‘ఆ సమయంలో ఎన్టీఆర్‌కు నేనే మేకప్‌ వేశాను’ | Mohan Babu Says He Did Make Up To NTR | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 24 2018 12:28 PM | Last Updated on Mon, Dec 24 2018 12:43 PM

Mohan Babu Says He Did Make Up To NTR - Sakshi

ఇటీవల జరిగిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఆడియో వేడుకలో సీనియర్‌ నటుడు మోహన్‌బాబు నందమూరి తారక రామరావుతో తనకున్న అనుబంధాన్ని కొంతమేర ప్రేక్షకులతో పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మోహన్‌బాబు ఎన్టీఆర్‌తో తనకున్న చనువును ట్విటర్‌ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ఎన్టీఆర్‌ మేకప్‌ కోసం పర్సనల్‌ మేకప్‌ మెన్‌కే ప్రాధాన్యత ఇచ్చేవారని తెలిపారు. అలాంటిది ఓ సందర్భంలో ఎన్టీఆర్‌కు తాను మేకప్‌ వేశానని అన్నారు. 1993లో మేజర్‌ చంద్రకాంత్‌ చిత్రంలోని ‘పుణ్యభూమి నాదేశం’ పాట కోసం ఎన్టీఆర్‌ చాలా గెటప్పుల్లో కనిపించారని గుర్తుచేశారు. ఆ సందర్భంగా ఆయనకు తాను మేకప్‌ వేసినట్టు చెప్పారు. ప్రతి గెటప్‌లోను ఎన్టీఆర్‌ ఉదయం ఏడు గంటలకే మేకప్‌తో సహా లోకేషన్‌లో ఉండేవారని.. అంతటి గొప్ప నటుడు ఎన్టీఆర్‌ అని పేర్కొన్నారు.

అయితే ఎన్టీఆర్‌ బయోపిక్‌ వేడుకలో మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన స్పీచ్‌ చివర్లో ‘క్రిష్‌.. యు డిడ్‌ ఏ వండర్‌ఫుల్‌ జాబ్‌.. మా అన్నయే కనిపిస్తున్నాడు. ఎక్కడ సినిమాను ప్రారంభించావో.. ఎక్కడ ఫినిష్ చేశావో తెలియదు. దాన్లో చెడ్డవాళ్లను కూడా మంచి క్యారెక్టర్స్‌ చేశావో. ఎవరెవరిని ఎలా చేశావో  నాకు తెలియదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement