ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
నటుడు హరికృష్ణ బుధవారం రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తండ్రి చనిపోయిన విషాదంలో ఉన్నారు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్. కానీ తమ కుటుంబానికి సంబంధించిన బాధను తమ సినిమా మీద పడనీయకూడదని అనుకున్నారు. అందుకే తమ తమ సినిమా షూటింగ్స్‌కి హాజరు కానున్నారు. తమ ప్రొఫెషనలిజమ్ చూపించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ సినిమాను దసరాకు విడుదల చేద్దాం అనుకున్నారు. ఆ డెడ్‌లైన్ మీట్ అవ్వడం కోసం ఆల్రెడీ చిత్రబృందం ఫుల్ స్పీడ్‌లో షూటింగ్ జరుగుతోంది.
ఇప్పుడు తన వల్ల షూటింగ్ ఆలస్యం కాకూడదని ప్రొఫెషనల్‌గా ఆలోచించారు ఎన్టీఆర్. ఆయన షూట్‌లో జాయిన్ అవుతున్నట్టు చిత్రబృందం తెలిపింది. మరోవైపు కల్యాణ్ రామ్ కూడా ఇదే విధంగా ఆలోచించారు. కెమెరామేన్ కేవీ గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ ఓ థ్రిల్లర్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో ఎప్పటిలానే పాల్గొంటారట కల్యాణ్ రామ్. మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ హీరోలుగా తమ బాధ్యతను నిర్వర్తించాలనుకున్న ఈ అన్నదమ్ములను ‘ప్రొఫెషనల్ బ్రదర్స్’ అనొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment