
మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రవితేజ మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించాడు. టైటిల్‌కు తగ్గట్టుగా అమర్ అక్బర్ ఆంటోని మూడు మతాలకు సంబంధించిన వ్యక్తులుగా కనిపించారు మాస్ హీరో.
అయితే ఈ సినిమాలో రవితేజ ట్రిపుల్ రోల్ చేయటం లేదట. అపరిచితుడు సినిమాలో విక్రమ్ తరహాలో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో ఇబ్బందిపడే వ్యక్తిగా కనిపించనున్నాడట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. రవితేజ సరసన ఇలియానా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment