Kalpika Ganesh Reveals Dhanya Balakrishna Secret Marriage With Tamil Director, Deets Inside - Sakshi
Sakshi News home page

Kalpika Ganesh-Dhanya Balakrishna: పెళ్లయిన డైరెక్టర్‌తో ధన్య బాలకృష్ణ సీక్రెట్‌ పెళ్లి? నటి సంచలన కామెంట్స్‌

Published Tue, Dec 13 2022 7:16 PM | Last Updated on Tue, Dec 13 2022 7:53 PM

Kalpika Ganesh Reveals Dhanya Balakrishna Secret Marriage With Tamil Director - Sakshi

కల్పిక గణేశ్‌ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ప్రయాణం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి, పడిపడి లేచే మనసు చిత్రాలతో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె. ఇటీవలే సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద మూవీలో ముఖ్య పాత్ర పోషించింది కల్పిక. ఇదిలా ఉంటే ఈ మధ్య ఆమె తరచూ తన సహానటీనటులను టార్గెట్‌ చేస్తూ వారిపై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. అలా వివాదాలతో, ట్రోల్స్‌తో వార్తల్లో నిలుస్తున్న కల్పిక​ ఓ నటి గురించిన సంచలన విషయం బయపెట్టింది.

ప్రముఖ నటి, హీరోయిన్‌ ధన్య బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 7th సెన్స్‌, నేను శైలజ, జయ జానకి నాయక వంటి చిత్రాలల్లో నటిగా అలరించిన ఆమె ఈ మధ్య వెబ్‌ సిరీస్‌లో సైతం నటించింది. అల్లుడు గారు, లూసర్‌, రెక్కీ వంటి వెబ్‌ సిరీస్‌లో ఆమె హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే ఆమె ఓ పెళ్లై, విడాకులైన డైరెక్టర్‌ను వివాహం చేసుకుందంటూ షాకింగ్‌ విషయం బయటపెట్టింది నటి కల్పిక. రీసెంట్‌ తన యూట్యూబ్‌ చానల్లో ధన్య గురించి ఈ విషయం చెబుతూ ఆమె ఓ వీడియో విడుదల చేసింది.

అయితే కాపీ రైట్‌ ఇష్యూ కారణంగా యూట్యూబ్‌ ఈ వీడియోను డిలీట్‌ చేసింది. ఇక ఆ వీడియోలో కల్పిక మాట్లాడుతూ.. ‘ధన్య బాలకృష్ణ.. కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్‌ను ఈ ఏడాది జనవరిలో రెండో పెళ్లి చేసుకుంది. మొదటి నుంచి ఆమె చెన్నై వెళ్లినప్పుడల్లా బాలాజీ మోహన్‌తోనే ఉండేది. అయితే అప్పటికే బాలాజీకి పెళ్లయి భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. తమిళంలో సినిమాలు చేస్తున​ క్రమంలో బలాజీతో ఆమె పరిచయం అయ్యింది. అది కాస్తా ప్రేమగా మారడంతో వారిద్దరు సీక్రెట్ గా వివాహం చేసుకొని కాపురం కూడా పెట్టేశారు. వీరిద్దర పెళ్లయి ఏడాది కావోస్తోంది. అయినా ఇప్పటికీ తమ రిలేషన్‌ను వారు బయటకు చెప్పేందుకు ఇష్టపడటం లేదు. 

అయితే వారి పెళ్లి విషయం తెలిసి ధన్య గురించి నాకు భయం వేసింది. అతడు ఆమె టార్చర్‌ పెడతాడామో అని అనుకున్నా. కానీ, వారిద్దరు చాలా ఆన్యోన్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇప్పుడు చెప్పడానికి ఓ కారణం ఉంది. ధన్య మూవీ ప్రమోషన్స్‌కి రావడం లేదు. ఈ విషయంలో బాలాజీ ఆమెను ఇబ్బంది పెడుతున్నాడెమో అనిపించింది. అందుకే నేను ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే కాపీ రైట్‌ ఇష్యూ కారణంగా యూట్యూడ్‌ ఈ వీడియోను డిలీట్‌ చేసింది. అయితే ఇది డైరెక్టర్‌ బలాజీనే వీడియోను డిలిట్‌ చేయించారని ఆరోపిస్తు ఆమె తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేయడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement