Arundhati actress
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
సినిమాల్లో నటించి హిట్స్ కొట్టినా సరే కొందరు యాక్టర్స్ కనుమరుగైపోతుంటారు. కొన్నాళ్ల పాటు పూర్తిగా కనిపించకుండా పోతుంటారు. ఈ బ్యూటీ సేమ్ అలానే. తెలుగు, తమిళంలో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో బాలనటిగా చేసింది. ఆ తర్వాత పూర్తిగా ఒక్క భాషకే పరిమితమైపోయింది. ఇప్పుడేమో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు దివ్య నగేశ్. తమిళనాడుకి చెందిన ఈమె.. 'అపరిచితుడు' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో 'అరుంధతి'లో అనుష్క చిన్నప్పటి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. వీటితో మంచి ఫేమ్ వచ్చినప్పటికీ ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేస్తూ వచ్చింది.రీసెంట్గా తమిళంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన దివ్య నగేశ్.. తన కెరీర్ గురించి చెప్పుకొచ్చింది. అయితే అప్పట్లో ఈమెని బాలనటిగా చూసిన ప్రేక్షకులు.. ఇప్పుడు పూర్తిగా మారిపోయిన దివ్యని చూసి షాకవుతున్నారు. ఇద్దరూ ఒకరేనా కాదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నారు. మరి మీరేమైనా గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య) -
స్కూటీపై వెళ్తుండగా యాక్సిడెంట్.. ఐసీయూలో హీరోయిన్..
హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను తిరువనంతపురంలోని ఆస్పత్రిలో చేర్పించగా ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అరుంధతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. వెంటిలేటర్‌పై హీరోయిన్ ఈ విషయాన్ని నటి గోపిక అనిల్ సోషల్ మీడియాలో వెల్లడించింది. 'అరుంధతి వెంటిలేటర్‌పై పోరాడుతోంది. ఆమె కుటుంబానికి ఆస్పత్రి ఖర్చులు భరించే స్థోమత లేదు. మా వంతు మేము సాయం చేశాం. కానీ అది సరిపోవడం లేదు. మీరు కూడా తోచినంత సాయం చేస్తే అది ఆమె మెరుగైన చికిత్సకు ఉపయోగపడుతుంది' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ మేరకు బ్యాంకు వివరాలను సైతం పొందు పరిచింది. కెరీర్.. కాగా 'పొంగి ఎలు మనోహర(2014)' సినిమాతో నటిగా వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టిందీ అరుంధతి. విరుమాండికుమ్ శివానందికమ్, సైతాన్, పిస్తా, ఆయిరం పోర్కాసుకల్ చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఒట్టకోరు కాముకన్ చిత్రంతో మలయాళ చిత్రసీమకు పరిచయమైంది. పద్మిని, డోంట్ థింక్ అనే వెబ్ సిరీస్‌ల్లోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Gopika Anil (@gops_gopikaanil) చదవండి: ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఏవి ఎందులో అంటే? -
ఆ చిత్రాలన్నీ హిట్టే
హీరోయిన్ సమస్యను తీర్చే కథా చిత్రాలన్నీ హిట్టేనని సీనియర్ నటుడు సత్యరాజ్ అన్నారు. ఈయన సమర్పణలో నాదాంబాళ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న చిత్రం నాయ్‌గళ్ జాగ్రత్తైసత్యరాజ్ కొడుకు యువనటుడు శిబిరాజ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నటి అరుంధతి హీరోయిన్గా నటించారు. శునకరాజ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రానికి శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వం వహించారు. యువ సంగీత దర్శకుడు ధరణికుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 21న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చిత్ర యూనిట్ మంగళవారం చెన్నైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చిత్ర సమర్పకుడు సత్యరాజ్ మాట్లాడుతూ నాయ్‌గళ్ జాగ్రత్తైచిత్రం గురించి తాను తొలిసారిగా మాట్లాడుతున్న వేదిక ఇదేనన్నారు. తన కొడుకు శిబిరాజ్ కొంచెం గ్యాప్ తరువాత నటిస్తున్న చిత్రం నాయ్‌గళ్ జాగ్రత్తైఅని తెలిపారు. తనకి చాలా అవకాశాలొచ్చినా అంగీకరించకుండా ఎన్నో కథలు విన్న తరువాత ఈ చిత్రంలో కథ నచ్చడంతో నటించారని తెలిపారు. చిత్రంలో అంతా తానే ఉండాలనే పెద్ద హీరో ఇమేజ్ శిబిరాజ్‌కు లేదన్నారు. అందుకే కథను నమ్మి చేసిన చిత్రం ఇదన్నారు. ఇందులో కుక్క ముఖ్యపాత్ర పోషించిందని తెలిపారు. హీరోయిన్ అరుంధతికి ఎక్కువ పాత్ర లేకపోయినా చిత్ర కథ ఆమె చుట్టూనే తిరుగుతుందన్నారు. అలా హీరోయిన్ సమస్యను పరిష్కరించే హీరోల చిత్రాలన్నీ హిట్టే అని వ్యాఖ్యానించారు. ఇందుకు చాలా నిదర్శనాలు ఉన్నాయని తాను నటించిన నూరునాళ్ చిత్రంలో తనతోపాటు మోహన్ కూడా నటించారన్నారు. ఆ చిత్రంలో హీరోయిన్గా నటించిన నళినిది చిన్న పాత్రేనని అయినా చిత్రం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలిపారు. ఆ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. నూరునాళ్ చిత్రం చూసినప్పుడు కలిగిన ఫీల్ ఈ నాయ్‌గళ్ జాగ్రత్తైచిత్రం చూసినపుపడు కలిగిందని సత్యరాజ్ అన్నారు. చిత్ర హీరో శిబిరాజ్ మాట్లాడుతూ నాణెయం చిత్రం తరువాత తాను నటించిన చిత్రం నాయ్‌గళ్ జాగ్రత్తైఅని తెలిపారు. సుమారు నాలుగేళ్ల గ్యాప్ తరువాత ఈ చిత్రంలో నటించానని చెప్పారు. ఈ గ్యాప్‌ను కావాలనే తీసుకున్నట్టు అన్నారు. దీనికి ముందు ఒక కథ నచ్చడంతో చేద్దాం అనుకున్నానని అయితే అలాంటి కథతో ఒక ప్రముఖ హీరో నటించిన చిత్రం పలు సమస్యలను ఎదుర్కొని తెరపైకి వచ్చిందన్నారు. అలాంటి సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేక ఆ చిత్రం చేయలేదన్నారు. నాయ్‌గళ్ జాగ్రత్తైచాలా సంతృప్తిగా వచ్చిందని శిబిరాజ్ తెలిపారు.