breaking news
Aparichitudu
-
సినిమాను శాసించే సైకాలజీ.. అందుకే ఇవన్నీ హిట్
సైకాలజీ ఆధారిత సినిమాలు మానసిక ఆరోగ్య సమస్యల గురించి అవగాహన పెంచడంలో సహాయపడతాయి. వాటిని సమాజంలో చర్చించడానికి ఒక వేదికను అందిస్తాయి. ఒక వ్యక్తి చేస్తున్న పనుల వెనుక దాగిఉన్న సైకాలజీ ఏంటి అనేది అంత ఈజీగా ఎవరూ కనిపెట్టలేరు. ఒక్కోసారి వారు హత్యలు చేయవచ్చు లేదా ప్రాణ భయంతో బయటి ప్రపంచానికి దూరంగా ఉంటూ నేరాలు చేయవచ్చు. ఇలాంటి నిజజీవిత ఘటనలతో చాలా సినిమాలు వచ్చాయి. చైల్డ్ కౌన్సిలింగ్, సైకాలజికల్ థ్రిల్లర్, న్యూరోసైకాలజీ, క్లినికల్ సైకాలజీ ఇలా ఏదో ఒక మానసిక సమస్యను తీసుకుని కమర్షియల్ స్టైల్లో వెండితెరపై దర్శకులు చూపిస్తున్నారు. ఇలాంటి కథల వైపే ప్రేక్షకులు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా మలయాళ చిత్రాలు ఎక్కువగా ఇలాంటి కాన్సెప్ట్‌తోనే వస్తుంటాయి. నేటి సినిమాలను సైకాలజీ కథలే శాసిస్తున్నాయి. వాటి విజయాల శాతం కూడా చాలా ఎక్కువగానే ఉంటంది.విక్రమ్- శంకర్ కాంబినేషన్లో వచ్చిన అపరిచితుడు సినిమా సైకాలజీకి బలమైన సంబంధం ఉంది. ఈ చిత్రం ప్రధానంగా డిస్సోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ (Dissociative Identity Disorder – DID) అనే మానసిక సమస్య చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక వ్యక్తిలో బహుళ వ్యక్తిత్వాలు (multiple personalities) ఉత్పత్తి కావడం వల్ల కలిగే పరిస్థితి. అపరిచితుడు లాంటి వ్యక్తులు ప్రపంచంలో సుమారు 1.5 శాతం ఉన్నారని ఒక సర్వే పేర్కొంది."అపరిచితుడు"లో మూడు వ్యక్తిత్వాలు- ముఖ్య పాత్ర రామానుజం – ఒక న్యాయవాది, సమాజంలో జరుగుతున్న అవినీతిని ఎదుర్కొంటూ మానసికంగా క్షోభకు లోనవుతాడు.- అపరిచితుడు – అతని లోపల ఉన్న కోపం, న్యాయం కోసం పోరాటం, సమాజంపై విసుగు కలగజేసే వ్యక్తిత్వం.- రెమో – అతని లోపలున్న సరదా, ప్రేమను వ్యక్తపరచే వ్యక్తిత్వం.ఈ మూడు వ్యక్తిత్వాలు ఒకే వ్యక్తిలో ఉండటం, అతను వాటిని గుర్తించకపోవడం వల్ల సమాజంలో మంచి లేదా చెడు ఏదైనా జరగవచ్చని వైద్యులు చెప్తారు. అలాంటి వారికి మానసిక చికిత్స అవసరం. అపరిచితుడులో విక్రమ్ పాత్ర రామానుజం సామాజిక అవమానాలు ఎదుర్కొంటే మరో వ్యక్తిత్వంలోకి వెళ్లి గరుడ పురాణం ఆధారంగా శిక్షలు వేస్తుంటాడు. ప్రేమలో నిరాకరణ రావడంతో రెమోలా మారిపోయి తన కోరిక తీర్చుకుంటాడు. అయితే, ఇలాంటి సైకాలజీ వ్యక్తిత్వం ఉన్న వారు నేటి సమాజంలో చాలామంది ఉన్నారు. విక్రమ్ సతీమణి శైలజ (సైకాలజిస్ట్) కావడంతో ఆమె సలహాలు తనకు బాగా ఉపయోగపడ్డాయి. దీంతో సులువుగా మూడు వ్యక్తిత్వాలను వేరుగా ప్రదర్శించగలిగాడు. ఇది సినిమా సైకాలజీకి నిజమైన గౌరవం ఇచ్చిన అంశమని చెప్పవచ్చు.క్లినికల్ సైకాలజీతో 'గజిని'గజిని సినిమాకు సైకాలజీతో చాలా దగ్గరి సంబంధం ఉంది. ఈ చిత్రం మొత్తం అన్తెగ్రేడ్ అమ్నీషియా (Anterograde Amnesia) అనే మానసిక సమస్య చుట్టూ తిరుగుతుంది. దీంతో ఇబ్బంది పడేవారు వ్యక్తి గత సంఘటనలను మాత్రమే గుర్తుపెట్టుకోగలడు. కానీ, కొత్త సమాచారం, కొత్త సంఘటనలను మెమరీలో నిల్వ చేయలేడు. అంటే, అతను కొత్తగా జరిగే విషయాలను కొద్ది నిమిషాలకే మర్చిపోతాడు. గజినిలో సంజయ్ రామస్వామి పాత్రలో హీరో పరిస్థితి కూడా ఇంతే ఉంటుంది. తన ప్రేయసి కల్పనను హత్య చేసిన వ్యక్తిని గుర్తుపెట్టుకోవడానికి ఫోటోలు, టాటూలు, నోట్లు వంటివి ఉపయోగిస్తాడు. మానసికంగా తాను మర్చిపోకుండా ఉండేందుకు ఉపయోగించే పద్ధతులే ఇవి. ఇలా ఇబ్బంది పడేవారు చాలామందే ఉన్నారు. వారు పాటించే విధానం కూడా ఇదే తరహాలో ఉంటుంది. క్లినికల్ సైకాలజీలో ట్రామా తర్వాత వ్యక్తి ఎలా స్పందిస్తాడో అర్థం చేసుకోవడం చాలా కష్టమని చెప్పవచ్చు. గజిని సినిమా ఒక మానసిక సమస్యను కమర్షియల్ స్టైల్లో చూపించి భారీ హిట్ అందుకున్నారు.చైల్డ్ హుడ్ ఫోబియా, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌తో భగవంత్ కేసరిసైకాలజీకి చాలా దగ్గరగా ఉండే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అనే అంశంతో భగవంత్ కేసరి చిత్రం వచ్చింది. ఈ సినిమా 71వ జాతీయ చలన చిత్ర అవార్డులలో భాగంగా ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. - ఎడ్యుకేషనల్ సైకాలజీలో పిల్లలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగానే వారి వయసును భట్టి వారికి అర్థం అయ్యేలా ఈ విషయం గురించి తెలపాలి. పిల్లల భద్రతను, భావోద్వేగాలను, వ్యక్తిత్వాన్ని పరిరక్షించేందుకు ఇది ఒక సైకాలజికల్ టూల్లా ఉపయోగపడుతుంది. చైల్డ్ హుడ్ ఫోబియా (Childhood Phobia)తో కథానాయిక విజయలక్ష్మి (విజ్జి) చిన్నతనంలో జరిగిన సంఘటనల వల్ల ఆర్మీలో చేరే విషయంలో భయం కలిగి ఉంటుంది. ఈ భయాన్ని అధిగమించేందుకు సైకాలజిస్ట్ డాక్టర్ కాత్యాయనీ పాత్రను ప్రవేశపెట్టడం, మానసిక చికిత్స (therapy) ప్రాధాన్యతను చూపిస్తుంది. ఈ కాన్సెప్ట్‌లో వచ్చే సీన్లు మనకు కూడా ఆసక్తిని కలిగిస్తాయి.రాక్షససుడుకి సైకాలజీతో సంబంధంరాక్షససుడు సినిమా కథలో ఒక సైకో కిల్లర్ స్కూల్ వయస్సు అమ్మాయిలను టార్గెట్ చేస్తూ వరుస హత్యలు చేస్తుంటాడు. హీరో అరుణ్ (SI) ఈ కేసును చేధించే క్రమంలో, అతను ఈ నేరాలు ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తి చేస్తున్నట్లు గుర్తిస్తాడు. సైకోపతీ (Psychopathy) నేరస్తుడు ఎమోషనల్ ఎంపతీ లేకుండా, ప్లానింగ్‌తో హత్యలు చేస్తాడు. అరుణ్ నేరస్తుడి మానసిక స్థితిని అర్థం చేసుకొని, అతని ప్రవర్తన ఆధారంగా కేసును చేధిస్తాడు. ఈ సినిమా సైకాలజీ, నేర పరిశోధన, మానవ ప్రవర్తన అంశాలను మనకు గుర్తుచేస్తాయి. ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ భారీ విజయాన్ని అందుకున్నారు.సైకాలజీతో హిట్హిట్ సినిమా కథలో SP అర్జున్ సర్కార్ అనే పోలీస్ అధికారి, ఒక పెడోఫైల్ను హత్య చేసి, ఆ కేసును తానే విచారించాల్సిన పరిస్థితిలో పడతాడు. అతని ప్రవర్తన, హత్యల పద్ధతులు, మానసిక స్థితి వంటి అంశాలు అన్ని కూడా సైకాలజీతో ముడిపడే ఉంటాయి. ఇందులో నాని పాత్ర చేసే చర్యలు సైకోపతిక్ టెండెన్సీలు, ట్రామా-బేస్డ్ బిహేవియర్‌ను సూచిస్తాయి. అంటే తనే నేరం చేసి మరో నేరస్థుడిని పట్టుకోవడం. ఈ మూవీ కూడా సైకాలజీ కాన్సప్ట్‌తో నిర్మించి ప్రేక్షకులను మెప్పించారు. ఒక మనిషి జీవితం సైకాలజీతో చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఇలాంటి కథలు వెండితెరపైకి వచ్చినప్పుడు వాటిని ఆసక్తిగా గమనిస్తాడు.. ఒక్కోసారి తన చుట్టూ ఉండే వారి జీవితాలతో పోల్చి సరిచూస్తాడు కూడా.. ఈ కారణం వల్లే ఇలాంటి సైకాలజీ కథలు హిట్ అవుతున్నాయి.-సాక్షి వెబ్ ప్రత్యేకం -
నా భర్త మరణం.. మోహన్‌లాల్ తన బుద్ధి చూపించాడు: నటి
మలయాళ సీనియర్ నటి శాంతి విలియమ్స్ మోహన్‌లాల్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె తమిళ, మలయాళంలో వందకు పైగా సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో సహాయక పాత్రలు పోషించారు. అపరిచితుడు సినిమాలో విక్రమ్‌కు తల్లిగా కూడా నటించారు. తనకు 12 ఏళ్ల వయసు ఉండగానే చిత్రపరిశ్రమలో ఆమె అడుగుపెట్టారు. ఆమె 1979లో మలయాళీ కెమెరామెన్ జె. విలియమ్స్ ను వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. తన భర్త మరణం సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండగా దానిని మోహన్‌లాల్ తన స్వార్థానికి ఉపయోగించుకున్నాడని ఆమె ఆరోపించారు.మలయాళ సినిమాల్లో ఒకప్పుడు సుపరిచితుడైన సినిమాటోగ్రాఫర్ జె విలియమ్స్‌ను వివాహం చేసుకున్న శాంతి, తన భర్త అనారోగ్యానికి గురైనప్పుడు కుటుంబం తీవ్ర పేదరికంలోకి నెట్టబడిందని, కానీ పరిశ్రమ నుండి ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. విలియమ్స్ 2005లో అనారోగ్యంతో మరణించారు. అయితే, ఆ సమయంలో మోహన్ లాల్‌తో జరిగిన ఒక సంఘటన గురించి శాంతి ఇలా అన్నారు, “ఒకప్పుడు నాకు తెలిసిన లాల్ నేటి సూపర్ స్టార్ కంటే చాలా భిన్నంగా ఉంటాడు. అప్పట్లో, అతనికి చిన్నపిల్లవాడి అమాయకత్వం ఉండేది. అతను మా ఇంటికి వచ్చి, మాతో ఎప్పుడూ మాట్లాడేవాడు. నవ్వుతూ అన్ని విషయాలు పంచుకునే మంచి వ్యక్తి. కానీ, అతను పాపులర్ అయిన తర్వాత అతని ప్రవర్తన మారిపోయింది. చాలా మంది ఇతరులు కూడా అదే చెప్తారు.లక్షల విలువైన కృష్ణుడి విగ్రహాన్ని తీసుకెళ్లాడుతన ఇంట్లో ఉండే కృష్ణుడి విగ్రహాన్ని మోహన్‌లాల్ ఎలా తీసుకెళ్లాడో శాంతి ఇలా చెప్పింది. "మా ఇంట్లో పది నుంచి పన్నెండు అడుగుల ఎత్తున్న కృష్ణుడి విగ్రహం ఉండేది. నేడు ఆ విగ్రహం మోహన్‌లాల్ ఇంట్లో ఉంది. నా భర్తకు ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాం. ఆ సమయంలో కృష్ణుడి విగ్రహాన్ని మేము సరిగ్గా నిర్వహించగలమో లేదోనని నా భర్తకు అనిపించింది. మా ఇంట్లో ఎయిర్ కండిషనర్ లేదని, పిల్లలకు ఇబ్బందిగా ఉందని మోహన్‌లాల్‌తో నా భర్త విలియమ్స్ చెప్పాడు. మా ఆర్థిక పరిస్థితిని లాల్ సద్వినియోగం చేసుకున్నాడు. లక్షల విలువైన కృష్ణుడి విగ్రహాన్ని తీసుకెళ్లి, బదులుగా తన ఆఫీసు నుండి పాత ఎయిర్ కండిషనర్ను మాకు ఇచ్చాడు. కేవలం పదిరోజుల తర్వాత అది రిపేయర్‌కు వచ్చింది. దీంతో మేము దానిని అమ్మినప్పుడు, మాకు రెండు వేల రూపాయలు మాత్రమే వచ్చాయి. నాకు చాలా బాధ కలిగించే విషయం ఏమిటంటే.., మేము మోహన్‌లాల్ కోసం చాలా చేసినప్పటికీ, నా భర్త మరణించినప్పుడు అతను రాలేదు. నేను దాని గురించి మాట్లాడే ప్రతిసారీ, నాలో కోపం ఉప్పొంగుతుంది. ఆకలితోనే నా పిల్లలు నిద్రపోయేవారునాకు నలుగురు పిల్లలు ఉన్నారనే విషయం మోహన్‌లాల్‌కు తెలుసు. విలియమ్స్ మంచం పట్టిన తర్వాత, కుటుంబాన్ని పోషించడానికి నేను డబ్బింగ్, నటన అంటూ తిరగాల్సి వచ్చింది. పిల్లలకు కడుపు నిండా ఆహారం లేని రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు వారు ఆకలితోనే నిద్రపోయేవారు. ఇప్పటివరకు నేను దీని గురించి ఎవరికీ చెప్పలేదు. అయితే, దర్శకుడు శంకర్ సార్ నా భర్త మరణించారని తెలుసుకొని రూ. 25వేలు సాయం చేశారు. ఏదైనా సాయం అవసరమైతే కాల్ చేయమని కూడా చెప్పారు. అయితే, మలయాళ పరిశ్రమ నుంచి ఏ ఒక్కరు కూడా సాయం చేయలేదు. కానీ, తమిళ పరిశ్రమ నుంచి కొందరు చేశారు. నా మాతృభూమి కేరళ, నేను మలయాళీని. అయినప్పటికీ నన్ను నేను అలా పిలుచుకోవడానికి సిగ్గుపడుతున్నాను. మా దగ్గర డబ్బున్న సమయంలో ఎందరికో సాయం చేశాం. కానీ, నా భర్త మరణించిన సమయంలో ఎవరూ కూడా పలకరించలేదు.' అని ఆమె అన్నారు. ప్రస్తుతం శాంతి పిల్లలు పెద్దవారయ్యరు. ఉద్యోగాలు చేస్తూ జీవితంలో సెటిల్ అయ్యారు. భర్త మరణం తర్వాత తనకు చిన్న పాత్ర వచ్చినా సరే చేస్తూ పిల్లలను చదివించారని అక్కడి పరిశ్రమ గురించి తెలిసిన వారు చెప్తారు. -
రజనీకాంత్ వదిలేసుకున్న అపరిచితుడు.. ఫస్ట్ హీరోయిన్ సదా కాదు!
దర్శకుడు శంకర్ ఇప్పుడంటే తడబడుతున్నాడు కానీ అద్భుతః అని చెప్పుకునే సినిమాలు గతంలో బోలెడు తీశాడు. రోబో, అపరిచితుడు, ఇండియన్, జీన్స్, శివాజీ.. ఇలా ఎన్నో కళాఖండాలు ఆయన సృష్టించినవే! వీటిలో అపరిచితుడు సినిమా వచ్చి జూన్ 17 నాటికి 20 ఏళ్లు పూర్తయింది. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యావత్ దేశాన్ని అల్లాడించేసింది. ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.🎥 తమిళ అన్నియన్ తెలుగులో అపరిచితుడు (Aparichitudu Movie)గా రిలీజైంది. విక్రమ్, సదా జంటగా నటించారు. దాదాపు రూ.26.38 కోట్ల బడ్జెట్‌తో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించారు.🎥 శంకర్ (Shankar Shanmugam) సినిమాలకు డైలాగ్స్, స్క్రీన్‌ప్లేలో స్టార్ రైటర్ సుజాత రంగరాజన్ భాగమే ఎక్కువగా ఉంటుంది. అపరిచితుడు కథ కూడా ఆయనే రాశారని ప్రచారం జరగ్గా.. అది తన కథే అని శంకర్ వెల్లడించాడు.🎥 ఎక్కడైనా హీరో డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం ఒకే మనిషి ముగ్గురి(రామానుజం, రెమో, అపరిచితుడు)లా కనిపిస్తాడు.🎥 దక్షిణాదిన అన్ని భాషల్లో రిలీజైన (హిందీలోనూ డబ్ అయింది) ఈ మూవీ 37 సెంటర్స్‌లో వంద రోజులు ఆడింది.🎥 అపరిచితుడు పబ్లిక్‌తో మాట్లాడే సీన్‌ను హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తీశారు.🎥 శంకర్ ఈ కథ మొదటగా రజనీకాంత్‌కు వినిపించాడు. ఆయన సారీ అనడంతో విక్రమ్ (Chiyaan Vikram.) దగ్గరకు వెళ్లినట్లు భోగట్టా!🎥 విక్రమ్ భార్య శైలజ సైకాలజిస్ట్. దీంతో సినిమాలో హీరోకున్న పర్సనాలిటీ డిజార్డర్ గురించి భార్యను అడిగి ఆ మూడు పాత్రలకు తగ్గట్లుగా తనను తాను మల్చుకున్నాడు విక్రమ్.🎥 హీరోయిన్గా కూడా జీన్స్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌ను అనుకున్నారు. కానీ బాలీవుడ్లో బిజీ అవడంతో కుదర్లేదు. సిమ్రాన్‌ను అడగ్గా అప్పుడే పెళ్లి పిక్స్ అవడంతో తనూ చేజార్చుకుంది. చివరగా జయంతో పెద్ద హిట్ కొట్టిన సదాకు ఈ అవకాశం వరించింది.🎥 ఏఆర్ రెహమాన్ లేకుండా సినిమా చేయని శంకర్.. ఈ చిత్రానికి రెహమాన్ శిష్యుడు హ్యారిస్ జైరాజ్‌ను తీసుకున్నాడు.🎥 ఫ్రెంచ్ భాషలో రిలీజైన తొలి దక్షిణాది చిత్రంగా నిలిచింది.🎥 ఫైట్ సన్నివేశం కోసం 120 కెమెరాలు ఉపయోగించిన తొలి భారతీయ చిత్రం.🎥 అపరిచితుడు మే 17, 2024లో రీరిలీజ్ అయింది.20 ఏళ్ల క్రితం లంచం, నిర్లక్ష్యం లేని సమాజాన్ని కోరుకున్న అపరిచితుడు కల ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది.చదవండి: చై-శోభితను పట్టించుకోని మహేశ్? వీడియోతో ఆన్సర్ దొరికేసింది! -
రెమో మళ్లీ వచ్చేస్తున్నాడు.. బుకింగ్స్ అదుర్స్!
స్టార్ డైరెక్టర్ శంకర్, విక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రం అపరిచితుడు. సదా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రభుత్వ అధికారుల్లో అవినీతి, అక్రమాల కథ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా 2005లో విడుదలై సూపర్‌హిట్‌ను సొంతం చేసుకుంది. ఆస్కార్ సినిమా బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రాన్ని రూ.20 కోట్లతో తెరకెక్కించగా.. రూ.60 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆ ఏడాది రిలీజైన అన్ని చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ రి రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాను మే 17వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.కాగా.. ఈ చిత్రంలో విక్రమ్, ప్రకాశ్ రాజ్ మధ్య సన్నివేశాలు అభిమానులను అలరించాయి. విక్రమ్ నటనా విశ్వరూపాన్ని ప్రేక్షకులు చూడగలిగారు. త్రిపాత్రాభినయంతో రెమో, అపరిచితుడు, బ్రాహ్మణుడిగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగు, తమిళ రాష్ట్రాల్లో రి రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగా.. ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఎన్నికల తర్వాత సరైనా సినిమా థియేటర్లో లేకపోవడంతో విక్రమ్ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తుందని ఆశిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు హరీశ్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. -
19 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అవుతున్న హిట్ సినిమా.. అదేంటంటే?
