్పాలి లాంటివి సలహా ఇచ్చేవాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక ఫన్నీ సీన్ జరిగింది. సడెన్‌గా అసిస్టెంట్ డెరైక్టర్ నా మీద అరిచేవాడు. నేను కూడా తిరిగి అరిచేదాన్ని ఇలా ఒకరిమీద ఒకరం అరుచుకుంటూ ఉండేవాళ్లం. మిగిలిన క్రూ అంతా హీరోయిన్, అసిస్టెంట్ డెరైక్టర్ గొడవపడుతున్నారు... అసలు ఏమైంది అని చాలా కంగారుపడేవారు. తర్వాత విషయం తెలుసుకుని అందరం నవ్వుకునేవాళ్లం. సరదాగా మేం టీం మీద ప్లే చేసిన జోక్ అది. ఇలాంటివి షూటింగ్ టైంలో చాలానే చేశాం.
 
 నాకు నచ్చిన వాళ్లు...
 ప్రస్తుతం ఇంకొన్ని సినిమాలు డిస్కషన్‌లో ఉన్నాయి. అవి ఇంకా కన్‌ఫర్మ్ అవలేదు. తమన్నా నాకు చాలా ఇష్టం. భాషను చాలా త్వరగా నేర్చుకుంది. అలాగే మాధురీదీక్షిత్ నాకు ఇన్సిపిరేషన్. టాలీవుడ్‌లో నాకు మహేష్‌బాబు అంటే చాలా ఇష్టం. ఆన్‌స్క్రీన్ అపీరియన్స్ చాలా బాగుంటుంది. హీ ఈజ్ వెరీ క్యూట్. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నిఖిల్‌తో యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. తనతో మళ్లీ వర్క్ చేయాలని ఉంది.
 
 చాలా బాగుంది...
 నేను వైజాగ్ రావడం ఇదే ఫస్ట్ టైం. కాబట్టి అన్ని ప్లేస్‌లు తిరిగి చూడడానికి టైం సరిపోలేదు. కానీ చూసినంత వరకు చాలా బాగుంది. క్లీన్‌గా ఉంది. చాలా బాగా మెయింటెన్ చేస్తున్నారు. హుదూద్ తర్వాత చాలా త్వరగా కోలుకుంది. స్టీల్‌సిటీ అని చెప్పినందుకు అంతే ఫాస్ట్‌గా రికవర్ అయ్యింది. నేను మళ్లీ మళ్లీ ఇక్కడకు రావడానికి ప్లాన్ చేసుకుంటాను. ఈ సిటీలో ప్యూరిటీ ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement