Dhanya Balakrishna
-
'బాపు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన ధన్య బాలకృష్ణ (ఫొటోలు)
-
బ్రహ్మాజీ 'బాపు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
హీరోయిన్గా చేయమని నయనతార సలహా ఇచ్చిందన్న ధన్య బాలకృష్ణ (ఫోటోలు)
-
ఓటీటీలోకి వచ్చేసిన దేశ భక్తి చిత్రం ‘రామ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
సూర్య అయ్యలసోమయాజుల, ధన్యా బాలకృష్ణ జంటగా నటించిన తాజా దేశ భక్తి చిత్రం రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) . రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది జనవరి 16న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ని సంపాదించుకుంది. దర్శకుడు మిహిరామ్ వైనతేయకి ఇది తొలి సినిమానే అయినా.. మంచి పేరును తీసుకొచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ‘రామ్’ కథేంటి? హైద్రాబాద్‌లోని హెచ్ ఐ డీ (హిందుస్థాన్ ఇంట్రా డిఫెన్) హెడ్డుగా రియాజ్ అహ్మద్ (సాయి కుమార్) వ్యవహరిస్తుంటారు. ఆ డిపార్ట్మెంట్లో జేబీ (భాను చందర్) చురుకైన ఆఫీసర్. గతంలో జేబీ పని చేసిన జట్టు ఓ మిషన్ కోసం వెళ్తుంది. అందులో జేబీపై అధికారి మేజర్ సూర్య ప్రకాష్ (రోహిత్) ప్రాణాలు కోల్పోతాడు. తమ కోసం ప్రాణాలు అర్పించిన అధికారి కొడుకు రామ్ (సూర్య అయ్యలసోమయాజుల)ను డిపార్ట్మెంట్లోకి తీసుకు రావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ రామ్ మాత్రం అల్లరి చిల్లరి జాలీగా తిరుగుతూ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అలాంటి రామ్ తొలి చూపులోనే జాహ్నవి (ధన్య బాలకృష్ణ) ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి జేబీ కూతురే. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనే కండీషన్ పెడతాడు జేబీ. అమ్మాయి ప్రేమ కోసం రామ్ డిపార్ట్మెంట్లో చేరేందుకు పడిన కష్టం ఏంటి? అదే టైంలో ఉగ్రవాదులు ఎలాంటి కుట్రలు పన్నుతుంటారు? దాన్ని అడ్డుకునేందుకు హీరో ఏం చేస్తాడు? అసలు ఈ కథలో ర్యాపిడ్ యాక్షన్ మిషన్ మీనింగ్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే. -
12 ఏళ్ల క్రితం వివాదం.. ఇప్పుడు సారీ చెప్పిన యంగ్ హీరోయిన్
యంగ్ హీరోయిన్.. సినీ ప్రేక్షకులకు క్షమాపణ చెప్పింది. అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం పెట్టిన పోస్ట్‌పై ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చేసింది. తనకు తమిళ ఆడియెన్స్ అంటే ఎంతో గౌరవమని చెప్పింది. అలానే అప్పట్లోని స్టేట్మెంట్తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. ఇంతకీ అప్పుడేం జరిగింది? నటి ధన్య ఇప్పుడెందుకు సారీ చెప్పిందో తెలుసా? (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా.. డేట్ ఫిక్స్) బెంగళూరులో పుట్టి పెరిగిన ధన్య బాలకృష్ణ.. తెలుగు, తమిళంలో బోలెడన్ని సినిమాలు చేసింది. హీరోయిన్, సహాయ పాత్రల్లో నటించి ఆకట్టుకుంది. ఈమె నటించిన 'లాల్ సలామ్' ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. సరిగ్గా ఇప్పుడు ఓ పాత గొడవ బయటకొచ్చింది. గతంలో తమిళ ప్రేక్షకులని కించపరిచేలా 2012లో ఫేస్బుక్లో ఈమె పోస్ట్ పెట్టిందని చెబుతూ ఓ స్క్రీన్ షాట్‌ని వైరల్ చేశారు. దీని వల్ల తమిళ నెటిజన్స్.. ఈమెకు చుక్కలు చూపించారు. దీంతో ధన్య ఆ పోస్టుపై క్లారిటీ ఇచ్చేసింది. 12 ఏళ్ల పోస్ట్‌లో ఏముంది? 'ప్రియమైన చెన్నై, మీరు అడుక్కుంటే మేం నీళ్లిచ్చాం. మీరు అడుక్కుంటే కరెంట్ ఇచ్చాం. మీరు వచ్చి మా అందమైన నగరాన్ని ఆక్రమించారు. క్షమాపణ చెబితే మేం దయతలచి ఫ్లే ఆఫ్స్‌కి వెళ్లేలా చేస్తాం. మీరు అడుక్కుంటే మేం ఇస్తాం' అని అప్పట్లో ధన్య బాలకృష్ణ రాసిన ఫేస్బుక్ పోస్ట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. తాజాగా ఈ స్క్రీన్ షాట్‌పై స్పందించిన నటి ధన్య.. సోషల్ మీడియాలో పెద్ద నోట్ రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ఇప్పుడు ఏం చెప్పింది? 'నా వృత్తి, తినే తిండి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఇప్పుడు వైరల్ అవుతున్న ఆ కామెంట్స్ నేను చేయలేదు. అది నా అభిప్రాయం కాదు. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం జరిగిన దానికి ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను. అది ట్రోలింగ్కి సృష్టించిన స్క్రీన్ షాట్. ఇన్నేళ్లు ఎందుకు దీనిపై స్పందించలేదా అని మీరనుకోవచ్చు. కానీ ఇన్నేళ్లలో నాకు, నా కుటుంబానికి చాలా బెదిరింపులు వచ్చాయి. వాళ్లని కాపాడుకోవడంలో భాగంగా నేను సైలెంట్‌గా ఉండిపోవాల్సి వచ్చింది' 'కానీ ఇప్పుడు ఆ కామెంట్స్ నేను చేయలేదని పక్కాగా చెబుతున్నాను. నేను తమిళ ఇండస్ట్రీలోనే నటిగా కెరీర్ మొదలుపెట్టాను. ఇక్కడ పనిచేస్తుండటం గౌరవంగా భావిస్తున్నాను. నాకు తమిళ ప్రేక్షకులే ఫస్ట్ ఆడియెన్స్. ఓ మహిళగా నేను ఎవరినీ హర్ట్ చేయలేదు. చేయను కూడా. ఈ స్టేట్మెంట్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ నేను ఇందులో ఇరుక్కోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా తమిళ ప్రేక్షకులందరికీ క్షమాపణ చెబుతున్నాను' అని నటి ధన్య బాలకృష్ణ ఇన్ స్టాలో రాసుకొచ్చింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) -
RAM Movie Review: ‘రామ్’ మూవీ రివ్యూ
టైటిల్: రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) నటీనటులు: సూర్య అయ్యలసోమయజుల,ధన్య బాలకృష్ణ ,భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు నిర్మాణ సంస్థ: దీపికా ఎంటర్టైన్మెంట్ & ఓ ఎస్ యం విజన్ నిర్మాత:దీపికాంజలి వడ్లమాని కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మిహిరామ్ వైనతేయ సంగీతం: ఆశ్రిత్ అయ్యంగార్ సినిమాటోగ్రఫీ దర్శకుడు: ధారన్ సుక్రి విడుదల తేది: జనవరి 26, 2024 కథేంటంటే... హైద్రాబాద్‌లోని హెచ్ ఐ డీ (హిందుస్థాన్ ఇంట్రా డిఫెన్) హెడ్డుగా రియాజ్ అహ్మద్ (సాయి కుమార్) వ్యవహరిస్తుంటారు. ఆ డిపార్ట్మెంట్లో జేబీ (భాను చందర్) చురుకైన ఆఫీసర్. గతంలో జేబీ పని చేసిన జట్టు ఓ మిషన్ కోసం వెళ్తుంది. అందులో జేబీపై అధికారి మేజర్ సూర్య ప్రకాష్ (రోహిత్) ప్రాణాలు కోల్పోతాడు. తమ కోసం ప్రాణాలు అర్పించిన అధికారి కొడుకు రామ్ (సూర్య అయ్యలసోమయాజుల)ను డిపార్ట్మెంట్లోకి తీసుకు రావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ రామ్ మాత్రం అల్లరి చిల్లరి జాలీగా తిరుగుతూ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అలాంటి రామ్ తొలి చూపులోనే జాహ్నవి (ధన్య బాలకృష్ణ) ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి జేబీ కూతురే. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనే కండీషన్ పెడతాడు జేబీ. అమ్మాయి ప్రేమ కోసం రామ్ డిపార్ట్మెంట్లో చేరేందుకు పడిన కష్టం ఏంటి? అదే టైంలో ఉగ్రవాదులు ఎలాంటి కుట్రలు పన్నుతుంటారు? దాన్ని అడ్డుకునేందుకు హీరో ఏం చేస్తాడు? అసలు ఈ కథలో ర్యాపిడ్ యాక్షన్ మిషన్ మీనింగ్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రామ్ సినిమా కోసం దర్శకుడు రాసుకున్న సెటప్ కొత్తగా అనిపిస్తుంది. ఉగ్రవాదం మీద సినిమాలు రావడం కొత్తేమీ కాదు. మన దేశంలో ఉగ్రవాదం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. బార్డర్లోనే కాదు.. దేశం లోపలే ఎంతో ప్రమాదకర శత్రువులుంటారని చూపించాడు డైరెక్టర్. రామ్ విషయంలో కథనాన్ని నడిపించిన తీరు మాత్రం కొత్తగా ఉంటుంది. పనీ పాట లేని అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి.. దేశం కోసం ప్రాణాలిచ్చే అధికారిగా మారే ప్రయాణాన్ని, ఆ గ్రాఫ్‌ను చక్కగా ప్రజెంట్ చేశాడు. హెచ్ఐడీ (హిందుస్తాన్ ఇంట్రా డిఫెన్స్) అంటూ కొత్త పాయింట్ చూపించాడు. దాని చుట్టూ ఈ కథనాన్ని అల్లు కున్నాడు. దేశం లోపల ఉండే స్లీపర్ సెల్స్ గురించి చర్చించాడు. ఓ మతం చేస్తే తప్పు.. ఇంకో మతం చేస్తే తప్పు కాదు అంటూ సాయి కుమార్ పాత్రతో డైలాగ్ చెప్పించడం దర్శకుడి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అలాంటి గూస్ బంప్స్ ఇచ్చే సీన్లు చాలానే రాసుకున్నాడు. సెకండాఫ్, క్లైమాక్స్‌లో హై ఇచ్చే సీన్లను బాగానే రాసుకున్నాడు. బ్యూరోక్రసీ జీహాద్ అంటూ సాయి కుమార్ పాత్రతో కొత్త పాయింట్‌ను జనాల్లోకి బలంగా తీసుకెళ్లాడు దర్శకుడు. శుభలేఖ సుధాకర్ పాత్రతో రాజకీయానికి ఉగ్రవాదానికి కనెక్షన్స్ ఎలా ఉంటాయో చూపించాడు. ఫస్ట్ హాఫ్‌ను సరదా సరదాగా రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌ను ఫుల్ సీరియస్ మోడ్‌లో నడిపించాడు. క్లైమాక్స్‌ను మాత్రం నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నాడు. త్రివర్ణ పతాకం కనిపించే షాట్ డైరెక్టర్ విజన్, ప్రతిభకు ఉదాహరణగా నిలుస్తుంది. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులను చివరకు జై హింద్ అనిపించేలా చేస్తాడు. అదే దర్శకుడి సక్సెస్ అని చెప్పొచ్చు. ఎవరెలా నటించారంటే? రామ్ పాత్రలో సూర్య అయ్యలసోమయాజుల చక్కగా నటించాడు. కొత్త వాడైనా ఎక్కడా ఆ బెరుకు కనిపించలేదు. యాక్షన్ సీక్వెన్స్‌లో ఓ మాస్ హీరోగా ఫైట్స్ చేశాడు. కామెడీ టైమింగ్ కూడా బాగుంది. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌కు, సెకండాఫ్‌కు చూపించిన వేరియేషన్స్ బాగున్నాయి. అక్కడే సూర్య సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, రోహిత్, భాను చందర్ పాత్రలు బాగుంటాయి. రోహిత్ చాలా కాలం తరువాత ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. సాయి కుమార్ తన డైలాగ్ డెలివరీతో మరోసారి ఆడియెన్స్‌ను మంత్ర ముగ్దుల్ని చేస్తాడు. శుభలేఖ సుధాకర్ కనిపించేది కొద్ది సేపే అయినా ఇంపాక్ట్ చూపిస్తాడు. ధన్య బాలకృష్ణ లుక్స్ పరంగా బాగుంది. ఎమోషనల్గానూ ఆకట్టుకుంది. భాషా కామెడీ, రవి వర్మ, మీనా వాసు, అమిత్ ఇలా మిగిలిన పాత్రలన్నీ మెప్పిస్తాయి. రామ్ సినిమాలో టెక్నికల్ టీం మేజర్ అస్సెట్‌గా నిలిచింది. ఆశ్రిత్ అయ్యంగార్ ఇచ్చిన ఆర్ఆర్ సినిమాను నిలబెట్టింది. చివర్లో వచ్చే దేశ భక్తి గీతం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ధారన్ సుక్రి విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. సెకండాఫ్‌లో వచ్చే డైరెక్టర్ మిహిరాం రాసిన మాటలు గుండెల్ని హత్తుకుంటాయి. హిందూ, ముస్లిం, దేశ భక్తి అంటూ చెప్పే డైలాగ్స్ అందరి మనసుల్ని తాకుతాయి. ఆర్ట్, ఎడిటింగ్ అన్నీ చక్కగా కుదిరాయి. నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
దేశభక్తిని చాటే ‘రామ్’
రిపబ్లిక్ డేకి ప్రతీ ఏడాది బాలీవుడ్ నుంచి పేట్రియాటిక్ సినిమాలు వస్తుంటాయి. మన టాలీవుడ్ నుంచి ఇలాంటి జానర్లు రావడం చాలా అరుదు. అలాంటిది ఇప్పుడు తెలుగులో ఓ దేశభక్తి చిత్రం రిపబ్లిక్ డేకి రాబోతోంది. ఈ మేరకు మేకర్లు అధికారికంగా ప్రకటించారు. కమర్షియల్ ఫార్మాట్లో పేట్రియాటిక్ జానర్లో తెరకెక్కించిన రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) చిత్రం జనవరి 26న విడుదల కాబోతోంది. ఈ మేరకు దర్శక నిర్మాతలు ప్రకటించారు. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఓఎస్ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం కానున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు, ట్రైలర్ కూడా అందర్నీ ఆకట్టుకున్నాయి. అందరిలోనూ అంచనాలు పెంచిన ఇక ఈ చిత్రాన్ని జనవరి 26న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. -
జీవితం అనేది యుద్ధం
సూర్య అయ్యల సోమయాజుల హీరోగా, మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ర్యాపిడ్ యాక్షన్ మిషన్’. ఇందులో ధన్యా బాలకృష్ణ హీరోయిన్. దీపికాంజలి వడ్లమాని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్ శైలేష్ కొలను విడుదల చేశారు. ‘జీవితం అనేది ఒక యుద్దం.. చుట్టూ మనుషులు ఉన్నా లేకపోయినా.. నీ పోరాటం నువ్వే చేయాలి.. ఆ పోరాటంలో నా రామ్ గెలుస్తాడని నాకు నమ్మకం ఉంది’ అనే డైలాగ్స్‌తో ట్రైలర్ సాగుతుంది. ‘ఈ 60 ఏళ్ల స్వాతంత్య్రం ప్రజలది కాదు... అధికారులది కాదు... రాజకీయ నాయకులది మాత్రమే... మీరు అప్పుడూ బానిసలే... ఇప్పుడూ బానిసలే... ఎప్పుడూ బానిసలే’ అంటూ ‘శుభలేఖ’ సుధాకర్ చెప్పిన డైలాగ్ కూడా ఉంది. ‘‘దేశభక్తి నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా 'రామ్' చిత్రం నుంచి పాట విడుదల
యదార్థ ఘటనల ఆధారంగా రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం రాబోతోంది. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందకు రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం సిద్దంగా ఉంది. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఓఎస్ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రాన్ని రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం కాబోతున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్గా రాహుల్ సిప్లిగంజ్ పాడిన దేశ భక్తి గీతం అందరిలోనూ ఉత్తేజాన్ని నింపింది. ఇక ఇప్పుడు కాస్త రొమాంటిక్ టచ్ ఉన్న పాటను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ పాటను రిలీజ్ చేస్తూ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. 'మనతోని కాదురా భై' అంటూ సాగే ఈ పాటకు.. రాము కుమార్ ఏఎస్కే సాహిత్యం, ధనుంజయ్ గాత్రం, ఆశ్రిత్ అయ్యంగార్ బాణీ ఇలా అన్నీ కలిసి వినసొంపుగా మార్చాయి. కమర్షియల్, యాక్షన్, పేట్రియాటిక్ జానర్లో రాబోతోన్న ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తుండగా.. ధారణ్ సుక్రి డిఎసి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు. -
Dhanya Balakrishna : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ధన్య భాలకృష్ణ (ఫొటోలు)
-
స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ.. ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో తెలుసా?
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నేను శైలజ, రాజుగారి గది, రాజా రాణి, సాఫ్ట్వేర్ సుధీర్, కార్బన్, జగమేమాయ లాంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. బెంగళూరుకు చెందిన ఈ కన్నడ బ్యూటీ తమిళం, మలయాళ చిత్రాల్లో కూడా నటించింది. తమిళంలో సూర్య నటించిన సెవెన్త్ సెన్స్ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో చిన్ని చిన్ని ఆశ అనే చిత్రంతో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. ఇప్పటివరకు దాదాపు 40 సినిమాలు, 10 వెబ్ సిరీస్‌లో నటించింది. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా? మరెవరో కాదు.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్ బాబుకు ప్రపోజ్ చేసే అమ్మాయి పాత్రలో కనిపించిన ధన్య బాలకృష్ణ. అయితే ఇవాళ చిల్డ్రన్స్ డే కావడంతో ధన్య తన చిన్ననాటి ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తన తండ్రి ఒడిలో కూర్చుని ఉన్న ఫోటోను పంచుకుంటూ విషెస్ తెలిపింది. ఇది చూసిన ఫ్యాన్స్ సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో నైస్ పిక్ అంటూ పోస్టులు పెడుతున్నారు. డైరెక్టర్‌తో పెళ్లి! బాలాజీ మోహన్, ధన్య బాలకృష్ణ 2020 జనవరి నెలలోనే వివాహం చేసుకున్నారు. బాలాజీ మోహన్‌కిది రెండో పెళ్లి. అతను ఇదివరకే తన చిన్ననాటి స్నేహితురాలు అరుణను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ‘మారి’, ‘మారి 2’, ‘వాయై మూడి పేసవుం’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు బాలాజీ. View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) -
దేశభక్తి నేపథ్యంలో...
సూర్య అయ్యలసోమయాజుల హీరోగా, మిహిరామ్ వైన తేయ దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘రామ్’ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్). ధన్యా బాలకృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. దీపికా ఎంటర్టై¯Œ మెంట్–ఓఎస్యం విజన్‌పై దీపికాంజలి వడ్లమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ని డైరెక్టర్ పరశురామ్ విడుదల చేశారు. ‘‘వాస్తవ ఘటనలను ఆధారం చేసుకుని, దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘రామ్’. దేశాన్ని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ గ్లింప్స్‌లో హీరో చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలుస్తుంది. మా సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది’’ అని మేకర్స్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఆశ్రిత్ అయ్యంగార్, కెమెరా: ధారన్ సుక్రే. -
సాఫ్ట్వేర్ సుధీర్ మూవీ హీరోయిన్ ధన్య భాలకృష్ణ (ఫోటోలు)
-
హీరోయిన్ సీక్రెట్ పెళ్లిపై నటి కల్పిక గణేశ్ సంచలన వ్యాఖ్యలు
-
డైరెక్టర్‌తో హీరోయిన్ సీక్రెట్ పెళ్లి.. యూటర్న్ తీసుకున్న కల్పికా గణేశ్
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, నేను శైలజ, యశోద, హిట్ వంటి చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న కల్పిక గణేశ్ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. సెలబ్రిటీలపై నిత్యం ఆరోపణలు గుప్పించే ఆమె ఆమధ్య హీరోయిన్ ధన్య బాలకృష్ణపైతో మాటల యుద్ధమే చేసింది. ధన్య.. పెళ్లై విడాకులు తీసుకున్న డైరెక్టర్‌ను సీక్రెట్‌గా పెళ్లాడిందని, అతడు మరెవరో కాదు, మారి డైరెక్టర్ బాలాజీ మోహన్ అంటూ గతేడాది డిసెంబర్లో ఓ వీడియో రిలీజ్ చేసింది కల్పిక. ఊహించని ట్విస్ట్ దీనిపై పెద్ద దుమారమే చెలరేగగా గతేడాది చివర్లో అదే నిజమని అంగీకరించాడు బాలాజీ మోహన్. అయితే తమ పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించిందంటూ కల్పికపై కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. ఈ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కల్పికా గణేశ్.. సదరు సెలబ్రిటీ జంటకు క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. 'ధన్య బాలకృష్ణ, బాలాజీ మోహన్.. మీపై తప్పుడు ఆరోపణలు చేసి మీ పరువుకు భంగం కలిగించినందుకు క్షమాపణలు చెప్తున్నాను. తప్పుడు ఆరోపణలు.. క్షమాపణలు నేను మీపై చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదు. మనస్ఫూర్తిగా మీకు, మీ కుటుంబానికి, అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఇక మీదట ధన్య, బాలాజీల గురించి ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడను' అని చెప్పుకొచ్చింది. అటు బాలాజీ మోహన్ కూడా మద్రాస్ హైకోర్టులో తన పిటిషన్‌ను వెనక్కు తీసుకున్నాడు. అయితే అంతకంటే ముందే న్యాయస్థానం కల్పికా క్షమాపణలు చెప్పిన వీడియోను సోషల్ మీడియాలో అలాగే ఉంచాలని ఆదేశించింది. ధన్య బాలకృష్ణ మారి డైరెక్టర్కిది రెండో పెళ్లి బాలాజీ మోహన్, ధన్య బాలకృష్ణ 2020 జనవరి నెలలోనే వివాహం చేసుకున్నారు. బాలాజీ మోహన్‌కిది రెండో పెళ్లి. అతను ఇదివరకే తన చిన్ననాటి స్నేహితురాలు అరుణను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ‘మారి’, ‘మారి 2’, ‘వాయై మూడి పేసవుం’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు బాలాజీ. ధన్య బాలకృష్ణ ప్రధానంగా తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలలో పని చేస్తోంది. తెలుగులో ఆమె 'సాఫ్ట్వేర్ సుధీర్', 'కార్బన్', 'రాజు గారి గది' వంటి చిత్రాల్లో నటించింది. చదవండి: హీరోయిన్‌కు దోశలు వేసిన సోనూసూద్.. ఆ హీరో ఫ్యాన్స్‌కు నచ్చలే! -
అన్ని భాషల్లో మా సినిమా టాప్ ట్రెండింగ్‌లో ఉంది : నిర్మాత
‘‘మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని మా ‘జగమే మాయ’ నిరూపించింది. ఇలానే ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్‌తో వస్తాం’’ అని నటుడు చైతన్యా రావు అన్నారు. ధన్యా బాలకృష్ణ, చైతన్యా రావు, తేజ ఐనంపూడి ప్రధాన పాత్రల్లో సునీల్ పుప్పాల దర్శకత్వం వహించిన చిత్రం ‘జగమే మాయ’. ఉదయ్ కోలా, శేఖర్ అన్నే నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబర్ 15న రిలీజైంది. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన సమావేశంలో ఉదయ్ కోలా మాట్లాడుతూ– ‘‘విడుదలైన అన్ని భాషల్లోనూ మా సినిమా టాప్ ట్రెండింగ్‌లో ఉంది’’ అన్నారు. ‘‘ఉదయ్‌గారు నన్ను బలంగా నమ్మారు. ప్రేక్షకుల ఆదరణ గొప్ప ఆనందాన్ని ఇస్తోంది’’ అన్నారు సునీల్ పుప్పాల. -
డైరెక్టర్‌తో ధన్య బాలకృష్ణ సీక్రెట్ పెళ్లి.. అవును ఇది నిజమే..!
ప్రముఖ నటి, హీరోయిన్ ధన్య బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 7th సెన్స్, నేను శైలజ, జయ జానకి నాయక వంటి చిత్రాలల్లో నటిగా అలరించిన ఆమె ఈ మధ్య వెబ్ సిరీస్‌లో సైతం నటించింది. అల్లుడు గారు, లూసర్, రెక్కీ వంటి వెబ్ సిరీస్‌లో ఆమె హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే ఆమె ఓ పెళ్లై, విడాకులు తీసుకున్న ఓ డైరెక్టర్‌ను వివాహం చేసుకుందంటూ షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ విషయాన్ని మరో నటి కల్పిక గణేశ్ తన యూట్యూబ్ చానల్లో ధన్య గురించి ఈ విషయం చెబుతూ గతంలో ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: పెళ్లయిన డైరెక్టర్‌ను ధన్య బాలకృష్ణ సీక్రెట్ పెళ్లి చేసుకుందా? నటి సంచలన వ్యాఖ్యలు) తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు బాలాజీ మోహన్ ధ్రువీకరించారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు కోర్టుకు తెలిపారు. కల్పిక గణేశ్ తనపై, తన భార్య ధన్య బాలకృష్ణపై పరువు నష్టం కలిగించేలా యూట్యూబ్‌లో వీడియో విడుదల చేసిందని కోర్టుకు సమర్పించారు. తన వ్యక్తిగత పరువుకు భంగం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని దర్శకుడు ఆరోపించాడు. అయితే బాలాజీ మోహన్, నటి ధన్య బాలకృష్ణ జనవరి 2020 నెలలోనే వివాహం చేసుకున్నారు. బాలాజీ మోహన్‌కిది రెండో వివాహం. అతను ఇదివరకే అరుణను వివాహం చేసుకున్నారు. ‘మారి’, ‘మారి 2’, ‘వాయై మూడి పేసవుం’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ధన్య బాలకృష్ణ ప్రధానంగా తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలలో పని చేస్తోంది. ఆమె 'సాఫ్ట్వేర్ సుధీర్', 'కార్బన్', 'రాజు గారి గది' వంటి చిత్రాలలో నటించింది. -
నా పవర్ ఏంటో చూపిస్తా.. నటి కల్పిక షాకింగ్ కామెంట్స్..!
నటి ధన్య బాలకృష్ణ, మరో నటి కల్పిక గణేశ్ మధ్య తాజాగా ఓ వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే షాకింగ్ ఆరోపణలు చేశారు మరో నటి కల్పికా గణేశ్. కల్పికా గణేశ్ మాట్లాడుతూ.. ' నువ్వు నన్ను వివాదంలోకి లాగుతున్నావు. సరే అయితే కోర్టులో కలుసుకుందాం. నీ విషయాలు బయటపెట్టే సరికి ఇన్నాళ్లు నన్ను బ్లాక్ చేసిన నువ్వు.. రాత్రి అన్‌బ్లాక్ చేసి వరుసగా కాల్స్ చేశావు. అంటే నువ్వు భయపడ్డావా? లేదా నన్ను భయపెట్టాలనుకున్నావా?. ఏం చేసుకుంటావో చేసుకో. నీతో మాట్లాడేందుకు నేను సిద్ధం. అనుకోకుండా నేను నటిని అయ్యా. ఇది కాకపోతే వేరే పనులు చేసుకుంటా. నీ పవర్ చూపించి నేను షేర్ చేసిన వీడియోను యూట్యూబ్ ఖాతాలో లేకుండా చేశావు కదా. నా పవర్ ఏంటో చూపిస్తా.' అంటూ ఫైరయ్యారు. (ఇది చదవండి: సమంత వ్యాధిపై సంచలన కామెంట్స్ చేసిన నటి కల్పిక) సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద, హిట్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కల్పిక ఓ యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. తన కెరీర్‌లోని అనుభవాలను ఈ ఛానెల్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ధన్య బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఇటీవల ఆమె ఓ వీడియో షేర్ చేశారు. మారి, మారి-2 చిత్రాలతో కోలీవుడ్‌లో ఫేమ్ సొంతం చేసుకున్న బాలాజీ మోహన్ అనే దర్శకుడిని ధన్య ఈ ఏడాది జనవరిలో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు కల్పిక ఆరోపించారు. బాలాజీ గతంలో తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడని తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం ధన్యతో ఆయనకు పరిచయమైందని.. నాటి నుంచి వాళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారని.. పెళ్లి అయ్యాక కూడా సంతోషంగానే ఉన్నారని ఆమె చెప్పారు. కొద్ది రోజులుగా ధన్య ఎక్కడ ప్రమోషన్స్‌లోనూ పాల్గొనలేదని.. ఆమె ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నట్లు ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: అందుకే ప్రెగ్నెంట్‌గా నటించడానికి ఒప్పుకున్నా : కల్పికా గణేష్) అయితే.. ఊహించని రితీలో ఆ వీడియో యూట్యూబ్‌లో అదృశ్యమైంది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ. 'కోలీవుడ్ స్టార్ హీరో అండ చూసుకుని.. నా ఖాతాలో ఉన్న వీడియోను బ్లాక్ చేయించారు. కానీ, నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నా ఖాతా నుంచి వాళ్లు ఎలా తొలగిస్తారు? దీనిపై నేను మరింత తెలుసుకుంటా.' అంటూ కల్పిక ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పెళ్లయిన డైరెక్టర్‌ను ధన్య బాలకృష్ణ సీక్రెట్ పెళ్లి చేసుకుందా? నటి సంచలన వ్యాఖ్యలు
కల్పిక గణేశ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ప్రయాణం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి, పడిపడి లేచే మనసు చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె. ఇటీవలే సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద మూవీలో ముఖ్య పాత్ర పోషించింది కల్పిక. ఇదిలా ఉంటే ఈ మధ్య ఆమె తరచూ తన సహానటీనటులను టార్గెట్ చేస్తూ వారిపై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. అలా వివాదాలతో, ట్రోల్స్‌తో వార్తల్లో నిలుస్తున్న కల్పిక ఓ నటి గురించిన సంచలన విషయం బయపెట్టింది. ప్రముఖ నటి, హీరోయిన్ ధన్య బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 7th సెన్స్, నేను శైలజ, జయ జానకి నాయక వంటి చిత్రాలల్లో నటిగా అలరించిన ఆమె ఈ మధ్య వెబ్ సిరీస్‌లో సైతం నటించింది. అల్లుడు గారు, లూసర్, రెక్కీ వంటి వెబ్ సిరీస్‌లో ఆమె హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే ఆమె ఓ పెళ్లై, విడాకులైన డైరెక్టర్‌ను వివాహం చేసుకుందంటూ షాకింగ్ విషయం బయటపెట్టింది నటి కల్పిక. రీసెంట్ తన యూట్యూబ్ చానల్లో ధన్య గురించి ఈ విషయం చెబుతూ ఆమె ఓ వీడియో విడుదల చేసింది. అయితే కాపీ రైట్ ఇష్యూ కారణంగా యూట్యూబ్ ఈ వీడియోను డిలీట్ చేసింది. ఇక ఆ వీడియోలో కల్పిక మాట్లాడుతూ.. ‘ధన్య బాలకృష్ణ.. కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్‌ను ఈ ఏడాది జనవరిలో రెండో పెళ్లి చేసుకుంది. మొదటి నుంచి ఆమె చెన్నై వెళ్లినప్పుడల్లా బాలాజీ మోహన్‌తోనే ఉండేది. అయితే అప్పటికే బాలాజీకి పెళ్లయి భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. తమిళంలో సినిమాలు చేస్తున క్రమంలో బలాజీతో ఆమె పరిచయం అయ్యింది. అది కాస్తా ప్రేమగా మారడంతో వారిద్దరు సీక్రెట్ గా వివాహం చేసుకొని కాపురం కూడా పెట్టేశారు. వీరిద్దర పెళ్లయి ఏడాది కావోస్తోంది. అయినా ఇప్పటికీ తమ రిలేషన్‌ను వారు బయటకు చెప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే వారి పెళ్లి విషయం తెలిసి ధన్య గురించి నాకు భయం వేసింది. అతడు ఆమె టార్చర్ పెడతాడామో అని అనుకున్నా. కానీ, వారిద్దరు చాలా ఆన్యోన్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇప్పుడు చెప్పడానికి ఓ కారణం ఉంది. ధన్య మూవీ ప్రమోషన్స్‌కి రావడం లేదు. ఈ విషయంలో బాలాజీ ఆమెను ఇబ్బంది పెడుతున్నాడెమో అనిపించింది. అందుకే నేను ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే కాపీ రైట్ ఇష్యూ కారణంగా యూట్యూడ్ ఈ వీడియోను డిలీట్ చేసింది. అయితే ఇది డైరెక్టర్ బలాజీనే వీడియోను డిలిట్ చేయించారని ఆరోపిస్తు ఆమె తన ఫేస్బుక్లో ఓ పోస్ట్ షేర్ చేయడం గమనార్హం. View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by Balaji Mohan (@directormbalaji) -
కుక్కతో విజయ్ ఆటలు, బిర్యానీ కావాలన్న ధన్య
♦ తన వయసు పెరగకుండా పరిష్కారం కనిపెడతానంటున్న సుమ కనకాల ♦ కుక్కతో ఆడుకుంటున్న విజయ్ దేవరకొండ ♦ గ్యాంగ్‌తో కరీష్మా కపూర్ ♦ ఫొటోలతో హీటు పెంచుతున్న ఆండ్రియా ♦ ప్యారడైస్లో మరొక రోజు అంటోన్న లావణ్య త్రిపాఠి ♦ బిర్యానీ పార్సిల్ కావాలంటున్న ధన్య బాలకృష్ణ ♦ గోవాను మిస్ అవుతున్నానంటోన్న అప్సర రాణి ♦ స్విమ్ సూట్లో ఉన్న ఫొటోను షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ♦ లైట్ల మధ్య చందమామలా వెలిగిపోతున్న ప్రియాంక చోప్రా ♦ చీరకట్టులో ఏంజెల్లా మెరిసిపోతున్న మోనాల్ గజ్జర్ ♦ వ్యాక్సిన్ వేయించుకున్న మలైకా అరోరా View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Karisma Kapoor (@therealkarismakapoor) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
దిక్కులు చూస్తున్న రాశీ, హొయలు పోతున్న అనసూయ
♦ బ్యాక్ టూ బిజినెస్ అంటోన్న తాప్సీ పన్ను ♦ చిన్ననాటి ఫొటో షేర్ చేసిన అప్సర రాణి ♦ వ్యాక్సిన్ తీసుకోండంటున్న శ్రీముఖి ♦ చీరకట్టులో హొయలు పోతున్న అనసూయ ♦ నీ పాట వింటూ సిగ్గుపడుతున్నా అంటోన్న దివి వాద్యా View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Divi Vadthya (@divi.vadthya) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) -
అనసూయ బర్త్‌డే పార్టీ, బిర్యానీ వండిన రవి
► వర్షంలో గొడుగుతో విహరిస్తున్న ఫొటోను షేర్ చేసిన ధన్య బాలకృష్ణ ► ఒక్కసారి ప్రేమిస్తే వదలనంటున్న అఖిల్ సార్థక్ ► ఇప్పుడు అందరికీ అవసరమైన ప్రేమను ఎమోజీ రూపంలో సెండ్ చేస్తానంటోన్న శృతీ హాసన్ ► నా పిల్ల ఎక్కడుందో అని ప్రేమ పాటలు పాడుకుంటున్న మెహబూబ్ దిల్సే ► లాస్ట్ ఫొటోతో భయపెట్టేసిన అదా శర్మ ► క్వారంటైన్ బర్త్‌డే జరుపుకున్న అనసూయ భరద్వాజ్ ► కూతురి కోసం మటన్ బిర్యానీ వండిన యాంకర్ రవి View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Dakkshi (@dakkshi_guttikonda) View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) -
నేను మందు తాగినట్లు చూపించారు, కానీ: హీరోయిన్
తమిళ హీరో, టాప్ హీరోయిన్ శృతీ హాసన్ జంటగా నటించిన 'సెవంత్ సెన్స్' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ధన్య బాలకృష్ణ. ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్, ఎటో వెళ్లిపోయింది చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. విక్టరీ వెంకటేశ్, మహేశ్‌బాబు మల్టీస్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో ఒక సీన్లో నటించి మెప్పించింది. 'నేను శైలజ', 'రాజు గారి గది', 'రాజారాణి', 'సాఫ్ట్వేర్ సుధీర్', 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి' వంటి పలు చిత్రాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన ముద్దు పేరు పప్పు అని, ప్రస్తుతం బెంగళూరులో ఉన్నానని వెల్లడించింది. 'రాజారాణి' సినిమాలో మందు తాగినట్లు చూపించారు, కానీ అది నిజం కాదని స్పష్టం చేసింది. తాను తాగింది కేవలం మంచినీళ్లు మాత్రమేనని తెలిపింది. ఎక్కువగా పార్టీలు కూడా చేసుకోనని, ప్రతి వీకెండ్లో మాత్రం స్నేహితులతో కలిసి భోజనానికి వెళ్తానని చెప్పుకొచ్చింది. పవన్ కల్యాణ్, సూర్య, రణ్‌బీర్ కపూర్ తన క్రష్‌లని, వీరితో సినిమా చేయాలనుందని మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె తెలుగులో కన్నా తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తోంది. చదవండి: 'ఆ సీరియల్ నటుడితో ప్రియాంకకు పెళ్లి చేయాలనుకున్నారట' -
దడ పుట్టిస్తున్న ధన్య బాలకృష్ణ ఫొటోలు
-
హీరోయిన్ ‘ధన్య బాలకృష్ణ’ క్యూట్ ఫోటోలు
-
హీరోయిన్లే హీరోలు
‘‘చీరాలలో బీ టెక్ చదువుకొని సినిమా మీద ఉన్న పిచ్చితో హైదరాబాద్ వచ్చాను. కొంతకాలం మీడియాలో పని చేసిన తర్వాత ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది’’ అన్నారు బాలు అడుసుమల్లి. ధన్యా బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్ ముఖ్య తారలు. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూరీ పిక్చర్స్ పతాకంపై బాలు అడుసుమల్లి దర్శకత్వంలో హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్ నిర్మించిన ‘అనుకున్నది ఒక్కటి...’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్ విత్ హిలేరియస్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించాం. నలుగురు హీరోలు గోవా వెళ్లి ఎంజాయ్ చేసే సినిమాలు చాలా వచ్చాయి. నాకు హీరోలతో సినిమా చేయలని ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అవకాశం రావటం చాలా కష్టం. అందుకే నా కథకు అమ్మాయిలే హీరోలు అనుకొని సినిమా తీయటానికి రెడీ అయ్యాను. కథ విషయానికొస్తే నలుగురు అమ్మాయిలు మందుకొట్టి మగాళ్ల గురించి ఏం మాట్లాడుకుంటారు? ఓ ఫ్రెండ్ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు గోవా వెళ్లిన నలుగురమ్మాయిలు అనుకోకుండా ఓ హత్య చేసి హైదరాబాద్‌కి వస్తారు. వచ్చాక ఎవరి పనులు వారు చేసుకుంటుంటారు. ఆ టైమ్‌లో విలన్ బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ బ్లాక్మెయిల్ నుండి తప్పించుకోవటానికి మళ్లీ గోవా వెళ్తారు. అలా వెళ్లిన వాళ్ల పరిస్థితి ఏంటి? అనేది మా సినిమా కథ. ఇది నిజంగా జరిగిన కథ. నా ఫ్రెండ్స్‌కే ఇలా జరిగింది. వాళ్లు చెప్పిన కథను దృష్టిలో పెట్టుకొని ఈ కథను సినిమాగా ఎందుకు తీయకూడదని తీశాను. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
అనుకున్నది ఒక్కటి
‘మంచి మనసుకు మంచి రోజులు’ చిత్రంలోని ‘అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట..’ పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. తాజాగా ఇదే పేరుతో ఓ సినిమా రూపొందింది. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. జర్నలిస్టు బాలు అడుసుమిల్లి ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూర్వీ పిక్చర్స్ పతాకంపై హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా మార్చి 6న విడుదలకానుంది. ఈ చిత్రం కొత్త ట్రైలర్‌ని విడుదల చేశారు. బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ– ‘‘మీడియా నుంచి వచ్చి ఒక సినిమాకు దర్శకత్వం వహించడం పెద్ద స్టెప్. చాలామంది దర్శకులు కావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకని దర్శకులందరికీ ఈ సినిమాను అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ధన్య అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు ధన్య బాలకృష్ణ. ‘‘చిన్నప్పటి నుండి స్నేహితులైన నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా’’ అన్నారు సిద్ధీ ఇద్నాని. ‘‘ఈ కథలో నలుగురు హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు త్రిధా చౌదరి. ‘‘హాయిగా రెండు గంటలపాటు నవ్వుకోవడానికి మా సినిమాకి రండి’’ అన్నారు కోమలి ప్రసాద్. ‘‘బాలు దర్శకుడు అవుతానని చెప్పినప్పుడు షాకయ్యా. కథ విన్న తర్వాత ట్రై చేయమని చెప్పాను. తర్వాత మేమే సినిమా నిర్మించాలనే నిర్ణయానికి వచ్చాం. రఘురామ్‌గారు, శ్రీరామ్‌గారు ఎంతో సపోర్ట్ చేశారు’’ అన్నారు హిమబిందు. చిత్ర సహనిర్మాత రఘురామ్ యేరుకొండ, నటులు లోబో, బాషా మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఎల్ఎ¯Œ వారణాసి, వైజేఆర్, లై¯Œ ప్రొడ్యూసర్: నేహా మురళి, కెమెరా: శేఖర్ గంగమోని, సంగీతం: వికాస్ బాడిస. -
కుర్రాళ్ల గుండెచప్పుడు
‘పండుగాడి ఫోటో స్టూడియో’ చిత్రదర్శ కుడు దిలీప్ రాజా తెరకెక్కించనున్న చిత్రం ‘యూత్’. ‘కుర్రాళ్ల గుండె చప్పుడు’ అన్నది ఉప శీర్షిక. ధన్య బాలకృష్ణ లీడ్ రోల్లో, రావత్ సింధు, వెన్నెల, ఆలోక్ జైన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది. దిలీప్ రాజా మాట్లాడుతూ– ‘‘నా బలం, నా శ్రేయోభిలాషి అయిన డైరెక్టర్ సుకుమార్‌గారు కథ విని ఓకే అంటేనే ‘పండుగాడి ఫోటో స్టూడియో’ చేశాం. ఇప్పుడు ‘యూత్’ కథ కూడా సుకుమార్‌గారు బాగుందంటేనే మొదలుపెడతాం. యువత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా రు? ఎలాంటి బాధలను భరిస్తున్నారో తెలియజెప్పేదే ఈ చిత్రకథ. ఈ చిత్రంలో హిందీ నుంచి ఇద్దరు, తమిళ్ నుంచి ఇద్దరు ప్రముఖ నటులు నటిస్తారు. మార్చిలో షూటింగ్ మొదలు పెట్టి సినిమాని జూన్‌లో రిలీజ్ చేయాల నుకుంటున్నాం’’ అన్నారు. ‘‘ప్రస్తుతం రెండు ట్యూ¯Œ ్స రెడీ అయ్యాయి’’ అన్నారు సంగీత దర్శకుడు యాజమాన్య. -
విజయ్ సేతుపతిలా పేరు తెచ్చుకోవాలి
‘‘సినిమా తీయడం చాలా ఈజీ. కానీ దాన్ని రిలీజ్ చేయడం నరకం’ అనే విషయాన్ని ‘హల్ చల్’ సినిమా ద్వారా తెలుసుకున్నాను’’ అన్నారు రుద్రాక్ష్.. శ్రీపతి కర్రి దర్శకత్వంలో రుద్రాక్ష్, ధన్యా బాలకృష్ణ జంటగా తెరకెక్కిన చిత్రం ‘హల్ చల్’. గణేష్ కొల్లూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 3న విడుదలైంది. ఈ సందర్భంగా రుద్రాక్ష్ మాట్లాడుతూ– ‘‘గ్రాడ్యువేషన్ పూర్తయ్యాక సినిమాల్లో నటించాలని యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. ‘బొమ్మరిల్లు, షాక్, యువత, రక్త చరిత్ర, హైదరాబాద్ నవాబ్స్’ వంటి సినిమాల్లో నటించాను. ‘యువత’ నాకు ఎక్కువ గుర్తింపు తెచ్చింది. ‘లాస్ట్ బెంచ్ స్టూడెంట్, ఓం శాంతి’ సినిమాల్లో విలన్‌గానూ నటించాను. సహాయ నటుడిగా గుర్తింపు రాగానే వరుసగా ఆఫర్స్ అన్నీ నా దగ్గరకు వస్తాయనుకున్నాను. కానీ అలా జరగదని తెలియడానికి టైమ్ పట్టింది (నవ్వుతూ). తమిళంలో విజయ్ సేతుపతిలా విభిన్నమైన స్క్రిప్ట్‌లు చేసి, ఆయనలా పేరు తెచ్చుకోవాలన్నది నటుడిగా నా ఆశయం’’ అన్నారు. -
సాఫ్ట్వేర్ సుధీర్
-
సుధీర్‌తో మూవీపై స్పందించిన రష్మీ..
-
సుధీర్‌తో మూవీపై స్పందించిన రష్మీ..
జబర్దస్త్ నటుడు సుధీర్ హీరోగా తెరకెక్కిన చిత్రం సాఫ్ట్వేర్ సుధీర్. ఈ చిత్రంలో సుధీర్ సరసన హీరోయిన్గా ధన్య బాలకృష్ణ నటించారు. ఈ శనివారం విడుదలైన సాఫ్వేర్ సుధీర్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా సుధీర్, ధన్య ‘సాక్షి’ టీవీ లైవ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు జబర్దస్త్ సెలబ్రిటీలు వారికి కాల్ చేసి ఈ చిత్రంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. లైవ్‌లో సర్ప్రైజ్ కాల్ చేసిన రష్మీ.. ధన్య, సుధీర్‌లకు కంగ్రాట్స్ చెప్పారు. ట్యాలెంట్ అనేది వృథా కాదనే దానికి సుధీర్ నిదర్శనమని అన్నారు. టీవీ నుంచి బిగ్ స్కీ ట్యాలెంట్ పరిచమవ్వడం మంచి పరిణామని అన్నారు. ప్రస్తుతం హాలిడే వెకేషన్లో ఉన్నానని.. త్వరలోనే సినిమా చూస్తానని చెప్పారు. సుధీర్ నవరసాలు పండించడంలో దిట్ట అని చెప్పిన రష్మీ.. త్వరలోనే సుధీర్‌లోని అన్ని కోణాలు చూస్తారు. ఈ సందర్భంగా సుధీర్, రష్మి కాంబినేషన్లో సినిమా ఎప్పుడూ వస్తుందని ప్రశ్నించగా.. ‘కొన్ని చర్చలు జరుగుతున్నాయి.. సుధీర్ ప్రస్తుతం ఈ సినిమాతో బీజీగా ఉన్నాడు. పరిస్థితులు ఎలా ఉంటాయో.. ఎంత త్వరగా ఇది జరుగుతుందో చూద్దాం’ అని రష్మీ తెలిపారు. అలాగే లైవ్ షోకు ఫోన్ చేసిన రామ్‌ప్రసాద్.. సుధీర్‌ను ఆటపట్టించాడు. తనదైన శైలిలో ఆటో పంచ్‌లు విసిరాడు. సాఫ్ట్వేర్ సుధీర్ చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదని సుధీర్ చెప్పారు. చాలా మంది ఫోన్లు చేసి సినిమా బాగుందని చెబుతున్నారని తెలిపారు. ఒకవేళ ఎవరికైనా ఈ సినిమా నచ్చకపోతే క్షమించాలన్న సుధీర్.. మరో మంచి సినిమాతో ముందుకు వస్తానని అన్నారు. ఈ సినిమాకు అనుకున్న దానికన్నా పెద్ద హిట్ అయిందన్న ధన్య.. ప్రతి ఒక్కరు ఈ సినిమాను థియేటర్లోనే చూడాలని, పైరసీకి దూరంగా ఉండాలని కోరారు. -
నవ్వులు పంచే సాఫ్ట్వేర్ సుధీర్
‘‘నాది భీమవరం దగ్గర ఒక పల్లెటూరు. హైదరాబాద్‌లో 2500 నెలసరి జీతంతో ఓ గ్లాస్ మార్ట్‌లో పనిచేశా. ఆ పనిలోని మెళకువలు నేర్చుకుని శేఖర గ్లాస్మార్ట్ను స్థాపించి ప్రస్తుతం మూడు చోట్ల 90 మంది సిబ్బందితో సంస్థని నడుపుతున్నాను’’ అని నిర్మాత, నటుడు కె.శేఖర్ రాజు అన్నారు. సుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ జంటగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాఫ్ట్వేర్ సుధీర్’. కె.శేఖర్ రాజు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కె.శేఖర్ రాజు మాట్లాడుతూ– ‘‘రాజశేఖర్ రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ‘సాఫ్ట్వేర్ సుధీర్’ చిత్రం నిర్మించా. సుధీర్‌కు ఇది మంచి సినిమా అవుతుంది. ఈ ఇయర్ ఎండిగ్ని మా సినిమా చూస్తూ ఆడియ¯Œ ్స ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ– ‘‘రైటర్‌గా నా కెరీర్ స్టార్ట్ చేశాను. 10 సంవత్సరాల క్రితం కథలు పట్టుకొని సినిమా ఆఫీసుల చుట్టూ తిరి గాను. ఫైనల్‌గా మా గురువు సంపత్ నందిగారి దగ్గర అసిస్టెంట్ రైటర్, కో డైరెక్టర్‌గా పని చేశాను. పోసాని కృష్ణమురళి, కోన వెంకట్‌గారి దగ్గర కూడా పనిచేశాను. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ చిత్రానికి రచయితగా పని చేశాను. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. కరెంట్ బర్నింగ్ ఇష్యూ పాయింట్ అందర్నీ ఆలోచింపజేస్తుంది’’ అన్నారు. -
వెండితెర నటుడిగానూ ఆదరించండి
‘జబర్దస్త్, ఢీ, పోవే పోరా’ వంటి టీవీ షోస్ ద్వారా పాపులర్ అయిన ‘సుడి గాలి’ సుధీర్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘సాఫ్ట్వేర్ సుధీర్’. ఈ చిత్రంలో ధన్యా బాలకృష్ణ హీరోయిన్గా నటించారు. రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో కె. శేఖర్‌రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. నిర్మాత రాజ్ కందుకూరి, యాంకర్ సుమ అతిథులుగా ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక జరిగింది. ‘‘సుధీర్ బాడీ లాంగ్వేజ్, టైమింగ్ బాగుంటుంది. ఈ ట్రైలర్ నాకు నచ్చింది. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాజ్ కందుకూరి. ‘‘ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సుమ. ‘‘కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఇప్పటి వరకు నన్ను బుల్లితెరపై ఎలా సపోర్ట్ చేశారో, అలాగే వెండితెరపై కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు సుధీర్. ‘‘ఈ సినిమాలో కథ కన్నా కొన్ని జీవితాలు కనిపిస్తాయి. కామెడీ టైమింగ్‌తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో సుధీర్‌ని హీరోగా ఎంపిక చేశాం. కథ నచ్చి ప్రజాగాయకుడు గద్దర్ ఇందులో ఓ పాట పాడి నటించారు’’ అన్నారు రాజశేఖర్. ‘‘మా బ్యానర్ ద్వారా సుధీర్‌ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు శేఖర్. లిరిసిస్ట్ సురేష్ గంగుల, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ పాల్గొన్నారు. -
‘సాఫ్ట్వేర్ సుధీర్’ ప్రీ రిలీజ్ వేడుక
-
కొత్త కాన్సెప్ట్
రుద్రాక్ష, ధన్య బాలకృష్ణ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హల్ చల్’. గణేష్ కొల్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ బాగుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉందనిపిస్తోంది. ట్రైలర్ చూసిన వారు తప్పకుండా సినిమా చూస్తారు’’ అన్నారు. ‘‘మూడు సంవత్సరాలు ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి నిర్మించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఎమ్ఎస్కె డిజిటల్ ద్వారా మల్కాపురం శివకుమార్‌గారు మా సినిమాను రిలీజ్ చేస్తున్నారు’’ అన్నారు గణేష్ కొల్లూరి. ‘‘మంచి కథతో కూడిన ఇలాంటి సినిమాతో హీరోగా పరిచయం కావడం నా అదృష్టం’’ అన్నారు రుద్రా„Š . ‘‘సరికొత్త కథతో రూపొందిన చిత్రమిది. గణేష్‌గారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను’’ అన్నారు శ్రీపతి కర్రి. -
వాట్సాప్‌లో ఉన్నావా.. లేదు అమీర్‌పేట్‌లో..
‘నీ దగ్గర అంతుందేంట్రా అంటే... అంతులేనంత’ అంటున్నాడు సుడిగాలి సుధీర్. ‘ఫోటోలు పంపిస్తాను వాట్సాప్‌లో ఉన్నావా అని అడిగితే.. లేదంకుల్ అమీర్‌పేటలో ఉన్నాను’ అంటూ అమాయకంగా చెబుతున్నాడు. ఇవన్నీ అతడి తొలి చిత్రం ‘సాఫ్ట్వేర్ సుధీర్’.లోని డైలాగులు. ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. తనకు అలవాటైన పంచ్ డైలాగులు, డాన్స్‌తో సుధీర్ అదరగొట్టాడు. పనిలో పనిగా ఫైటింగ్‌లు చేసేశాడు. సుధీర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ట్రైలర్ ఉంది. సుధీర్‌కు జోడిగా ‘రాజుగారి గది’ ఫేమ్ ధన్యా బాలకృష్ణ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పారిశ్రామికవేత్త కె.శేఖర్ రాజు నిర్మించిన ఈ సినిమాను డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. నాజర్, సాయాజి షిండే, ఇంద్రజ, పృథ్విరాజ్, ఎన్.శివప్రసపాద్, గద్దర్ తదితరులు ఈ పాత్రల్లో నటించారు. (చదవండి: ఫిల్మ్ చాంబర్లోకి రానిస్తారా అనుకున్నా) -
ఫిల్మ్ చాంబర్లోకి రానిస్తారా? అనుకున్నా
‘జబర్దస్త్, ఢీ, పోవే పోరా’ వంటి టెలివిజన్ షోస్ ద్వారా ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘సాఫ్ట్వేర్ సుధీర్’. ‘రాజుగారి గది’ ఫేమ్ ధన్యా బాలకృష్ణ హీరోయిన్. రాజశేఖర్ రెడ్డి పులిచర్లని దర్శకుడిగా పరిచయం చేస్తూ శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పారిశ్రామికవేత్త కె.శేఖర్ రాజు నిర్మించారు. డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ– ‘‘ఒక ట్రెండీ కంటెంట్‌తో సాఫ్ట్వేర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రమిది. వినోదంతో పాటు వాణిజ్య అంశాలున్నాయి. సినిమా ఔట్పుట్ బాగా వచ్చింది. సుధీర్ ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఒక ఫీస్ట్‌లా ఉంటుంది’’ అన్నారు. ‘‘సుధీర్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఒప్పుకున్నాను’’ అన్నారు ధన్యా బాలకృష్ణ. ‘‘నాకిది మొదటి సినిమా అయినా పూర్తి సహకారం అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. మా సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు కె. శేఖర్ రాజు. సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ– ‘‘పదేళ్ల కిందట హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ చాంబర్ ముందుగా వెళ్తూ.. మనల్ని లోపలికి రానిస్తారా? లేదా? అనుకున్నాను. అలాం టిది ఇవాళ నా ఫస్ట్ సినిమా ప్రెస్‌మీట్ ఇక్కడ జరగడానికి ఆ దేవుడు, మా అమ్మానాన్నల ఆశీర్వాదమే కారణం అనుకుంటున్నాను. మార్చి 20న నా రెండు సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యాయి. నాకు ఇష్టమైన రజినీకాంత్, పవన్ కల్యాణ్గార్లను ‘సాఫ్ట్వేర్ సుధీర్’ చిత్రంలో అనుకరించా’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సి.రామ్‌ప్రసాద్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
వేసవిలో క్రైమ్ కామెడీ
రుద్రాక్ష , ధన్యా బాలకృష్ణ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హల్చల్’. శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై గణేష్ కొల్లురి నిర్మించిన ఈ సినిమా సెన్సార్‌కి సిద్ధమవుతోంది. గణేష్ కొల్లురి మాట్లాడుతూ– ‘‘క్రైమ్ కామెడీ జోనర్లో తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకులను మెప్పించేలా తీర్చిదిద్దారు శ్రీపతి. మా బ్యానర్‌కు మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది. అనుకున్న ప్లానింగ్, బడ్జెట్లో సినిమాను పూర్తి చేశాడు దర్శకుడు. హనుమాన్, భరత్ చక్కటి సంగీతం అందించారు. రాజ్ తోట అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఈ వేసవికి సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. కృష్ణుడు, మధునందన్ ఇతర పాత్రల్లో నటించారు. -
‘నలుగురు అమ్మాయిల కథ’ మూవీ స్టిల్స్
-
గోవా వెళ్తున్న నలుగురు అమ్మాయిల కథ!
బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ పతాకంపై బాలు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా హిమబిందు వెలగపూడి ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రిధా చౌదరి, ధన్య బాలకృష్ణ, సిద్ధీ ఇద్నాని, కోమలి ప్రసాద్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. ఫిబ్రవరి రెండో వారంలో కీలక సన్నివేశాలు, పాటల, పోరాట దృశ్యాల చిత్రీకరణకు చిత్రబృందం గోవా వెళ్లనుంది. ఈ సందర్భంగా దర్శకుడు బాలు మాట్లాడుతూ... ‘మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. స్వతంత్ర్య భావాలున్న నలుగురి జీవితాల్లో ఏం జరిగిందన్న విషయాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించాం. ఈ నెల రెండో వారంలో గోవాలో మొదలు కానున్న సెకండ్ షెడ్యూల్ లో రెండు పాటలు, కీలక సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మార్చిలో హైదరాబాదులో మూడో షెడ్యూల్ ప్లాన్ చేశాం. మే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కథానుగుణంగా వచ్చే మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’ అన్నారు. -
నలుగురమ్మాయిల కథ
బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా హిమబిందు వెలగపూడి నిర్మిస్తున్న చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సినీ మీడియా రంగంలో రిపోర్టర్‌గా పని చేసిన బాలు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాలు మాట్లాడుతూ– ‘‘స్వతంత్ర భావాలున్న నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. త్రిదా చౌదరి, ధన్యా బాలకృష్ణ. సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాలో కథానుగుణంగా ఉండే ట్విస్ట్‌లు ప్రేక్షకులనుఆకట్టుకుంటాయి’’ అన్నారు. ‘‘ఈ రోజు నుండి తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది. తదుపరి షెడ్యూల్‌ను గోవాలో ఫిబ్రవరిలో ప్రారంభిస్తాం. మేలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు హిమబిందు. ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, సహనిర్మాతలు: రాధికా శ్రీనివాస్ వెత్షా, ఉమా కూచిపూడి. -
కీరవాణిగారు గుర్తుకొస్తారు!
రుద్రా„Š, ధన్యా బాలకృష్ణ జంటగా నటించిన చిత్రం ‘హల్చల్’. శ్రీపతి కర్రి దర్శకత్వంలో శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై గణేష్ కొల్లూరి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను నిర్మాతలు రాజ్ కందుకూరి, ‘మధుర’ శ్రీధర్, సంగీత దర్శకుడు రఘు కుంచె, డైరెక్టర్ క్రాంతి మాధవ్ విడుదల చేశారు. శ్రీపతి కర్రి మాట్లాడుతూ– ‘‘హల్చల్ అనే డ్రగ్ బ్లెండర్ స్టోరీ. కేవలం డ్రగ్స్ అంశాలే ఉండవు. సెంటిమెంట్, కామెడీ, యాక్షన్, లవ్.. అన్నీ ఉంటాయి. గణేష్ కొత్త నిర్మాతైనా రాజీ పడకుండా సపోర్ట్ చేశారు’’ అన్నారు. ‘‘నా నమ్మకాన్ని శ్రీపతి వమ్ము చేయలేదు. హనుమాన్ మంచి సంగీతం ఇచ్చారు. పాటలు వింటుంటే కీరవాణిగారు గుర్తుకొస్తారు. త్వరలో సినిమా రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు గణేష్ కొల్లూరి. ‘‘క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న నాకు హీరోయిన్గా అవకాశమిచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు ధన్య. ‘‘16 ఏళ్ల కష్టం తర్వాత హీరో అవ్వాలనే నా కోరిక ‘హల్చల్’తో నెరవేరింది’’ అన్నారు రుద్రా„Š . -
వినోదం పక్కా
వినోదమే ప్రధానంగా తెరకెక్కిన చిత్రం ‘తను..వచ్చెనంట’. తేజ కాకుమాను, రేష్మీ గౌతమ్, ధన్యా బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో వెంకట్ కాచర్ల దర్శకత్వంలో శ్రీ అచ్యుత ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మించారు. రవిచంద్ర స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. చిత్రం లోగోను సీనియర్ పాత్రికేయులు వినాయకరావు, పాటల సీడీని నిర్మాతలు బీఏ రాజు, కె.రాఘవేంద్రరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ శీను ఆవిష్కరించారు. అనంతరం చిత్ర దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఇటీవల ప్రేమకథలు, హారర్, కామెడీ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ప్రేక్షకులకు నవ్వులు పంచాలనే ఉద్దేశంతో వినోదమే ప్రధానంగా ఈ చిత్రం నిర్మించాం. ఇందులో పలు ట్విస్ట్‌లు ఉంటాయి’’ అని చెప్పారు. ‘‘ఇప్పటికే మా చిత్రానికి మంచి బిజినెస్ జరిగింది. రాఘవేంద్రరెడ్డిగారు మమ్మల్ని ముందుకు నడిపించారు. ఈ నెలాఖరులో సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాత చెప్పారు. తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, సహ నిర్మాత యశ్వంత్, పాటల రచయిత్రి డా. చల్లా భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వినోదమే ప్రధానంగా ...
వినోదమే ప్రధానంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తను.. వచ్చెనంట’. తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, ధన్యా బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో వెంకట్ కాచర్ల దర్శకత్వంలో చంద్రశేఖర్ ఆజాద్ నిర్మిస్తున్నారు. టాకీ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రచయిత, దర్శకుడు బీవీయస్ రవి విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రేమ కథలతో పాటు, హారర్, కామెడీ సినిమాల హవా ప్రస్తుతం కొనసాగుతోంది. సెంటిమెంట్ ఉండే కథలను కూడా ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఈ చిత్రకథ, కథనం కొత్తగా ఉంటాయి. వినోద ప్రధానంగా సాగుతుంది. మిగిలిన మూడు పాటల చిత్రీకరణను త్వరలోనే పూర్తి చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బెక్కం రవీందర్, కెమేరా: రాజ్‌కుమార్, సంగీతం: రవిచంద్ర, సహ నిర్మాతలు: లావు శ్రీమన్నారాయణ, పి.యశ్వంత్. -
ఒక్క రోజులో..!
అప్పటివరకూ ఆడుతూ పాడుతూ హాయిగా సాగిన ఆ కుర్రాడి జీవితం ఒక్క రోజులో ఘాట్రోడ్టులా మలుపులు తిరిగింది. ఆ రోజు ఏం జరిగింది? ఆ మలుపులు అతని ప్రయాణాన్ని ఎంత దాకా తీసుకెళ్లాయి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘భలే మంచి రోజు’. సుధీర్‌బాబు, వామిక జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్‌కుమార్, శశిధర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ‘‘ఈ సినిమాలో కొత్త సుధీర్‌ను చూస్తారు’’ అని దర్శకుడు అన్నారు. ‘‘డిఫరెంట్ జానర్లో సాగే కామెడీ కథాంశంతో తెరకెక్కించాం’’ అని సుధీర్‌బాబు అన్నారు. ‘ఉత్తమ విలన్’ కెమెరామన్ శ్యామ్‌దత్ ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. -
ఫస్ట్‌క్లాస్‌గా... సెకండ్ హ్యాండ్
‘‘ఈ టైటిల్ ‘సెకండ్ హ్యాండ్’ అయినా పాటలు, ట్రైలర్స్ మాత్రం ఫస్ట్‌క్లాస్‌గా ఉన్నాయి. బీవీయస్ రవి నాకు రెండేళ్లుగా తెలుసు. మంచి రచయిత, క్రియేటివ్‌గా ఆలోచిస్తాడు. తనకున్న ప్రతిభను 10 శాతం వినియోగించినా ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుంది’’ అన్నారు రామ్‌గోపాల్‌వర్మ. సుధీర్‌వర్మ, ధన్య బాలకృష్ణన్, కిరీటి, అనూజ్రామ్ ముఖ్య తారలుగా మల్టీడైమన్షన్ ప్రై. లిమిటెడ్ సమర్పణలో పూర్ణనాయుడు నిర్మించిన చిత్రం ‘సెకండ్ హ్యాండ్. బీవీయస్ రవి సహనిర్మాత. కిషోర్ తిరుమల దర్శకుడు. రవిచంద్ర స్వరపరచిన ఈ చిత్రం పాటలను, ప్రచార చిత్రాలను రామ్‌గోపాల్‌వర్మ ఆవిష్కరించారు. ‘‘నేను నటించిన ‘నేను మీకు తెలుసా’కి రచయితగా చేసిన కిషోర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. మంచి టాలెంట్ ఉన్నవాడు’’ అని మనోజ్ చెప్పారు. ‘‘ఈ సినిమా కోసం సింగిల్ టేక్‌లో తీసిన పాట చాలా క్వాలిటీగా ఉంది’’ అని హరీష్‌శంకర్ తెలిపారు. బీవీయస్ రవి మాట్లాడుతూ -‘‘ఈ చిత్రాన్ని కిషోర్ అద్భుతంగా తీశాడు. అతని సోదరుల్లో ఒకరు సంగీతదర్శకుడిగా, మరొకరు ఛాయాగ్రాహకుడిగా చేశారు’’ అని చెప్పారు. ఈ చిత్రంలో నటించడంపట్ల సుధీర్‌వర్మ, ధన్య బాలకృష్ణ, కిరీటి, అనూజ్రామ్ ఆనందం వ్యక్తం చేశారు.