Director Shankar-Ram Charan Game Changer Movie Next Schedule In Mysore - Sakshi
Sakshi News home page

గేమ్‌ ఛేంజర్‌ నెక్స్ట్‌ షెడ్యూల్‌ మైసూర్‌లో!

Published Thu, May 25 2023 1:11 AM | Last Updated on Thu, May 25 2023 8:34 AM

Ram Charan, Kiara Advani Game Changer next schedule in Mysore - Sakshi

‘గేమ్‌ చేంజర్‌’ మూమెంట్స్‌ కోసం మైసూర్‌ వెళ్లనున్నారు రామ్‌చరణ్‌. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘గేమ్‌ చేంజర్‌’. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీకాంత్, సునీల్, ఎస్‌జే సూర్య, జయరాం, నవీన్‌ చంద్ర కీలక పాత్రధారులు. ఇటీవల ఈ సినిమా భారీ క్లైమాక్స్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరిగింది.

కాగా ‘గేమ్‌ చేంజర్‌’ నెక్ట్స్‌ షెడ్యూల్‌ మైసూర్‌లో జరగనున్నట్లు తెలిసింది. జూన్‌ మొదటివారంలో రామ్‌చరణ్, శంకర్‌ అండ్‌ కో ఈ చిత్రంలోని కీలక సన్నివేశాల కోసం మైసూర్‌ ప్రయాణం కానున్నారని సమాచారం. దాదాపు పది రోజుల పాటు ఈ షూటింగ్‌ షెడ్యూల్‌ జరుగుతుందట. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.  

జపాన్‌లో మేజిక్‌ జరిగింది: రామ్‌చరణ్‌ భార్య ఉపాసన గర్భవతి అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం తనకు ఏడో నెల అని శ్రీనగర్‌లో జరిగిన ‘జీ 20’ కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌చరణ్‌ అన్నారు. ఇదే వేదికపై జపాన్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, అది ఇప్పుడు ఇంకా స్పెషల్‌ అని, ఎందుకంటే జపాన్‌లోనే ఈ మేజిక్‌ (భార్య ప్రెగ్నెన్సీ గురించి) జరిగిందనీ రామ్‌చరణ్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement