Balaji Mohan & Dhanya Balakrishna Secret Marriage: Kalpika Ganesh Apologises - Sakshi
Sakshi News home page

Kalpika Ganesh: హీరోయిన్‌ సీక్రెట్‌ పెళ్లిపై నటి సంచలన వ్యాఖ్యలు.. ఊహించని ట్విస్ట్‌

Published Mon, Jul 3 2023 12:16 PM | Last Updated on Mon, Jul 3 2023 12:37 PM

Balaji Mohan, Dhanya Balakrishna Secret Marriage: Kalpika Ganesh Apologises - Sakshi

ధన్య బాలకృష్ణ, బాలాజీ మోహన్‌, కల్పికా గణేశ్‌

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, నేను శైలజ, యశోద, హిట్‌ వంటి చిత్రాలతో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న కల్పిక గణేశ్‌ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. సెలబ్రిటీలపై నిత్యం ఆరోపణలు గుప్పించే ఆమె ఆమధ్య హీరోయిన్‌ ధన్య బాలకృష్ణపైతో మాటల యుద్ధమే చేసింది. ధన్య.. పెళ్లై విడాకులు తీసుకున్న డైరెక్టర్‌ను సీక్రెట్‌గా పెళ్లాడిందని, అతడు మరెవరో కాదు, మారి డైరెక్టర్‌ బాలాజీ మోహన్‌ అంటూ గతేడాది డిసెంబర్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేసింది కల్పిక.

ఊహించని ట్విస్ట్‌
దీనిపై పెద్ద దుమారమే చెలరేగగా గతేడాది చివర్లో అదే నిజమని అంగీకరించాడు బాలాజీ మోహన్‌. అయితే తమ పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించిందంటూ కల్పికపై కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. ఈ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కల్పికా గణేశ్‌.. సదరు సెలబ్రిటీ జంటకు క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. 'ధన్య బాలకృష్ణ, బాలాజీ మోహన్‌.. మీపై తప్పుడు ఆరోపణలు చేసి మీ పరువుకు భంగం కలిగించినందుకు క్షమాపణలు చెప్తున్నాను.

తప్పుడు ఆరోపణలు.. క్షమాపణలు
నేను మీపై చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదు. మనస్ఫూర్తిగా మీకు, మీ కుటుంబానికి, అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఇక మీదట ధన్య, బాలాజీల గురించి ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడను' అని చెప్పుకొచ్చింది. అటు బాలాజీ మోహన్‌ కూడా మద్రాస్‌ హైకోర్టులో తన పిటిషన్‌ను వెనక్కు తీసుకున్నాడు. అయితే అంతకంటే ముందే న్యాయస్థానం కల్పికా క్షమాపణలు చెప్పిన వీడియోను సోషల్‌ మీడియాలో అలాగే ఉంచాలని ఆదేశించింది.


ధన్య బాలకృష్ణ

మారి డైరెక్టర్‌కిది రెండో పెళ్లి
బాలాజీ మోహన్, ధన్య బాలకృష్ణ 2020 జనవరి నెలలోనే వివాహం చేసుకున్నారు. బాలాజీ మోహన్‌కిది రెండో పెళ్లి. అతను ఇదివరకే తన చిన్ననాటి స్నేహితురాలు అరుణను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ‘మారి’, ‘మారి 2’, ‘వాయై మూడి పేసవుం’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు బాలాజీ. ధన్య బాలకృష్ణ ప్రధానంగా తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలలో పని చేస్తోంది. తెలుగులో ఆమె 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'కార్బన్', 'రాజు గారి గది' వంటి చిత్రాల్లో నటించింది.

చదవండి: హీరోయిన్‌కు దోశలు వేసిన సోనూసూద్‌.. ఆ హీరో ఫ్యాన్స్‌కు నచ్చలే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement