‘ఆత్మీయుడైన తమ్ముడు.. మా అన్నగారి బిడ్డ’ | Mohan Babu Condolences To Harikrishna Demise | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 30 2018 3:12 PM | Last Updated on Thu, Aug 30 2018 7:47 PM

Mohan Babu Condolences To Harikrishna Demise - Sakshi

తమ సొంత బ్యానర్‌తో నిర్మించిన డ్రైవర్‌ రాముడు షూటింగ్‌ జరిగేటప్పుడు...

నందమూరి కుటుంబంతో నటుడు మోహన్‌బాబుకు ప్రత్యేక అనుబంధం ఉంది. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును అన్నా అంటూ ఆప్యాయంగా పిలుచుకునే మోహన్‌బాబు... హరికృష్ణ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నందున హరికృష్ణ భౌతికకాయాన్ని చూసే వీలు లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరాలి..
‘నేను ఇండియాలో లేను. అమెరికాలో ఉన్నాను. తమ్ముడు హరికృష్ణ మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒళ్లంతా కంపించిపోయింది. నాకు అత్యంత ఆత్మీయుడైన తమ్ముడు.. మా అన్నగారి బిడ్డ. తమ సొంత బ్యానర్‌తో నిర్మించిన డ్రైవర్‌ రాముడు షూటింగ్‌ జరిగేటప్పుడు నన్నెంతో ప్రేమగా చూసుకున్నాడు. ఆరోజు మొదలైన మా అనుబంధం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది. స్వర్గస్తుడైన తమ్ముడు హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ తన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ’  మోహన్‌ బాబు.. హరికృష్ణకు నివాళులు అర్పించారు. కాగా మెహిదీపట్నంలోని స్వగృహం నుంచి ప్రారంభమైన హరికృష్ణ అంతిమయాత్ర కుటుంబసభ్యులు అభిమానుల ఆశ్రునయనాల మధ్య కొనసాగుతోంది. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement