తమిళ స్టార్ హీరో విక్రమ్ ఇటీవల నటించిన సినిమా 'తంగలాన్'. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. పా.రంజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ మూవీని తెలుగు, తమిళంలో ఓకేసారి రిలీజ్ చేశారు.
అయితే ఈ మూవీ రిలీజైన రెండు నెలల కావొస్తున్నా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తంగలాన్ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించారు. దీంతో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుందని ఓటీటీ ఆడియన్స్ వెయిట్ చేశారు. కానీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు.
తాజా సమాచారం మేరకు నెట్ ఫ్లిక్స్‌తో మేకర్స్‌కు సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఒప్పందాన్ని నెట్‌ఫ్లిక్స్ రద్దు చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో తంగలాన్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ కొనుగోలు చేసినట్లు లేటేస్ట్ టాక్. త్వరలోనే స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సమాచారం.
తంగలాన్ కథేంటంటే..
'తంగలాన్' విషయానికొస్తే 1850లో చిత్తూరు ప్రాంతంలోని పల్లెటూరు. తంగలాన్ ఓ శ్రామికుడు. అతడికి భార్య ఐదుగురు పిల్లలు. ఓ రోజు పిల్లలతో.. ఏనుగు కొండ వెనకాల బంగారం కొండ ఉందని, దానికి ఓ రక్షకురాలు ఉందని ఏవో కథలు చెబుతాడు. కట్ చేస్తే తంగలాన్‌తోపాటు కొందరిని బ్రిటీష్ దొరలు బంగారం నిధుల కోసం కూలీలుగా తీసుకెళ్తారు. నిధి అన్వేషణ కోసం సాగించిన ప్రయాణంలో వీళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు ఏమైందనేదే కథ.
Comments
Please login to add a commentAdd a comment