గత కొన్నాళ్ల నుంచి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. కొత్త సినిమాలు సరిగా ఆడకపోయేసరికి హిట్ చిత్రాల్ని మళ్లీ థియేటర్లకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో 'అపరిచితుడు' చేరింది. విక్రమ్, సదా జంటగా నటించిన ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. విక్రమ్‌ను మూడు ఢిఫరెంట్ షేడ్స్‌లో అద్భుతంగా ఈ చిత్రంలో శంకర్ చూపించారు. హాలీవుడ్ చిత్రాలకు దీటుగా తెరకెక్కించారు.(ఇదీ చదవండి: అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్)2005లో తెలుగులో ఓ అనువాద చిత్రంలా కాకుండా స్ట్రెయిట్ మూవీలానే విడుదలై బయ్యర్లకు వసూళ్ల వర్షం కురిపించింది. కథ, కథనాలు, దర్శకుడి స్టైలిష్ దర్శకత్వం, నటుడు విక్రమ్ నటనా ప్రతిభ ప్రేక్షకలను విపరీతంగా ఆకట్టుకుంది. మల్టీపుల్ పర్సనాలిటీ డిజాస్టర్ కారణంగా మామూలు మనిషి సూపర్ హీరోగా మారి సమాజంలో జరుగుతున్న అరాచకాలను, కాలరాస్తూ, తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా నరకాన్ని అనుభవించేలా శిక్షలు వేసే పాత్రలో నటుడు విక్రమ్ నటన గురించి ఎంత చెప్పినా చాలదు.ఇకపోతే ఫ్రెంచ్ భాషలోకి డబ్ అయిన తొలి ఇండియన్ చిత్రం అపరిచితుడు కావడం విశేషం. అలాంటి ఈ సినిమాని ఇప్పుడు మళ్లీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు 700 థియేటర్లలో విడుదలకు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులు కూడా కాస్త ఆసక్తి చూపిస్తున్నారు.(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్) -
రీరిలీజ్‌కు రెడీ అయిన అపరిచితుడు.. ఏకంగా 700 థియేటర్స్‌లో!
తమిళసినిమా: ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో రీ రిలీజ్‌ల కాలం నడుస్తోందనే చెప్పాలి. కొత్త చిత్రాలు ఆశించిన ప్రేక్షకాదరణ పొందకపోవడంతో రీ రిలీజ్ చిత్రాలే థియేటర్లను కాపాడుతున్నాయి. ఆ జాబితా లో అపరిచితుడు చిత్రం చేరుతోంది. నటుడు విక్రమ్, సదా జంటగా నటించిన తమిళ చిత్రం అన్నియన్ చిత్రానికి తెలుగు అనువాదం అపరిచితుడు. గ్రేట్ డైరెక్టర్ శంకర్ సృష్టి ఈ చిత్రం. నటుడు విక్రమ్‌ను మూడు ఢిఫరెంట్ షేడ్స్‌లో అద్భుతంగా ఈ చిత్రంలో శంకర్ చూపించారు. హాలీవుడ్ చిత్రాలకు దీటుగా తెరకెక్కించిన అపరిచితుడు చిత్రం 2005లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. తెలుగులో ఓ అనువాద చిత్రంలా కాకుండా ఒక భారీ నేరు చిత్రంలా విడుదలై బయ్యర్లకు వసూళ్ల వర్షం కురిపించింది. కథ, కథనాలు, దర్శకుడి స్టైలిష్ దర్శకత్వం, నటుడు విక్రమ్ నటనా ప్రతిభ ప్రేక్షకలను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పట్లోనే అత్యంత భారీ బడ్జెట్లో రూపొందిన అపరిచితుడు చిత్ర క్లైమ్యాక్స్ సన్నివేశాల కోసమే 120 కెమెరాలతో 270 డిగ్రీల రొటేషన్ ఫొటోగ్రఫీ టెక్నిక్‌తో చిత్రీకరించారు దర్శకుడు శంకర్. ఇదే టెక్నాలజీతో రూపొందిన హాలీవుడ్ చిత్రం మ్యాట్రిక్స్ కంటే అపరిచితుడు చిత్రాన్ని శంకర్ బ్రహ్మండంగా తెరకెక్కించారు. దాదాపు 200 మంది స్టంట్ కళాకారులతో చిత్రీకరించిన ఫైట్ దృశ్యాలను చూస్తుంటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తోంది. నెదర్లాండ్‌లోని పుష్పాల ఎగ్జిబిషన్లో చిత్రీకరించిన ఇందులోని పాట మరో హైలెట్. మల్టీపుల్ పర్సనాలిటీ డిజాస్టర్ కారణంగా మామూలు మనిషి సూపర్‌హీరోగా మారి సమాజంలో జరుగుతున్న అరాచకాలను, కాలరాస్తూ, తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా నరకాన్ని అనుభవించేలా శిక్షలు వేసే పాత్రలో నటుడు విక్రమ్ నటన గురించి ఎంత చెప్పినా చాలదు. అదేవిధంగా ఫ్రెంచ్ భాషలోకి అనువాదం అయిన తొలి ఇండియన్ చిత్రం అపరిచితుడు. కాగా అలాంటి అపరిచితుడు చిత్రం ఇప్పుడు మళ్లీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు 700 థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
సినిమాల్లో నటించి హిట్స్ కొట్టినా సరే కొందరు యాక్టర్స్ కనుమరుగైపోతుంటారు. కొన్నాళ్ల పాటు పూర్తిగా కనిపించకుండా పోతుంటారు. ఈ బ్యూటీ సేమ్ అలానే. తెలుగు, తమిళంలో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో బాలనటిగా చేసింది. ఆ తర్వాత పూర్తిగా ఒక్క భాషకే పరిమితమైపోయింది. ఇప్పుడేమో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు దివ్య నగేశ్. తమిళనాడుకి చెందిన ఈమె.. 'అపరిచితుడు' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో 'అరుంధతి'లో అనుష్క చిన్నప్పటి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. వీటితో మంచి ఫేమ్ వచ్చినప్పటికీ ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేస్తూ వచ్చింది.రీసెంట్గా తమిళంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన దివ్య నగేశ్.. తన కెరీర్ గురించి చెప్పుకొచ్చింది. అయితే అప్పట్లో ఈమెని బాలనటిగా చూసిన ప్రేక్షకులు.. ఇప్పుడు పూర్తిగా మారిపోయిన దివ్యని చూసి షాకవుతున్నారు. ఇద్దరూ ఒకరేనా కాదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నారు. మరి మీరేమైనా గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య) -
కథ నాది, మీకు హక్కు లేదు, అర్థం అవుతుందనుకుంటా: శంకర్
వరుస వివాదాలతో దర్శకుడు శంకర్ అల్లాడిపోతున్నారు. హీరో రామ్‌చరణ్‌తో శంకర్ సినిమాను అనౌన్స్ చేయగానే ‘కమలహాసన్‌తో తాము నిర్మిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాను పూర్తి చేయనిదే ఎక్కడికీ కదలడానికి లేదు’ అని లైకా ప్రొడక్షన్స్ కేసు నమోదు చేసింది. ఇది ఇలా ఉండగా, తమిళ చిత్రం ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’) హిందీ రీమేక్‌ను హీరో రణ్‌వీర్‌సింగ్‌తో చేయనున్నట్టు బుధవారం నాడు శంకర్ ప్రకటించడం మరో సంచలనమైంది. ఇప్పుడు ఆ ప్రకటన కూడా వివాదాస్పదమైంది. శంకర్ ప్రకటించి 24 గంటలు గడవకముందే అప్పట్లో ‘అన్నియన్’ చిత్రాన్ని నిర్మించిన ‘ఆస్కార్’ రవిచంద్రన్ ఆ కథ హక్కులు తనవి అంటూ ఘాటుగా లేఖ పంపారు. ఆ వెంటనే శంకర్ దానికి తన స్పందనగా మరో ఘాటైన ప్రత్యుత్తరం ఇచ్చారు. ఈ వివాదం సినీసీమలో గురువారం పెద్ద చర్చనీయాంశమైంది. నన్నడగకుండా ఎలా తీస్తారు? – ‘అన్నియన్’ నిర్మాత రవిచంద్రన్ ‘నా ఊహలకు తగ్గట్టు పవర్ఫుల్ హీరో దొరికాడు. హిందీలో నా ‘అన్నియన్ ’ అతనే’ అని దర్శకుడు శంకర్ ఇలా ప్రకటించారో, లేదో అలా వివాదం మొదలైంది. ‘‘నన్ను సంప్రదించకుండానే రీమేక్‌ని ప్రకటిస్తారా?’ అంటూ ‘అన్నియన్ ’ చిత్ర నిర్మాత ‘ఆస్కార్’ వి. రవిచంద్రన్ మండిపడ్డారు. దర్శకుడు శంకర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఓ లేఖను కూడా విడుదల చేశారు. ఆ లేఖ సారాంశం ఏమిటంటే... ‘‘మీరు (శంకర్) ‘అన్నియన్ ’ ఆధారంగా హిందీలో ఓ సినిమాను అనౌన్స్ చేయడం తెలిసి, షాక్ అయ్యాను. ‘అన్నియన్ ’కు నేను నిర్మాతని అని మీకు గుర్తుండే ఉంటుంది. ఈ స్టోరీ లైన్ పై పూర్తి స్థాయి హక్కులను రచయిత సుజాత (దివంగత రచయిత సుజాతా రంగరాజన్ )కు డబ్బు చెల్లించి నేను సొంతం చేసుకున్నాను. ఇందుకు ఆధారాలు కూడా నా వద్ద భద్రంగా ఉన్నాయి. ‘అన్నియన్ ’ స్టోరీలైన్ కు సంబంధించిన పూర్తి హక్కులు నావే. నా అనుమతి లేకుండా ఈ స్టోరీలైన్ తో రీమేక్ సినిమా చేయాలనుకోవడం చట్టరీత్యా నేరం. మీ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ సక్సెస్ కాకపోవడంతో ఆందోళనలో ఉన్న మీకు ‘అన్నియన్ ’కు దర్శకుడిగా అవకాశం ఇచ్చింది నేనే. ఈ సినిమా సక్సెస్ఫుల్ దర్శకుడిగా మీ స్టార్‌డమ్‌ను పెంచింది. ఇందులో ‘అన్నియన్ ’ నిర్మాతగా నా సపోర్ట్ ఉంది. కానీ ఇదంతా మరచిపోయి నన్ను సంప్రదించకుండానే మీరు హిందీ రీమేక్‌ను అనౌన్స్ చేశారు. ఎప్పుడూ నైతిక విలువలను పాటించే మీరు, మీ స్థాయిని తగ్గించుకునేలా ఇలా చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడడం నన్ను ఆశ్చర్యపరిచింది. ‘అన్నియన్ ’ హక్కులు నా దగ్గర ఉన్నాయి గనుక, హిందీ రీమేక్ ఆలోచనను విరమించుకోవాలని సలహా ఇస్తున్నా’’ అని పేర్కొన్నారు రవిచంద్రన్ . కథ... స్క్రీన్ ప్లే...డెరెక్షన్ నావి! – దర్శకుడు శంకర్ ‘అన్నియన్ ’ హక్కులు తనవేనంటూ ఓ బహిరంగ లేఖ విడుదల చేసిన నిర్మాత రవిచంద్రన్ కు దర్శకుడు శంకర్ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ‘‘ఆ ‘అన్నియన్ ’ కథ హక్కులు మీవి (రవిచంద్రన్) అంటూ... పంపిన మెయిల్ చూసి షాక్ అయ్యాను. కథ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై శంకర్ అనే టైటిల్‌తోనే ఆ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేను నేను ఎవరికి అప్పగించ లేదు. ఆ స్క్రిప్ట్ నిజానికి రచయిత సుజాత గారిదని మీరు అనడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆయన ఆ సినిమాకు డైలాగ్స్ మాత్రమే రాశారు. అందుకే, ఆయనకు సినిమాలో డైలాగ్ రైటర్‌గా క్రెడిట్ ఇవ్వడం జరిగింది. డైలాగ్స్ మినహా... ‘అన్నియన్ ’ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, హీరో క్యారెక్టరైజేషన్ ఇలా దేనిలోనూ సుజాత గారి ప్రమేయం లేదు. ‘అన్నియన్ ’కు దర్శకుడిగా నాకే కాదు. నిర్మాతగా మీకూ పేరు వచ్చింది. నిర్మాతగా సినిమా స్క్రిప్ట్‌పై మీకు హక్కు లేదు. నిరాధారమైన ఆరోపణలను ఇకనైనా మానుకోండి. మీరు చెబుతున్న అవాస్తవాలు నా భవిష్యత్ ప్రాజెక్ట్స్‌ను ప్రభావితం చేయవు. నా వివరణ మీకు పాజిటివ్‌గానే అర్థం అవుతుందని అనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు శంకర్. కమల్ వస్తే... శంకర్ రెడీనే! ‘అన్నియన్’ వివాదం ఇలా ఉండగా... ‘ఇండియన్ 2’ను పూర్తి చేయకుండా, శంకర్ మరో సినిమాను డైరెక్షన్ చేయకూడదని కోరుతూ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బుధవారం విచారణ జరిగింది. శంకర్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదిస్తూ, ‘‘లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు ఆరోపించినట్లు ‘ఇండియన్ 2’ను శంకర్ మధ్యలో వదిలేయలేదు. ఆ సినిమా షూటింగ్‌కు విదేశీ సాంకేతిక నిపుణులు కావాలి. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితులకు అనుగుణంగా ఫారిన్ టెక్నీషియన్స్‌తో షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టడం అంత ఈజీ కాదు. ఇండియాలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న పెద్ద డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌ను రెండేళ్ళుగా ఓ ప్రొడక్షన్ హౌస్ ఖాళీగా ఉంచడం కరెక్ట్ కాదు. జూన్‌లో కూతురి పెళ్ళి పెట్టుకున్నప్పటికీ, కమల్‌హాసన్ గనక షూటింగ్‌కు వస్తే ‘ఇండియన్ 2’ను పూర్తి చేయడానికి శంకర్ సిద్ధంగానే ఉన్నారు’’ అని కోర్టుకు విన్నవించుకున్నట్లు కోడంబాకమ్ సమాచారం. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘ఇండియన్ ’. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ను అనౌన్స్ చేశారు శంకర్. తొలిపార్టులో హీరోగా నటించిన కమల్‌హాసనే మలిపార్టులో కూడా హీరోగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఆ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం జరగడం, కమల్ హాసన్ మొన్నటివరకు రాజకీయంగా బిజీగా ఉండటంతో ఇప్పటికే 60 శాతం దాకా పూర్తయిన ‘ఇండియన్ 2’కు బ్రేక్ పడింది. -
క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన శంకర్..16 ఏళ్ల తర్వాత మళ్లీ...
