తెలుగు సినిమాల్లో నటులు లెక్కలేనంత మంది. ఎప్పటికప్పుడు కొత్తోళ్లు వస్తూనే ఉంటారు. పాత వాళ్లు కనుమరుగైపోతూనే ఉంటారు. కానీ కొందరు మాత్రం హిట్ సినిమాలు చేసినా సరే కొన్ని కారణాలతో ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. ఈమె కూడా సేమ్ అలాంటి వ్యక్తే. అప్పట్లో ఎన్టీఆర్, చిరంజీవి పక్కన నటించింది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమెని గుర్తుపట్టారా? ఎవరో మమ్మల్నే చెప్పేయమంటారా?
పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్రేష్ఠ. అరె ఈ పేరు ఎప్పుడు వినలేదే ఎవరబ్బా అనుకుంటున్నారా? 80-90ల్లో తెలుగులో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టు బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. దాదాపు 100కి పైగా తెలుగు సినిమాల్లో బాలనటిగా చేసింది.
(ఇదీ చదవండి: పెళ్లయిన ఐదురోజులకే ఆస్పత్రిలో హీరోయిన్.. ఏమైంది?)
'సమరసింహారెడ్డి' సినిమాలో హీరోకి నడవలేక ఇబ్బంది పడే చెల్లి ఉంటుంది. ఆ పాత్ర పోషించింది శ్రేష్ఠనే. ఇదే ఈమెకి చివరి మూవీ కూడా. దీని తర్వాత పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది. బీటెక్, ఎమ్ టెక్, ఎమ్ఎస్ చేసి అమెరికాలో జాబ్ చేసింది. తర్వాత తిరిగి స్వదేశానికి తిరిగొచ్చేసింది. ప్రస్తుతం తండ్రికి చెందిన కన్‌స్ట్రక్షన్ వ్యవహారాలు చూసుకుంటోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఈమెని చూసి చాలామంది షాకయ్యారు. ఎందుకంటే అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది.
ఇక ఈమె నటించిన సినిమాల విషయానికొస్తే.. సమర సింహారెడ్డి, రౌడీ అల్లుడు, మేజర్ చంద్రకాంత్, హిట్లర్ తదితర చిత్రాలున్నాయి. ఈమెకు మంచు మనోజ్‌తో కూడా పెళ్లి చేయాలని అనుకున్నారట. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ప్రస్తుతానికైతే ఈమె సింగిల్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఓ బాలనటి ఇలా చాన్నాళ్ల తర్వాత కనిపించడం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.
(ఇదీ చదవండి: 'కల్కి'లో ఈ తెలుగు హీరోయిన్ కూడా! మీరు గమనించారా?)
Comments
Please login to add a commentAdd a comment