సిధ్ధీ ఇద్నాని, త్రిధా చౌదరి, కోమలి ప్రసాద్, ధన్య బాలకృష్ణ
‘మంచి మనసుకు మంచి రోజులు’ చిత్రంలోని ‘అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట..’ పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. తాజాగా ఇదే పేరుతో ఓ సినిమా రూపొందింది. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. జర్నలిస్టు బాలు అడుసుమిల్లి ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూర్వీ పిక్చర్స్ పతాకంపై హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా మార్చి 6న విడుదలకానుంది.
ఈ చిత్రం కొత్త ట్రైలర్‌ని విడుదల చేశారు. బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ– ‘‘మీడియా నుంచి వచ్చి ఒక సినిమాకు దర్శకత్వం వహించడం పెద్ద స్టెప్. చాలామంది దర్శకులు కావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకని దర్శకులందరికీ ఈ సినిమాను అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ధన్య అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు ధన్య బాలకృష్ణ. ‘‘చిన్నప్పటి నుండి స్నేహితులైన నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా’’ అన్నారు సిద్ధీ ఇద్నాని. ‘‘ఈ కథలో నలుగురు హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు త్రిధా చౌదరి.
‘‘హాయిగా రెండు గంటలపాటు నవ్వుకోవడానికి మా సినిమాకి రండి’’ అన్నారు కోమలి ప్రసాద్. ‘‘బాలు దర్శకుడు అవుతానని చెప్పినప్పుడు షాకయ్యా. కథ విన్న తర్వాత ట్రై చేయమని చెప్పాను. తర్వాత మేమే సినిమా నిర్మించాలనే నిర్ణయానికి వచ్చాం. రఘురామ్‌గారు, శ్రీరామ్‌గారు ఎంతో సపోర్ట్ చేశారు’’ అన్నారు హిమబిందు. చిత్ర సహనిర్మాత రఘురామ్ యేరుకొండ, నటులు లోబో, బాషా మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఎల్‌ఎ¯Œ వారణాసి, వైజేఆర్, లై¯Œ ప్రొడ్యూసర్: నేహా మురళి, కెమెరా: శేఖర్ గంగమోని, సంగీతం: వికాస్ బాడిస.
Comments
Please login to add a commentAdd a comment