రెమో మళ్లీ వచ్చేస్తున్నాడు.. బుకింగ్స్‌ అదుర్స్! | Sakshi
Sakshi News home page

Vikram: అపరిచితుడు మళ్లీ వచ్చేస్తున్నాడు.. రీ రిలీజ్‌ ఎప్పుడంటే?

Published Tue, May 14 2024 5:47 PM

Vikram Aparichithudu Movie Re Releasing On this Date

స్టార్‌ డైరెక్టర్ శంకర్, విక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రం అపరిచితుడు. సదా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రభుత్వ అధికారుల్లో అవినీతి, అక్రమాల కథ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా 2005లో విడుదలై సూపర్‌హిట్‌ను సొంతం చేసుకుంది. ఆస్కార్ సినిమా బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రాన్ని రూ.20 కోట్లతో తెరకెక్కించగా.. రూ.60 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆ ఏడాది రిలీజైన అన్ని చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.  తాజాగా ఈ మూవీ రి రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాను మే 17వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.

కాగా.. ఈ చిత్రంలో విక్రమ్, ప్రకాశ్ రాజ్ మధ్య సన్నివేశాలు అభిమానులను అలరించాయి. విక్రమ్ నటనా విశ్వరూపాన్ని ప్రేక్షకులు చూడగలిగారు. త్రిపాత్రాభినయంతో రెమో, అపరిచితుడు, బ్రాహ్మణుడిగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను  తెలుగు, తమిళ రాష్ట్రాల్లో రి రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌ మొదలవ్వగా.. ఆడియన్స్‌ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.  ఎన్నికల తర్వాత సరైనా సినిమా థియేటర్‌లో లేకపోవడంతో విక్రమ్ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తుందని ఆశిస్తున్నారు. కాగా.. ఈ  సినిమాకు హరీశ్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement