
విక్రమ్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘తంగలాన్ ’. ఈ మూవీ థియేటర్స్‌కు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా పా. రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోసం విక్రమ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రోడక్షన్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ‘తంగలాన్ ’ సినిమాను తొలుత ఈ ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కుదర్లేదు. ఆ తర్వాత ఏప్రిల్‌కు వాయిదా వేశారు. కానీ, అప్పుడు కూడా ‘తంగలాన్ ’ చిత్రాన్ని విడుదల చేయలేకపోయారు.
తాజాగా తంగలాన్ చిత్రాన్ని ఆగష్టు 15న థియేటర్స్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ, అదే తేదీలో తంగలాన్ ఎంట్రీ గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆగష్టు 15న విడుదల కావాల్సిన అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 వాయిదా పడింది. డిసెంబర్ 6న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు కూడా. దీంతో తంగలాన్ సినిమాకు లైన్ క్లియర్ అయింది.

బన్నీ ముందుగా ఫిక్స్ చేసుకున్న ఆగష్టు 15ను విక్రమ్ లాక్ చేయనున్నాడని సమాచారం. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తామని పా. రంజిత్ తాజాగా తెలిపారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో మాళవికా మోహనన్, పార్వతీ తిరువోరు, పశుపతి, హరికృష్ణన్, అన్భుదురై కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment