Major chandrakanth
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్.. ఏకంగా 100 మూవీస్
తెలుగు సినిమాల్లో నటులు లెక్కలేనంత మంది. ఎప్పటికప్పుడు కొత్తోళ్లు వస్తూనే ఉంటారు. పాత వాళ్లు కనుమరుగైపోతూనే ఉంటారు. కానీ కొందరు మాత్రం హిట్ సినిమాలు చేసినా సరే కొన్ని కారణాలతో ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. ఈమె కూడా సేమ్ అలాంటి వ్యక్తే. అప్పట్లో ఎన్టీఆర్, చిరంజీవి పక్కన నటించింది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమెని గుర్తుపట్టారా? ఎవరో మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్రేష్ఠ. అరె ఈ పేరు ఎప్పుడు వినలేదే ఎవరబ్బా అనుకుంటున్నారా? 80-90ల్లో తెలుగులో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టు బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. దాదాపు 100కి పైగా తెలుగు సినిమాల్లో బాలనటిగా చేసింది.(ఇదీ చదవండి: పెళ్లయిన ఐదురోజులకే ఆస్పత్రిలో హీరోయిన్.. ఏమైంది?)'సమరసింహారెడ్డి' సినిమాలో హీరోకి నడవలేక ఇబ్బంది పడే చెల్లి ఉంటుంది. ఆ పాత్ర పోషించింది శ్రేష్ఠనే. ఇదే ఈమెకి చివరి మూవీ కూడా. దీని తర్వాత పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది. బీటెక్, ఎమ్ టెక్, ఎమ్ఎస్ చేసి అమెరికాలో జాబ్ చేసింది. తర్వాత తిరిగి స్వదేశానికి తిరిగొచ్చేసింది. ప్రస్తుతం తండ్రికి చెందిన కన్స్ట్రక్షన్ వ్యవహారాలు చూసుకుంటోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఈమెని చూసి చాలామంది షాకయ్యారు. ఎందుకంటే అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది.ఇక ఈమె నటించిన సినిమాల విషయానికొస్తే.. సమర సింహారెడ్డి, రౌడీ అల్లుడు, మేజర్ చంద్రకాంత్, హిట్లర్ తదితర చిత్రాలున్నాయి. ఈమెకు మంచు మనోజ్‌తో కూడా పెళ్లి చేయాలని అనుకున్నారట. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ప్రస్తుతానికైతే ఈమె సింగిల్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఓ బాలనటి ఇలా చాన్నాళ్ల తర్వాత కనిపించడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది.(ఇదీ చదవండి: 'కల్కి'లో ఈ తెలుగు హీరోయిన్ కూడా! మీరు గమనించారా?) -
ఇండిపెండెన్స్ డే స్పెషల్: ఆగస్టు 15న చూడదగిన సినిమాలేవో తెలుసా?
ఈ ఏడాది స్వాతంత్య్ర సంబురాలకు యావత్ భారవతావని సిద్ధమవుతోంది. ఎంతోమంది వీరుల త్యాగాలతో మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంగతి తెలిసిందే. బ్రిటీష్ వారికి తమ ప్రాణాలను ఎదురొడ్డి నిలిచిన వీరులెందరో భారతమాత ఒడిలో చేరారు. వారిలో ముఖ్యంగా అల్లూరి సీతరామరాజు, సుభాశ్ చంద్రబోస్ పేర్లు వినిపిస్తాయి. స్వాతంత్ర పోరాటంలో అమరులైన వారి చరిత్ర గురించి మనం చాలా సినిమాల్లో చూశాం. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మనలో దేశభక్తి గురించి తెలిపే టాలీవుడ్ చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. 1.అల్లూరి సీతారామ రాజు ఎన్ని ఏళ్లు గడిచినా అందరికీ గుర్తుండి పోయే సినిమా 'అల్లూరి సీతారామ రాజు'. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ చిత్రం స్వాతంత్ర్య సమరయోధుడి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. బ్రిటీష్ వారి పాలనకు వ్యతిరేకంగా 1922-24 మద్రాసు ప్రెసిడెన్సీలో స్వాతంత్య్రోద్యమ కాలంలో జరిగిన కథాంశంగా ఈ చిత్రం రూపొందించారు. అనేకమంది జీవితాలకు స్ఫూర్తిగా నిలిచిన అల్లూరి.. బ్రిటిష్ వారిపై యుద్ధంలో తన దళాన్ని ముందుకు నడిపించారు. ఈ 'అల్లూరి సీతారామ రాజు' రిలీజై 175 రోజులు విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించారు. అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు చిత్రానికి వి.రామచంద్రరావు దర్శకత్వం వహించారు. జి హనుమంత రావు, జి ఆదిశేషగిరి నిర్మించిన చిత్రంలో విజయ నిర్మల, కొంగర జగ్గయ్య, చంద్ర మోహన్ కీలక పాత్రల్లో నటించారు. భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో విప్లవకారుడు, మన్యం దొర అల్లూరి సీతారామ రాజు జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. 2.సర్దార్ పాప రాయుడు స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో 1980లో వచ్చిన చారిత్రాత్మక చిత్రం సర్దార్ పాపరాయుడు. ఈ చిత్రాన్ని దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కించారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కొన్ని థియేటర్లలో అయితే ఏకంగా 300 రోజులపాటు ప్రదర్శించారు. ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా సర్దార్ పాపరాయుడు ఘనత సాధించింది. శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై క్రాంతి కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీదేవి, శారద ప్రధాన పాత్రల్లో నటించారు. 3.మేజర్ చంద్రకాంత్ ఎన్టీఆర్, మోహన్ బాబు, శారద ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 'మేజర్ చంద్రకాంత్'. 1993లో విడుదలైన ఈ చిత్రం ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించే లక్ష్యంలో ఉన్న సైనికుడి జీవితం చుట్టు తిరుగుతుంది. నగ్మా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ దేశభక్తి చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని 'పుణ్యభూమి నాదేశం', 'ముద్దులతో ఓనమాలు' వంటి పాటలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాయి. 4. బొబ్బిలి పులి దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం బొబ్బిలి పులి. ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కొంగర జగ్గయ్య, కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, జయచిత్ర, మురళీమోహన్, ఎం. ప్రభాకర్ రెడ్డి, ప్రసాద్ బాబు, అల్లు రామలింగయ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. 5.భారతీయుడు తమిళ స్టా హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భారతీయుడు. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ వారిపై సాధించిన విజయాన్ని అందంగా చిత్రీకరించారు. స్వాతంత్రద్యోమంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాన్ని ఈ చిత్రం ద్వారా చూపించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేశారు. 6.ఖడ్గం దేశభక్తిపై రూపొందించిన చిత్రాల్లో ఖడ్గం మూవీకి ప్రత్యేకస్థానం ఉంటుంది. ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహించారు. ఈ టాలీవుడ్ ఐకానిక్ చిత్రం కమర్షియల్ హిట్‌గా నిలిచింది. శ్రీకాంత్, సోనాలి బింద్రే, ప్రకాష్ రాజ్, రవితేజ కీలక పాత్రల్లో నటించిన ఖడ్గం థియేటర్లను దద్దరిల్లేలా చేసింది. 2002లో వచ్చిన ఈ చిత్రానికి సరోజిని అవార్డు, ఐదు నంది అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ముగ్గురు యువకుల జీవితాలను ప్రభావితం చేసే అమానవీయ ఉగ్రవాద చర్యల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 7.సుభాష్ చంద్రబోస్ 2005లో విడుదలైన హిస్టారికల్ డ్రామా స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కించారు. వెంకటేష్, శ్రియ శరణ్, జెనీలియా డిసౌజా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కె.రాఘవేంద్ర దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మూడు నంది అవార్డులను గెలుచుకుంది. బ్రిటీష్ వారితో పోరాడి చింతపల్లి గ్రామాన్ని రక్షించే సుభాష్ చంద్రబోస్ అనుచరుడి చుట్టూ కథను రూపొందించారు. 8.మహాత్మ టాలీవుడ్‌లోని ఉత్తమ దేశభక్తి చిత్రాలలో మహాత్మ ఒకటి. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రధానపాత్ర పోషించారు. ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు, త్యాగం ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా తెరకెక్కించారు. 9. సైరా నరసింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. బ్రిటీశ్ పాలనలో వారిని ఎదురించి నిలిచిన ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. రామ్ చరణ్ నిర్మించారు. 2019లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. 10. ఆర్ఆర్ఆర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. బ్రిటీష్ కాలంలో ఓ మన్యం వీరుడైన కొమురం భీం జీవితం ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ బ్రిటీష్ పోలీసు అధికారి పాత్రలో కనిపించగా.. ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లూ సాధించగా.. ఆస్కార్ అవార్డ్‌ను సైతం సాధించింది. వీటితో పాటు స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వీటిలో పల్నాటి యుద్ధం, నేటి భారతం(1983), వందేమాతరం(1985), ఆంధ్ర కేసరి, మరో ప్రపంచం(1970), మనదేశం(1949) ఘాజీ(2017), మేజర్, సైరా నరసింహా రెడ్డి(2019), గౌతమి పుత్ర శాతకర్ణి, పరమవీరచక్ర చిత్రాలు కూడా ఉన్నాయి. -
సినిమాని 'దేశభక్తి' కాపాడిందా? లేదంటే..!
యాక్షన్ సినిమా మీకు గూస్బంప్స్ తెప్పించొచ్చు.. హారర్ మూవీ భయపెట్టొచ్చు.. థ్రిల్లర్ మునివేళ్లపై కూర్చోబెట్టొచ్చు. రొమాంటిక్ లవ్‌స్టోరీ మిమ్మల్ని మైమరిచిపోయాలా చేయొచ్చు. ఇలా ఆయా జానర్స్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే వీళ్లందరికీ నచ్చేది ఒకటుంది. అదే 'దేశభక్తి' జానర్. ఎన్నేళ్లు గడుస్తున్నా సరే ఈ తరహా సినిమాలకు ఉన్న డిమాండే వేరు. అయితే అన్నిసార్లు దేశభక్తి.. మన సినిమాను కాపాడిందా? తెలుగులో దేశభక్తి సినిమాలు బోలెడు. వీటిలో ది బెస్ట్ అంటే చాలామంది చెప్పేమాట 'ఖడ్గం'. ఏ ముహుర్తాన కృష్ణవంశీ ఈ మూవీ తీశారో గానీ ఈ జానర్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. చాలా సరదాగా మొదలై, క్లైమాక్స్ వచ్చేసరికి ఈ సినిమా మీలో ఎక్కడో మూల దాగున్న దేశభక్తిని రగిలిస్తుంది. అలానే 'ఖడ్గం'లోని ప్రతి పాట సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కమర్షియల్ అంశాలు ఉన్నప్పటికీ.. ఈ సినిమా హిట్ అయిందంటే దానికి ప్రధాన కారణం ఒక్కటే. అదే దేశభక్తి. (ఇదీ చదవండి: 'పోర్ తొళిల్' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ)) అలానే తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించి, అలరించి ఆకట్టుకున్న దేశభక్తి సినిమాల్లో 'అల్లూరి సీతారామరాజు', 'మేజర్ చంద్రకాంత్', 'ఆర్ఆర్ఆర్' లాంటివి టాప్‌లో ఉంటాయి. వీటిలో ప్రారంభ సన్నివేశం నుంచి దేశభక్తిని ప్రతిబింబించే సీన్సే ఉండటం హైలెట్ అని చెప్పొచ్చు. వీటిల్లో కమర్షియల్ అంశాలున్నప్పటికీ మెయిన్ థీమ్‌ని దర్శకులు మర్చిపోలేదు. దీంతో ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేశాయి. దేశభక్తి పవర్ ఏంటో ప్రూవ్ చేశాయి. ఈ లిస్టులో మేజర్, సైరా తదితర చిత్రాలు కూడా ఉన్నాయి. ఇకపోతే మిగతా భాషల్లో వచ్చిన దేశభక్తి చిత్రాలు మనవాటికి తక్కువేం కాదు. 'భారతీయుడు' దగ్గర నుంచి 'బోర్డర్', 'షేర్షా', 'కేసరి', 'ఉరి', 'ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్', 'రాజీ'.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత జాబితా ఉంటుంది. అయితే బాక్సాఫీస్ దగ్గర అన్నిసార్లు దేశభక్తి వర్కౌట్ అయిందా అంటే 90 శాతం మాత్రమే అని చెప్పొచ్చు. ఆ 10 శాతం ఎందుకు అని మీరు కోపం తెచ్చుకోవచ్చు. ఆ పాయింటే ఇప్పుడు మాట్లాడుకుందాం. (ఇదీ చదవండి: Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ) దేశభక్తి అనేది కచ్చితంగా హిట్ అయ్యే జానర్ అని చాలామంది దర్శకులు అభిప్రాయం. అయితే ఈ పాయింట్‌తో సినిమాలు తీస్తున్నప్పుడు కొన్నిసార్లు తేడా కొట్టేస్తుంది. అంతెందుకు తెలుగులోనే విక్టరీ వెంకటేశ్ హీరోగా ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు.. 'సుభాష్ చంద్రబోస్' అనే మూవీ తీశారు. బాక్సాఫీస్ దగ్గర ఇది ఫెయిలైంది. బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు.. 'పరమవీరచక్ర' అనే దేశభక్తి సినిమా తీశారు. కానీ ఏం లాభం. ప్రేక్షకులు ఈ రెండు చిత్రాల్ని తిరస్కరించారు. ఓవరాల్‌గా చెప్పేది ఏంటంటే.. ఏ భాషలో అయినా 'దేశభక్తి' సినిమాలకు కొదవలేదు. కాకపోతే ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా సరే ఆయా స్టోరీని సరిగా హ్యాండిల్ చేయాలి. లేదంటే మాత్రం బొక్కబోర్లా పడటం గ్యారంటీ. ఇప్పటివరకు వచ్చినవాటిలో మాత్రం దాదాపుగా 90 శాతం సినిమాలి అద్భుతమైన విజయాల్ని అందుకున్నాయని చెప్పడంలో ఎలాంటి మొహమాటం అక్కర్లేదు. (ఇదీ చదవండి: ‘భోళా శంకర్’ మూవీ రివ్యూ) -
‘ఆ సమయంలో ఎన్టీఆర్‌కు నేనే మేకప్ వేశాను’
ఇటీవల జరిగిన ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకలో సీనియర్ నటుడు మోహన్‌బాబు నందమూరి తారక రామరావుతో తనకున్న అనుబంధాన్ని కొంతమేర ప్రేక్షకులతో పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మోహన్‌బాబు ఎన్టీఆర్‌తో తనకున్న చనువును ట్విటర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ఎన్టీఆర్ మేకప్ కోసం పర్సనల్ మేకప్ మెన్కే ప్రాధాన్యత ఇచ్చేవారని తెలిపారు. అలాంటిది ఓ సందర్భంలో ఎన్టీఆర్‌కు తాను మేకప్ వేశానని అన్నారు. 1993లో మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని ‘పుణ్యభూమి నాదేశం’ పాట కోసం ఎన్టీఆర్ చాలా గెటప్పుల్లో కనిపించారని గుర్తుచేశారు. ఆ సందర్భంగా ఆయనకు తాను మేకప్ వేసినట్టు చెప్పారు. ప్రతి గెటప్లోను ఎన్టీఆర్ ఉదయం ఏడు గంటలకే మేకప్‌తో సహా లోకేషన్లో ఉండేవారని.. అంతటి గొప్ప నటుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ వేడుకలో మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన స్పీచ్ చివర్లో ‘క్రిష్.. యు డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్.. మా అన్నయే కనిపిస్తున్నాడు. ఎక్కడ సినిమాను ప్రారంభించావో.. ఎక్కడ ఫినిష్ చేశావో తెలియదు. దాన్లో చెడ్డవాళ్లను కూడా మంచి క్యారెక్టర్స్ చేశావో. ఎవరెవరిని ఎలా చేశావో నాకు తెలియదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేజర్ చంద్రకాంత్(1993) సినిమాలోని పుణ్యభూమి నాదేశం అనే పాట కోసం అన్నగారు చాలా గెటప్పులలో కనిపిస్తారు.. ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ తప్ప ఎవరు మేకప్ వేసేవారుకాదు. అలాంటిది నేను వేశాను. ప్రతి గెటప్ లోను అన్నగారు విత్ మేకప్ 7 గం||లకు లొకేషన్ లో ఉండేవారు. అంతటి గొప్ప నటుడు అన్నగారు. pic.twitter.com/ojB6okJ2tb — Mohan Babu M (@themohanbabu) 24 December 2018 -
'ఎన్టీఆర్ నన్ను పిలిచి నువ్వు చేస్తావా? అన్నారు'
కాకినాడ (కొత్తపేట) : తెలంగాణా శకుంతలగా అమ్మ, అక్క, లేడీ విలన్ క్యారెక్టర్లలో రాణించాలన్నదే తన ఆకాంక్ష అని వర్ధమాన క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాసరి పద్మరేఖ తెలిపారు. రాధాగోపాలం, రాములమ్మ తదితర సీరియల్స్, పుష్కర, టైటానిక్ తదితర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన పద్మరేఖ కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ‘మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పుణ్యభూమి నాదేశం’ పాట చిత్రీకరణ హైదరాబాద్ గోల్కొండ కోటలో జరుగుతుండగా.. అందులో ఒక డ్యాన్సర్ సరిగా చేయకపోతే ఎన్టీఆర్ నన్ను పిలిచి నువ్వు చేస్తావా? అన్నారు. చేస్తానని చెప్పాను. అలా సినిమాల్లో తొలి అవకాశం దక్కింది. సినీ రైటర్ చంద్రబోస్ భార్య, డ్యాన్సర్ సుచిత్రమాస్టర్ నా గురువు. ఆమె వద్ద వెస్ట్రన్ డ్యాన్స్, విజయశాంతి ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ పొందాను. చేసిన సినిమాలు.. నూతన నటీనటులతో తీసిన ‘మజిలీ’ చిత్రంలో తల్లి పాత్ర, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ హీరోగా ‘టైటానిక్’ అంతర్వేది టు అమలాపురం అనే ఉప శీర్షిక పేరుతో తీసిన చిత్రంలో థర్టీయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ వైఫ్ క్యారెక్టర్, ఏఎన్ఆర్ మనుమడు సుశాంత్ హీరోగా ‘ఆటాడుకుందాం రా!’ సినిమాలో హీరోయిన్ అవకాశం కోసం డెరైక్టర్‌ను పాకులాడే పాత్ర, పుష్కర సినిమాలో హీరోయిన్ కాజల్‌కు తల్లిగా, భానుచందర్‌కు భార్యగా నటించా. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ సినిమాలోని ప్రకాష్‌రాజ్ చెల్లెలుగా నటిస్తున్నాను. నటించిన సీరియల్స్.. రాములమ్మలో తల్లి పాత్ర, రాధాగోపాలంలో హీరోయిన్ రాధ పిన్ని (విలన్ షేడ్)పాత్ర పోషిస్తున్నాను. -
‘మరో చరిత్ర’ ముగిసింది
-
‘మరో చరిత్ర’ ముగిసింది
* దర్శక శిఖరం కె. బాలచందర్ ఇక లేరు * అస్వస్థతతో చెన్నైలో కన్నుమూత * సినీ చరిత్రకే మకుటాయమానమైన చిత్రాలను తీసిన కేబీ * ‘మేజర్ చంద్రకాంత్’ నాటకంతో రంగస్థలంపై తొలి గుర్తింపు * మరోచరిత్ర, అంతులేనికథ, ఆకలిరాజ్యం వంటి ఎన్నో మరపురాని చిత్రాలకు దర్శకత్వం * దర్శక శిఖరం మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి సాక్షి, చెన్నై, హైదరాబాద్: మరో చరిత్ర ముగిసింది.. రుద్రవీణ మూగబోయింది.. భారత సినీ పరిశ్రమలో ధ్రువతారగా వెలిగిన దర్శక శిఖరం నేలకొరిగింది.. చిత్ర పరిశ్రమకు మకుటాయమానంగా వెలిగిన కైలాసం బాలచందర్(84) తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని తిరువారూర్ (గతంలో తంజావూరు జిల్లా) జిల్లా నన్నిలం గ్రామంలో దండపాణి కైలాసం, సరస్వతి దంపతులకు 1930, జూలై 9న బాలచందర్ జన్మించారు. 1956లో రాజంను వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు (కైలాసం, ప్రసన్న), ఓ కూతురు(పుష్పా కందసామి). అనారోగ్యంతో పెద్ద కుమారుడు కైలాసం ఇటీవల మృతి చెందడంతో బాలచందర్ బాగా కుంగిపోయారు. అదే బెంగతో అస్వస్థతకు గురై ఈనెల 15న ఆస్పత్రిలో చేరారు. చిన్నతనం నుంచే నాటకాలు, చిత్రాలపై మక్కువ పెంచుకున్న బాలచందర్‌పై.. త్యాగరాజ భాగవతార్ సినిమాలు ప్రభావం చూపాయి. బాలచందర్ మృతితో సినీలోకం దిగ్భ్రాంతికి గురైంది. 12 ఏళ్ల ప్రాయంలోనే నటన వైపు... తమిళ, తెలుగు సినిమాను వైవిధ్య భరితమైన కథాంశాలతో ఓలలాడించిన దర్శక వైతాళికుడు కె.బాలచందర్(కేబీ) తన 12 ఏళ్ల ప్రాయంలోనే నటనవైపు అడుగులు వేశారు. ఒక నాటిక సమాజంలో సభ్యుడిగా చేరి పేరు తెచ్చుకున్నారు. అన్నామలై యూనివర్సిటీ ద్వారా 1949లో గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసి 1950లో తిరువారూరు జిల్లా ముత్తుపేటలో టీచర్‌గా పనిచేశారు. తర్వాత 1956లో చెన్నైలోని అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో సాధారణ అకౌంటెంట్‌గా చేరారు. అదే ఏడాది రాజంను పెళ్లిచేసుకున్నారు. ఆ సమయంలో యునెటైడ్ అమెరికన్ ఆర్టిస్ట్ (మద్రాసు) నాటక కంపెనీలో సభ్యుడిగా చేరి కొద్ది కాలంలోనే సొంతంగా నాటక బృం దాన్ని ఏర్పరుచుకున్నారు. స్వీయ దర్శకత్వంలో అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చి రంగస్థల ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. ఆయన రచించిన ‘మేజర్ చంద్రకాంత్’ నాటకంతో రంగస్థలంలో గుర్తిం పు తెచ్చుకున్నారు. ఎంజీ రామచంద్రన్ హీరోగా నటించిన ‘దైవత్తాయ్’ చిత్రానికి డైలాగ్ రైటర్‌గా 1965లో సినీ పరిశ్రమకు పరిచయమయ్యూరు. ఆ తర్వాత ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేత ఏవీ మెయ్యప్పన్ ప్రోత్సాహంతో ‘సర్వర్ సుం దరం’ చిత్రానికి స్క్రిప్ట్ సహకారం అందించారు. 1965లో ‘నీర్కుముళి’తో దర్శకుడిగా మారారు. 1981లో కవితాలయా ప్రొడక్షన్స్‌ను సొంతంగా స్థాపించి తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో ఎన్నో చిత్రరాజాలను ప్రేక్షకులకు అందించారు. దర్శకుడిగా 101 సినిమాలు.. స్టార్ హీరోలతో సినిమాలు చేయడం బాలచందర్‌కి పెద్దగా ఇష్టం ఉండేది కాదు. తన కథలు స్టార్లకు నప్పవని, వాళ్ల డేట్స్, కాలపరిమితికి లోబడి పనిచేయడం తన వల్ల కాదని కరాకండీగా చెప్పేవారు. సాధ్యమైనంత వరకూ కొత్తవారితోనే పని చేసేవారు. దాదాపు వందకు పైచిలుకు కొత్త నటులను తెరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే. దర్శకుడిగా 101 సినిమాలు చేశారాయన. వాటిలో తమిళంలోనే దాదాపు 80 సినిమాలుంటాయి. అన్నీ ఆణిముత్యాలే. బాలచందర్ సినిమాల్లో కాలం కోరల్లో నలిగిపోతున్న సగటు జీవితాలు కనిపిస్తాయి. సమకాలీన సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యనూ 1970ల్లోనే వెండితెరపై ఆవిష్కరించిన సృజనశీలి బాలచందర్. నిరుద్యోగం, అంటరానితనం, కట్టుబాట్లు, వ్యసనాలు, మూఢనమ్మకాలు, తదితర సామాజిక రుగ్మతలపై ఎన్నో సినిమాలు తీశారు. దర్శకుడు బాలచందర్ చాలా జానర్లు స్పృశించలేకపోవచ్చు. కానీ ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ అన్ని వర్గాలను రక్తికట్టించాయి. సగటు జీవితాలు ఎదుర్కొంటున్న సున్నిత సమస్యల్ని ఆయన ఎంత సునిశితంగా చూస్తారో చెప్పడానికి ‘అం తులేని కథ’ ఓ మచ్చుతునకగా మిగిలిపోతుంది. తెలుగులో ఆయన భలే కోడళ్లు, సత్తెకాలపు సత్తెయ్య, బొమ్మా బొరుసా, అంతులేని కథ, మరో చరిత్ర, ఇది కథ కాదు, గుప్పెడు మనసు, ఆకలిరాజ్యం, అందమైన అనుభవం, తొలికోడి కూసింది, కోకిలమ్మ, రుద్రవీణ వంటి ఆణిముత్యాలను తెరకెక్కించారు. రజనీ కాంత్‌ని ‘అపూర్వరాగంగళ్’తో వెండితెరకు పరిచయం చేసింది బాలచందరే. ‘మరో చరిత్ర’ ద్వారా కమల్‌హాసన్, సరితలను హీరోహీరోయిన్లుగా పరి చయం చేశారు. మణిరత్నం దర్శకత్వంలో ‘రోజా’ చిత్రాన్ని నిర్మించి, సినీ లోకానికి స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ పరిచ యం చేసిన ఘనత బాలచందర్దే. ‘డ్యూయెట్’ చిత్రం ద్వారా ప్రకాశ్‌రాజ్‌ను వెలుగులోకి తెచ్చారు. నటుడిగా.. : దర్శకుడిగా ఖ్యాతిపొందినా అప్పుడప్పుడూ నటుడిగా కూడా కనిపించారు బాలచందర్. చిన్నచిన్న పాత్రలతో ఐదు సినిమాల్లో నటుడిగా ప్రేక్షకులకు దర్శనమిచ్చారు. ‘రెట్టైసుళి’ అనే తమిళ చిత్రంలో ప్రధాన పాత్ర చేసి మెప్పిం చారు. ప్రస్తుతం కమల్‌హాసన్ హీరోగా రూపొందిస్తున్న ‘ఉత్తమ విలన్’ చిత్రంలో కూడా బాలచందర్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలో ఉంది. ఎన్నెన్నో అవార్డులు... పద్మశ్రీ(1987), దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(2011), జాతీయ అవార్డు(2013), పలు ఫిలింఫేర్ అవార్డులు, అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు, తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక కలైమామణి పురస్కారాలు బాలచందర్‌ను వరించాయి. ఇవిగాక ప్రైవేటు సంస్థలు అందజేసిన అవార్డులు కోకొల్లలు. సినిమాలకు దూరమైన దశలో ఎన్నో టీవీ సీరియళ్లకు దర్శకత్వం అందించారు.