గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ | Arundhati Movie Child Artist Divya Nagesh Latest Pics And Interesting Details Goes Viral| Sakshi
Sakshi News home page

Guess The Actress: అప్పుడు బాలనటి.. ఇప్పుడేమో హీరోయిన్

Published Sun, May 5 2024 9:57 PM | Last Updated on Mon, May 6 2024 9:20 AM

Arundhati Movie Child Artist Divya Nagesh Latest Pics

సినిమాల్లో నటించి హిట్స్ కొట్టినా సరే కొందరు యాక్టర్స్ కనుమరుగైపోతుంటారు. కొన్నాళ్ల పాటు పూర్తిగా కనిపించకుండా పోతుంటారు. ఈ బ్యూటీ సేమ్ అలానే. తెలుగు, తమిళంలో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో బాలనటిగా చేసింది. ఆ తర్వాత పూర్తిగా ఒక్క భాషకే పరిమితమైపోయింది. ఇప్పుడేమో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు దివ్య నగేశ్. తమిళనాడుకి చెందిన ఈమె.. 'అపరిచితుడు' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో 'అరుంధతి'లో అనుష్క చిన్నప్పటి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. వీటితో మంచి ఫేమ్ వచ్చినప్పటికీ ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేస్తూ వచ్చింది.

రీసెంట్‌గా తమిళంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన దివ్య నగేశ్.. తన కెరీర్ గురించి చెప్పుకొచ్చింది. అయితే అప్పట్లో ఈమెని బాలనటిగా చూసిన ప్రేక్షకులు.. ఇప్పుడు పూర్తిగా మారిపోయిన దివ్యని చూసి షాకవుతున్నారు. ఇద్దరూ ఒకరేనా కాదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నారు. మరి మీరేమైనా గుర్తుపట్టారా?

(ఇదీ చదవండి: సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement