ఆ చిత్రాలన్నీ హిట్టే | all movies hit... | Sakshi
Sakshi News home page

ఆ చిత్రాలన్నీ హిట్టే

Published Wed, Nov 12 2014 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

ఆ చిత్రాలన్నీ హిట్టే

ఆ చిత్రాలన్నీ హిట్టే

హీరోయిన్ సమస్యను తీర్చే కథా చిత్రాలన్నీ హిట్టేనని సీనియర్ నటుడు సత్యరాజ్ అన్నారు. ఈయన సమర్పణలో నాదాంబాళ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న చిత్రం నాయ్‌గళ్ జాగ్రత్తైసత్యరాజ్ కొడుకు యువనటుడు శిబిరాజ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నటి అరుంధతి హీరోయిన్‌గా నటించారు. శునకరాజ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రానికి శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వం వహించారు. యువ సంగీత దర్శకుడు ధరణికుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 21న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చిత్ర యూనిట్ మంగళవారం చెన్నైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

చిత్ర సమర్పకుడు సత్యరాజ్ మాట్లాడుతూ నాయ్‌గళ్ జాగ్రత్తైచిత్రం గురించి తాను తొలిసారిగా మాట్లాడుతున్న వేదిక ఇదేనన్నారు. తన కొడుకు శిబిరాజ్ కొంచెం గ్యాప్ తరువాత నటిస్తున్న చిత్రం నాయ్‌గళ్ జాగ్రత్తైఅని తెలిపారు. తనకి చాలా అవకాశాలొచ్చినా అంగీకరించకుండా ఎన్నో కథలు విన్న తరువాత ఈ చిత్రంలో కథ నచ్చడంతో నటించారని తెలిపారు. చిత్రంలో అంతా తానే ఉండాలనే పెద్ద హీరో ఇమేజ్ శిబిరాజ్‌కు లేదన్నారు. అందుకే కథను నమ్మి చేసిన చిత్రం ఇదన్నారు. ఇందులో కుక్క ముఖ్యపాత్ర పోషించిందని తెలిపారు. హీరోయిన్ అరుంధతికి ఎక్కువ పాత్ర లేకపోయినా చిత్ర కథ ఆమె చుట్టూనే తిరుగుతుందన్నారు.

అలా హీరోయిన్ సమస్యను పరిష్కరించే హీరోల చిత్రాలన్నీ హిట్టే అని వ్యాఖ్యానించారు. ఇందుకు చాలా నిదర్శనాలు ఉన్నాయని తాను నటించిన నూరునాళ్ చిత్రంలో తనతోపాటు మోహన్ కూడా నటించారన్నారు. ఆ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన నళినిది చిన్న పాత్రేనని అయినా చిత్రం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలిపారు. ఆ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. నూరునాళ్ చిత్రం చూసినప్పుడు కలిగిన ఫీల్ ఈ నాయ్‌గళ్ జాగ్రత్తైచిత్రం చూసినపుపడు కలిగిందని సత్యరాజ్ అన్నారు.

చిత్ర హీరో శిబిరాజ్ మాట్లాడుతూ నాణెయం చిత్రం తరువాత తాను నటించిన చిత్రం నాయ్‌గళ్ జాగ్రత్తైఅని తెలిపారు. సుమారు నాలుగేళ్ల గ్యాప్ తరువాత ఈ చిత్రంలో నటించానని చెప్పారు. ఈ గ్యాప్‌ను కావాలనే తీసుకున్నట్టు అన్నారు. దీనికి ముందు ఒక కథ నచ్చడంతో చేద్దాం అనుకున్నానని అయితే అలాంటి కథతో ఒక ప్రముఖ హీరో నటించిన చిత్రం పలు సమస్యలను ఎదుర్కొని తెరపైకి వచ్చిందన్నారు. అలాంటి సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేక ఆ చిత్రం చేయలేదన్నారు. నాయ్‌గళ్ జాగ్రత్తైచాలా సంతృప్తిగా వచ్చిందని శిబిరాజ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement