టాలీవుడ్ నటుడు మోహన్ బాబు తన అభిమానులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తాను నటించిన మేజర్ చంద్రకాంత్ మూవీలో సాంగ్‌ను అభిమానులతో పంచుకున్నారు. 1993లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ కుమారుడిగా నటించారు.
ఈ చిత్రంలోని దేశభక్తి సాంగ్ ఎప్పటికీ భారతీయుల గుండెల్లో నిలిచి ఉంటుంది. 'పుణ్య భూమి నాదేశం నమోనమామి.. ధన్య భూమి నాదేశం సదా స్మరామీ' అంటూ సాగే ఈ పాట దేశభక్తిని చాటి చెబుతుంది. ఈ పాటను జాలాది రాజారావు రాయగా.. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీతమందించారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మేజర్ చంద్రకాంత్ అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది.
Wishing you all a Happy Republic Day!🇮🇳
"Major Chandrakanth" (1993): 🎶"Punyabhoomi Naadesam" – A timeless patriotic anthem that resonates deeply with Telugu audiences. With lyrics by Sri. Jaladi Raja Rao, sung soulfully by Sri. S.P. Balasubrahmanyam, and composed masterfully by… pic.twitter.com/xvVqP6Ht66— Mohan Babu M (@themohanbabu) January 26, 2025
Comments
Please login to add a commentAdd a comment