చలో మైసూర్‌ | Shankar and Ram Charan Game Changer next shooting schedule in Mysore | Sakshi
Sakshi News home page

చలో మైసూర్‌

Published Mon, Nov 20 2023 12:19 AM | Last Updated on Mon, Nov 20 2023 8:22 AM

Shankar and Ram Charan Game Changer next shooting schedule in Mysore - Sakshi

హీరో రామ్‌చరణ్‌ కొన్ని రోజులు మైసూర్‌కు మకాం మార్చనున్నారట. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘గేమ్‌చేంజర్‌’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ మైసూర్‌లో జరిగేలా చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేసిందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

ఈ నెల చివర్లో జరగనున్న ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించేలా శంకర్‌ ప్లాన్‌ చేశారట. అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ‘గేమ్‌చేంజర్‌’ వచ్చే ఏడాది విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement