డేట్‌ ఫిక్స్‌ | Vikram and Pa Ranjith Thangalaan gets a release date | Sakshi
Sakshi News home page

డేట్‌ ఫిక్స్‌

Published Sat, Jul 20 2024 2:14 AM | Last Updated on Sat, Jul 20 2024 2:15 AM

Vikram and Pa Ranjith Thangalaan gets a release date

‘తంగలాన్‌’ సినిమా థియేటర్స్‌కు వచ్చే తేదీ ఖరారైంది. విక్రమ్‌ హీరోగా నటించిన ఈ పీరియాడికల్‌ సినిమాను ఆగస్టు 15న రిలీజ్‌   చేయనున్నట్లుగా చిత్రయూనిట్‌ శుక్రవారం ప్రకటించింది. పా. రంజిత్‌ దర్శకత్వంలో నీలమ్‌ప్రోడక్షన్స్, స్టూడియో గ్రీన్‌ ఫిలింస్‌ పతాకాలపై కేఈ జ్ఞానవేల్‌ రాజా ఈ సినిమాను నిర్మించారు.

18వ శతాబ్దంలో కేజీఎఫ్‌ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌) నేపథ్యంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో మాళవికా మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో విక్రమ్‌ ఓ తెగకు చెందిన నాయకుడిగా కనిపిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement