
పాత్ర కోసం ప్రాణం పెట్టే అతి కొద్ది మంది నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు. విక్రమ్ నటించిన తాజా చిత్రం తంగలాన్. ఈ సినిమాను డైరెక్టర్ పా.రంజిత్ తెరకెక్కిస్తున్నారు. స్టూడి యో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటి మాళవిక మోహన్, పార్వతి, డేనియల్ కల్టిగరోన్, పశుప తి ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ సినిమా స్వాతంత్య్రానికి ముందు కర్ణాటకలోని గోల్డ్ మైన్ కార్మికుల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విక్రమ్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. కాగా.. మొదట తంగలాన్ చిత్రాన్ని ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే గ్రాఫిక్స్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో పలుసార్లు వాయిదా వేస్తూ వచ్చారు.
కాగా తాజాగా చిత్రాన్ని జూన్ నెలలో తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో తంగలాన్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతమందించారు.
Comments
Please login to add a commentAdd a comment