![Vikram Aparichithudu Movie Re Release On May 17th](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/05/13/aparichitudu-movie-re-relea.jpg.webp?itok=GZXpbn7S)
గత కొన్నాళ్ల నుంచి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. కొత్త సినిమాలు సరిగా ఆడకపోయేసరికి హిట్ చిత్రాల్ని మళ్లీ థియేటర్లకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో 'అపరిచితుడు' చేరింది. విక్రమ్, సదా జంటగా నటించిన ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. విక్రమ్‌ను మూడు ఢిఫరెంట్ షేడ్స్‌లో అద్భుతంగా ఈ చిత్రంలో శంకర్ చూపించారు. హాలీవుడ్ చిత్రాలకు దీటుగా తెరకెక్కించారు.
(ఇదీ చదవండి: అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్)
2005లో తెలుగులో ఓ అనువాద చిత్రంలా కాకుండా స్ట్రెయిట్ మూవీలానే విడుదలై బయ్యర్లకు వసూళ్ల వర్షం కురిపించింది. కథ, కథనాలు, దర్శకుడి స్టైలిష్ దర్శకత్వం, నటుడు విక్రమ్ నటనా ప్రతిభ ప్రేక్షకలను విపరీతంగా ఆకట్టుకుంది. మల్టీపుల్ పర్సనాలిటీ డిజాస్టర్ కారణంగా మామూలు మనిషి సూపర్ హీరోగా మారి సమాజంలో జరుగుతున్న అరాచకాలను, కాలరాస్తూ, తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా నరకాన్ని అనుభవించేలా శిక్షలు వేసే పాత్రలో నటుడు విక్రమ్ నటన గురించి ఎంత చెప్పినా చాలదు.
ఇకపోతే ఫ్రెంచ్ భాషలోకి డబ్ అయిన తొలి ఇండియన్ చిత్రం అపరిచితుడు కావడం విశేషం. అలాంటి ఈ సినిమాని ఇప్పుడు మళ్లీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు 700 థియేటర్లలో విడుదలకు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులు కూడా కాస్త ఆసక్తి చూపిస్తున్నారు.
(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్)
![](/sites/default/files/inline-images/aparichitudu-movie.jpg)
Comments
Please login to add a commentAdd a comment