ఇప్పుడు తగ్గిపోయారు గానీ ఒకప్పుడు తెలుగులో దాదాపు ప్రతి సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్టులుగా ఉండేవారు. హీరోహీరోయిన్లలానే వీళ్లు కూడా మంచి క్రేజ్ సంపాదించేవారు. అలా 'సన్నాఫ్ సత్యమూర్తి' మూవీలో స్వీటీగా యాక్ట్ చేసిన బేబీ వర్ణిక ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఏకంగా 'పుష్ప 2' పాటకు స్టెప్పులేసి అదరగొట్టేసింది. ఇంతకీ ఇప్పుడెలా ఉందో తెలుసా?
(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ)
బేబి వర్ణిక గురించి పెద్దగా డీటైల్స్ అయితే తెలియవు. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా తర్వాత నాన్నకు ప్రేమతో, బంగారు బాబు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత చదువు కోసం పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు పుష్ప కపుల్ సాంగ్‌కి అదిరిపోయే డ్యాన్స్ చేసింది.
చిన్నప్పుడు చబ్బీగా బూరె బుగ్గలతో ఉన్న వర్ణిక కాస్త ఇప్పుడు టీనేజ్‌లోకి వచ్చేసింది. ఒడ్డు పొడుగు చూస్తే హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గలేదు. స్టెప్పులు అవి చూస్తుంటే త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేస్తుందేమో అనిపిస్తుంది. మరి బేబీ వర్ణిక లేటెస్ట్ వీడియో మీరు చూసేయండి.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ)
S/O satyamurthy kid Vernika got transformed into a grown up one and is looking like this now!!#Pushpa2TheRule #Pushpa2 pic.twitter.com/Nm8jEMxtZ5
— Vamc Krishna (@lyf_a_zindagii) June 13, 2024
Comments
Please login to add a commentAdd a comment