ప్రముఖ దర్శకుడు శంకర్, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కలయికలో ఓ చిత్రం రాబోతుందని గత కొద్దిరోజులుగా గుసగుసలు వినబడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై శంకర్ అఫిషియల్‌గా అనౌన్స్ చేశాడు. తన కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయిన ‘అపరిచితుడు’ మూవీని హిందీలో రీమేక్ చేయబోతున్నానని ప్రకటించారు. ‘ఈ సమయంలో నా కంటే ఆనందంగా ఉండే వ్యక్తి మరొకరు ఉండరు. రణ్వీర్ సింగ్‌తో సూపర్ హిట్ చిత్రం ‘అన్నియన్’ రీమేక్‌ని తెరకెక్కిస్తుండటం గొప్ప అనుభూతిని పంచుతోంది’ అని శంకర్ ట్వీట్ చేశాడు. కాగా, 2005లో విక్రమ్ హీరోగా తమిళం ‘అన్నియన్’, తెలుగులో ‘అపరిచితుడు’గా వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో శంకర్ దశ మారిపోయింది. ఈ మూవీ తర్వాత తెలుగులో కూడా శంకర్‌కు మంచి మార్కెట్ ఏర్పడింది. ఇదే సినిమాని హిందీలో కూడా విడుదల చేశారు కానీ, అక్కడ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ‘అపరిచితుడు’ని బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయడం చేయనున్నాడు. పాత్ర పాతదే అయినప్పటీకి కథలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కొత్త తరహా కథలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. పెన్ మూవీస్ బ్యానర్‌పై జయంతిలాల్ నిర్మించబోతున్న ఈ సినిమా షూటింగ్ 2022 లో ప్రారంభం కాబోతున్నట్లు శంకర్ ప్రకటించాడు. 2023లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. శంకర్ ప్రస్తుతం కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’తో పాటు రామ్ చరణ్‌తో చేయనున్న మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాతే ‘అన్నియన్’ హిందీ రీమేక్ ప్రారంభించనున్నాడు. In this moment, no one will be happier than me, bringing back the larger than life cinematic experience with @RanveerOfficial in the official adaptation of cult blockbuster Anniyan.@jayantilalgada @PenMovies pic.twitter.com/KyFFTkWGSL — Shankar Shanmugham (@shankarshanmugh) April 14, 2021 -
హిందీలో అపరిచితుడు! హీరో ఎవరంటే?
క్రిమి భోజనం.. కుంభీపాకం... అన్యాయం చేసినవారికి అపరిచితుడు వేసిన శిక్షలివి. ఇవే కాదు.. ఇంకా బోలెడన్ని శిక్షలు విధిస్తాడు. విక్రమ్ కెరీర్లో ఎప్పటికీ చెప్పుకోదగ్గ ‘అపరిచితుడు’లోని ఈ శిక్షలు గుర్తుండే ఉంటాయి. శంకర్ దర్శకత్వంలో 2005లో ‘అన్నియన్’ పేరుతో తమిళంలో రూపొంది, తెలుగులో ‘అపరిచితుడు’గా విడుదలైంది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన రామానుజం మల్టిపుల్ పర్సనాల్టీ డిజార్డర్‌తో బాధపడతాడు. ఇందులో రామానుజం, రెమో, అపరిచితుడుగా విక్రమ్ నటన అదుర్స్. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా ప్రస్తావన ఎందుకూ అంటే బాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘అన్నియన్’ని హిందీలో రీమేక్ చేయాలనుకుంటోందట. శంకర్‌తో చర్చలు కూడా జరిపారని టాక్. రణ్వీర్ సింగ్‌ని హీరోగా అనుకుంటున్నారట. ‘అన్నియన్’లో సదా కథానాయికగా నటించారు. హిందీలో కియారా అద్వానీని కథానాయికగా ఎంపిక చేయనున్నారని సమాచారం. అయితే ఈ సినిమాకి ముందు రామ్‌చరణ్ హీరోగా శంకర్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అలాగే కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’ ఉంది. ఈ రెండు చిత్రాల తర్వాతే ‘అన్నియన్’ హిందీ రీమేక్ ఆరంభం అవుతుందని టాక్. చదవండి: ప్రభాస్ ‘ఆదిపురుష్’: కేవలం ఈ ఒక్క పార్ట్‌కే రూ.300 కోట్లు ఖర్చు! రంగ్‌దే ప్రీ రిలీజ్: చీఫ్ గెస్ట్‌గా త్రివిక్రమ్, కారణం అదేనట! -
రవితేజ అపరిచితుడా..?
మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్లో రవితేజ మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించాడు. టైటిల్‌కు తగ్గట్టుగా అమర్ అక్బర్ ఆంటోని మూడు మతాలకు సంబంధించిన వ్యక్తులుగా కనిపించారు మాస్ హీరో. అయితే ఈ సినిమాలో రవితేజ ట్రిపుల్ రోల్ చేయటం లేదట. అపరిచితుడు సినిమాలో విక్రమ్ తరహాలో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో ఇబ్బందిపడే వ్యక్తిగా కనిపించనున్నాడట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. రవితేజ సరసన ఇలియానా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. -
కభీం కుపాం.. మిక్రిన జంభో.. అకూంపధం..
ఒక మనిషి ఐదు పైసలు లంచం తీసుకుంటే తప్పా...? తప్పుకాదన్నా... ఐదువందల మంది ఐదు పైసలు లంచం తీసుకుంటే తప్పా...? అదీ పెద్ద తప్పు కాదన్నా.... ఐదు కోట్ల మంది ఐదు పైసలు లంచం తీసుకుంటే... ? పెద్ద తప్పేనన్నా.... శంకర్ ఆలోచిస్తున్నాడు. అన్నీ చిన్న చిన్న తప్పులే. చిన్న చిన్న నిర్లక్ష్యాలే. చిన్న చిల్లే పెద్ద ఓడను ముంచేస్తుందని ఈ జనానికి తెలియదా? మన దేశం ఎటు పోతోంది? ఇండియాలో ఓ స్టేట్ అంత ఉండే సింగపూర్,అభివృద్ధిలో మనకంటే ముందుంది. ఎందుకు? అసలేం జరుగుతోంది? ఏదో జరగాలి. రాక్షసుల్ని అంతమొందించేందుకు దేవుడు అవతరించి నట్టుగా... ఈ అవినీతినీ, అలసత్వాన్నీ, నిర్లక్ష్యాన్నీ రూపుమాపేందుకు ఓ శక్తి కావాలి. అది దేవుడు కానవసరం లేదు. మనిషి చాలు. ఇంతకూ ఎవరా మనిషి? అతనొక్కడే. కానీ ముగ్గురు. కాసేపు ట్రెడిషనల్. ఇంకాసేపు అల్ట్రా మోడ్రన్. మరికాసేపు రెబల్. ట్రిపుల్ రోల్ కాదు. ఒకే మనిషి ముగ్గురిలా కనిపిస్తాడు. అదెలా సాధ్యం? సాధ్యమే. అదొక మాయ రోగం. ఈ రోగమే సమాజానికి పట్టిన రోగాన్ని తొలగిస్తుంది. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. ఒకే వ్యక్తి వేర్వేరు వ్యక్తుల్లా వ్యవహరించే ఉన్మాదస్థితి. అతనికి సమాజంపై కోపం. కాదు... అతి ప్రేమ. అతనొక అపరిచితుడు. ఎవ్వరికీ తెలీదు. చివ రికి అతనికే తెలీదు. తప్పు చేసిన కేటరింగ్ వాడు కభీం కుపాం. నకిలీ బ్రేక్వైర్ అమ్మినవాడు మిక్రిన జంభో. యాక్సిడెంట్ చూసినా పట్టించుకోనివాడు అకూంపధం. శంకర్ ఇప్పటిదాకా ఏడు సినిమాలు తీశాడు. దేనికీ ఇంత టెన్షన్ పడలేదు. సుజాతా రంగరాజన్ ఈజీగా స్టోరీ రాసిచ్చేశాడు కానీ, దానికి స్క్రీన్‌ప్లే రాయడానికి నాలుగు రెట్ల టెన్షన్ పడుతున్నాడు శంకర్. సీన్లు మారుస్తున్నాడు. క్యారెక్టర్లు మార్చి పారేస్తున్నాడు. ఫస్ట్ ఈ ముగ్గురిలో ఒకడు సర్దార్జీ. ఫన్ వస్తుంది. కానీ సౌత్వాళ్లు కనెక్టవుతారా? ఎందుకు... హాయిగా వైష్ణవ బ్రాహ్మణున్ని చేస్తే పోలా! స్క్రిప్టు ఫైల్ మూసేసి ఊపిరి పీల్చుకున్నాడు. ఆ పక్కనే టేబుల్ మీద గరుడ పురాణం. దాన్ని కళ్లకద్దుకున్నాడు. ఈ కథకు అదే పెద్ద ఆసరా. హిందీ ‘నాయక్’ అయిపోయింది. నెక్ట్స్ ‘రోబో’ తీద్దామా? బడా ప్రొడ్యూసర్ కావాలి. దొరకలేదు. అందుకే ‘బాయ్స్’ తీశాడు శంకర్. మామూలుగా ఒక సినిమా అయ్యేవరకూ ఇంకో సినిమా గురించి ఆలోచించడు. కానీ ‘బాయ్స్’ టైమ్‌లోనే ‘అపరిచితుడు’ గురించి థింక్ చేస్తున్నాడు. అంతలా హాంట్ చేస్తోందీ స్క్రిప్టు. రజనీకాంత్ దగ్గరికెళ్లి కథ చెప్పాడు. ‘సారీ’ అన్నాడు రజనీ. ఆయనిలా చెప్పడం రెండోసారి. ఇంతకుముందు ‘ఒకే ఒక్కడు’ కూడా రిజెక్ట్ చేశాడు. రజనీ ‘నో’ అంటే విక్రమ్ దగ్గరికెళ్లిపోదామని ప్లాన్. అక్కడ విక్రమ్ ఇలాంటి అవకాశం కోసం పొంచి చూస్తున్నాడు. ఆకలితో ఉన్న సింహానికి మంచి ఆహారమే దొరికింది. బడ్జెట్ చాలా అవుతుంది. డేరింగ్ ప్రొడ్యూసర్ కావాలి. ఆస్కార్. వి. రవిచంద్రన్ ఇలాంటి వాటికి ఎప్పుడూ రెడీ. అప్పటికి సౌత్‌లో ‘జీన్స్’ కాస్ట్లీ ఫిల్మ్. ఇది దానికి బాబులాంటిది. అయినా ఓకే. హీరోయిన్గా ఐశ్వర్యారాయ్ అయితే బాగుంటుంది. ఆమెకూ శంకర్‌తో చేయడం ఇష్టమే. ‘జీన్స్’తో తనకు గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన డెరైక్టర్ మరి. కానీ బాలీవుడ్లో బిజీ. సిమ్రాన్‌ని అడిగారు. తనకప్పుడే పెళ్లి కుదిరింది. 120 కాల్షీట్స్ అంటే అయ్యే పని కాదు. మరి ఎవరా లక్కీ గాళ్? ‘జయం’తో పెద్ద హిట్టు కొట్టిన సదాని వెతుక్కుంటూ వెళ్లిందీ ఆఫర్. శంకర్ కథ లేకుండా అయినా సినిమా తీస్తాడేమో కానీ, రెహమాన్ లేకుండా చేయడు. కానీ ఈ సినిమాకు రెహమాన్ లేడు. తన శిష్యుడు హ్యారిస్ జై రాజ్‌ని తీసుకున్నారు. ఇలాంటి సినిమాకు కెమెరామ్యా న్గా పీసీ శ్రీరామ్ అయితే కరెక్ట్. ఆయన ఫుల్ బిజీ. రవివర్మన్ వచ్చాడు. ఫేమస్ కెమెరామ్యాన్. రవి.కె.చంద్రన్‌కి అసిస్టెంట్. ‘బాయ్స్’కి జెనీలియా ఫొటోషూట్ అంతా అతనే చేశాడు. ‘‘సార్... ఒక్క చాన్స్’’ అన డిగాడు. శంకర్ అప్పటికే మణికందన్‌తో మాట్లాడేశాడు. అతను ‘మై హూ నా’లాంటి భారీ హిట్ సినిమాలకు పని చేశాడు. ఇక్కడ ప్రీప్రొడక్షన్ జరుగుతుంటే, అక్కడ విక్రమ్ కేరెక్టర్స్ మౌల్డింగ్ కోసం హోమ్‌వర్క్ చేసుకుంటున్నాడు. అద్దం ముందు రామానుజం గెటప్‌లో ఉన్నాడు. బాడీ లాంగ్వేజ్ చూసుకున్నాడు. అంతా ఓకే. కానీ కొంచెం పొట్ట పెంచాలి. నెక్ట్స్ రెమో. అల్ట్రామోడ్రన్‌గా తయారయ్యాడు. వాకింగ్ స్టయిల్ మార్చేశాడు. ఇంకొంచెం బాడీ షేప్ మార్చాలి. ఇప్పుడు ‘అపరిచితుడు’ గెటప్. బాగుంది కానీ, ఇంకా బాగుండాలి. ఫుల్‌గా ఎక్సర్సైజ్ చేసి బాడీ బిల్డింగ్ చెయ్యాలి. పగలూ, రాత్రీ ఈ మూడు పాత్రల గురించే ఆలోచన. నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. విక్రమ్ వైఫ్ శైలజ సైకాలజిస్ట్. ఆమెతో కూర్చుని పర్సనాలిటీ డిజార్డర్ గురించి డిస్కషన్స్. యాక్టింగ్ అంటే మరీ ఇంత పిచ్చా అనుకుందామె. 2004 మార్చి 4. ఉదయం 9.30 గంటలు. చెన్నైలోని ఏవీయమ్ స్టూడియోలో లెవెన్త్ ఫ్లోర్. ‘అపరిచితుడు’ ఓపెనింగ్. తమిళంలో ‘అన్నియన్’, హిందీలో ‘అపరిచిత్’. ప్రెస్మీట్లో శంకర్ మాట్లాడుతున్నాడు. ‘‘ఇది ఫిక్షన్ థ్రిల్లర్. ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తా’. జర్నలిస్టులు అయోమయంగా చూశారు. కాన్సెప్ట్ చూస్తే కొండంత ఉంది. ఆరు నెలల్లో కంప్లీ షన్ అంటే హౌ ఈజ్ ఇట్ పాజిబుల్? షూటింగ్ జరుగుతూనే ఉంది. షెడ్యూల్ మీద షెడ్యూల్... ప్లానింగ్ మీద ప్లానింగ్. తిరువయ్యూరులో ఏటా త్యాగ రాజ మహోత్సవాలు జరుగుతుంటాయి. ఈ సినిమాలో ఆ ఎపిసోడ్ ఉంది. ఏవీయమ్ స్టూడియోలో సెట్ వేశారు. ఫేమస్ వయొలిన్ విద్వాంసుడు కన్నకుడి వైద్యనా థన్, ఫేమస్ సింగర్స్ ఉన్నికృష్ణన్, సుధా రఘునాథన్ తదితరులపై షాట్స్ తీశారు. వెరీ ఇంపార్టెంట్ యాక్షన్ ఎపిసోడ్. వియత్నాం నుంచి 127 మంది మార్షల్ ఆర్ట్స్ నిపుణులు దిగారు. టేకింగ్ హాలీవుడ్ లెవెల్లో ప్లాన్ చేశారు. ‘మ్యాట్రిక్స్’ మూవీకి వాడిన టెక్నాలజీ. చెన్నైలోని జేబీ ఇన్డోర్ స్టేడియమ్లో సెట్ వేశారు. 25 రోజులు తీశారు. అపరిచితుడు పబ్లిక్‌తో మాట్లాడే సీన్‌ని హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియమ్లో తీశారు. గేదెల సీన్‌కి కూడా చాలా కష్టపడ్డారు. సీజీ వర్క బాగా యూజ్ చేశారు. పాటల్నీ భారీగానే తీశారు. ‘ఓ సుకుమారి’ పాటను నెదర్లాండ్స్‌లో జరిగే వరల్డ్ ఫ్లవర్ షోలో తీశారు. ఆ టైమ్‌లో అక్కడ చలి చాలా ఎక్కువ. అంత చలిలో, విక్రమ్‌తో సహా డాన్సర్లంతా పంచెకట్టుతో పాల్గొన్నారు. ఆరు నెలలు పూర్తయ్యాయి. ఇంకా షూటింగ్ పార్ట్ చాలా ఉంది. కెమెరామ్యాన్ మణికందన్‌కి వేరే కమిట్మెంట్ ఉంది. ఆయన జంప్. శంకర్ ఇంకేం చేస్తాడు? రవివర్మన్‌ను రమ్మన్నాడు. అప్పుడే అతను ఓ బెంగాలీ సినిమా కమిట్ అయ్యాడు. ఇక్కడేమో శంకర్ ఆఫర్. బెంగాలీ సినిమా వదిలేసుకుని మరీ ఇక్కడికొచ్చేశాడు.విక్రమ్ పరిస్థితీ అంతే. డేట్ల మీద డేట్లు ఇస్తున్నాడు. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలీని పరిస్థితి. పెద్దపెద్ద ఆఫర్లొస్తున్నాయి. అన్నీ రిజెక్ట్ చేస్తున్నాడు. పూర్తిగా ‘అపరిచితుడు’ మైకంలో ఉన్నాడు. అది మైకం కూడా కాదు. ఓ రకంగా ఉన్మాదం. ఆ పాత్రనే కలవరిస్తున్నాడు. పిచ్చోడిలా శూన్యంలోకి చూస్తున్నాడు. తనలో తానే ఏదో మాట్లాడుకుంటున్నాడు. విక్రమ్ భార్యకు కంగారొచ్చేసింది. షూటింగ్ త్వరగా పూర్తి కావాలని దేవుడికి దణ్ణాలు పెట్టుకుంటోంది. గుమ్మడికాయ కొట్టేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ టేక్స్ మోర్ టైమ్. ఇంకో పక్క గ్రాఫిక్స్. ఆస్కార్ రవిచంద్రన్ కోట్లకు కోట్లు పోస్తున్నాడు. ఫైనల్‌గా లెక్క తేలింది. 26 కోట్ల 38 లక్షలు. షాకింగ్ ఫిగర్. సౌత్‌లో హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్. అంత డబ్బు తిరిగొస్తుందా?! తెలుగు డబ్బింగ్ రైట్స్ కోసం ఫుల్ కాంపిటీషన్. పెద్ద పెద్ద వాళ్లు అడుగుతు న్నారు. రవిచంద్రన్ పెద్ద రేట్లు చెబుతున్నాడు. ‘లక్ష్మీగణపతి ఫిలిమ్స్’ బాడిగ సుబ్రహ్మణ్యం రూ. 6.75 కోట్లకు బేరమాడాడు. డీల్ ఓకే. రిస్కీ ఫిగర్. ‘టెర్మినేటర్-3’, ‘స్పైడర్‌మ్యాన్ 2’ లాంటి హాలీవుడ్ డబ్బింగ్‌లు, ‘శివపుత్రు డు’లాంటి తమిళ డబ్బింగ్‌లు చేసినవాడు ఈ దెబ్బతో ఫినిష్ అనుకున్నారు చాలామంది. చూద్దాం ఏం జరుగుతుందో! 2005 జూన్ 17. సమ్మర్ ఎండింగ్లో ఉంది. బాక్సాఫీస్ మాత్రం ఓవర్హీట్లో ఉంది. పెద్ద పెద్ద సినిమాలు రిలీజవుతున్నాయి. వీటిమధ్య శంకర్ మ్యాజిక్ వర్కవుట్ అయ్యింది. డివైడ్ టాక్‌తోనే ‘అపరిచితుడు’ సూపర్‌హిట్. 104 ప్రింట్లతో రిలీజ్ చేసిన సినిమా 37 సెంటర్స్‌లో హండ్రడ్ డేస్. పదిహేను కోట్ల వరకూ కలెక్షన్స్. ఈ సినిమాకి నిజంగా విక్రమే హీరో. ప్రాణం పెట్టి పని చేశాడు. మూడు కేరెక్టర్ల హావభావాలను క్షణాల్లో మార్చి మార్చి చూపించడం చాలా చాలా కష్టం. శంకర్ సిని మాల్లో ఎప్పుడూ సోషల్ అవుట్‌లుక్ కనిపిస్తుంది. ఇందులో మాత్రం పీక్‌కి వెళ్లిపోయింది. పాజిబిలిటీ - ఇంపాజిబిలిటీ పక్కన పెడితే సోషల్ లేజీనెస్‌ని ఈ రేంజ్లో సెల్యులాయిడ్ మీద ఉతికి ఆరే సింది మాత్రం శంకరే. కలిసొస్తే అన్నీ కలిసొస్తాయ్. ఈ సినిమాకి పాటలూ అంతే. భువనచంద్ర లిరిక్స్ గురించి మెన్షన్ చేసి తీరాల్సిందే. ‘పువ్వులు పేల్చేటి స్టెన్‌గన్ రెమో’, ‘పువ్వుల్తోనే బాణం వేసే ఫూలన్‌దేవి నువ్వే జాణా’ లాంటి మోడరన్ ఎక్స్ప్రెషన్స్ భలే అనిపిస్తాయి. కొన్ని కలలు నిజమైతే బావుంటుంది. శంకర్ కన్న కల ‘అపరిచితుడు’. ఈ కల నిజమైతే ఎంత బావుంటుందో కదా!