Ranveer Singh In Vikram Aparichithudu Bollywood Remake - Sakshi
Sakshi News home page

హిందీలో అపరిచితుడు?

Published Mon, Mar 22 2021 8:43 AM | Last Updated on Thu, Apr 14 2022 1:18 PM

Aparichitudu Hindi Remake With Ranveer Singh - Sakshi

క్రిమి భోజనం.. కుంభీపాకం... అన్యాయం చేసినవారికి అపరిచితుడు వేసిన శిక్షలివి. ఇవే కాదు.. ఇంకా బోలెడన్ని శిక్షలు విధిస్తాడు. విక్రమ్‌ కెరీర్‌లో ఎప్పటికీ చెప్పుకోదగ్గ ‘అపరిచితుడు’లోని ఈ శిక్షలు గుర్తుండే ఉంటాయి. శంకర్‌ దర్శకత్వంలో 2005లో ‘అన్నియన్‌’ పేరుతో తమిళంలో రూపొంది, తెలుగులో ‘అపరిచితుడు’గా విడుదలైంది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన రామానుజం మల్టిపుల్‌ పర్సనాల్టీ డిజార్డర్‌తో బాధపడతాడు. ఇందులో రామానుజం, రెమో, అపరిచితుడుగా విక్రమ్‌ నటన అదుర్స్‌.

ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా ప్రస్తావన ఎందుకూ అంటే బాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘అన్నియన్‌’ని హిందీలో రీమేక్‌ చేయాలనుకుంటోందట. శంకర్‌తో చర్చలు కూడా జరిపారని టాక్‌. రణ్‌వీర్‌ సింగ్‌ని హీరోగా అనుకుంటున్నారట. ‘అన్నియన్‌’లో సదా కథానాయికగా నటించారు. హిందీలో కియారా అద్వానీని కథానాయికగా ఎంపిక చేయనున్నారని సమాచారం. అయితే ఈ సినిమాకి ముందు రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అలాగే కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’ ఉంది. ఈ రెండు చిత్రాల తర్వాతే ‘అన్నియన్‌’ హిందీ రీమేక్‌ ఆరంభం అవుతుందని టాక్‌.

చదవండి: ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’: కేవలం ఈ ఒక్క పార్ట్‌కే రూ.300 కోట్లు ఖర్చు!

రంగ్‌దే ప్రీ రిలీజ్‌: చీఫ్‌‌ గెస్ట్‌గా త్రివిక్రమ్‌, కారణం అదేనట!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement