తంగలాన్ రెడీ | Vikram Thangalaan release date announced | Sakshi
Sakshi News home page

తంగలాన్ రెడీ

Published Mon, Jun 17 2024 3:07 AM | Last Updated on Mon, Jun 17 2024 3:07 AM

Vikram Thangalaan release date announced

విక్రమ్‌ హీరోగా నటించిన పీరియాడికల్‌ యాక్షన్  మూవీ ‘తంగలాన్ ’. ఈ మూవీ థియేటర్స్‌కు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా పా. రంజిత్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్, నీలమ్‌ ప్రోడక్షన్స్ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా ఈ చిత్రం నిర్మించారు. కాగా ‘తంగలాన్ ’ సినిమాను తొలుత ఈ ఏడాది జనవరిలో రిలీజ్‌ చేయాలనుకున్నారు కానీ కుదర్లేదు.

ఆ తర్వాత ఏప్రిల్‌కు వాయిదా వేశారు. ఏప్రిల్‌లోనూ ‘తంగలాన్ ’ థియేటర్స్‌కు రాలేదు. అయితే తాజాగా ఈ మూవీని ఆగస్టులో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్‌ సమాచారం. మాళవికా మోహనన్  హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పార్వతీ తిరువోరు, పశుపతి, హరికృష్ణన్, అన్భుదురై కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement